జిగ్నేష్ మేవాని

07:42 - January 10, 2018

ఢిల్లీ : హస్తినలో యువ హుంకార్‌ ర్యాలీ గర్జించింది. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది.  అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంట ప్రధాన సమస్యలను పక్కన బెట్టి.. ఘర్‌ వాప్‌సి, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రాధ్యనత నిస్తోందని మండిపడింది. దేశానికి మనువాదం ముప్పు పొంచి ఉందని యువతను హెచ్చరించింది. సామాజిక న్యాయం కోసం తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసింది. 
భారీ భద్రత మధ్య సభ 
ఢిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌లో దళిత యువనేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని నేతృత్వంలో 'యువ హుంకార్' ర్యాలీ జరిగింది. మొదటి నుంచి ర్యాలీకి నిరాకరిస్తున్న పోలీసులు చివరి నిముషంలో పోలీసులకు, నిర్వాహకులకు మధ్య అవగాహన కుదరడంతో భారీ భద్రత మధ్య సభ నిర్వహించారు. 
మోది ప్రభుత్వంపై జిగ్నేష్‌ మేవాని ఫైర్   
గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత యువనేత జిగ్నేష్‌ మేవాని మోది ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంటి ప్రధాన అంశాలను ప్రధాని ప్రస్తావించడం లేదని...ఘర్‌ వాప్‌సీ, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మండిపడ్డారు. చంద్రశేఖర్, రోహిత్‌ వేములకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో 150 స్థానాలను సాధిస్తామన్న బిజెపి కలలకు హార్దిక్‌, అల్పేష్‌, తాను అడ్డుగా నిలవడంతో తమని  టార్గెట్‌ చేస్తున్నారని జిగ్నేష్‌ ఆరోపించారు. గత 22 ఏళ్లుగా వాళ్లు విభజిస్తుంటే తాము జోడిస్తున్నామని చెప్పారు. గుజరాత్ శాసనసభ్యుడిగా అవినీతికి సంబంధించిన ఫైళ్లను బయటపెడతానని మోదీని హెచ్చరించారు.
కార్పోరేట్లకు తొత్తుగా మోది ప్రభుత్వం : కన్హయ్య 
మోది ప్రభుత్వం కార్పోరేట్లకు తొత్తుగా మారిందని జెఎన్‌యు మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ విమర్శించారు. కార్పోరేట్లను బలోపేతం చేయడం కాదని, తమకు సామాజిక న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు. తాము ప్రజాస్వామ్యం కోసమే పోరాడుతున్నామని చెప్పారు.
దళిత సంస్థ భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ ఫొటోలు సందడి
హుంకార్‌ ర్యాలీలో దళిత సంస్థ భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను ఫొటోలు సందడి చేశాయి. ఉత్తరప్రదేశ్ షెహరాన్‌పూర్ జిల్లాలో గత జూన్‌లో ఠాకూర్లు, దళితుల మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల ఆజాద్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఆజాద్‌ను వెంటనే విడుదల చేయాలని అనుచరులు డిమాండ్‌ చేశారు.  జేఎన్‌యూ, ఢిల్లీ యూనినర్శిటీ, లక్నో యూనివర్శిటీ, అలహాబాద్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులతో పాటు అసోం రైతు నేత అఖిల్ గొగోయ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా హాజరయ్యారు. 

 

11:58 - January 9, 2018

ఢిల్లీ : ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ప్రార్లమెంటు వద్ద యువ హుంకార్ ర్యాలీ జరగనుంది. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, అఖిల్ గొగోయ్, కన్హయ్య కుమార్లతో పాటు దళిత, విద్యార్ధి, రైతు, మహిళా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొంటారు. పీఎంవో కు వెళ్లి ప్రధాని ముందు మనుస్మృతి, రాజ్యాంగం రెండు పుస్తకాలు ఉంచుతానని ఆయన ఏది ఎంచుకుంటారో తేల్చుకోవాలని గత వారం జిగ్నేష్ మేవానీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిగ్నేష్ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. యువర్యాలీ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss

Subscribe to RSS - జిగ్నేష్ మేవాని