జితేందర్ రెడ్డి

15:31 - July 16, 2017

ఢిల్లీ : జీఎస్టీ నుండి గ్రానైట్ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం స్కీం, మిషన్ కాకతీయ..మిషన్ భగీరథ పనులకు జీఎస్టీ మినహాయింపు కోరినట్లు తెలిపారు. గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న చిన్న వారిపై జీఎస్టీ ప్రభావం చూపుతుందని, ఈ రంగంపై ఆధార పడుతున్న లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటారని దీనిపై దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయి మూడు సంవత్సరాలైనా హైకోర్టు ఏర్పాటు నిర్ణయం తీసుకోలేదని, దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. దీనికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

17:51 - December 15, 2016

ఢిల్లీ : తెలంగాణను క్యాష్‌లెస్‌ స్టేట్‌గా తీర్చిదిద్దాలని తమ పార్టీ నిర్ణయించిందని.. అందువల్లే నోట్ల రద్దును సమర్థించామని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో చర్చిజరుపుదామని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఇది తనను బాధించిందని జితేందర్‌రెడ్డి అన్నారు. 

19:29 - April 24, 2016

 ఢిల్లీ : తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా విభజన చట్టంలోని అంశాలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని టిఆర్ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని తాము లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు చెప్పామని ప్రతి విషయంలోనూ రేపు మాపు అంటూ కేంద్రం తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో అమలవుతున్న ఆడ్‌-ఈవెన్ ఫార్ములా నుంచి ఎంపీలకు మినహాయింపు ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు జితేందర్ ఢిల్లీలో అన్నారు. 

 

16:42 - November 16, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం మరింత ఊపందుకుంది. అగ్రనేతల రాకతో ఓరుగల్లు పోరుగల్లులా మారింది. టిఆర్ఎస్‌ ఎంపీలు బృందం వరంగల్ నగరంలో ప్రచారం నిర్వహిస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ బహిరంగ సభ, అధికార పార్టీపై ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డి ని 'టెన్ టివి' పలుకరించింది. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

17:29 - October 16, 2015

హైదరాబాద్ : పత్తికి మద్దతు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఆంక్షలు సరికాదన్నారు. సీసీఐ సీఎండీతో వ్యక్తిగతంగా మాట్లాడి 12-16 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని కోరామని తెలిపారు. పత్తి కొనుగోలు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని తేల్చిచెప్పారు జితేందర్ రెడ్డి.

13:33 - August 18, 2015

మహబూబ్ నగర్ : కర్నాటక పోలీసులపై మంత్రి జూపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజాపూర్ ప్రాజెక్టును ఎలాగైనా చూసి తీరుతానని ఆయన పట్టుబట్టారు. అనుమతి లేదంటూ కర్నాటక పోలీసులు స్పష్టం చేశారు. దీనితో ఆ ప్రాంతంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి జూపల్లితో వెళ్లిన ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచూర్ జిల్లా శక్తినగర్ వద్ద జూపల్లిని, జితేందర్ రెడ్డిని కర్నాటక పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగైనా అనుమతినివ్వాల్సిందేనని జూపల్లి స్పష్టం చేశారు. చివరకు రాయచూర్ కలెక్టర్ తో మాట్లాడిన అనంతరం పరిమిత సంఖ్యలో వెళ్లవచ్చని అనుమతి వచ్చింది. చివరకు మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు మరికొందరు ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లారు.
రూ.150 కోట్లతో ప్యాకేజీ..
కృష్ణాపై మరో మినీ బ్యారేజీ నిర్మాణంతో వరద నీటిని ఒడిసిపట్టేందుకు కర్నాటక ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోంది. రూ.150 కోట్లతో ఈ నిర్మాణం జరుగుతోంది. కేవలం రెండు సంవత్సరాల్లో దీని నిర్మాణం చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టి. సర్కార్ అగ్గిలం మీద గుగ్గిలమయ్యింది. ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడుతాయని టి.ప్రభుత్వం భావించింది. దీనిపై అఖిలపక్షం వేయాలని విపక్ష నేతలు కూడా డిమాండ్ చేశారు.

17:12 - August 12, 2015

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్ సభలో బుధవారం ఆయన మాట్లాడారు. పార్లమెంట్ జరుగుతున్న తీరూ చూస్తుంటే టెన్నిస్ కోర్టులాగా అనిపిస్తోందన్నారు. అధికారపక్షం..విపక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుంటే తాము బాల్ లాగా అటూ ఇటూ చూడడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు చూస్తే తెలంగాణ బడీ అమ్మ..మరోవైపు తెలంగాణ ఇచ్చిన చోటీ అమ్మ..ఈ ఇద్దరి మధ్య తాము నిలబడ్డామన్నారు. కేంద్ర మంత్రి సుష్మాను చూస్తుంటే ఒక గౌరవం ఏర్పడుతుందని, ఆమెను చూసిన తరువాత నమస్కారం పెడుతామన్నారు. ఆమె తప్పు చేశారంటే కష్టంగా ఉందన్నారు. లలిత్ మోడీ నేరస్థుడయితే కఠినంగా శిక్షించాలని ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 

Don't Miss

Subscribe to RSS - జితేందర్ రెడ్డి