జీవిత

12:48 - August 17, 2018

జీవితా రాజశేఖర్. వీరిద్దరిని విడి విడిగా చూడలేం. సినిమా పరిశ్రమలో ఏ జంటకు లేని ప్రత్యేకత వీరిద్దరికి వుంది. హీరోగా రాజశేఖర్, నటిగా..దర్శకురాలిగా పలు విభిన్న పాత్రల్లో జీవిత రాజశేఖర్ కు అన్నీ తానై అండగా వుంటుంది. సినిమా పరిశ్రమే మా జీవితం అంటున్న ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు..ఇప్పటికే పెద్ద కుమార్తె శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా వుంది. ఈ క్రమంలో అక్క బాటలోనే రెండో కుమార్తె శివాత్మిక కూడా పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా పరిశ్రలోకి ఎంట్రీ ఇచ్చేందుకు శివాత్మిక కూడా వచ్చేస్తున్నట్లుగా సినీ వర్గాల సమాచారం.

అడవి శేష్ జోడీగా శివాని ..
తెలుగులో అడవి శేష్ జోడీగా శివాని ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఇక తమిళంలోను శివాని కథానాయికగా పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా నటన వైపే ఆసక్తిని చూపుతోందట. ఈ విషయాన్ని జీవిత రాజశేఖర్ స్వయంగా చెప్పారు. అక్క మాదిరిగానే శివాత్మిక కూడా నటనపట్ల ఆసక్తిని చూపుతుండటంతో, ఆ దిశగానే ఆమెను ప్రోత్సహించేందుకు జీవిత రాజశేఖర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

07:33 - August 8, 2018

చెన్నై : రాజకీయాల్లో కురువృద్ధుడిగా.. విజయవంతమైన వ్యూహనిపుణుడిగా తరగని యశస్సును సొంతం చేసుకున్న కరుణానిధి.. తన 94వ ఏట కన్ను మూశారు. కొన్ని రోజులుగా.. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కరుణానిధి.. మంగళవారం తుది శ్వాస విడిచారు. కరుణానిధి జీవిత విశేషాలపై 10టీవీ ప్రత్యేక కథనం. 
1924లో కరుణానిధి జననం
కరుణానిధి 1924లో.. నాగపట్నం జిల్లా తిరుక్కువలైలో.. ముత్తువేల్‌ అంజు దంపతులకు జన్మించారు. స్కూలు దశ నుంచే నాటకాలు, కవిత్వం, సాహిత్యాలపై ఆయన మక్కువ పెంచుకున్నారు. ఎంచుకున్న రంగాల్లో తనదైన శైలిలో ఎదుగుతూ వచ్చారు. స్కూలు దశ నుంచే సామాజిక స్పృహను పెంపొందించుకున్నారు. జస్టిస్‌ పార్టీకి మూలస్తంభంగా భావించే అళగిరి స్వామి కరుణానిధికి స్ఫూర్తినిచ్చారు. ఫలితంగా.. కరుణానిధి తన 14వ ఏటి నుంచే సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. సహవిద్యార్థులతో కలిసి యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి.. వారిలో రచనావ్యాసంగాన్ని ప్రోత్సహించేవారు. ద్రావిడ ఉద్యమకాలంలో తొలి యువజన సంఘం ఇదే. కరుణానిధి ప్రత్యక్ష ఉద్యమాల్లోకి దిగి.. యశస్సును పొందింది మాత్రం 1953లోనే. కల్లగుడి అన్న పేరును.. దాల్మియాపురంగా మార్చేందుకు ఉత్తరాది పారిశ్రామిక వేత్తలు చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా కరుణానిధి భారీ ఉద్యమాన్నే లేవనెత్తారు. ఆ నిరసనలో.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ సందర్భంగా పోలీసులు కరుణానిధిని అరెస్టు చేశారు. 
దురంధరుడు కరుణానిధి
ద్రవిడ ఆత్మాభిమాన ఉద్యమం.. రాజకీయ యవనికపై ఆవిష్కరించిన దురంధరుడు కరుణానిధి. ద్రవిడ మున్నేట్ర కళ్జగం పేరిట స్థాపించిన పార్టీకి ఆయన అచ్చంగా పదిసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కరుణానిధి, తన 33వ ఏట.. 1957లో కుళితలై స్థానం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1961లో డిఎంకె కోశాధికారిగాను, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ లీడర్‌గాను ఎన్నికయ్యారు. 1967లో డిఎంకె అధికారంలోకి రాగానే కరుణానిధి పబ్లిక్‌ వర్క్స్‌ మంత్రిగా నియమితులయ్యారు. 
1969లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు 
రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన కరుణానిధి 1969లో అన్నాదురై మరణించడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  కరుణానిధి తన కెరీర్‌లో మొత్తం మీద 13సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969 నుంచి 2011 మధ్య కాలంలో ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా ఆయన పార్టీ నాయకులు చాలామంది అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి జనతాపార్టీతో కలిసి వెళ్లి ఓటమిపాలయ్యారు. 
కరుణానిధి హయాంలోనే డీఎంకే పార్టీ చీలిక 
ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటైన ద్రవిడ మున్నేట్ర కళ్జగం పార్టీ చీలిక కరుణానిధి హయాంలోనే జరిగింది. పార్టీ కార్యదర్శిగా ఉన్న కరుణానిధి.. సినీ, రాజకీయ సన్నిహితుడు ఎంజీరామచంద్రన్‌ను.. వివిధ కారణాల వల్ల.. పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో.. ఎంజీఆర్‌ అన్నాడిఎంకె పార్టీని స్థాపించారు. ఆటుపోట్ల అనంతరం ఎంజీఆర్‌ అధికారపీఠాన్ని దక్కించుకోగలిగారు. అప్పటి నుంచి రాష్ట్రంలో డిఎంకె, అన్నాడిఎంకెలు చెరో టర్మ్‌ గెలవడం ఆనవాయితీగా కొనసాగింది. 2013లో ఆ ఆనవాయితీని తమిళ ఓటర్లు తిరగరాస్తూ.. జయలలితకు వరుసగా రెండోసారి పట్టం కట్టారు. అలా.. ఈసారి కరుణానిధి అధికారానికి దూరమయ్యారు. మాజీ ముఖ్యమంత్రిగానే కన్నుమూశారు. 

 

07:20 - January 11, 2018

హైదరాబాద్ : ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కేవలం నేర ఆరోపణతోనే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవితఖైదు విధించారన్నారు ఆయన భార్య వసంత. ప్రజాసమస్యలపై పోరాడినందుకు తన భర్తను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. ప్రస్తుతం సాయిబాబాను నాగ్‌పూర్‌ అండాసెల్‌లో ఉన్నారని, ఆయన ఆరోగ్యం క్షీనిస్తోందని తెలిపారు. సాయిబాబాను చర్లపల్లి జైలుకు తరలించి, సరైన వైద్యం అందించాలని కోరుకుంటున్నామన్నారు. 

18:58 - November 3, 2017

గరుడవేగ.. గత వారం రోజులుగా ఈ సినిమా టీం చేస్తున్న ప్రమోషన్స్ తో రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ అని చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ కూడా స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో 30 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన భారీ చిత్రానికి.. అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. ప్రవీణ్ సత్తారు ని నమ్మి నిర్మాతలు భారీగా ఖర్చు పెడితే.. రాజశేఖర్ కూడా కష్టానికి వెనుకాడకుండా ఫుల్ హార్డ్ వర్క్ తో ఈ సినిమాని చేశాడు. సో.. ఇన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన గరుడవేగ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథ..
కథ విషయానికొస్తే..ఫోక్రాన్ అను పరీక్షల తర్వాత జరిగిన ఒక భారీ ఫ్లూటోనియం స్కామ్ కి సంబంధించిన ఇంట్రస్టింగ్ ప్లాట్ తో తెరకెక్కింది పిఎస్ వి గరుడవేగ. కథగా చెప్పుకోడానికి చిన్న పాయింట్ అయినప్పటికీ.. దాన్ని తనమార్క్ స్క్రీన్ ప్లే తో, ప్రజెంట్ జనరేషన్ కి లింక్ చేస్తూ.. ఎన్ ఐఏ అసిస్టెంట్ కమీషనర్ అయిన చంద్రశేఖర్ దాన్ని ఎలా ఛేధించాడు అన్నదే సినిమా టోటల్ స్కీమ్. దీనికి మరోపక్క ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా యాడ్ చేసి ..ఈ థ్రిల్లర్ పాయింట్ కి ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చారు.

నటీనటుల ప్రతిభ..
నటీనటుల విషయానికొస్తే.. చాలాకాలంగా..తనకు కనిపించే తనను నడిపించే పాత్ర కోసం ఎదురుచూసే రాజశేఖర్ కి అలాంటి పాత్రే దక్కింది. ఎన్ ఐఏ అసిస్టెంట్ కమీషనర్ గెటప్ లో జీవించాడు రాజశేఖర్. ఎమోషన్స్ పండించడంలో అక్కడక్కడా తడబడ్డప్పటికీ.. ఓవరాల్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎక్కడా కథను డామేజ్ చెయ్యకుండా,.. డీవియేట్ చెయ్యకుండా దర్శకుడు అనుకున్న కథని అలాగే స్క్రీన్ పై ప్రజెంట్ చెయ్యడంలో పూర్తిగా కోఆపరేట్ చేశాడు. అక్కడక్కడా..తన ఏజ్ తాలూకు ఛాయలు కనిపించినప్పటికీ..హార్డ్ వర్క్ తో ఓవరాల్ తన పాత్రకి, సినిమాకి న్యాయం చేశాడు. ఇక విశ్వరూపం సినిమాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకుమారికి..మళ్లీ అదేరేంజ్ ప్రాజెక్ట్ దక్కింది. లిమిటెడ్ రోల్ అయినప్పటికీ.. కథతో కనెక్ట్ అయి ఉండడంతో ఆడియన్స్ కిబాగానే రిజిస్టర్ అయ్యింది. హోమ్ లీ లుక్స్ తో, గుడ్ పర్ ఫామెన్స్ తో పరవాలేదనిపించింది. చాలా కాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అదిత్.. కు గరుడవేగ మంచి గుర్తింపు తెచ్చింది. తన కెరీర్ లో చెప్పుకునే సినిమాగా నిలిచింది. పోసాని కృష్ణ మురళి, నాజర్ ,పృథ్వి, చరణ్ దీప్, రవివర్మ లకు మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు దక్కాయి. శ్రధ్దాదాస్ క్యారెక్టర్ ని గెస్ట్ అప్పియరెన్స్ గా చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తానికి డియ్యో డియ్యో అంటూ మంచి క్రేజ్ తెచ్చిన సన్నీలియోన్ సాంగ్ సినిమాకి ప్లస్ అయ్యింది. మిగతా నటీనటులందరూ పాత్రల పరిధి మేరకు దర్శకుడి విజన్ లో నటించారు.

టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. ఈ సినిమాకి ఇనీషియేటర్ అండ్ బ్యాక్ బోన్ అయిన ప్రవీణ్ సత్తారు.. స్క్రిప్ట్ గురించి చాలా రీసెర్చ్ చేసి దాన్ని సినిమాగా మలచడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశాడనే చెప్పాలి. చిన్న పాయింట్ ని ఫుల్ లెన్త్ థ్రిల్లర్ సినిమాగా తియ్యడం మామూలు విషయం కాదు. ఫస్ట్ హాఫ్ వరకూ డైరెక్టర్ గా రోమాలు నిక్కబొడుచుకునే స్క్రీన్ ప్లేతో , హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు..సెకండాఫ్ లో మాత్రం కొంచెం తడబడ్డాడు. ఇంటర్వెల్ వరకూ పీక్ లో ఉన్న సినిమా గ్రాఫ్ సెకండాఫ్ కొచ్చేసరికి తగ్గుతుంది. కానీ ఇప్పటి వరకూ తాను తీసిన సినిమాలకు .. పూర్తి భిన్నంగా ఉండే పాయింట్ తో రాజశేఖర్ లాంటి హీరోతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చెయ్యగలిగాడు.

సినిమాటోగ్రఫీ..
సినిమాటోగ్రఫీ విషయానికొస్తే.. డైరెక్టర్ విజన్ ని పూర్తిగా అర్దం చేస్కుని సినిమాకి ఎలాంటి విజువల్స్ కావాలో.. అలాంటి విజువల్స్ ని అందించాడు. ముఖ్యంగా ఛేజింగ్ సీన్స్ లో వాళ్ల పనితనం కనిపిస్తుంది. 30 కోట్ల బడ్జెట్ లో ఆరేంజ్ అవుట్ పుట్ ఇవ్వడంలోనే వాళ్ల టాలెంట్ అర్దమవుతుంది. ఇక సంగీతం విషయానికొస్తే..భీమ్స్ చేసిన రెండు పాటలు కూడా మాస్ జనాలకి కిక్ ఇస్తాయి. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టింది. సీన్ సీన్ కి మారిపోయే సినిమా థీమ్ ని తన ఆర్.ఆర్ తో సక్సెస్ ఫుల్ గా ఎలివేట్ చేశాడు శ్రీచరణ్. టెక్నికల్ వాల్యూస్ పరంగా చాలా హై స్టాండర్డ్స్ లో ఉందీ సినిమా. ఎడిటింగ్ ఇంకాస్త్ షార్ప్ గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. డైరెక్టర్ చెప్పిన కథని, రాజశేఖర్ కాన్ఫిడెన్స్ ని చూసి కథకు తగిన విథంగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఓవరాల్ గా చెప్పాలంటే క్లాసీ టైటిల్ తో తెరకెక్కిన గరుడవేగ.. టేకింగ్ పరంగా క్లాస్ కి, విజువల్ పరంగా మాస్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో వచ్చింది. అయితే థ్రిల్లర్ సినిమా కావడంతో ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో తెలియాలంటే..మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

ప్లస్ లు..
స్టోరీ, స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు
యాక్షన్ సీన్స్..

మైనస్
సెకాండాఫ్ లో కొన్ని సీన్స్
కామెడీ లేకపోవడం
టెక్నికల్ లాంగ్వేజ్
రేటింగ్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

17:34 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినిమా స్టార్స్‌ను మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదన్నారు నటి జీవిత. సొసైటీలో ఎంతోమంది డ్రగ్స్ కేసులో ఉన్నవారుండగా.. సినిమా వారిని ముందు వరుసలో చూపించడం సరికాదన్నారు జీవిత. సినిమా తారలు ఒక పని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని .. తమకందరికి బాధ్యత ఉంటుందని జీవిత చెప్పారు. 

14:40 - June 30, 2017

కరీంనగర్: జిల్లా కేంద్రంలో 2012మార్చి 8న రూ.30 పకోడీ కోసం అనిల్ అనే వ్యక్తి గొడవపడి రాజు, నరేశ్, కమల్, కిరణ్ లను హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో అనిల్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది.అనిల్ ఇప్పటికే ఓ హత్య కేసుతో సంబంధం ఉండడంతో అతని పై పీడీ యాక్ట నమోదు చేశారు. అనిల్ దాన్ని హైకోర్టుల సవాల్ చేశారు. దీంతో కోర్టు అతని పిటిషన్ కొట్టివేయడంతో కరీంనగర్ కోర్టు 10 రోజులు విచారణ జరిపి తుది తీర్పు ఇచ్చింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

11:51 - June 15, 2017

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోల కుమారులు..కుమార్తెలు వెండి తెరకు పరిచయం అయ్యేందుకు ఉత్సాహం చూపుతుంటారు. తల్లిదండ్రుల గ్రీన్ సిగ్నల్ తో వారు పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం నుండి పలువురు అదృష్టం పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ పోలీసు ఆఫీసర్ పాత్రకు జీవం పోసే నటుడు అనిపించుకున్న 'రాజశేఖర్' కుమార్తెలు వెండి తెరకు పరిచయ్యేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. రాజశేకర్..జీవిత దంపతులు తెలుగు..తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరికి శివాని..శివాత్మిక కూతుర్లున్నారు. వీరిలో 'శివాని' తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా వివరాలను శివాని మీడియాకు వెల్లడించనున్నట్లు టాక్. సినిమాల కోసం భరత నాట్యం..కూచిపూడి..గిటార్, వీణలను నేర్చుకున్నట్లు సమాచారం. ఇక శివాని సోదరి శివాత్మిక కూడా సినిమాల్లో రంగ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Don't Miss

Subscribe to RSS - జీవిత