జీవితం

09:13 - June 13, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భయ్యూజీ మహారాజ్‌ను హుటాహుటిన ఇండోర్‌లోని ముంబై ఆసుపత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూనే ఆయన కన్ను మూశారు. ఆయన ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభించింది. జీవితంపై విరక్తి చెందడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సుసైడ్‌ నోట్‌లో ఉంది. సుసైడ్‌ నోట్‌తో పాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు భయ్యూజీ మరణంపై  దర్యాప్తు చేపట్టారు. భయ్యూజీ తుపాకితో తనని తాను తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.  ఫోరెన్సిక్‌ బృందం సుసైడ్‌ నోట్‌పై దర్యాప్తు జరుపుతోంది.  భయ్యూజీ మహారాజ్‌కి రాజకీయాలతోనూ సంబంధాలున్నాయి. శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం ఇటీవల ఆయనకు కెబినెట్‌ మంత్రి హోదా పదవిని ఆఫర్‌ చేయగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. భయ్యూజీ మొదటి భార్య చనిపోవడంతో ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు.

 

17:44 - January 11, 2018

ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కంగనా రనౌత్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ వికలాంగ మహిళా అరుణిమ సిన్హా జీవితం ఆధారంగా ఆర్‌.బాల్కీ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో అరుణిమ సిన్హా పాత్రకు కంగనాను ఎంపిక చేశారట. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మెంటర్‌ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కంగనా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనుందట. 'ఈ పాత్రకు కంగనా నూటికి నూరుశాతం న్యాయం చేయగలదనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ఆమె మెంటర్‌గా బిగ్‌ బి అమితాబ్‌ నటించడం ఆనందంగా ఉంది. అత్యద్భుత ప్రతిభ గల ఇద్దరు ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించడం విశేషంగా భావిస్తున్నాను' అని దర్శక, నిర్మాత ఆర్‌.బాల్కీ తెలిపారు. ఇదిలా ఉంటే ఝాన్సీ రాణి లక్ష్మిభాయి జీవిత కథను ఆధారంగా చేసుకుని హిస్టారికల్‌ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ 'మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ సినిమాను మొదట మార్చిలో లేదా ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. సినిమాలో విజువల్‌ ఎఫెక్స్‌కి సంబంధించిన వర్క్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందట. ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్‌ ఉన్న నేపథ్యంలో ఇండో బ్రిటీష్‌ చిత్రం 'స్వార్డ్స్‌ అండ్‌ స్కెప్ట్రెస్‌' చిత్రం బృందం రిలాక్స్‌ అయ్యింది. దీనికి కారణం ఈ చిత్రాన్ని కూడా లక్ష్మీభాయి జీవితాన్ని బేస్‌ చేసుకునే రూపొందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో విడుదల చేయనున్నారు.

 

21:20 - September 13, 2017

గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ గరం... గల్లీలల్లతిరుగుకుంట జనానికిజెప్తున్నడు, చంద్రబాబు జీవితం మీద సీన్మొస్తుంది....ఓటుకు నోటు సీన్లు మాత్రం పెట్టకుండ్రి, రాత్రి 11 దాకా వైన్సులు ఓపెన్.. తాగుబోతులకు టీర్కార్ బంపర్ హాపర్, సైకిండ్లకు కూడా గులాలద్దిన ప్రభుత్వం... వైన్స్ లకు, బార్లకు కూడా అద్దితే బాగుంటది కదా, సబ్బిడీ గొర్లు అమ్ముకున్న ఇద్దరు అరెస్టు.... అపతొచ్చిన అవిట్నికాసుకోవల్సిందే ... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

14:36 - August 22, 2017

సంసారం వ్యాపార వస్తువుగా మారిపోతుందా ? కుటుంబాల్లో వచ్చే కలహాలు కొంతమందికి పెట్టుబడిగా మారిపోతున్నాయా ? ఆలుమగల మధ్య వచ్చే కలహాలు వ్యాపార వస్తువుగా మార్చివేసే ధోరణి ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతున్నాయి. కలహాలతో రండి..కుటుంబంతో కలిసి వెళ్లండి అనే ధీమాను ఇచ్చేస్తున్నారు. కౌన్సెలింగ్ వ్యాపారులుగా అవతారమెత్తిన కొంతమంది పెద్దమనుషులు కొన్ని ఛానెల్స్ లో ఇలాంటి కార్యక్రమాలు బాధితులకు న్యాయం జరుగుతోందా ? దంపతుల మధ్య వచ్చే కలహాలు సదరు వ్యక్తులకు కాసులు కురిపిస్తున్నాయా ? వ్యాపారమౌతున్న సంసారంపై టెన్ టివి 'మానవి' ప్రత్యేక చర్చ కార్యక్రమం చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో దేవి (సామాజిక కార్యకర్త), రవికుమార్ (సైకాలజిస్టు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:40 - August 6, 2017

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నాడు కవి సినారె. అవును.. కష్టాల్లో ధైర్యాన్నిచ్చేది.. కష్టసుఖాల వల్ల వచ్చే బాష్పాలను మనతో సమానంగా ఆస్వాదించేది ఒక్క స్నేహితుడే. మిత్రుడు అన్న పదానికి ఎంరెందరో.. ఎన్నెన్నో నిర్వచనాలు ఇచ్చారు. కానీ, ప్రపంచమంతా నిన్ను దూరంగా ఉంచినప్పుడు.. నీ వెన్నంటి ఉండేవాడే స్నేహితుడు.. అన్న ఒక్క నిర్వచనం మాత్రం శాశ్వతత్వాన్ని పొందింది. స్నేహమాధుర్యాన్ని ఆస్వాదించేందుకు.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు మొదటి ఆదివారం రోజును స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ శుభతరుణాన స్నేహితులకు, స్నేహపాత్రులు అందరికీ 10టీవీ శుభాకాంక్షలు అందిస్తోంది.

జీవితాల్లో స్నేహితుడి ముద్ర ఎంతలా ఉంటుందో ...

నీ స్నేహితుడెవరో చూపించు.. నీవెలాంటివాడివో చెబుతాను అన్నది జనాంతికం. ఇది వినడానికి చాలా సాదాసీదాగా కనిపించినా.. జీవితాల్లో స్నేహితుడి ముద్ర ఎంతలా ఉంటుందో నిక్కచ్చిగా తెలియజెప్పే వాస్తవం. అవును.. సృష్టిలో తియ్యనిది స్నేహమే. కన్నవారి వద్ద కూడా చెప్పుకోలేని విషయాలు.. స్నేహితుడి సమక్షంలో మన నోటి నుంచి అలవోకగా బయటపడిపోతాయి. స్నేహితులతో గడిపే ప్రతి క్షణం ఎంతో హాయినిస్తుంది. ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. ఆస్తులు లేనివారు ఉంటారేమో కానీ, స్నేహితులు లేని వారు మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

స్నేహితులంతా ఏటా కలిసి జరుపుకునే సంబరమే ఫ్రెండ్ షిప్ డే..

స్నేహితులంతా ఏటా కలిసి జరుపుకునే సంబరమే ఫ్రెండ్ షిప్ డే.. ఎక్కడెక్కడివారో.. ఒక్క చోటికి చేరి తమ అనుభవాల్ని, అనుభూతుల్ని ఒక్కసారి ఈరోజు ఒక్కసారైనా నెమరువేసుకుంటారు. 1935లో యూఎస్ కాంగ్రెస్ సూచన మేరకు ఆగస్టు నెల మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని పరపంచ దేశాలు నిర్ణయించాయి. అందులో భారతదేశం కూడా ఉంది.

అందరూ పరస్పరం శుభాకాంక్షలు

స్నేహితుల దినోత్సవం రోజు అందరూ పరస్పరం శుభాకాంక్షలు అందించుకుంటారు. ఇటీవలి కాలంలో ఫ్రెండ్షిప్‌ బ్యాండ్స్ కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. స్నేహం ఎక్కడ మొదలవుతుంది.. అంటే చెప్పలేం.. స్కూల్లో, కాలేజ్‌లో.. ఎదురింట్లో.. బస్సులో.. ట్రైన్ ఎక్కడైనా పుడుతుంది. అలా పుట్టిన స్నేహం గొప్ప బంధంగా మారుతుంది. స్నేహితులతో గడిపే ప్రతిరోజు ఓ పండగే.. స్నేహితుడు.. లాలనలో అమ్మను.. ఆదరణలో తండ్రిని.. అలిగిన వేళ నెచ్చెలిని.. తలపిస్తాడు. చిరుచిరు పొరపొచ్చాలు వచ్చినా స్నేహితుడిని మాత్రం నిజమైన మిత్రుడు ఎన్నటికీ వదులుకోడు..

చదువుకునే రోజుల్లో స్నేహితులు మనతోనే ...

చదువుకునే రోజుల్లో స్నేహితులు మనతోనే ఉంటారని ధీమా.. కానీ చదువులు పూర్తై కాలేజీ గేటు దాటుతుంటే మనసులు భారమవుతాయి. ఒకరికొకరు ఫేర్ వెల్ చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటారు. చదువుకున్న రోజుల్లో స్నేహితులతో పంచుకున్న అనుభవాల్ని ఏ ఒక్కరూ ఎప్పటికీ మర్చిపోలేరు.

స్నేహానికి కులం.. మతం... ధనిక.. పేద బేధాలుండవు.

స్నేహానికి కులం.. మతం... ధనిక.. పేద బేధాలుండవు. మనసులు కలిసిన స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. చివరికి ప్రాణం కూడా ఇచ్చేస్తుంది. స్నేహితుల దినోత్సవం మన సంప్రదాయం కాకపోయినా.. ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటూ వస్తున్నాం. హడావిడి జీవితంలో స్నేహితులతో గడిపే సమయం దొరకట్లేదు. ఈరోజైనా ఒక్కసారి స్నేహితులంతా కలిస్తే ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. మనసులోని మధుర జ్ఞాపకాల్ని మననం చేసుకోవచ్చు. 

15:46 - July 14, 2017

హైదరాబాద్ : టాలీవుడ్‌ స్టార్స్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న విషయం తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు భానుచందర్‌. తాను కూడా ఇకప్పుడు డ్రగ్స్‌కు భానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నానని..కానీ ఇప్పుడు దాన్ని నుంచి సంపూర్ణంగా బయటపడి ఎంతో ఆనందంగా జీవిస్తున్నానన్నారు. డ్రగ్స్‌తో జీవితాలను నాశనం చేసుకోకుండా ప్రతిఒక్కరు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలని ఈ సందర్భంగా టాలీవుడ్‌ స్టార్స్‌కు భానుచందర్‌ సలహా ఇచ్చారు. ఇదే అంశంపై మా అధ్యక్షుడు శివాజీరాజా స్పందిస్తూ..నోటీసులు అందని వారి పేర్లను బయటపెట్టవద్దని సూచించారు. నోటీసులు అందన వారికి పోలీసు డిపార్ట్‌మెంటే శిక్షిస్తుందని..మా తరపున కూడా తగిన చర్యలు చేపడతామన్నారు. 

19:21 - July 1, 2017

గుంటూరు : వనం-మనం కార్యక్రమం మనందరి జీవితాల్లో భాగం కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలెంలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎవరైతే చెట్లు పెంచుతారో వారంతా తన మిత్రులని వారిని అన్ని విధాల ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా వృక్షమిత్ర అవార్డులో సత్కరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మొక్కలను నాటడంలో ఖమ్మం వాసి వనజీవి రామయ్యని అందర్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 

12:33 - June 11, 2017

సాహిత్యం సమాజంలోని ప్రజలకు దిశానిర్దేశం చేస్తుంది. వ్యక్తులను మహోన్నత శక్తులుగా మారుస్తుంది. మానవ సమాజ వికాసానికి తోడ్పడుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తున్న ఎందరో రచయితలు కవులు మన మధ్యలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ కవయిత్రి పాతూరి అన్నపూర్ణ ఒకరు. కంటినుండి జారే భాష్పాన్ని కవిత్వం స్పర్శిస్తుంది. చలమలో ఊరే నీటిలా నిండిన హృదయవేదననీ స్పర్శిస్తుంది కవిత్వం...అంటూ హృదయాలను కదిలించే కవిత్వాలు రాశారు. గత మూడు దశాబ్దాలుగా కవితలు, కథలు రాస్తున్నారామె. అడవి ఉరేసుకుంది, నిశ్శబ్దాన్ని వెతక్కు, మనసు తడిలాంటి కవితా సంకలనాలు వెలువరించిన ప్రముఖ కవయిత్రి కథన శిల్పి పాతూరి అన్నపూర్ణ గురించి మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి.

06:30 - May 31, 2017

హైదరాబాద్ : 'ఆగదు ఏ నిమిషము నీ కోసమూ..' అంటూ పాట రాసి, 'ప్రేమాభిషేకం' చేయించుకొన్న దార్శనికుడు శాశ్వతంగా కన్నుమూశాడు. చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలూ తీసి, 'డైరెక్టర్‌ ఈజ్‌ ద కెప్టెన్ ఆఫ్‌ ద మూవీ' అని అందరు దర్శకులూ సగర్వంగా తలెత్తుకొని నిల్చొనేలా చేసిన దిగ్దర్శకుడు అచేతనుడైపోయాడు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా 'మా గురువుగారున్నారు' అనే భరోసా కల్పించిన మహాగురువు మరల రాని లోకాలను మరలిపోయాడు. ఒక్క నటులే కాదు.. సినీ పరిశ్రమలోని 24 నాలుగు శాఖల వారూ తమ పెద్ద దిక్కు, తమ 'మేస్త్రీ' వెళ్లిపోయాడంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక తనకు దిక్కేదంటూ తెలుగు చిత్రసీమ కన్నీరు కారుస్తోంది. గత నాలుగు రోజులుగా కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి ఈ ఏడాది జనవరి 19న తీవ్ర అనారోగ్యంతో.. కిమ్స్‌లో తొలిసారిగా చేరారు. ఆయన అన్నవాహికకు రీకన్‌స్ట్రక్టివ్ శస్త్ర చికిత్స చేసిన తర్వాత మార్చి 19న దాసరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఆ తర్వాత ఆయనకు మూత్రపిండాల్లో సమస్య తలెత్తడంతో..వారం రోజుల క్రితం తిరిగి దాసరి కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. దాసరికి మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కిమ్స్‌ వైద్యులు ఆయనకు హెమో డయాలసిస్ ట్రీట్‌మెంట్‌ కూడా నిర్వహించారు. అయితే దాసరి ఆరోగ్యం క్షీణించడంతో సాయంత్రం మంగళవారం రాత్రి 7 గంటలకు కన్నుమూశారు. దాసరి మృతి విషయం తెలుసుకున్న వెంటనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కిమ్స్‌కు చేరుకున్నారు.

పలువురి సంతాపం..
దాసరి నారాయణరావు మృతిపట్ల సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు, సినిమా విమర్శకులు, సినీ రచయితలు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ప్రతి విషయంలో ఆయన ప్రత్యేకత కనబరిచేవారని, ఆయన చనిపోవడం సినీ పరిశ్రమతో పాటు యావత్ రాష్ట్రానికి తీరని లోటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దాసరి మరణం సినీ లోకానికి తీరని లోటని,..ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్త వినగానే సీనియర్ నటుడు మోహన్‌బాబు మీడియా ముందు భోరున విలపించారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన గురువు ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని..తన కుటుంబం పెద్దన్నను కోల్పోయిందని మోహన్‌బాబు కన్నీటి పర్యంతమయ్యారు. దాసరి మృతి చెందారన్న వార్త తెలిసిన తర్వాత..కిమ్స్‌ ఆసుపత్రికి తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళులర్పించారు.

చేవెళ్లలో అంత్యక్రియలు..
దాసరి నాయరణరావు అంత్యక్రియలు...బుధవారం చెవేళ్లలో ఉన్న దాసరి సొంత ఫౌంహౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ప్రకటించారు. అంతకుముందు దాసరి భౌతికకాయాన్ని మూవీ ఆర్డిస్ట్‌ అసొసియేషన్‌ కార్యాలయానికి తరలిస్తామని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ ప్రకటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా చెవేళ్లకు అంతిమయాత్ర చేరుకుంటుందని ప్రకటించారు.

1942లో జననం..
దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4న మహాలక్ష్మి, సాయిరాజ్‌ దంపతులకు జన్మించారు. నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. తాతా మనవడు చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా తన ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, వంటి అగ్రనటులతో సినిమాలు తీసిన దాసరి జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు అందుకున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌ ఉన్నారు.

14:52 - May 19, 2017

హైదరాబాద్: ఆదర్శ లక్షణాలు మూర్తీభవించిన నేత సుందరయ్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సైద్ధాంతిక క్రమశిక్షణ గల నేత సుందరయ్య అని తమ్మినేని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుల్లో సుందరయ్య ఒకరని, నేటి తరానికి ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణలో ప్రజారాజ్య స్థాపనకు కృషి చేస్తామన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - జీవితం