జీహెచ్ ఎంసీ

21:04 - March 26, 2018

జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడించిన కోతులు,వేటగాళ్లను రంగంలకు దించిన మేయర్..హోదా కోసం జనసేన ప్రత్యేక కూటమి..వామపక్షాలతోని కల్సి యుద్దానికి సై అంటున్న జనసేనాని..ఉద్యోగుల సభ ఆగమాగం పెంటపెంట,కేసీఆర్ మాటింటె మండుతున్నజనం..నల్లగొండ జిల్లా రైతుగోస రాస్తే రామాయణం,మద్దతు ధరలు లేవు.. బొర్లెండిపోయినయ్...కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి అయితడు..మల్కాజ్ గిరి మల్లారెడ్డి గారి మాట..కొమురం భీం ఊర్లె తాగునీళ్లు కర్వు, ముర్గినీళ్లు తాగి బత్కుతున్న జనం..

11:49 - March 17, 2018

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 25పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2012లో జీహెచ్ ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. నాలుగేళ్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. టీఆర్ ఎస్ కేవీ, బీఎంఎస్ మధ్యే పోటీ నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:38 - December 30, 2017

హైదరాబాద్ : 2017 సంవత్సరంలో శాస్త్ర, సాంకేతిక రంగాలను పూర్తి స్ధాయిలో వినియోగించుకోవడంలో, సర్వీసులు అందజేయడంలో జీచ్ ఎంసీ ముందుందన్నారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌. ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ అగ్రస్థానం సాధించడానికి  జీహెచ్‌ఎమ్‌సీ కీలకపాత్ర పోశించిందన్నారు. సిటిజన్స్‌ సహకారంతోనే జీహెచ్ ఎంసీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్లగలిగిందన్నారు జీహెచ్ ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌. స్వచ్చ సర్వేక్షన్‌లో భాగంగా మెట్రో నగరానికి నంబర్‌ వన్‌ ర్యాంక్‌ వచ్చింది అయితే అంతర్జాతీయ స్థాయిలో నంబర్‌ వన్‌గా నిలవడానికి కృషి చేస్తామని తెలిపారు. 

 

12:56 - November 19, 2017

హైదరాబాద్ : ఘన వ్యర్థాల నిర్వహణకు బల్దియా వినూత్న పద్ధతుల్లో ముందుకు వెళ్తుంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. తాజాగా అండర్‌ గ్రౌండ్‌ డస్ట్‌ బిన్స్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది.
చెత్త నిర్వహణపై బల్దియా కొత్త ప్రయోగాలు 
హైదరాబాద్‌లో చెత్త నిర్వహణపై బల్దియా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేయడంతో పాటు.. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు ఆటో టిప్పర్లను వినియోగిస్తోంది. ఇప్పుడు భూగర్భంలో  డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మరో వినూత్న విధానాన్ని ఇంట్రడ్యూస్‌ చేయడానికి సిద్ధమైంది.  
రోడ్లపై డస్ట్‌ బిన్‌ల విధానానికి స్వస్తీ
రోడ్లపైనే డస్ట్‌ బిన్‌లు ఉండే  విధానానికి బల్దియా స్వస్తి చెప్పనుంది. అండర్‌ గ్రౌండ్‌లో డస్ట్‌ బిన్‌లు ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఈ విధానంలో ఒకటిన్నర టన్నుల సామర్థ్యం గల డస్ట్‌ బిన్‌లను భూమిలో గొయ్యి తీసి అమరుస్తారు. ఉపరితలంపైకి కనిపించేలా అందమైన ఆకృతుల్లో రూపొందించిన  పెద్ద గొట్టాలను బయటికి ఏర్పాటు చేస్తారు. ఈ అండర్‌ గ్రౌండ్‌ డస్ట్‌ బిన్‌లో చెత్త నిండిపోయిన విషయం కూడా ఆటోమేటిక్‌గా తెలుస్తోంది. చెత్త నిండిన వెంటనే గార్బెజ్‌ కలెక్షన్‌ వాహనాలు అండర్ గ్రౌండ్‌ డస్ట్‌ బిన్‌లను ఖాళీ చేయడం లేదా వాటిని పూర్తిగా ట్రాన్స్‌ఫర్‌ కేంద్రానికి తీసుకెళ్లి అదే స్థానంలో మరో బిన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుంది.  
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో డస్ట్‌ బిన్‌ల ఏర్పాటు
తొలుత జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ సర్కిళ్లలో.. చార్మినార్‌, జూపార్క్‌ల వద్ద  ఈ డస్ట్‌ బిన్‌లను పెట్టేందుకు అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో ఈ డస్ట్‌ బిన్‌లను ఏర్పాటు చేయనున్నారు. అండర్‌ గ్రౌండ్స్‌ డస్ట్‌ బిన్స్‌ ఉన్న..  అక్కడి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని.. నగర బ్యూటిఫికేషన్‌ కూడా దెబ్బతినకుండా  ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

 

20:40 - September 16, 2017
16:04 - September 1, 2017

హైదరాబాద్ : విధి నిర్వహణలో మృతి చెందిన జీహెచ్‌ఎంసీ హార్టీ కల్చర్‌ విభాగం కార్మికుడు సమ్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ  కార్మికులు ఆందోళనకు దిగారు. గణేశ్‌ నిమజ్జనం కోసం జామై ఉస్మానియా వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను నరికేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన సమ్మయ్య ప్రమాదవశాత్తు జారిపడిపోయి మృతి చెందాడు. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వాటర్‌ ట్యాంకు ఎక్కి చెట్లు నరకాలని అధికారులు ఆదేశించడంతో సమ్మయ్య చనిపోయాడని  కార్మికులు ఆరోపిస్తున్నారు. సమ్మయ్య మృతితో పెద్దదిక్కు కోల్పోయామని, అధికారులు తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

 

15:37 - September 1, 2017

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో విధుల్లో మృతిచెందిన జీహెచ్ ఎంసీ కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం ఓయూ పరిధిలో కార్మికుడు సమ్మయ్య చెట్లు నరుకుతూ చనిపోయాడు. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ కార్మికులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ అధికారులకు కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. సమ్మయ్య మృతదేహం వద్దకు జీహెచ్ ఎంసీ కమిషనర్, అదనపు కమిషనర్ రాలేదన్నారు. సమ్మయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.
అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుడి మృతికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:27 - August 29, 2017

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ ఏఎంసీని దుర్భాషలాడారు. చెప్పుతో కొడతానని కింది స్థాయి అధికారిని తిట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు కెనడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే కెనడీపై చర్యలు తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

17:35 - August 26, 2017
12:37 - August 25, 2017

హైదరాబాద్‌ : నగరంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఊపందుకుంది. జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. వివిధ సంస్థలు పెద్ద ఎత్తున మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాయి. ఇందిరా పార్క్‌ వద్ద ఎమరాల్డ్‌ ఆధ్వర్యంలో..  మట్టి విగ్రహాలను జీహెచ్‌ఎంసీ మేయర్‌ సతీమణి శ్రీదేవి.. స్థానిక కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాలుష్యం చేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహాలను కాకుండా.. మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - జీహెచ్ ఎంసీ