జూపూడి ప్రభాకర్

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

07:05 - December 6, 2018

జూపూడి ఇంట్లో డబ్బుల కలకలం...
ఇంటి వెనుక నుండి పారిపోతున్న యువకులను పట్టుకున్న టీఆర్ఎస్ నేతలు...
జూపూడిని అరెస్టు చేయాలన్న గులాబీ నేతలు...

హైదరాబాద్ :
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది..ఇక ప్రలోభాలకు తెరలేచింది. ఆఖరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు..మద్యం..బంగారు ఆభరణాలు పట్టుబడుతున్నాయి. డిసెంబర్ 5వ తేదీ రాత్రి కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ఇంట్లో భారీగా డబ్బులున్నాయనే ప్రచారం కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు డబ్బు సంచులతో పారిపోతుండగా పట్టుకోవడం జరిగిందని..అందులో ఒకరు దొరికారని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని..వెంటనే జూపూడిని అరెస్టు చేయాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వ్యక్తులు ఎవరు ? డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనేది తెలియాల్సి ఉంది. 

12:16 - August 20, 2017

కర్నూలు : నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమని ఏపీ ఎస్సీకార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ అన్నారు. టీడీపీకి అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజలంతా అభివృద్ధికే ఓటు వేస్తారని జూపూడీ ప్రభాకర్‌, మాజీమంత్రి మారెప్ప అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

21:41 - November 2, 2015

హైదరాబాద్ : ఉత్తరాంధ్ర వెనుకబాటులో ధర్మాన ప్రసాదరావు పాత్ర ఉందని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను రెచ్చగొట్టాలని చూసి.. వైసిసి నేతలు విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంతా రాజధాని ప్రాంతంలోనే అంటూ వైసిపి అర్థంలేని విమర్శలు చేస్తోందన్నారు. ఈ విమర్శలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైసిపి నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. 

19:41 - October 17, 2015

హైదరాబాద్ : వైసీపీ ఈ దేశానికి సంబంధించింది కాదా.. అని టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. రాష్ట్రమంతటా పండగ వాతావరణం నెలకొంటే, జగన్‌ మాత్రం ఆహ్వానాన్ని తిరస్కరించడం బాధాకరమన్నారు. భూసమీకరణ విషయాలు తెలియకుండానే మోడీ కార్యక్రమానికి వస్తున్నారనుకుంటున్నారా అంటూ జూపూడి వైసీపీపై మండిపడ్డారు.

18:27 - October 3, 2015

హైదరాబాద్ :సీఎం చంద్రబాబు, కుమారుడు లోకేష్‌ను స్పూర్తిగా తీసుకుని మిగిలిన రాజకీయ నాయకులు తమ ఆస్తులను ప్రకటించాలని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ అన్నారు. చంద్రబాబుకు సింగపూర్‌లో ఆస్తులు ఉన్నాయని, మారిషస్ నుంచి సింగపూర్‌కు నిధులు మళ్లిస్తున్నారని ఓ పత్రిక అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రకటించిన వాటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. వాటిని వారికే రాసిస్తామని జూపూడి సవాల్ విసిరారు.

15:32 - August 28, 2015

హైదరాబాద్: ఎపికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చంద్రబాబు కష్టపడుతుంటే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్యాకేజీల గురించి టీడీపీ పోరాడుతుందని ఆయన చెప్పారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

 

18:12 - August 13, 2015

హైదరాబాద్: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే లేదని టిడిపి అధికార ప్రతినిధి జూపూడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని సీఎం చంద్రబాబు ఇదివరకే చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా అంశంపై విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో మొదట్లో లోక్ సత్తా, సిపిఐ పార్టీలకు స్పష్టత లేకున్నా.. చివరకు రాష్ట్రాన్ని విభజించాలని చెప్పాయన్నారు. లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్.. టిడిపిపై చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. జగన్, కేసీఆర్ ల నోటి నుంచి వచ్చే మాటలు జయప్రకాశ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జయప్రకాశ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడిపి, బిజెపిల మధ్య పొలిటికల్ అలయెన్స్ ఉందని.. బిజెపితో తెగదెంపులు చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు.

 

20:31 - July 28, 2015

హైదరాబాద్: 'కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి' అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలనే యువత స్ఫూర్తిగా తీసుకోవాలని...అదే కలాంకు అర్పించే నిజమైన నివాళి అని టిడిపి నేత జూపూడి ప్రభాకర్‌ అన్నారు. గొప్ప శాస్త్రవేత్త అయిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మృతి దేశానికే తీరని లోటన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న తాను...అబ్దుల్ కలాం చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో పనిచేశానని గుర్తుచేశారు. శ్యాటిలైట్‌ రంగంలో అగ్ర దేశాలుగా ఉన్న ఫ్రాన్స్, రష్యా, అమెరికా లాంటి దేశాలకు భారత్‌ సత్తా ఏంటో అబ్దుల్‌ కలాం నిరూపించారన్నారు. అలాంటి గొప్ప నేతకు ఈ తరం యువత ఆదర్శంగా నిలవాలని జూపూడి కోరారు. 

19:37 - July 14, 2015

హైదరాబాద్: విపక్ష పార్టీల నేతలపై టీడీపీ నేత జూపూటి ప్రభాకర్‌ ఫైర్ అయ్యారు. రాజమండ్రి పుష్కర విషాదంపై విపక్షాలు సీఎం చంద్రబాబును నిలదీయడాన్ని ఆయన తప్పుపట్టారు. విమర్శించే వారు ఇప్పటికైనా..కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. 'మీరేమైనా..పుష్కరఘాట్లకు వాలెంటీర్లను పంపారా'..?అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని హితవు పలికారు.

 

Don't Miss

Subscribe to RSS - జూపూడి ప్రభాకర్