జూబ్లీహిల్స్

06:34 - January 8, 2018
13:20 - January 7, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 లో నిన్న రాత్రి రోడ్రు ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే మస్తానీ మృతి చెందింది. అనూష అనే ఆమ్మాయికి బ్రెయిన్ డెడ్ అయింది. విష్ణువర్ధన్ అనే వ్యక్తి మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:30 - January 4, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో పట్టపగలే దారుణం జరిగింది. రోడ్ నెం.10లో దోపిడి జరిగింది. ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి, పర్సు, టూవీలర్ లాక్కొని దుండగులు పరారైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:33 - November 6, 2017

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో నుండి రూ. 2లక్షలను అపహరించారు. ఇంట్లో దొంగతనం జరిగిందని జూబ్లీహిల్స్ పీఎస్ లో చిరంజీవి మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. గత పదేళ్లుగా పనిచేస్తున్న చిన్నయ్య అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు సమాచారం. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

20:12 - July 8, 2017
16:37 - June 22, 2017

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో రూ. 7 కోట్ల పాత నోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి రవి, శ్రీనివాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో శ్రీనివాస్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే శ్రీనివాస్ నటి జీవిత తమ్ముడు అని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన జీవిత '10టివి'తో మాట్లాడుతూ.. మాకూ శ్రీనివాస్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మా బ్రెదర్ శ్రీనివాస్ అపోలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. రద్దయిన నోట్ల తో పట్టుబడిన శ్రీనివాస్ మాసినిమా మేనేజర్స్ లో ఒకరని తెలిపారు. అయితే మాకూ అతనికి ఎలాంటి సంబంధం లేదని, ఇంతా మీడియా సృష్టేనని, మీడియాలో వార్తను ప్రచురించేటపుడు వివరణ తీసుకుంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

15:43 - June 22, 2017

హైదరాబాద్: రద్దైన పెద్దనోట్ల మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో పెద్ద ఎత్తున రద్దైన పాత కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో శ్రీనివాస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో కంపెనీ నడుపుతున్న శ్రీనివాస్‌తో పాటు రవి అనే మరో వ్యక్తిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 7 కోట్ల రద్దైన పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు సినీనటి జీవితా రాజశేఖర్‌కు సమీప బంధువుగా తెలుస్తోంది. ఈ అంశంలో దీంట్లో సినీనటి జీవిత ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

08:27 - May 31, 2017

హైదరాబాద్ : దాసరి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన సిని పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. పలువురు సినీ, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి దాసరి పార్థీవ దేహాన్ని తరలించారు. మంగళవారం రాత్రి చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులర్పించారు. బుధవారం ఉదయం అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు పలు ఏర్పాట్లు చేశారు. ఇండ్రస్ట్రీ దురదృష్టమని ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ టెన్ టివితో పేర్కొన్నారు. పలువురు అభిమానులు దాసరితో తమకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.

06:36 - May 10, 2017

హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ నారాయణతో పాటు మరోవ్యక్తి మృతిచెందారు. స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి నిషిత్ బెంజ్ కారులో వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో వీరి వాహనం మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిషిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతిచెందాడు. నిషిత్ ప్రయాణించిన బెంజ్ కారు నెంబర్ టీఎస్ 07 ఎఫ్‌కే 7117 అని సమాచారం. ఈ ఏడాదే నారాయణ గ్రూప్స్ డైరెక్టర్‌గా నిషిత్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు నిషిత్ తండ్రి ఏపీ మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమిక సమాచారం.

15:06 - May 4, 2017

హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు మేరకు.. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 505 (1), 505(2) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - జూబ్లీహిల్స్