జేసీ దివాకర్ రెడ్డి

16:42 - July 19, 2018

విజయవాడ : పార్లమెంటు వర్షా కాల సమావేశాలకు హాజరుకాదని భీష్మించిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న మండిపడ్డారు. శుక్రవారం లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశాస తీర్మానంపై చర్చ జరుగనున్న తరుణంలో జేసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బుద్దా వెంకన్న తప్పుట్టారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను బేఖారు చేసే ఎవరిపైనా చర్యలు తీసుకునే అధికారం  టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉందన్నారు. 

 

13:44 - July 19, 2018

అనంతపురం : ఎంపీ జేసి దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు కేంద్రంపై అవిశ్వాసానికి ఎంపీలంతా రెడీ అవుతుంటే.. తాను పార్లమెంటుకు హాజరు కాబోనని ప్రకటించారు. అవిశ్వాసం తీర్మానం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదన్నారు. కోట్లాది మంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరనసన తెలుపిన సందర్భాల్లోనే స్పందించని కేంద్రం.. ప్రయోజనం లేని అవిశ్వాసం వల్ల ఎలా స్పందిస్తుందని వ్యాఖ్యానించారు. కేవలం 25 మంది ఎంపీలు అవిశ్వాసంతో ఏం సాధిస్తారని జేసి దివారకర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. 

20:28 - July 11, 2018

అమ్మయ్య మొత్తం మీద థాయ్ లాండ్ బొయ్యారం కథ సుఖాంతమైంది..జేసీ దివాకర్ రెడ్డి అంటె ఫీలైతవ్ గని.. నీది నాల్కెనా తాటి మట్టనా..? అరే నీయక ఆ పోరని పేరేంది ఆ లోకేశం.. ఆ పోరన్ని ఎవ్వలికన్న మంచి డాక్టరుకు సూపెట్టుండ్రివా ఓ తెల్గుదేశమోళ్లు..అనంతపురం కాడ తెల్గుదేశం ఎంపీలు దీక్ష జేస్తున్నరు ఎందుకు..? ఓయమ్మనే ఈ ముచ్చట మూడు రోజులు ముందు దెలిస్తె చంద్రాలు ఆంధ్రరాష్ట్రమంత పండుగ జేసునో ఏమో..?అయ్యో హైకోర్టు ఎంత పనిజేశే.. ఇంకో నాల్గొద్దులు ఆగినా.. ఎన్నికలు అయిపోవు అప్పుడు ఏం జెప్పినా ఏంగాకపోతుండే..మంత్రి జగదీశ్వర్ రెడ్డిగారు తమరేమో గడ్కోపారి రచ్చగెలుస్తాని..పెద్దల పెద్దరికం పర్వు మర్యాదలు.. అన్ని గల్పి నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తేవెధ ఊర్లె ఒక శవాన్ని తయ్యారు జేశ్నయ్..గీ గరం గరం ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ జేయండి...

20:08 - June 2, 2018
21:43 - May 29, 2018

విజయవాడ : జన్మభూమి కమిటీలు ప్రజా ప్రతినిధుల కొంపముంచుతున్నాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఈ కమిటీలతో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు తెలుగుదేశం పరువుపోతోందని మహానాడు వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లతో అధికారులు పనిచేయడం మానుకున్నారంటూ.. ముఖ్యమంత్రికి సుతిమెత్తగా చురకలు అంటించారు. వైసీపీ అధినేత జగన్‌కు అన్నీ తన తాత రాజరెడ్డి బుద్ధులే వచ్చాయని జేసీ మండిపడ్డారు.

జగన్‌... 1500 కోట్లు తెచ్చుకొంటున్నాడు..
టీడీపీ మహానాడులో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. తనదైన శైలిలో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారులోని లోపాలను వేలెత్తిచూపారు. జన్మభూమి కమిటీలు, చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లపై జేసీ దివాకర్‌రెడ్డి తనదైన రీతిలో చురకలు అంటించారు. వైసీపీ అధినేత జగన్‌కు అన్నీ వాళ్ల తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని దివాకర్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌కు డబ్బుమీద ధ్యాస మినహా ప్రజాసేవపై శ్రద్ధలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం ప్రధాని మోదీ నుంచి జగన్‌... 1500 కోట్లు తెచ్చుకొంటున్నారని దివాకర్‌రెడ్డి ఆరోపించారు.

మోదీకి బాబు గుడ్డిగా నమ్మారు :జేసీ
మరోవైపు మోదీ ప్రత్యేక హోదా ఇవ్వరన్న విషయం చంద్రబాబుకు తెలిసినా గుడ్డిగా నమ్మారంటూ అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రిని వేలెత్తి చూపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీకి ఏ గతిపట్టిందో.. 2019 ఎన్నికల్లో కూడా మోదీకి అదే గతి పడుతుందని దివాకర్‌రెడ్డి హెచ్చరించారు. దేశం, రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు దేశానికి ప్రధాని, లోకేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని దివాకర్‌రెడ్డి ఆకాంక్షించారు.

16:50 - May 29, 2018

విజయవాడ : జన్మభూమి కమిటీలు టీడీపీ ప్రజా ప్రతినిధులు కొంపముంచుతున్నాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కమిటీలతో పార్టీ పరువుపోతోందని విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆవేదన వెలిబుచ్చారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లను ఆసరాగా చేసుకుని అధికారులు పనిచేయడం మానుకొన్నారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ రెండు విషయాల్లో చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ సుతిమెత్తగా చురకలు అంటించారు. 

సోనియా గతే మోదీకి: జేసీ
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు ఏ గతి పట్టిందో... వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి కూడా అదేగతి పడుతుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీకి హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీని ఇక మర్చిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేసీ సూచించారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ప్రసంగించిన జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 

19:00 - March 10, 2018

అనంతపురం : తమ నిరసనలతో కేంద్రం దిగివస్తుందనుకోవడం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం వచ్చిన ఆయన.. కేంద్రం తాను పట్టిన కుందేలుకు మూడుకాళ్లు అన్నట్లుగా వ్యవహహిస్తోందన్నారు. పార్లమెంట్‌ జరిగినంత కాలం తమ నిరసన కొనసాగిస్తామన్న ఆయన.. కేంద్రానికి మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఏపీ ప్రజలకు ఏదో చేస్తారనే నమ్మకం కూడా తమకు లేదన్నారు.  కేంద్రంతో కలిసి నడుస్తామని చెప్పలేమని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

13:28 - March 9, 2018

విజయవాడ : టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు కోరుతూ ఎంపీలు..ఇతర నేతలు..ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలపై జేసీ మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం దక్కదని..ఏమీ కాదని తేల్చిచెప్పారు.

తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు. బీజేపీతో తమకు తలాక్ అయిపోయిందని, భార్యభర్తలు తలాక్ తీసుకున్నాకా పిల్లల కోసం ఏమి చేయాలనే దానిపై మాట్లాడుకున్నట్లే తాము కూడా బీజేపీ వారితో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. హోదా కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకోవాల్సిందేనని తెలిపారు. 

11:19 - March 2, 2018

విజయవాడ : వైసీపీ ఎంపీలకు టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడే రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని జేసీ సవాల్ విసిరారు. ఉండవల్లిలోని సీఎం నివాసం పక్కనే గ్రీవెన్స్ సెల్ లో టిడిపి ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై వైసీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం..రాజీనామాలతో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని పేర్కొన్నారు. ఇదంతా ఓ డ్రామా అని, ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతోనే ఏప్రిల్ ఆరో తేదీన రాజీనామాలు చేస్తామని వైసీపీ పేర్కొంటోందన్నారు. 

12:01 - February 6, 2018

ఢిల్లీ : ఏపీ విభజన చట్టం హామీలను అమలు చేయాలని ఢిల్లీలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏపీకి ప్యాకేజీ లేదు..పాకేజీ లేదు అని మండిపడ్డారు. మిత్రపక్షంలో ఉండాలో లేదో తాము ఆలోచించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహనం ఎక్కువగా ఉందన్నారు. సహనం కొంప ముచ్చతుందని... సహనానికి కూడా హద్దు ఉండాలని చెప్పారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - జేసీ దివాకర్ రెడ్డి