జ్యూస్

15:56 - August 2, 2018

అధిక బరువు తగ్గేంచుకునేందుకు మన చాలా చిట్కాలు పాటిస్తుంటాం. బరువు తగ్గించుకునేందుకు ఎవరు ఏ చిట్కా చెబితే అది పాటిస్తుంటాం. ఏ ఫుడ్ తినమని ప్రిఫర్ చేస్తే అవే తింటుంటాం. ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో తేనెను కలిపి తీసుకుంటే..ఇంకొందరు అన్నం తినడం మానేసి కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటుంటారు. అయితే కేవలం పండ్లను జ్యూస్ లుగా మార్చి ఎక్కువ ద్రవంగా తయారు చేసిన వాటిని తాగినంత మాత్రాన బరువు తగ్గొచ్చా? అన్న ప్రశ్నకు డైటీషియన్లు అడిగితే కాదనే సమాధానమిస్తున్నారు. దీనివల్ల బరువు తగ్గకపోగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ద్రవ పదార్ధాలతో ఆరోగ్యంపై ప్రభావం..
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏక్టివ్ గా పనిచేసేందుకు అవసరమైన శక్తి 'ఘన ఆహారం' వల్లే లభిస్తుందన్నది నిపుణులు చెబుతుఆన్నారు. అంతేతప్ప కేవలం జ్యూస్ లు, ఇతర ద్రవ పదార్ధాల వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుంటాపోతాయంటున్నారు. అలా చేస్తే సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి నీరసించిపోతారట. అంతేకాదు ఇలా చేస్తే దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం వుంటుందంటున్నారు.

ఘనాహారంతోనే ప్రొటీన్లు, మిటమిన్లు..
ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, కార్పొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం. ఇవి ద్రవ పదార్ధాలలో అంటే పండ్ల రసాలలో లభించవు. దీంతో బీపీ తో పాటు షుగర్ స్థాయిలో పలు మార్పులు చోటుచేసుకుని జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అనర్ధాలు జరుగుతాయట.

ఇరిటేషన్స్ తో వచ్చే ప్రమాదం..
కేవలం ఆరోగ్యమే కాకుండా..వ్యక్తిగత, వృత్తి జీవితం కూడా దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఎందుకంటే ద్రవాహారం తీసుకున్నవారిలో శరీరానికి తగిన శక్తి లభించక అలసట వచ్చేస్తుంది. దీంతో ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోవడం, ప్రతి చిన్నవిషయానికి కోపంతో గట్టిగా అరవడం వంటి ఇరిటేషన్స్ కు గురై బీపీ వచ్చే ప్రమాదం వుంటుంది. దీంతో ఉద్యోగుల్లో తీటో ఉద్యోగస్తులతోను, యాజమాన్యంతోను మనస్పర్థలు వచ్చి వృత్తిపరమైన జీవితం దెబ్బతింటుంది. రోజుకు 2,500 కేలరీల ఘనాహారం తీసుకోవాలని నిపుణులు సలహా.

శరీరానికి సమతుల ఆహారం...వ్యాయామం
మన శరీరానికి రోజుకు సగటున 2,500 కేలరీల శక్తి అవసరం పడుతుంది. అయితే ఈ జ్యూస్ లతో కేవలం 800 నుంచి 1200 కేలరీలు మాత్రమే లభిస్తాయి. తగినన్ని కేలరీలు లభించకుంటే శరీరంలో జీవక్రియ నెమ్మదించడం ద్వారా నిస్తేజం అలవడిపోతుంది. జ్యూస్ ల ద్వారా బరువు తగ్గుతారనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డైటీషియన్లు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పీచు పదార్థాలు సమపాళ్లలో తింటూ తగిన వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. పైగా ఈ విధానంలో ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు హామీ ఇస్తున్నారు.

16:42 - August 16, 2017

అందాన్ని మరింత మెరుగుపరుచుకొనేందుకు మహిళలు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా బ్యూటీషియన్లను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇంట్లోనే ఎన్నో ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు. అందులో క్యారెట్ కూడా ఒకటి. ఈ క్యారెట్ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

క్యారెట్‌ పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇది ఒక గిన్నెలో తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ శనగపిండి, కొద్దిగా పసుపు వేయాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత నీటితో కడుక్కోవాలి.

ఒక గిన్నెలో క్యారెట్ జ్యూస్..టేబుల్ స్పూన్ ఎగ్ వైట్ తీసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ ఆలీవ్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం..మెడకు రాసుకోవాలి. అనంతరం కొద్ది సేపటి అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

క్యారెట్ జ్యూస్..అరటిపండు గుజ్జు..ఎగ్ వైట్ లు తీసుకోవాలి. ఇవన్నీ రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. అందులో నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి అనంతరం కడుక్కోవాలి.

క్యారెట్..బొప్పాయి లను సరిసమానంగా తీసుకోవాలి. వీటిని పేస్ట్ చేయాలి. ఇందులో కొద్దిగా పాలు వేసి మిక్స్ చేయాలి. అనంతరం ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల అనంతరం కడుక్కోవాలి. 

15:56 - September 5, 2016

తాగండి..అంటే ఏదో అనుకోకండి..జ్యూస్ లు...వీటిని సేవించడం వల్ల బరువు తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. జ్యూస్ లతో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా అందరూ స్థూలకాయంతో బాధపడుతున్నారు. తింటున్న ఆహారం ఈ మార్పులకు కారణమవుతోంది. అయితే శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ఎక్సర్‌ సైజులతో పాటు ఆహారపదార్ధాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే చాలా మందికి పండ్లు తినడం ఇష్టము ఉండదు. బరువు తగ్గించే జ్యూస్‌ లు కూడా ఉన్నాయి. అవేంటంటే…
కీరదోస..టమోట...క్యారెట్..బీట్ రూట్..యాపిల్..నిమ్మకాయ..పుచ్చకాయ..జ్యూస్ లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయి.
ఉదయం ఆరు గంటలకు లేవగానే కొత్తిమీర జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకోవాలి.
అనంతరం 11గంటలకు ఓ గ్లాస్ బత్తాయి రసం..మధ్యాహ్నం 1గంటకు బొప్పాయి జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.
ఇక సాయంత్రం 4గంటలకు కమలాపండ్ల రసం ఒక గ్లాస్ తీసుకోవాలి.
రాత్రి 8గంటలకు కీరదోసకాయ జ్యూస్ చివరగా పడుకొనే ముందు ఓ గ్లాస్ మజ్జిగ తీసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. సో..ట్రై చేసి చూడండి..

13:23 - June 12, 2016

హైదరాబాద్ : ఫ్రూటీని సరైన పద్దతుల్లో నిల్వ చేయకపోవడంవల్లనే ఫ్రూటీలో బ్యాక్టీరియా చేరి ఉంటుందని బాధిత పిల్లల తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఇం జన్ బౌలిలో నివాసం ఉండే ఓ మహ్మద్ అబ్దుల్ అజీం తన ముగ్గురు పిల్లలకు శనివారం రాత్రి ఫ్రూటీ జ్యూస్ తీసుకొచ్చాడు. ఇవి తాగిన ఫర్హా, ఫైజాన్, అర్హాన్ లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టెన్ టివితో అజీం మాట్లాడారు. జ్యూస్ తాగిన వెంటనే 15నిమిషాల తేడా వ్యవధిలో ముగ్గురు పిల్లలు వాంతులు చేసుకున్నారని..ఆ వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చానని తెలిపారు.
కాలాపత్తర్ పోలీసులు వెంటనే స్పందించారు. కాలాపత్తర్‌లో ఫ్రూటీ జ్యూస్‌ శాంపిళ్లను పోలీసులు సేకరిస్తున్నారు. కాలాపత్తర్‌లో ఉన్న అన్ని షాపుల్లో తనిఖీలు చేసి ఫ్రూటీ పౌచ్‌లన్నింటిని స్వాధీనం చేసుకొని వాటిని సీజ్‌ చేశారు. సీజ్ చేసిన శాంపిళ్లను పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు పోలీసులు. అయితే ఫ్రూటీ జ్యూస్ తాగడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయనేది ఇన్విస్టిగేషన్‌లో తేలుతుందని కాలాపత్తర్‌ పీఎస్‌కు చెందిన పోలీసులు చెప్తున్నారు. 

12:21 - June 12, 2016

హైదరాబాద్ : పాతబస్తీ కాలాపత్తర్‌లో ఫ్రూటీ జ్యూస్‌ శాంపిళ్లను పోలీసులు సేకరిస్తున్నారు. కాలాపత్తర్‌లో ఉన్న అన్ని షాపుల్లో తనిఖీలు చేసి ఫ్రూటీ పౌచ్‌లన్నింటిని స్వాధీనం చేసుకొని వాటిని సీజ్‌ చేశారు. సీజ్ చేసిన శాంపిళ్లను పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు పోలీసులు. అయితే ఫ్రూటీ జ్యూస్ తాగడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయనేది ఇన్విస్టిగేషన్‌లో తేలుతుందని కాలాపత్తర్‌ పీఎస్‌కు చెందిన పోలీసులు చెప్తున్నారు. మహ్మద్ అజీం అనే వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఫ్రూటీ జ్యూస్ తాగడంతోనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నాడని సబ్ ఇన్స్ పెక్టర్ శ్రావణ్ టెన్ టివితో తెలిపారు. అనంతరం వెంటనే తాము రంగంలోకి దిగి ఫ్రూట్ షాప్ విక్రయించిన యజమానిని విచారించడం జరిగిందన్నారు. ఫ్రూట్ జ్యూస్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని శాంపిల్స్ లను లేబరేటరీకి పంపించినట్లు తెలిపారు. రిపోర్టు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఫ్రూట్ జ్యూస్ తాగి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారా ? లేక ఇతర కారణం ఉందా ? అనేది తెలాల్సి ఉంది. 

08:08 - June 12, 2016

హైదరాబాద్ : తండ్రి తీసుకొచ్చిన ఫ్రూటీ తాగి ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. ఇంజన్ బౌలిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు శనివారం రాత్రి ఫ్రూటీ జ్యూస్ తీసుకొచ్చాడు. ఇవి తాగిన ఫర్హా, ఫైజాన్, అర్హాన్ లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆబిడ్స్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు రంగంలోకి దిగి ఫ్రూటీని విక్రయించిన దుకాణంలో విచారించారు. అనంతరం ఫ్రూటీ గౌడౌన్ ను సీజ్ చేశారు. ఫ్రూటీ కంపెనీ నుండి ఇవి వచ్చాయా ? లేక కల్తీ చేశారా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. 

07:18 - December 18, 2015

మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఆకర్షణీయమైన చర్మాన్ని మనం సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా... వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ ఓ గ్లాసుడు యాపిల్‌ జ్యూస్‌ తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే క్యారెట్‌ జ్యూస్‌ ఆరోగ్యానికి మహా మంచిదంటున్నారు. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాకుండా, కళ్ళకు ఎంతో మంచిదని చెపుతున్నారు. అసిడిటిని సైతం తగ్గిస్తుందట. క్యారెట్‌లో విటమిన్‌ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయని వారు చెపుతున్నారు. ఇకపోతే, బీట్రూట్‌ జ్యూస్‌ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా ఇది లివర్‌కు కూడా మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే బీట్రూట్‌ రసం తీసుకుంటే బయటకు పోతాయట. అన్నింటికంటే ముఖ్యంగా ఎర్ర రక్తకణాల సమాఖ్య పెంచుతుందంటున్నారు. అలాగే, కడిగిన టమాటాలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని చెపుతున్నారు.

Don't Miss

Subscribe to RSS - జ్యూస్