టాలీవుడ్

08:12 - February 19, 2018

హైదరాబాద్ : సినీ పరిశ్రమ మరొక నటుడిని కోల్పోయింది. ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు (61) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఎస్సార్ నగర్ లోని ఓ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీనితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య..కూతురు...మరణించిన అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయనకు ఒక కుమారుడున్నాడు. ఆర్థికంగా చితికిపోవడంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మా అసోసియేషన్ సహాయం అందచేసిన సంగతి తెలిసిందే. ఎస్సార్ నగర్ లో ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు. సాయంత్రం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అక్టోబరు 10, 1956లో విజయవాడలో జన్మించారు. 18 ఏళ్ల వయసులో నాటకాల్లోకి ప్రవేశించారు. తొలిసారి రావణబ్రహ్మ వేషాన్ని వేశారు. 'సత్యాగ్రహం’ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ప్రవేశించారు. మొత్తం 400 సినిమాల్లో నటించారు. 'అమృతం' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందు హనుమంతరావు మిఠాయి షాపు నిర్వహించేవారు.

బాబాయి హోటల్, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, సత్యం, పెళ్లాం ఊరెళితే, అతడు, భద్ర, ఆట, మస్కా.. తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 

21:32 - January 17, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌పై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. తెలుగు నిర్మాతల కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయ పన్నులు కట్టడంలో తేడాలు చూపిస్తున్నారనే అనుమానాలు రావడంతో... ఐటీ అధికారులు తనీఖీలు చేపట్టారు. భవ్య క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, హారీక హాసిని, డీవీవీ క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, సీకే ఎంటర్టైన్మెంట్ లకు చెందిన నిర్మాతల కార్యాలయాలపై దాడులు చేశారు.

ఈ దాడుల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి ఎనిమిది మంది నిర్మాతల కార్యాలయాలపై దాడులు చేయడంతో టాలివుడ్ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 

సి.కల్యాణ్ కార్యాలయంలో
ఇటీవల రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ చిత్రం జై సింహాను నిర్మించిన సి.కల్యాణ్ కార్యాలయంలో కూడా తనిఖీలు జరిగాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటంతో ఆ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌పై ఐటీ శాఖ దృష్టి సారించిందని సమాచారం. ఆయన నివాసంలో కూడా సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల విడుదలైన పవన్ అజ్ఞాత వాసి నిర్మాణ రాధాకృష్ణకు చెందిన హారికా, హానిని కార్యాలయంలో కూడా తనిఖీలు జరిగాయి. గత మూడేళ్లుగా వీరి టీడీఎస్‌లో తేడాలు రావడంతోనే ఈ సోదాలు జరిగాయని తెలుస్తోంది. గత మూడు నాలుగు నెలలుగా నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతోనే ఈ ఆకస్మిక తనీఖీలు చేశారు.

దాడుల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
మరోవైపు తమ కార్యాలయంలో ఐటీ సోదాలపై సినీ నిర్మాత సి. కళ్యాణ్‌ స్పందించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని చెప్పారు. తన కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించిన మాట వాస్తమేనని వెల్లడించారు. కొత్త సినిమా విడుదలైన ప్రతీసారి ఐటీ అధికారులు వస్తారని వ్యాఖ్యానించారు. అయితే సోదాలకు సంబందించిన పూర్తి వివరాలు మాత్రం ఐటి అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దాడుల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంపై గురువారం వరకు ఒక క్లారిటీ వస్తుందని సమాచారం. 

15:23 - January 17, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ కు సంబంధించి 8 మంది బడా నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వాహిస్తున్నారు. గత మూడేళ్లుగా పన్ను కట్టని కొంత మంది నిర్మాతలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. భవ్య క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, హారిక హాసిని, డీవీవీ క్రియేషన్స్, డీవీవీ దానయ్య, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్, సీకే ఎంటర్ టైన్ మెంట్ పై ఐటీ దాడులు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

06:36 - December 23, 2017

హైదరాబాద్ : ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌లో పది భారతీయ సినిమాలు సత్తాచాటాయి. కోలీవుడ్‌ మూవీస్‌ విక్రమ్‌ వేధ' తొలిస్థానంలోనిలవగా రెండు, మూడు స్థానాల్లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలు నిలిచాయి. ఐఎండీబీ- 2017జాబితాలో 10 భారతీయ సినిమాలు టాప్‌ ప్లేస్‌లో నిలిచాయి. కోలీవుడ్‌ మూవీ 'విక్రమ్‌ వేధ' అరుదైన ఘనత సాధించింది. విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన తారాగణంగా నటించిన 'విక్రమ్‌ వేధ' తొలిస్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలు ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దక్షిణభారత చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు ఉండటం ఈసారి విశేషం. 2017లో ప్రజలకు బాగా చేరువైన టాప్‌ 10 భారత సినిమాల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది.

ఇక టాప్‌ టెన్‌లో ఇతర మూవీలు.. 4వస్థానంలో సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, 5 హిందీ మీడియం, 6వస్థానంలో ఘాజీ మూవీ నిలవగా , సెవెన్త్‌ ప్లేస్‌లో టాయిలెట్‌ ఏక్‌ప్రేమ్‌కథ, 8 జాలీ ఎల్‌.ఎల్‌.బి, 9వ ప్లేస్‌లో మెర్సల్‌.. ఇక పదవ స్థానంలో ది గ్రేట్‌ ఫాదర్ మూవీస్‌ నిలిచాయి. ఇక నటుల విషయానికి వస్తే .. మొదటి రెండు స్థానాల్లో సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ నిలిచారు. ఇటు దక్షిణభారత చిత్రపరిశ్రమ నుంచి తమన్నా, ప్రభాస్‌, అనుష్క.. వరుసగా 4,6,8 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఈ సినిమాలకు స్థానాల్ని నిర్ణయించించినట్టు ఐఎండీబీ ప్రకటించింది. 

06:31 - December 21, 2017

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన తెలంగాణ డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. రెండు రోజుల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల నివేదిక కూడా రానుంది. అయితే.. బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నవారిలో ఐదుగురివి పాజిటివ్‌ రావడంతో... వారు ఎవరనేదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

డ్రగ్స్ కేసు విచారణ మళ్లీ ఊపందుకోనుంది. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్ట్‌ ఆధారంగా నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేయనుంది. ఇప్పటికే ఈ రిపోర్ట్‌ను... కోర్టుకు సమర్పించారు. విచారణలో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మొత్తం 12 మంది దగ్గర నుంచి బ్లడ్‌ శాంపిల్స్ సేకరించారు. ఇందులో సినిమా ఇండస్ట్రీకి చెందిన పూరి జగన్నాధ్, హీరో తరుణ్, సుబ్బరాజు కూడా ఉన్నారు. వీరిలో ఐదుగురు.. డ్రగ్స్ వాడినట్టుగా.. ఫోరెన్సిక్‌ అధికారులు నిర్ధారించారు. ఆ ఐదుగురు ఎవరనేదానిపై ఇప్పుడు సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే డ్రగ్స్‌ వాడితే వాళ్లను బాధితులుగా .. అదే డ్రగ్స్‌ను అమ్మితే.. నిందితులుగా పరిగణిస్తారు. ఈ మేరకు డ్రగ్స్‌ వాడినట్టు రిపోర్టులు వచ్చిన వారు వినియోగించారా? అమ్మకాలు జరిపారా ? అనేది ఎక్సైజ్‌ శాఖ సిట్‌ తేల్చనుంది. ఏదిఏమైనా.. ఈ ఐదుగురులో సినీ ప్రముఖులు ఉన్నారా? లేదా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రచారం కోసమే విచారణ చేశారనే అపవాదును ఎక్సైజ్‌ శాఖ మూటగట్టుకుంది. మరీ ఈ కేసులో నిందితులకు శిక్షలు పడతాయ లేదో ... వేచి చూడాలి. 

20:06 - December 3, 2017
19:52 - December 3, 2017

'శుభలేఖ సుధాకర్' కు ఆరోగ్యం బాగా లేదని.. ఆయన్ను కూడా ఆదుకోవాలని ఓ కాలర్ క్యారెక్టర్ నటుడు 'దిల్' రమేష్ కు సూచించారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని..సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎన్నో వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువగా యూ ట్యూబ్ లో ఇలాంటి ఎన్నో అవాస్తమైన వీడియోలు ప్రసారం చేస్తున్నాయని, ఇలాంటి రావడం బాధాకరమన్నారు. తాను చనిపోలేదని..బాగా ఉన్నానని.. స్వయంగా ఆ వ్యక్తి మీడియాకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను వాకింగ్ చేస్తుంటే..అన్ని కోల్పోయి రోడ్డున పడ్డాడని..తనపై కూడా వార్తలు వస్తే అయ్యో..అలాంటిదేమి లేదని తాను వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మీడియా..ఇతర ఛానెల్స్..వారు పూర్తిగా వార్తలు తెలుసుకుని ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు 'దిల్' రమేష్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:29 - December 3, 2017

ఒక పద్ధతి లేనిది అంటూ ఉన్నది 'సినిమా'నేని క్యారెక్టర్ నటుడు 'దిల్' రమేష్ పేర్కొన్నారు. చదువు అవసరం లేదని..టాలెంట్ ఉన్నా టైం బాగుండాలని పేర్కొన్నారు. ‘దిల్' రమేష్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈసందర్భంగా ఆయన పరిశ్రమకు ఎలా వచ్చారు ? వచ్చిన కాలంలో ఎదుర్కొన్న అనుభవాలు..ఇతరత్రా విషయాలు తెలియచేశారు.

విశ్వనాథ్ ఇచ్చిన కాంప్లిమెంట్ జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక ఊరులో తాను జన్మించడం జరిగిందని, కేవలం నటించాలనే ఉద్ధేశ్యంతో అన్నీ వదిలేసి హైదరాబాద్ కు రావడం జరిగిందన్నారు. రూ. 1300 జీతంతో విజన్ కలర్ ల్యాబ్ లో మేనేజర్ గా పనిచేయడం జరిగిందన్నారు. ఎక్కడో తనకు ఆశావాదం ఉండేదని..ఏదైనా చేయాలనే సంకల్పం తనలో ఉండేదన్నారు. 'సీతారామరాజు' అనే చిత్రంలో తాను మొదటిసారిగా నటించానని అలా నటిస్తూ ఉన్నానని 'దిల్' సినిమా తనకు 49వ సినిమా అని..ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా వస్తున్న సినిమా తనకు 179వ సినిమా అని తెలిపారు. 16 సంవత్సరాల జర్నీలో ఎందుకు కష్టాలు పడుతున్నానని ఆలోచించలేదన్నారు. ఫేమ్ వస్తేనే డబ్బులు వస్తాయి..ఇది ఒక్క ఫిల్మ్ ఇండ్రస్ట్రీ ద్వారానేనని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:35 - November 16, 2017

మొదటి యాబై చిత్రాలు వేగంగా పూర్తి చేశాను. ప్రస్తుతం కొద్దిగా వేగం తగ్గించాను. కేవలం కమర్షియల్‌ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను' అని అన్నారు సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్‌. 'కిక్‌', 'బృందావనం', 'రగడ', 'మిరపకారు', 'నాయక్‌', 'షాడో', 'బాద్‌షా', 'గౌరవం', 'తడాఖా', 'బలుపు', 'మసాలా', 'రేసుగుర్రం', 'రభస', 'పవర్‌', 'ఆగడు', 'కిక్‌ 2', 'పండగ చేస్కో', 'డిక్టేటర్‌', 'సరైనోడు', 'విన్నర్‌', 'గౌతమ్‌నంద', 'మహానుభావుడు', 'రాజుగారి గది 2' వంటి తదితర చిత్రాలతో సంగీత దర్శకుడిగా థమన్‌కి తెలుగునాట మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపుని ఇంకా మెరుగుపర్చుకుంటానని అంటున్న 
థమన్‌ పుట్టినరోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా బుధవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే, 'ఎనిమిదేండ్ల వయసులోనే నా సినీ ప్రయాణం ప్రారంభమైంది. చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25 ఏండ్లు అవుతోంది. కీ బోర్డ్‌ ప్లేయర్‌గా ఏ.ఆర్‌.రెహ్మాన్‌, మణిశర్మ, కీరవాణితోపాటు దాదాపు అందరూ సంగీత దర్శకుల వద్ద 900 చిత్రాలకు పైగా పని చేశాను. ఈ ప్రయాణంలో వారి దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీత దర్శకుడిగా ఇప్పటివరకు 72 చిత్రాలు పూర్తయ్యాయి. వంద చిత్రాల దిశగా పయనిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి యాభై చిత్రాలు చాలా వేగంగా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు వేగం తగ్గించాను. కమర్షియల్‌ చిత్రాలకే పరిమితం కాకుండా భిన్న నేపథ్య చిత్రాలకూ సంగీతం అందించాలని ఆశిస్తున్నాను. సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఇందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాను. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిజం ప్రధానంగా సాగే సినిమాలదే ఆధిపత్యం. వారి ఇమేజ్‌కు అనుగుణంగానే సంగీతాన్ని అందించాలి. ప్రస్తుతం పాటల విడుదల ధోరణిలో కూడా చాలా మార్పులొచ్చాయి. గతంలో ఒకే రోజున ఆరుపాటల్ని విడుదల చేసేవారు. అందులో మంచి కిక్‌ ఉండేది. ప్రస్తుతం ఓ సినిమా ప్రమోషన్‌ నాలుగైదు నెలల పాటు సాగుతోంది. దాంతో ఒక్కో పాటను, ఒక్కోలా విడుదల చేయటం ట్రెండ్‌గా మారింది. టాలీవుడ్‌లో నాకు సాయి ధరమ్‌ తేజ్‌ అత్యంత ఆప్తుడు. ఇద్దరం కలిసి గతంలో కొన్ని సినిమాలు చేశాం. కానీ సక్సెస్‌ మాత్రం కొట్టలేకపోయాం. ఆ లోటుని భర్తీ చేసేలా మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'జవాన్‌' చిత్రం ఉంటుంది. కమర్షియల్‌, హర్రర్‌, మాస్‌.. ఇలా ఏ తరహా చిత్రం విషయంలోనైనా సంగీత దర్శకుడిగా నా పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు. వంద చిత్రాలకు చేరువవుతున్నప్పటకీ సంగీత దర్శకుడిగా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది' అని పేర్కొన్నారు.

11:12 - November 11, 2017

బొద్దుగుమ్మగా పేరొందిన 'నమిత' త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. తెలుగు..తమిళ చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఒకప్పుడు 'నమిత'కు తమిళంలో స్టార్ హీరోస్ కి ఉన్న క్రేజ్ ఉండేది. ఈమెకు భారీగానే అభిమానులు కూడా ఉన్నారు. ఏకంగా ఈమెకు గుళ్లు కూడా కట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో 'సొంతం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత 'జెమిని', 'బిల్లా', 'సింహా' వంటి చిత్రాల్లో నటించారు. ఈమె త్వరలోనే వివాహం చేసుకోనుంది. ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబును వివాహం చేసుకుంటోందని ప్రచారం జరిగింది. వీటిని శరత్ బాబు..నమిత ఖండించారు. తాజాగా త‌న వివాహం వీరాతో ఈ నెల 24న జ‌ర‌గ‌నుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. కొంతకాలంగా వీరా..నమితలు ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాయి. నవంబర్‌ 24న తిరుపతిలో వివాహం చేసుకోబోతున్నట్టు టాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - టాలీవుడ్