టాస్క్ ఫోర్స్ పోలీసులు

21:17 - November 8, 2018

హైదరాబాద్: మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడుగా ఉన్న మంగలికృష్ణను ఈరోజు హైదరాబాద్ లో  వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టుకు హజరై తిరిగి వెళుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మంగలికృష్ణ పై  హైదరాబాద్ లో దౌర్జన్యం,దాడి,భూకబ్జా కేసులు నమోదయ్యాయి.  హైదరాబాద్ లో  దుర్గారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని, వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని మంగలికృష్ణ  గత కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. ఇందులో భాగంగా మంగలికృష్ణ అనుచరులు దుర్గారావు ఇంట్లో విధ్వంసం సృష్టించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిగా....  కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్ అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. మంగలి కృష్ణ ఆదేశాల మేరకు మరో నలుగురితో కలిసి దాడి చేసినట్లు సమీర్ ఒప్పుకున్నాడు. ఇదే కేసుకు సంబంధించి మంగలికృష్ణ ఈరోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగి పోగా న్యాయస్ధానం బెయిల్ మంజూరుచేసింది. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

16:14 - April 24, 2016

హైదరాబాద్ : నగరంలో నకిలీ నెయ్యి తయారీ గుట్టు రట్టు అయింది. మూసారాంబాగ్ శాలివాహననగర్ లో శివ ఈశ్వరన్ అనే వ్యక్తి ఏడాది కాలంగా నకిలీ నెయ్యి తయారీ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడి చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 4 వేల లీటర్లకు పైగా నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వహకున్ని పోలీసులు అరెస్టు చేశారు. 

 

09:26 - January 29, 2016

చిత్తూరు : చంద్రగిరి మండలం రాజమానుగుంట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 130 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. లొంగిపోవాలంటూ పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పరాయ్యారు. రూ. 2 కోట్ల విలువైన 104 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి పరారైన కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

11:50 - December 31, 2015

చిత్తూరు : శేషాచల అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమారు కోటి రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జూపార్క్‌ను ఆనుకొని ఉన్న లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ జరుపుతుండగా.. స్మగ్లర్లు తారసపడ్డారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై వారు రాళ్లదాడికి దిగడంతో... ఓ రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ఆ ప్రాంతంలో కోటిరూపాయల విలువైన దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

09:38 - October 21, 2015

హైదరాబాద్ : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల అటవీ ప్రాంతంలో కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా 50 తమిళ కూలీలు మినీలారీని వదిలేసి పారిపోయారు.

10:49 - August 24, 2015

హైదరాబాద్ : పరారీలో ఉన్న ఇద్దరు హుజీ ఉగ్రవాదులను ఢిల్లీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జహిరాబాద్‌కు చెందిన షేక్‌నూర్‌, ఢిల్లీకి చెందిన హకీంను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పట్టుపడ్డ ఉగ్రవాది నజీర్‌ గ్యాంగ్‌ సభ్యులుగా వీరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. వీరిని విచారణ నిమిత్తం సిట్‌ పోలీసులకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అప్పచెప్పారు. 

12:31 - August 14, 2015

హైదరాబాద్ :పాతబస్తీలో ఉగ్రవాద సంస్థ హుజితో సంబంధం వున్న ఆరుగుర్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగుర్ని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అనుమానితుల్లో ఇద్దరు పాతబస్తీకి చెందిన వారు కాగా నలుగురిలో ఇద్దరు పాకిస్తానీలు, బంగ్లాదేశ్, మయన్మార్ లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Don't Miss

Subscribe to RSS - టాస్క్ ఫోర్స్ పోలీసులు