టివి

21:53 - August 12, 2017

ప్రకాశం : జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూముల్లో చెరువు తవ్వకంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నీరు, ప్రగతి కార్యక్రమంలోభాగంగా దళితుల భూముల్లో చెరువు తవ్వేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనిపై 10 TV వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం... దళితుల భూముల్ని తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చింది. సర్కారు ప్రకటన స్థానికుల్లో సంతోషం నింపింది.. తమకు మద్దతుగా నిలిచిన 10 TVకి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.


 

10:57 - April 13, 2016

మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవచ్చట. దీనిని గుర్తించటానికి బ్రిటన్‌ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యిమంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు. అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసు కున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్న వారిలో మానసిక సమస్యలు సమారు 60 శాతం వరకూ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా ఉంటున్నాయి. టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో గంట కన్నా తక్కువ సమయం వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరకశ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీనివల్ల కుటుంబంతో పిల్లలు కలసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయంటున్నారు.

Don't Miss

Subscribe to RSS - టివి