టీ

10:17 - August 11, 2017

అల్లం టీ..తాగుతున్నారా ? 'అల్లం' టీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా అనర్ధాలు కూడా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అల్లం టీ సేవించగానే కొంతమందికి పొట్టలో అలజడి గురి చేస్తుంది. ఎక్కువ అల్లం టీ తాగకూడదంట. కారం..మసాల దినుసల విధంగానే అల్లం కూడా మంట కలుగ చేస్తుందని..అల్లం టీ తాగితే రక్తపోటును బాగా తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 'అల్లం' టీ తాగటం వలన స్కిన్‌ రాషెస్‌ నోట్లో లేదా కడుపులో చికాకులను కలిగిస్తుంది. బ్లీడింగ్‌ సమస్యలున్న వారు అల్లంటీ కి దూరంగా ఉండాలంట. 

21:24 - June 14, 2017

హైదరాబాద్: మియాపూర్‌ భూ కుంభకోణంతో సీఎం కేసీఆర్‌కు సంబంధాలున్నాయని... కాంగ్రెస్‌ ఆరోపించింది.. మియాపూర్‌తోపాటు.. హఫీజ్‌పేట, బండ్లగూడ, ఇబ్రహీంపట్నంలో విలువైన భూముల్ని ప్రభుత్వ అండతో గోల్డ్ స్టోన్‌ సంస్థ దోచుకుందని.. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. మియాపూర్‌ భూముల్ని పరిశీలించిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల బృందం.. ఈ భూములపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు..

15:30 - December 21, 2016

ఉదయం లేవగానే చాలా మందికి టీ లేనిదే రోజు గడిచినట్టు అనిపియ్యదు. ఆఫీసుకు..ఇతర పనుల్లో ఉన్నా కాఫీలు..టీలు అలా కానిస్తుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా..అలసట చెందినా టీ తాగాలని అనిపిస్తుంటుంది. మరికొందరు చిప్స్ ఇతరత్రా నమిలేస్తూ ఉంటుంటారు. ఈ రెండు అలవాట్లు ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పదేపదే టీలు తాగడం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయని, ఊబకాయంతో పాటు క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. టీలు..కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగాలని, అది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని సూచిస్తున్నారు. వారాల తరబడి ఫ్రిజ్ లో ఉన్నవి కాకుండా తాజా కూరగాయాలు, కూరలు తినాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలను దూరంగా ఉండవచ్చునని అంటున్నారు నిపుణులు. మరి మీరేమంటారు..

07:23 - September 2, 2016

హైదరాబాద్ : సార్వత్రిక సమ్మె తెలుగురాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో ప్రభావాన్ని చూపెడుతోంది. ఒక్క తెలంగాణలోనే 70లక్షల మంది కార్మికులు సమ్మెలో దిగుతున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు ఉద్యోగాల క్రమబద్దీకరణకోసం డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడానికి కార్మికలోకం ఉరకలు వేస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసులతోపాటు వ్యాపారసంస్థలు పూర్తిగా స్తంభించనున్నాయి. అటు తెల్లవారుజామునుంచే ఆర్టీసీడిపోల ముందు కార్మికులు బైఠాయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటోలు కూడా పూర్తిస్థాయిలో బంద్‌కు దిగుతుండటంతో ..ప్రజారావాణ ఎక్కడిదక్కడే ఆగిపోతోంది. మోదీ ప్రభుత్వం సంస్కరణల పేరిట హక్కులను కాలరాస్తోందని, దేశంలో ట్రేడ్‌యూనిన్లే లేకుండా చేయాలనే కుట్ర పన్నుతోందని సీఐటీయూ నేతలు విమర్శిస్తున్నారు.

సార్వత్రిక సమ్మెకు టీజేఏసీ మద్దతు..
హైదరాబాద్
: సార్వత్రిక సమ్మెకు టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మద్దతు ప్రకటించారు. సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత కార్మికుల హక్కులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధనకు కార్మికులు సంఘటితం కావాలని కోదండరామ్‌ పిలుపు ఇచ్చారు. 

08:26 - July 31, 2016

నెల్లూరు : జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఇద్దరు ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన బోగోలు మండలం బిట్రగుంటలో చోటు చేసుకుంది. ప్రమీణ, నిర్మల అనే ఇద్దరు సోదరీమణులు టీ దుకాణం నడుపుతున్నారు. ఎప్పలిటాగానే ఆదివారం ఉదయం టీ దుకాణం తెరిచి పనులు చేసుకుంటున్నారు. నెల్లూరు కు వెళుతున్న కర్నాటకకు చెందిన లారీ టీ దుకాణంలోకి అతివేగంగా దూసుకొచ్చింది. నిర్మల, ప్రమీల మీద నుండి వెళ్లడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమీల అక్కడికక్కడనే మృతి చెందగా నిర్మల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసింది.
సమాచారం తెలుసుకున్న కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిందని తెలుసుకున్న డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యాడు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

09:45 - February 12, 2016

ఈ మధ్య ఎవరిని కదిలించినా గుర్తులేదు..మర్చిపోయాం అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి కారణం పనివత్తిడి, టెన్షన్స్‌, ఎక్కువగా ఆలోచించడం అంటున్నారు నిపుణులు. ఈ బిజీ లైఫ్‌లో మనం మన ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. పొద్దున లేవగానే టీ కప్పుతోనే ఎంతో మంది తమ రోజును ప్రారంభిస్తారు. పనివత్తిడిలో ఉన్నపుడు టీ తాగితే ఒత్తిడి తగ్గుతుందంటారు కొందరు. అయితే ఇలాంటి మన దైనందిక సమస్యలకు కప్పు గ్రీన్‌ టీ తో చెక్‌ పెట్టొచ్చంటున్నారు డాక్టర్లు. సహజంగా గ్రీన్‌ టీ అనగానే బరువు తగ్గేందుకు ఓ చక్కని ఉపాయంగా అందరూ భావిస్తారు. శరీరంలోని కొవ్వును కరిగించి చక్కటి శరీరాకృతిని అందించే గ్రీన్‌టీలో మనకు తెలియని ఎన్నో ఔషధగుణాలున్నాయి. అవి అధిక బదువును తగ్గించడమే కాదు, షుగరు వ్యాధిని దరిచేరకుండా చేస్తాయి. గ్రీన్‌ టీ లో ఉండే ధయామిన్‌ , అమినోసిడ్స్‌ మనల్ని ఒత్తిడి నుండి దూరం చేస్తాయి. రోజుకో కప్పు గ్రీన్‌ టీ తాగటం వల్ల కీళ్ళనొప్పులు దూరమవుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గుండెకు రక్త ప్రసరణ అందేలా చేస్తూ గుండెలో కొవ్వుని తగ్గించి, గుండెపోటు, రక్తపోటు వంటి ప్రమాదాల నుండి రక్షిస్తుంది. పురుషుల్లో సంభంవించే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ని గ్రీన్‌ టీ నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తూ శరీరానికి శక్తినందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరీ ముఖ్యంగా గ్రీన్‌ టీని తాగడం వల్ల మన శరీరం తేజోవంతంగా, ఆరోగ్యంగానూ ఉంటుంది. మనకి ఇన్ని లాభాలను తెచ్చిపెడుతున్న గ్రీన్‌ టీని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!

12:02 - September 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ పథకం ప్రతిష్టకు బీటలు వారాయి.నిండా 3నెలలు కూడా కాక ముందే వాటర్‌ ఫైలాన్‌ కుంగిపోయింది. కోటి 95 లక్షల ఖర్చుతో మునుగోడులో ఏర్పాటు చేసిన పైలాన్‌కు పగుళ్లు వచ్చాయి. తరతరాలకు చిహ్నంగా ఉండాల్సిన పైలాన్‌ ప్రారంభ దశలోనే ఇలా అయిపోవడం పట్ల అనేక విమర్శలొస్తున్నాయి.

కుంగిపోయిన వాటర్‌ గ్రిడ్‌ ఫైలాన్‌.....

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన ఫైలాన్‌ ఇది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించిన ఫైలాన్‌ కుంగిపోయింది. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే పథకం ఫైలాన్‌కు ఆదిలోనే పగుళ్లు ఏర్పడ్డాయి.

ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం కోసం వాటర్‌ గ్రిడ్‌ ......

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ఆర్భాటంగా ఫైలాన్‌ను ప్రారంభించారు. తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఆవాసప్రాంతాలకు, 69 పట్టణాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం కోసం వాటర్‌ గ్రిడ్‌ పథకం ప్రవేశపెట్టారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు చౌటుప్పల్‌లో ఫైలాన్‌ను ఆవిష్కరించారు. కానీ, అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం కారణంగా ఫైలాన్‌కు మొదట్లోనే పగుళ్లు ఏర్పడ్డాయి.

కోటి 95 లక్షల ఖర్చుతో ఫైలాన్‌ నిర్మాణం....

కోటి 95 లక్షల ఖర్చుతో నిర్మించిన ఫైలాన్‌ కుంగిపోయింది. ఫైలాన్‌కు పగుళ్లు ఏర్పడడానికి.. దీని నిర్మాణంలో లోపమా..? లేక కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమా..? అనేదే అర్థం కావడం లేదు. అంత డబ్బు ఖర్చుపెట్టి కూడా నిర్మాణం సరిగా చేయక పోవడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. భావితరాలకు చిహ్నంగా ఉండాల్సిన ఫైలాన్‌ ప్రారంభ దశలోనే ఇలా అయిపోవడం పట్ల విపక్షాలు అధికార పార్టీపై దాడికి దిగుతున్నాయి. దీనిపై అధికార పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - టీ