టీఆర్ ఎస్ కార్యకర్తలు

15:44 - November 13, 2017

హైదరాబాద్ : రైతు సమన్వయ కమిటీల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలే ఉంటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అన్నం తినో, అటుకులు తినో ఈ బక్క పేద టీఆర్ ఎస్ కార్యకర్తలే 14సం.రాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండ్రని అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణానికి కూడా టీఆర్ ఎస్ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలే పని చేస్తారని తేల్చి చెప్పారు. వాళ్లే రైతు సమన్వయ కమిటీల్లో ఉంటారని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మీరందరు పదవుల్లో సేద తిరిన్నాడు.. మీరు అదే టీఆర్ ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి, జైల్లో వేసిననాడు, కేసులుపెట్టిన్నాడు పేగులు తెగే దాకా కొట్లాడారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వడ్డీ చెల్లింపు విషయంలో రైతుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ప్రతిపక్షాలు చేసేవి గాలి ఆరోపణలని కొట్టిపారేశారు. 'స్టే కావాలి, రైతులకు నీళ్లు అందొద్దు, కరెంట్ ఇయ్యొద్దు, 24 గంటల కరెంట్ అసలే ఇయ్యెద్దు, భూరికార్డులు ప్రక్షాళన కావొద్దు, ప్రాజెక్టులు తొందరగా కంప్లీట్ కావొద్దు' ఇవే కాంగ్రెస్, విపక్ష నేతల ఉద్దేశమని చెప్పారు. ఇదే కదా మీ ఎజెండా అని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేస్తారా అని అశ్చర్యపోయారు. కాలుకేస్తే మెడకేస్తున్నారు..మెడకేస్తే కాలుకేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒక్క పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎన్ని కేసులండి, ఎందుకు కోసం వేస్తున్నారని ప్రశ్నించారు. కోర్టుకు పోతరు, కోర్టు కొట్టివేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతారని చెప్పారు. సాంకేతిక కారణాల వల్లనైనా సరే ఆగాలని వారి ఉద్దేశ్యమని అన్నారు. నీళ్లు రావాలని కోరుతామా.. ఆగాలని కోరుతామా అన్నారు. రైతుకు వచ్చ నష్టపరిహారం ఎంత..? అడ్వకేట్ కు పెట్టేదెంత అని అన్నారు. రోజుకు ఆరు లక్షలు పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడే రైతు ఉన్నాడా అన్ని ప్రశ్నించారు. తమకు ఇంటెలిజెన్సీ రిపోర్టు ఉందని..తమకు సమాచారం ఉందని... ఎవరి వెనుకాల ఎవరు ఉన్నారో తమకు తెలుసని అన్నారు. ప్రభుత్వంపై చిత్తశుద్ధి ఉండేవారికి పెడతామని..ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టే వాళ్లను పెట్టబోమని తేల్చి చెప్పారు. తాము చేసేది తప్పైతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని...ఒప్పు అయితే తామే నెగ్గుతామన్నారు. క్రాప్ కాలనీలను నిర్ణయించాలని, రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నారు. హార్వెస్ట్ లు వచ్చినప్పటి నుంచి రైతులు అక్కడే అమ్ముకుంటున్నారు. పంట వేసే కాన్నుంచి ఎమ్ ఎస్ పీ వచ్చేదాకా ఉంటారు. వారికి ప్రభుత్వం తరపు నుంచి జీతాలు లేవని స్పష్టం చేశారు. 

 

21:44 - September 13, 2017

వరంగల్‌ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు పెట్టింది. హన్మకొండలో సర్క్యూట్‌ హౌస్‌ వద్ద టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను అడ్డుకున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ నిజమైన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తీరుపై మంత్రి కడియంకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతు సమన్వయ సమితుల్లో తమకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

17:52 - April 23, 2016

వరంగల్ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మిషన్ కాకతీయ కాంట్రాక్టరుపై దాడి చేశారు. జాఫర్ గడ్ మండలం తుమ్మడపల్లిలోని అతనిపై దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. టెండర్ నుంచి వైదొలగాలని కార్యకర్తలు బెదిరించారు. జాఫర్ గడ్ మండలం తుమ్మడపల్లిలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువు మరమ్మతు పనుల కోసం సాయిలు అనే కాంట్రాక్టర్ ఆన్ లైన్ టెండర్ దాఖలు చేశారు. అయితే టెండర్ వేయడానికి కంటే ముందే డీడీ తీసుకోవాలి. డీడీ తీసుకుంటేనే టెండర్ కు ఎలిజబులిటీ ఉంటుంది. టెండర్ వేసేందుకు సాయిలు డీడీ తీసుకున్నాడు. ఈనేపథ్యంలో జాఫర్ గడ్ ప్రాంతానికి చెందిన టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు తుమ్మడపల్లిలోని సాయిలు ఇంటిపై దాడి చేశారు. టెండర్ డీడీ ఇవ్వాలని సాయిలుపై దాడి చేశారు. టెండర్ వేయొద్దని... విరమించుకుంటున్నట్లు లెటర్ ఇవ్వాలని  దాడి చేసినట్లు తెలుస్తోంది. టెండర్ నుంచి వైదొలగాలని టీఆర్ ఎస్ కార్యకర్తలు, నేతలు సాయిలును బెదిరించినట్లు సమాచారం. అడ్డుగా వచ్చిన అతని కుమారునిపై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే తాము దాడి చేయడానికి అతని ఇంటికి వెళ్లలేదు.. మాట్లాడేందుకు వెళ్లామని టీఆర్ ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. డీడీని, టెండర్ లేటర్ వెనక్కి ఇవ్వాలని అడగడంతో వారే గందరగోళం సృష్టిస్తున్నారని నేతలు చెబుతున్నారు. సుబేదార్ పోలీసులకు సమాచారం అందగా వారు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గీయులను పీఎస్ కు తీసుకెళ్లారు. 

 

Don't Miss

Subscribe to RSS - టీఆర్ ఎస్ కార్యకర్తలు