టీజర్

11:44 - July 20, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' 'జై లవ కుశ' చిత్రంతో బిజీగా మారిపోయారు. బాబీ దర్శకత్వంలో సోదరుడు 'నందమూరి కళ్యాణ్ రామ్' నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ఏకంగా 'ఎన్టీఆర్' మూడు పాత్రలను పోషిస్తుండడం గమనార్హం. ఇటీవలే చిత్రానికి సంబంధించిన ఫొటోలు..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ లో 'ఎన్టీఆర్' పలికిన డైలాగ్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఒక్క టీజర్ తోనే చిత్ర అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మూడు పాత్రలకు సంబంధించిన టీజర్స్ విడుదల చేస్తారని తెలుస్తోంది. అందులో ఒక టీజర్ విడుదల కాగా మరొక టీజర్ ఈనెలాఖరులోగా విడుదల చేస్తారని టాక్. రాఖీఖన్నా..నివేదా థామస్ లు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణెలో జరుపుకొంటోంది. ఈ విషయాన్ని స్యయంగా 'ఎన్టీఆర్' ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. నైపుణ్యం కలిగిన బృందంతో పూణెలో శరవేగంగా షూటింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్ లో తీసిన ఒక ఫొటోను 'ఎన్టీఆర్' పోస్టు చేశారు. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

10:27 - July 19, 2017

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం నటిస్తున్న 101వ సినిమా 'పైసా వసూల్'. సెన్సెషనల్ డైరెక్టర్ గా పేరొందిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో 'బాలయ్య' వెరైటీ గెటప్ లో కనిపించనున్నారని టాక్. 'శ్రియా శ‌ర‌న్' మరోసారి 'బాలయ్య'తో జత కడుతోంది. ‘ముస్కిన్', ‘ఛార్మి' లు కూడా నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. పోస్టర్లలో బాలయ్య లుక్ కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మరోవైపు డబ్బింగ్ పనులు చేపడుతున్నారు. ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ మొదలు పెట్టింది. ఆఖరి షెడ్యూల్ ఈనెల 28వ తేదీన ముగియనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకొంటోంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు..చేర్పులు చేసుకోవచ్చని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో బాలయ్య ఓ సాంగ్ కూడా పాడిన సంగతి తెలిసిందే.

గతంలో ఎన్నడూ చూడని 'బాలయ్య'ను 'పైసా వసూల్' చిత్రంలో చూస్తారని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్, ఆడియో ఫంక్షన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంటోంది.

10:27 - July 14, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' తాజా చిత్రం 'జై లవ కుశ' సినిమాతో బిజీగా ఉన్నాడు. బాబి దర్శకత్వంలో 'ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఒక పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ‘జై' పాత్రలో 'ఎన్టీఆర్' తనదైన స్టైల్ లో నటించి అభిమానులను అలరించాడు. నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న 'జై' పాత్రలో నటిస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ బద్ధలు కొడుతూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే చిత్రానికి సంబంధించిన మరో టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈసారి 'లవ' క్యారెక్టర్ ను పరిచయంతో టీజర్ ఉంటుందని తెలుస్తోంది. 'జై' రావణుడు అయితే 'లవ' రాముడిలా ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈనెలాఖరున టీజర్ రిలీజ్ అవుతుందని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

08:53 - July 12, 2017

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లై. ఈ మూవీ టీజర్‌ మంగళవారం విడుదలైంది. పూర్తి యాక్షన్‌ సన్నివేశాలతో విడుదల చేసిన టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. యాక్షన్‌ ఎంటరటైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అర్జున్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో అర్జున్‌ పాత్రపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

10:47 - July 8, 2017

హైదరాబాద్ : బిగ్ బాస్ టీజర్ విడుదల అయింది. ఈనెల 16న బిగ్ బాస్ రియాల్టీ షో జరుగనుంది. ఈనెల 16న మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. షోపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. జూ.ఎన్ టీఆర్ టీజర్ కు మంచి స్పందన వస్తుంది. మరిన్ని వివరాలను వీడియో చూద్దాం...

15:43 - July 5, 2017

టాలీవుడ్ లో పలు చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా ? ఎప్పుడు చూద్దామా ? తాము అభిమానించే నటుడు అందులో ఎలా ఉన్నాడోనని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. కానీ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సినిమా రిలీజ్ కంటే ముందుగానే టీజర్..పోస్టర్స్ పై ఉత్కంఠ పెరిగిపోయింది. అందుకనుగుణంగా ఆయా చిత్రాల దర్శకులు..హీరోలు ఉత్కంఠను కలుగ చేసే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. తాజాగా జూ.ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై 'నందమూరి కళ్యాణ్ రామ్' నిర్మాణంలో బాబి దర్శకత్వంలో నిర్మితమౌతున్న ఈ సినిమాలో 'జూ.ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలు పోషిస్తుండడంపై అభిమానుల్లో ఉత్కంఠను కలుగ చేస్తోంది.
ఆయన సరసన 'రాశీఖన్నా'..’నివేదా థామస్' లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇటీవలే సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అనంతరం కొద్ది రోజుల అనంతరం చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. 'జై లవ కుశ'కు సంబంధించి మూడు టీజర్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 'ఇటీవల మీరు 'జై'ను చూశారు. జులై 6 సాయంత్రం 5.22 గంటలకు 'జై' టీజర్ చూసేందుకు సిద్ధం కండి' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకి రిలీజ్ చేయనున్న టీజర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి టీజర్ అభిమానులను సంతృప్తి పరుస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

10:20 - July 3, 2017

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ' జై లవ కుశ' సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుండడంతో చిత్రంపై ఉత్కంఠ పెరుగుతోంది. సినిమాలో 'ఎన్టీఆర్' మూడు పాత్రలను పోషించనున్నట్లు టాక్. సినిమాకు సంబంధించిన ఓ లుక్ ను ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసింది. కానీ లుక్ లో మాత్రం 'ఎన్టీఆర్' ఒకరు మాత్రం ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. తాజాగా చిత్ర యూనిట్ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ‘జై లవ కుశ' మూడు పాత్ర టీజర్లు విడివిడిగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల మీరు 'జై'ను చూశారు. జులై 6 సాయంత్రం 5.22 గంటలకు 'జై' టీజర్ చూసేందుకు సిద్ధం కండి' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ కీలక ప్రకటన చూసిన అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. సాధారణంగా సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ను మాత్రమే విడుదల చేస్తుండడం తెలిసిందే. కానీ ఎన్టీఆర్ ఆర్ట్స్ మూడు టీజర్లను విడుదల చేస్తుండడం క్యూరియాసిటీని మరింత పెంచేసింది. రాశీఖన్నా..నివేతా థామస్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుల్లితెర హిందీ నటుడు 'రోనిత్ రాయ్' విలన్ గా నటిస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకాంపై 'జూ.ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

11:19 - June 22, 2017

జూ.ఎన్టీఆర్ నటిస్తున్న 'జై..లవ..కుశ' చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈచిత్రంలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలను పోషిస్తుండడంపై అభిమానుల్లో తెగ ఉత్కంఠ రేపుతోంది. ఇటీలే ఈ చిత్ర ఫొటో విడుదలైన సంగతి తెలిసిందే. మరలా ఎలాంటి ఫొటోలు..ఇతరత్రా విడుదల కావడం లేదు. తమ అభిమాన హీరో ఎలా ఉంటాడు ? టీజర్ ఎప్పుడొస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతున్న సినిమా టీజర్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం టీజర్‌ను వచ్చే నెల మొదటి వారంలో అభిమానుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్నారు.

13:09 - June 19, 2017

టాలీవుడ్ లో తమ తమ చిత్రాలను వెరైటీగా ప్రమోట్ చేస్తూ..ప్రచారం నిర్వహిస్తూ చిత్రాలపై మరింత ఉత్కంఠ రేకేత్తిస్తున్నారు. మొదటగా మోషన్ పిక్చర్ అంటూ..తరువాత మూవీకి సంబంధించిన పలు లుక్స్ విడుదల చేస్తుండడంతో ఆయా చిత్రాలపై క్యూరియాసిటీ పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న 'స్పైడర్' చిత్రాన్ని కూడా అదే బాటలో పయనిస్తోంది. మొదట లుక్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఎలాంటి మాటలు లేకుండానే టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఒకటో తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'మహేష్‌' పుట్టిన రోజు ఆగస్టు తొమ్మిదో తేదీన రెండో టీజర్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అందులో 'మహేష్‌' పలికే డైలాగ్స్ ఉంటున్నట్లు సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'మహేష్ బాబు'.. 'రా'అధికారిగా నటిస్తున్నాడు. ఇతనికి జోడిగా 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది.

17:36 - June 18, 2017

హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా చేసిన 'బిగ్ బాస్' షో ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో కూడా సందడి చేయనుంది. తమిళంలో కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేయనున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలుగు 'బిగ్ బాస్' కార్యక్రమానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో..లుక్స్ తో ఆకట్టుకున్నాడు. పలువురు సెలబ్రెటీలతో సాగే ఈ గేమ్ షో ఉంటుందని సమాచారం.

Pages

Don't Miss

Subscribe to RSS - టీజర్