టీజేఏసీ

16:53 - August 16, 2017

ఖమ్మం : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన పచ్చి బూటకమని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ విమర్శించారు. ఖమ్మంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణి కాలరీస్‌, ఆర్టీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లోని ఖాళీలను కూడా ప్రభుత్వ శాఖ ఖాతాలో వేశారని మండిపడ్డారు. ఇంతవరకు పాతికవేల ఉద్యోగాలను మాత్రమే ప్రకటించారన్నారు. అంకెలగారడీతో కేసీఆర్  నిరుద్యోగులకు మభ్యపెడుతున్నారని కోదండరాం విమర్శించారు.  

20:18 - August 12, 2017

మెదక్ : అమరుల స్ఫూర్తి యాత్రకు వరుసగా రెండోరోజు పోలీసులు అడ్డు తగిలారు. హైదరాబాద్‌ నుంచి యాత్రకు బయలుదేరిన తెలంగాణ జేఏసీ నేతల్ని తుప్రాన్‌ మండలం అల్లాపూర్‌దగ్గర పోలీసులు ఆపేశారు.. టోల్‌గేట్‌ దగ్గర కోదండరాం టీంను అరెస్ట్ చేసి పలు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.. కోదండరాంను కౌడిపల్లి పీఎస్‌కు పంపారు.. అరెస్ట్ విషయం తెలుసుకున్న జేఏసీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ముందు ఆందోళనకు దిగారు.స్ఫూర్తియాత్రకు ముందు... కోదండరాం.. నిజమాబాద్ జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మార్గాన్ని అన్వేషించడం కోసమే అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరుల స్ఫూర్తి యత్రకు పోలీసులు అనుమతించలేదని.. అందుకే హాల్ మీటింగ్ నిర్వహించాలని తీర్మానించామని ప్రకటించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని చెప్పారు.తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు జేఏసీ స్ఫూర్తియాత్ర చేపట్టాలని రెండురోజులుగా ప్రయత్నిస్తోంది. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు బయలుదేరిన జేఏసీ నేతల్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆపేశారు.. ఆ తర్వాత అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు పంపారు.. అరెస్టులకు భయపడమన్న జేఏసీ నేతలు... శనివారం మళ్లీ యాత్రకు వెళతామని ప్రకటించారు. ఈ సమాచారంతో శనివారం నిజామాబాద్‌కు వెళ్లే ప్రతి మార్గంలో తనిఖీలుచేసిన పోలీసులు... మళ్లీ జేఏసీ నేతల్ని అదుపులోకి తీసుకొని.. మళ్లీ హైదరాబాద్ తిప్పిపంపారు.

11:09 - August 12, 2017

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ప్రజల హక్కు నిరసన తెలిపే అధికారం లేకుంటే ప్రజాస్వామ్యం బతకదని గతంలో చాల సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. టీజేఏసీ యాత్రను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ర్యాలీకి అనుమతి లేదంటున్నందున నిజామాబాద్‌లో మీటింగ్‌ పెట్టుకుంటామని కోదండరామ్‌ అన్నారు. 

06:33 - August 12, 2017

హైదరాబాద్ : ఉద్యమంలో కలిసి పనిచేసిన రెండు సంఘాల మధ్య వార్ మొదలైంది. తెలంగాణ కోసం అందర్నీ ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించిన టీజేఏసీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధానికి దిగుతోంది. కోదండరాం చేస్తున్న అమరుల స్ఫూర్తి యాత్రను నిజామాబాద్ లో గులాబీ నేతలు అడ్డుకోవడంపై టీజాక్ మండిపడుతోంది. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీ చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుందని విమర్శలు ఎదుర్కొన్న.....టీజాక్ ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం వరకు ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆచి తూచి స్పందించిన జాక్....ఆ తర్వాత రూటు మార్చుకుంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుబడుతూ వచ్చింది. టీజేఏపీ చైర్మన్‌ కోదండరాం... గులాబీ బాస్ కెసిఆర్ కు మధ్య రోజురోజుకు అంతరం పెరుగుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో టీజేఏసీ నేతలు ముఖ్యమంత్రిపై నేరుగా ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నేతలు కూడా కోదండరాం... కాంగ్రెస్ ఏజెంట్ అని విమర్శిస్తూ రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీజాక్ చైర్మన్ కోదండరాం గులాబీ పార్టీ కీలక నేతల నియోజకవర్గాలనే టార్గెట్ గా చేసుకున్నారు. అమరుల స్ఫూర్తి యాత్రలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీకి ఎన్నికైన సిద్దిపేట, ముఖ్యమంత్రి తనయుడు, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోకవర్గాల్లో కోదండరాం యాత్ర పూర్తయింది. కామారెడ్డి జిల్లాలో మొదలైన యాత్రకు పోలీసులు బ్రేకులు వేయడంతో పాటు గులాబీ దళాలను నుంచి ప్రతిఘటన ఎదురైంది. టీజాక్ ఏర్పాటు చేసుకున్న టెంట్లు పీకేయడం టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల పనేనని ఆరోపిస్తన్నారు. ప్రభుత్వం పోలీసులతో తమను అడ్డుకునే ప్రయత్నం చేసినా తాము యాత్రలను మాత్రం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పోలీసుల ఓవర్ యాక్షన్ తో అవస్థలు పడుతున్న అధికార పార్టీ టీజాక్ యాత్రను కూడా అడ్డుకోవడం చర్చనీయంశంగా మారుతోంది.

20:18 - August 11, 2017

కామారెడ్డి : ల్లాలో టీ జేఏసీ అమరుల స్ఫూర్తియాత్రకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడంలేదంటూ జేఏసీ అమరవీరుల స్ఫూర్తియాత్ర చేపట్టింది. ఈ యాత్ర కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో ప్రారంభించేందుకు జేఏసీ నేతలంతా అక్కడికి చేరుకున్నారు. జేఏసీ నేతల్ని గులాబీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. యాత్రకు అనుమతి లేదంటూ జేఏసీ నేతల్ని బిక్కనూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.. పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు.. పోలీసులతీరుపై ఆగ్రహించిన టీ జేఏసీ నేతలు... స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం భారీ బందోబస్తు మధ్య జేఏసీ నేతల్ని హైదరాబాద్‌కు తరలించారు.

15:08 - August 11, 2017

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా, బస్వాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీజేఏసీ అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. జేఏసీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేశారు. వాహనాలకు అనుమతి లేదని బికనూరు పోలీస్‌ స్టేషన్ ముందు పోలీసులు వాహనాలను నిలిపేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:06 - May 16, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్నాచౌక్‌ను పరిరక్షించుకుంటామని వామపక్షాలు, టీజేఏసీ నేతలు స్పష్టం చేశారు. ధర్నాచౌక్‌ను రక్షించుకునే వరకు తమ ఉద్యమం ఆగబోదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తే.... పోలీసులను తమపైకి ప్రభుత్వం ఉసిగొల్పిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను కేసీఆర్‌ కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజా హక్కుల పరిరక్షణకు సంఘటితంగా ఉద్యమిస్తామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ధర్నా చౌక్‌లో స్థానికుల పేరుతో పోలీసులు ధర్నాకు దిగడంపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

08:54 - May 15, 2017

ప్రజల అభిప్రాయలను ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని న్యూడెమోక్రసీ నేత రంగారావు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధర్నా చౌక్ ద్వారా తెలియజేయాలనికుంటే ప్రభుత్వం మాత్రం ధర్నా చౌక్ లెకుండా చేస్తుందని టెని టివి జనపథంలో పాల్గొన్న ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

19:01 - May 11, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్ ను ఇందిరాపార్క్ నుంచి తరలించడాన్ని నిరసిస్తూ ఈనెల 15 న ' చలో ధర్నా చౌక్' కార్యక్రమానికి పిలుపునిచ్చారు టిజెఎసి మరియు అఖిలపక్ష నేతలు. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు అఖిలపక్షం నేతలు డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై డిజిపి సానుకూలంగా స్పందించినట్లు కోదండరాం చెప్పారు. ఈ నిరసనలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు గన్ పార్క్ వద్ద మౌనదీక్ష చేపడుతున్నట్లు కోదండరామ్ తెలిపారు.

21:56 - April 28, 2017

ఖమ్మం : జిల్లాలో టీజేఏసీ రైతు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పాలేరు-కూసుమంచి మధ్య టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ను అరెస్ట్‌ చేశారు. టీ-జేఏసీ రైతు పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులంటున్నారు. ఖమ్మం మిర్చియార్డును కోదండరామ్‌ రేపు సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. కోదండరామ్‌ అరెస్ట్‌ను టీ-జేఏసీ నేతలు ఖండించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Pages

Don't Miss

Subscribe to RSS - టీజేఏసీ