టీపీసీసీ చీఫ్

18:44 - March 5, 2018

నిజామాబాద్ : నాలుగేళ్ల వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే జాతీయ స్థాయి రాజకీయాలు అంటు కేసీఆర్ హడవుడి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రికి ఏరోజు మనసొప్పదన్నారు. ఇప్పుడు ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు థర్డ్ ప్రంట్ అంటు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

19:30 - September 29, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. సింగరేణి ఎన్నికల కోసం కేసీఆర్ దిగజారడం సిగ్గు చేటు అన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు చేశారో అడగాలన్నారు. కేసీఆర్ సీఎం సీటులో కూర్చుకోవడానికి సింగరేణి కార్మికులే కారణమని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తావా లేదా 
అడగాలన్నారు. వారసత్వ ఉద్యోగాలపై కాంగ్రెస్ కేసు వేయలేదని తెలిపారు. కేసులు వేసింది తెలంగాణ జాగృతి అని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:05 - September 13, 2017

నల్లగొండ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ టీపీసీసీలో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. పీసీసీ చీఫ్‌ పేరు ఎత్తితే చాలు.. తోక తొక్కిన తాసుపాములా కస్సుమంటూ లేస్తారు. కోపంతో ఊగిపోతారు. శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా తరగతుల తర్వాత మరింత రగలిపోతున్నారు. ఈ సమావేశాల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమను అవమానించారన్న భావంతో ఉన్న కోమటిరెడ్డి సోదరులు... టీపీసీసీ చీఫ్‌ను టార్గెట్‌ చేశారు. ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచే కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది.

గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నంత కాలం గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవకాశం దొరికనప్పుడట్టా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని టార్గెట్‌ చేస్తున్నారు. చాన్స్‌ వచ్చినప్పుడల్లా తన ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం పైరవీలు చేసుకుంటున్న కోమటిరెడ్డి సోదరులు... శంషాబాద్‌ సమావేశం అనుభవంతో ఇక కాంగ్రెస్‌లో ఉండలేమన్న భావనుకు వచ్చారని సమాచారం. పార్టీ శిక్షణా తరగతుల్లో అవమానించారన్న కోపంతో రగలిపోతున్న కోమటిరెడ్డి సోదరులు.. ఆ రోజు వేదికపై ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డితోపాటు ఐఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాకు ఇంగిత జ్ఞానంలేదంటూ వ్యాఖ్యానించడం రాజకీయం పెద్ద రచ్చతోపాటు చర్చకు దారితీసింది.

టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమకు కాంగ్రెస్‌లో పొగబెట్టారని బహిరంగంగా విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి సోదరులు.. టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు ఇవ్వకపోతే పార్టీలో ఉండలేమని ప్రకటించారు. సెప్టెంబర్‌లో పీసీసీలో మార్పులు ఉంటాయని అనుకున్న నల్గొండ బద్రర్స్‌ ఆశలపై కుంతియా నీళ్లు చల్లారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కెప్టెనంటూ కుంతియా స్పష్టం చేయడంతో.... కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. శంషాబాద్‌ షాక్‌తో కోమటిరెడ్డి సోదరులకు పార్టీలో కొనసాగలేని పరిస్థితి వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలపై స్పష్టంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. తమ రాజకీయ భవిష్యత్‌పై అయోమయంలో ఉన్నారని వినిపిస్తోంది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి భవిష్యత్‌ పయనం టీఆర్‌ఎస్‌, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వీరికి టీఆర్‌ఎస్‌ తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక బ్రదర్స్‌ బీజేపీ గూటికి చేరతారని చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కూడా కోమటిరెడ్డి సోదరుల్లో స్పష్టతలేదని వినిపిస్తోంది. కమలం పార్టీపై ప్రజల్లో ఊపు కనిపించడంలేదని భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరు కలవరపడుతున్నారు. కమలదళంలో చేరితే భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందేమోన్న భయం వెంటాడుతోంది. అన్ని విషయాల్లో స్వేచ్ఛగా వ్యవహరించే తాము బీజేపీలో ఇమడలేమన్న భావంతో కోమటిరెడ్డి సోదరులతోపాటు వీరి అనుచరులు ఉన్నారు. దీంతో బీజేపీలోకి వెళ్లే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా
మొత్తానికి పార్టీలో పట్టు పెంచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాటిని తట్టుకోలేక... కోటమిరెడ్డి సోదరులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు వేరు పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు వీరిపై వేటు పడకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎటూతేల్చుకోలేని పరిస్థితితుల్లో చివరి అవకాశంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. వీరికి రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా ? ఇవ్వకపోతే కోమటిరెడ్డి సోదరుల దారెటు ? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

19:27 - July 8, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్లక్ష్యం చేస్తోందని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడద్డి విమర్శించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్.... పాలన కంటే పక్క పార్టీల వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం మీదనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలకు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఒక్క యూపీఏ పాలనకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇంచార్జ్‌ దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 

Don't Miss

Subscribe to RSS - టీపీసీసీ చీఫ్