టెన్ టివి

07:30 - June 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లా గరికపర్రు గ్రామంలో దళితుల వెలివేతపై టెన్‌టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో జాతీయ, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్‌లు సీరియస్‌గా స్పందించాయి. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశాయి. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ఆదేశాలతో జిల్లా అధికారుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా సబ్‌కలెక్టర్‌ గరికపర్రు గ్రామాన్ని సందర్శించగా.. ఈనెల 25న విచారణకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు కూడా హాజరుకావాలని ఏపీ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ఆదేశించింది. అటు కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ కూడా ఆదివారం గరికపర్రును సందర్శించి పరిస్థితిని స్వయంగా తెలుసుకోనున్నారు.

దళిత సంఘాల ఆగ్రహం
గరికపర్రులో దళితుల వెలివేతపై ఏపీ, తెలంగాణల్లో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌, కర్నూలు, కాకినాడ, విశాఖ నుంచి దళిత సంఘాల నేతలు శనివారం గ్రామాన్ని సందర్శించనున్నారు. అటు ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ కూడా ఇవాళ గరికపర్రుకు వస్తున్నారు. రెండు నెలలుగా గ్రామంలో దళితుల వెలివేత కొనసాగుతున్నా.. అధికారం యంత్రాంగం పట్టించుకోకపోవడంపై దళితసంఘాలు మండిపడుతున్నాయి. సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లి.. దళితుల పట్ల కొనసాగుతున్న వివక్షను ప్రపంచానికి చూపిన టెన్‌టీవీని అభినందిస్తున్నారు.

 

20:52 - May 27, 2017

ఎంత మంది బలి అవ్వాలి....? ఎందరికి ఈ అన్యాయం జరగాలి....? పరువు పేరుతో సిగ్గు ఎగ్గు లేకుండా కుల దురహకారమనే అదిమాజాతి లక్షాణాలతో విర్రవిగే కొందరు పశుప్రయులు చేస్తున్నా ఈ దారుణాలకు అంతం ఎప్పుడు...? నాడు కంచకర్ల కోటేశ్ నిన్న మంథని మధుకుర్, రాజేష్ ఇప్పుడు నరేష్ ప్రభుత్వాలలో చలనం రాదా...? ఖాకీ కళ్లకున్న పొరలు విడవా...? అదిపాత్య కులల అలోచన తీరులో మార్పచ్చేదేపుడు..పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

16:46 - May 27, 2017

యాదాద్రి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరేష్‌ అదృశ్యం కేసులో 10టీవీ చెప్పిందే నిజమైంది. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే.. నరేష్‌ను కిరాతకంగా హత్య చేశాడు. నరేష్‌ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసి బూడిదను మూసీలో కలిపారు. పోలీసుల దర్యాప్తులో స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి నేరాన్ని అంగీకరించడంతో అతడిని అరెస్ట్‌ చేశారు. మే 2 నుంచి కనిపించకుండా పోయిన నరేష్‌ హత్యకు గురయ్యాడు. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే నరేష్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీనివాసరెడ్డి సోదరుడు, సోదరుడి కుమారుల పేర్లనూ నిందితుల జాబితాల్లో చేర్చారు. ఆద్యంతం మలుపులతో కూడిన ప్రేమగాథ చివరికి తీవ్ర విషాదాంతంగా ముగిసింది.

నరేష్‌ కుటుంబంపై కేసు పెట్టిన శ్రీనివాస్‌రెడ్డి
ఆత్మకూర్‌ ఎం మండలం లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, పల్లెర్లకు చెందిన అంబోజి నరేష్‌ మూడు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ముంబైలో కాపురం పెట్టారు. అయితే వీరి వివాహానికి నరేష్‌ కుటుంబ సభ్యులు అంగీకరించినా.... స్వాతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో ఎలాగైనా నరేష్‌ను అంతమొందించి తన కుమార్తెను తమ దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నారు. దీంతో నరేష్‌ మర్డర్‌కు పక్కా స్కెచ్‌ వేశారు. వేసుకున్న పథకం ప్రకారం స్వాతి, నరేష్‌ పెళ్లికి అంగీకరిస్తున్నట్టు ముంబై నుంచి రప్పించారు. స్వాతి పుట్టింటికి చేరగా... నరేష్‌ మాత్రం అదృశ్యమయ్యాడు. నరేష్‌ ఆచూకీ తెలియకపోవడంతో స్వాతి తల్లిదండ్రులను అనుమానించింది. మనస్తాపంతో యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. స్వాతి ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. 16వ తేదీన తెల్లవారుజామున స్వాతి ఇంట్లోని మరుగుదొడ్డిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కొనప్రాణాలతో ఉన్న స్వాతిని తల్లిదండ్రులు భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయింది. స్వాతిది హత్యా లేక ఆత్మహత్యా అన్న అనుమానాలు రేకెత్తాయి. అయితే స్వాతి తల్లిదండ్రులు మాత్రం వరకట్నం కోసం నరేష్‌, అతడి కుటుంబం వేధించడంవల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైకోర్టును ఆశ్రయించారు
మరోవైపు నరేష్‌ అదృశ్యం వెనుక స్వాతి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తల్లిదండ్రులు, దళితసంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై విచారణ వేగవంతం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. జూన్‌ 1లోగా నరేష్‌ ఆచూకీ కనిపెట్టాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు గడువు సమీపిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమదైన స్టైల్‌లో విచారించగా అసలు నిజం బయటపడింది. నరేష్‌ను తామే హత్యచేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించాడు. నరేష్‌ను చంపి మృతదేహాన్ని కాల్చి.. బూడిదను మూసీలో కలిపారు. నరేష్‌ చనిపోయాడని తెలియడంతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును హత్యచేశారంటూ కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాస్‌రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు స్వాతిది ఆత్మహత్యా లేక ఆమెను కూడా హత్య చేశారా అనేది అనుమానాలకు తావిస్తోంది. స్వాతి, నరేష్‌ల ప్రేమ కథ విషాదాంతంగా ముగియడం.. జిల్లాలో సంచలనంగా మారింది. 

20:28 - May 24, 2017

ప్రజలు పుట్టెడు దుఖంలో ఉంటే ప్రభుత్వం సంబరాలకు సన్నాహాలు చేస్తున్నదా? ఏం సాధించారని ఈ వేడుకలు..? ఎవరి జీవితాలు ఉత్సాహంగా ఉన్నాయని ఈ ఉత్సవాలు...? నమ్మి అధికారమిచ్చిన ప్రజలకు మిగిలింది వంచనేనా? మోడీ ఏలుబడి మొత్తం వైఫల్యాలమయమేనా? గడిచిన మూడేండ్లలో అడుగడుగునా అసహనపు జాడలు...! దారిపొడవునా విధ్వేషపు నీడలు..!! కనిపిస్తుంటే... వాటిని విస్మరించి మూడేళ్ల వేడులకు తెరలేపుతున్నారా? అసలు మూడేళ్ల కాలంలో మోడీ సర్కారు సాధించిందేమిటి? చెప్పటానికేం చాలా ఉంటాయి.. కానీ చేతలు కదా ముఖ్యం.. అధికారంలోకి వచ్చేంతవరకు ఓ లెక్క.. గద్దెనెక్కాక మరో లెక్క. మూడేళ్ల క్రితం నరేంద్రమోడీ చెప్పిన మాటలకు … ఈ మూడేళ్లుగా చేతలకు పొంతన ఉందా? మాటల గారడీతో, అధికారం నిలబెట్టుకునే ఎత్తులతో కాలం గడిపేస్తున్నారా...


 

19:34 - May 24, 2017

మూడేళ్లలో 2.3లక్షలు ఉద్యోగాలు మాత్రమే కల్పించారని టెన్ టివి చర్చలో పాల్గొన్నా వక్తలు అన్నారు. 107 స్కీంలో ప్రజలకు తెలిసినవి కేవలం ఏడు, ఎనిమిది మాత్రమే సీఐటీయూసీ నేత సుధాభాస్కర్, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, దీలిప్ విశ్లెషకులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బీజేవైఎం గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:09 - May 16, 2017
13:29 - May 15, 2017

హైదరాబాద్ : ఛలో ధర్నా చౌక్ ఉద్రిక్తతంగా మారింది. కొంత మంది దుండగులు స్థానికుల ముసుగులో వచ్చి వామపక్షాలపై దాడులు చేశారు. దాడుల్లో వామపక్షాల కార్యకర్తలు గాయాపడ్డారు. దాడి చిత్రికరించడానికి వెళ్లిన టెన్ టివి ప్రతినిధులపై కూడా దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో రిపోర్టరు నారాయణకు, కెమెరామన్ కు తీవ్ర గాయాలయ్యాయి.

12:20 - May 15, 2017

హైదరాబాద్ : ప్రజలకు మధ్య ఘర్షణ చేటుచేసుకునేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని టెన్ టివి చర్చలో పాల్గొన్న నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, ప్రొ. హరగోపాల్ అన్నారు. ఇరు వర్గాలకు ఒకేసారి అనుమతివ్వడం వెనక ప్రభుత్వం కుట్ర ఉందని వీరయ్య  తెలిపారు. టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ కూడా ధర్నా చౌక్ ఎత్తివేయాలని కోరలేదని హరగోపాల్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:55 - May 15, 2017

ధర్నా చౌక్ సామాన్యుల పోరాట స్ఫూర్తి అని, ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని టెన్ టివిలో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ చర్చలో విశ్లేషకులు తెలపల్లి రవి, టీడీపీ నేత దుర్గాప్రసాద్, వైసీపీ నేత ధర్మశ్రీ, టీఆర్ఎస్ నేత గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:54 - May 15, 2017

ప్రజల అభిప్రాయలను ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని న్యూడెమోక్రసీ నేత రంగారావు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధర్నా చౌక్ ద్వారా తెలియజేయాలనికుంటే ప్రభుత్వం మాత్రం ధర్నా చౌక్ లెకుండా చేస్తుందని టెని టివి జనపథంలో పాల్గొన్న ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - టెన్ టివి