ట్రంప్

10:23 - November 3, 2018

అమెరికా : హెచ్‌-1బి వీసా ప్రక్రియ మరింత కఠినతరమవుతోంది. ఈ వీసాలపై ఆధారపడే ఉద్యోగ సంస్థలే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్‌-1బి కిందవచ్చే కొత్త విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టతరమయ్యేలా వీటిని సిద్ధం చేశారు. భారత ఐటీ నిపుణులపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. వీటి ప్రకారం ప్రస్తుతం తమ దగ్గర పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల లెక్కలు తప్పనిసరిగా ఉద్యోగ సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ కోరుతున్న తాజా సమాచారం అత్యంత కీలకంగా మారనుంది. దీని ఆధారంగానే కొత్తగా హెచ్‌-1బి వీసాదారులను తీసుకొనేందుకు ఉద్యోగ సంస్థలకు అనుమతి ఇస్తారు. దేశీయంగా ఆ ఉద్యోగానికి ఎవరూ అందుబాటులో లేరని శాఖ ధ్రువీకరించిన తర్వాతే విదేశీ నిపుణుల నియామకాలకు సంస్థలకు అవకాశం కల్పిస్తారు. దీనికి అనుగుణంగా కార్మిక నిబంధనల దరఖాస్తులో మార్పులు చేశారు. హెచ్‌-1బి నిపుణుల ఉద్యోగ స్థితిగతులు, వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? ఎంత కాలం నుంచి కొనసాగుతున్నారు? ఒక్కో కార్యాలయంలో ఎంత మంది ఉన్నారు? లాంటి వివరాలన్నీ సమగ్రంగా సేకరించేలా దరఖాస్తులో మార్పులు చేశారు. హెచ్‌-1బి లపై ఆధారపడుతున్న సంస్థలు, అవి అందిస్తున్న సేవలను వినియోగించుకుంటున్న ద్వితీయ పక్ష సంస్థలను స్పష్టంగా గుర్తించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. 

08:48 - July 17, 2018

హెల్సింకి : చిరకాల ప్రత్యర్థులైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకిలో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా, అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి ఈ సమావేశం దోహదపడనుందని క్రెమ్లిన్‌ వర్గాలు పేర్కొన్నాయి. రష్యాతో సంబంధాలు చెడిపోవడానికి ఎఫ్‌బిఐ కారణమని ట్రంప్‌ సమావేశానికి ముందు ఆరోపించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు ఎఫ్‌బిఐ బాధ్యత వహించాలని ట్రంప్‌ అన్నారు. రష్యాతో సంబంధాలు అధ్వానంగా ఉండటానికి అమెరికా పిచ్చితనం, మూర్ఖత్వమే కారణమని ట్రంప్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. సిరియా అంతర్యుద్ధం, ఉక్రెయిన్‌, అమెరికా ఎన్నికల్లో జోక్యం, అణు విస్తరణ, తదితర అంశాలపై పుతిన్‌తో చర్చించనున్నట్లు ట్రంప్‌ చెప్పారు. ప్రపంచంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం దోహదపడుతుందని పుతిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

09:32 - June 16, 2018

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు మళ్లీ షాకిచ్చాడు. 50 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. తమ మేధో సంపత్తి ఆస్తులను, టెక్నాలజీని చైనా అపహరిస్తోందని ఆరోపిస్తూ టారిఫ్‌లను విధించారు. చైనా అన్యాయపరమైన వాణిజ్య విధానాలను అవలంబిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులు, సర్వీస్‌ ఎగుమతులపై చైనా ప్రతీకారం తీర్చుకుంటే అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్‌ ప్రకటనపై బీజింగ్‌ కూడా స్పందించింది. తాము కూడా ఇదే స్థాయిలో పన్ను చర్యలను వెంటనే ప్రవేశ పెడతామని ప్రకటించింది. ట్రంప్‌ కవ్వింపు చర్యలతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారి తీస్తోంది.

20:15 - June 12, 2018

అమెరికా, ఉత్తర కొరియా దేశాధ్యక్షులు సింగపూర్ లో సమావేశమయ్యారు. ఇద్దరికిద్దరు తమ పట్టువీడని విక్కమార్కులే. 1950, 53 కొరియా యుద్ధం అనంతరం అమెరికా, ఉత్తరకొరియాలు శత్రు దేశాలుగా మారాయి. ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య చర్చలు ఇంతవరకూ జరగలేదు. ఎటువంటి సందర్భంలోను ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సంభాషణలు కూడా జరగలేదు. కానీ వున్నట్టుట్నుండి ఇరు దేశాధినేతలు భేటీ కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ సింగపూర్‌లో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ఇద్దరు ప్రకటించారు. ఇరు దేశాలు స్నేహ హస్తాన్ని అందుకుంటామనని తెలిపారు. కొరియా దేశపు ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ట్రంప్ ఆకాంక్షించారు. ప్రపంచ ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతుందంటు దేశాధ్యక్షులిద్దరు ప్రకటించారు. ఈ ప్రటనలు దేనికి సంకేతం పలుకుతున్నాయి? ఈ భేటీతో ఇరు దేశాలు మిత్ర దేశాలుగా మారతాయా? శాంతి నెలకొల్పేందుకు వీరిద్దరు యత్నిస్తారా? ఈ అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో ప్రముఖ విశ్లేషకులు నగేశ్, సీనియర్ విశ్లేషకులు కోటేశ్వరరావు, ప్రొ.బాలసుబ్రహ్మణ్యం.. 

20:03 - June 12, 2018

సింగపూర్ : అమెరికా, ఉత్తర కొరియా దేశాలు తమ మధ్య నెలకొన్న విభేదాలకు చరమగీతం పాడాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ సింగపూర్‌లో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇరు దేశాలు స్నేహ హస్తాన్ని అందుకున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించి శాంతి దిశగా అడుగు ముందుకు వేశాయి.

సింగపూర్‌ వేదికగా అమెరికా ట్రంప్‌, కిమ్‌ సమావేశం..
సింగపూర్‌ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన చారిత్రక సమావేశం విజయవంతంగా ముగిసింది. తాజాగా జరిగిన సమావేశం ట్రంప్‌, కిమ్‌ల మధ్య ఉద్రిక్తతలను చల్లబరచడమే కాదు...ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగాయి. ఇరు దేశాలు ఉమ్మడి తీర్మానంపై సంతకాలు చేశాయి.

ఇరు దేశాధినేతల కీలక ఒప్పందాలు..
శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రజల ఆకాంక్ష మేరకు అమెరికా, ఉత్తరకొరియాలు కొత్త సంబంధాలు నెలకొల్పుకోవడం... కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. 2018, ఏప్రిల్‌ 27 నాటి పాన్‌ముంగ్‌ జోమ్‌ తీర్మానానికి అనుగుణంగా సంపూర్ణ నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉంటుంది. యుద్ధ ఖైదీలను వెంటనే స్వదేశానికి తిప్పిపంపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

మార్పు సాధ్యమని నిరూపించాం : ట్రంప్
కిమ్‌తో సమావేశం కావడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. యుద్ధం ఎవరైనా చేయవచ్చు కానీ.. సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారని, మార్పు సాధ్యమేనని తాము నిరూపించామని ఆయన చెప్పారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అణు నిరాయుధీకరణ మొదలు పెట్టిన తరువాత నార్త్ కొరియాపై ఉన్న ఆంక్షలు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కొరియా ద్వీపంలో తమ సైనిక విన్యాసాలను నిలిపివేస్తామని అమెరికా ప్రకటించింది.

ఇది చారిత్రాతమ్మక సమావేశం : కిమ్
ఇది చారిత్రక సమావేశమని, గతాన్ని వదిలి పెట్టాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించినట్లు కిమ్‌ తెలిపారు. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోందని ఆయన అన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కిమ్‌ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ట్రంప్, కిమ్ ల భేటీ...
1950-53 కొరియా యుద్ధం అనంతరం అమెరికా, ఉత్తరకొరియాలు శత్రు దేశాలుగా మారాయి. ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య చర్చలు ఇంతవరకూ జరగలేదు. కనీసం ఫోన్‌లో కూడా నేతలు మాట్లాడుకోలేదు. తొలిసారిగా ఇప్పుడు ఇరు దేశాధినేతలు భేటీ కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 

16:34 - June 12, 2018

సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోన్‌ ఉంగ్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం పలు కీలక పత్రాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఎఎఫ్‌పి న్యూస్‌ ఏజెన్సీ ప్రకారం అణునిరాయుధీకరణకు కిమ్‌ కట్టుబడి ఉన్నారని...ప్యోగ్యాంగ్‌ భద్రతకు అమెరికా పూర్తి హామీ ఇచ్చిందని పేర్కొంది.దీంతో అమెరికా-ఉత్తరకొరియాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యయనం ప్రారంభం కానుంది. కిమ్‌తో సమావేశం కావడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాతో సంబంధాలు గతంలో కంటే భిన్నంగా ఉండబోతున్నాయని ట్రంప్‌ అన్నారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. కిమ్‌ చాలా స్మార్ట్‌....విలువైన వ్యక్తి అని ట్రంప్‌ కొనియాడారు. ఇది చారిత్రక సమావేశమని, గతాన్ని వదిలి పెట్టాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించినట్లు కిమ్‌ తెలిపారు. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోందని ఆయన అన్నారు. 

15:00 - June 12, 2018

సింగపూర్ : మార్పు సాధ్యమేనని మేం ఇద్దరం నిరూపించాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇదొక చారిత్రాత్మక సమావేశమని..దీనికి కిమ్ , నేను ఓ చారిత్రాత్మక ఒప్పందానికి తెరలేపామన్నారు. సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారన్నారు. త్వరలోనే అణునిరాయుధీకరణ జరుగుతుందని ట్రంప్ తెలిపారు. క్షిపణి ప్రయోగ కేంద్రాలనీన ధ్వంసం చేస్తామని కిమ్ హామీ ఇచ్చారన్నారు. ఉత్తర కొరియా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ఈ సందర్భంగా ట్రంప్ అకాంక్షించారు. యుద్ధం ఎవరైనా చేయవచ్చు..కానీ సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ దిశగా ఆలోచిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్, కిమ్ ఒప్పందాలు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ రోజు సింగపూర్ లో సమావేశం అనంతరం చేసుకున్న సమగ్ర ఒప్పందాలు చేసుకున్నారు. మొదటిది రెండు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, శాంతి, సౌభాగ్యం కోసం నూతన అమెరికా-ఉత్తరకొరియా సంబంధాల ఏర్పాటుకు ఇరు దేశాలు కృషి చేయడం, కొరియా ద్వీపకల్పంలో సుస్ధిర శాతం కోసం రెండు దేశాలు తమ ప్రయత్నాలను ప్రారంభించడం, 2018 ఏప్రిల్ 27నాటి పన్ ముంజోన్ డిక్లరేషన్ ప్రకారం ఉత్తరకొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ కోసం కట్టుబడి ఉండడం, వియత్నాం యుద్ద ఖైదీలను గుర్తించి స్వదేశాలకు పంపేందుకు చర్యలు తీసుకోవడం వంటి పలు కీలక ఒప్పందాలకు ఇద్దరు సమ్మతించినట్లుగా సమాచారం.

13:49 - June 12, 2018

సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోన్‌ ఉంగ్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం పలు కీలక పత్రాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఎఎఫ్‌పి న్యూస్‌ ఏజెన్సీ ప్రకారం అణునిరాయుధీకరణకు కిమ్‌ కట్టుబడి ఉన్నారని...ప్యోగ్యాంగ్‌ భద్రతకు అమెరికా పూర్తి హామీ ఇచ్చిందని పేర్కొంది.దీంతో అమెరికా-ఉత్తరకొరియాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యయనం ప్రారంభం కానుంది. కిమ్‌తో సమావేశం కావడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాతో సంబంధాలు గతంలో కంటే భిన్నంగా ఉండబోతున్నాయని ట్రంప్‌ అన్నారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. కిమ్‌ చాలా స్మార్ట్‌....విలువైన వ్యక్తి అని ట్రంప్‌ కొనియాడారు. ఇది చారిత్రక సమావేశమని, గతాన్ని వదిలి పెట్టాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించినట్లు కిమ్‌ తెలిపారు. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోందని ఆయన అన్నారు. 

12:01 - June 12, 2018

సింగపూర్ : అంతర్జాతీయ సమాజం దృష్టి సింగపూర్‌వైపు మళ్లింది. అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం ఆరున్నరకు సెంటోసాదీవిలో కెపెల్లా హోటల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ఉన్‌ సమావేశం అయ్యారు. మొదట ఇద్దరు నేతలే ఏకాంతంగా మట్లాడుకున్నారు. మరికొద్ద సేపట్లో రెండు దేశాలకు చెందిన అధికారుల సమక్షంలో చర్చలు జరుపుతారు. తర్వాత మధ్యాహ్నం ఇద్దరు నేతలు వర్కింగ్‌లంచ్‌లో పాల్గొంటారు. కాగా న్యూక్లియర్‌ వెపన్స్‌తో భయపెడుతున్న ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ దేశ మనుగడకు హామీ ఇవ్వడంతోపాటు ... వాణిజ్య ఆంక్షలను కూడా పూర్తిగా ఎత్తివేయాలని ఉత్తరకొరియా దేశాధినేత పట్టుబడుతున్నారు. కొరియాలో శాంతిస్థాపనే లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చలు ఫలించాలని ప్రపంచదేశాలు గట్టిగా కోరకుంటున్నాయి. కాగా ట్రంప్‌, కిమ్‌ భేటీ అయిన కెపెల్లా హోటల్‌తోపాటు సెంటొసా దీవిలో కనీవినీ ఎరుగని స్థాయిలో భత్రను కల్పించారు. 
 
10:22 - June 12, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - ట్రంప్