ట్రాఫిక్

13:44 - July 12, 2018

హైదరాబాద్ : రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో నగరం లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన రాదారులపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. చందానగర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో బయటకు రావడానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ నుంచి గుల్మొహర్ పార్క్ వరకు, నల్లగండ్ల ఫ్లైఓవర్ ఫై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రెండు కిలోమీటర్లమేర నిలిచినా వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హాఫిజ్‌పేట్ ప్రాంతాల రహదారులపై వాహనాలు కిక్కిరిసాయి.

10:30 - February 23, 2018

హైదరాబాద్ : సైఫాబాద్ పీఎస్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ట్రాఫిక్ ఎస్ఐ అక్రమంగా చలానాలు రాస్తున్నారంటూ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడిని ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:41 - February 3, 2018

హైదరాబాద్‌ : నగరంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. దీనికితోడు పార్కింగ్‌  వ్యవహారం మరింత  తలనొప్పిగా మారింది.ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు బల్దియా అధికారులు సన్నద్దమవుతున్నారు. ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.
రోజురోజుకూ పెరిగిపోతోన్న ట్రాఫిక్‌ సమస్య 
గ్రేటర్‌ హైదరాబాద్‌ రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎప్పుడు ఎక్కడ  ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందో ట్రాఫిక్‌ పోలీసులు కూడా చెప్పలేరు. గ్రేటర్‌ పరిధిలో నిత్యం 45 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయి. ఇలా వచ్చిన వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు సరైన స్థలం లేదు. దీంతో రోడ్లమీదే వాహనాలు నిలుపుతున్నారు.   కొన్ని చోట్ల  ఫుట్‌పాత్‌ మీదే టూవీలర్స్‌ పార్కింగ్‌ చేస్తున్నారు. 
అమలు కాని మల్టీ లెవల్‌ పార్కింగ్‌
పార్కింగ్‌ సమస్యను గుర్తించిన అధికారులు... ఇప్పటికే మల్టీ లెవల్‌ పార్కింగ్‌ భవనాల నిర్మాణానికి ప్రణాళిక  రూపొందించారు.  కానీ... అది అమలు కాలేదు. దీంతో మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేశారు.. గ్రేటర్‌ పరిధిలో ఖాళీగా ఉన్న పలు శాఖల స్థలాలను పార్కింగ్‌ యార్డులుగా ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. 
ప్రైవేటు స్థలాల్లోనూ పార్కింగ్‌ అవకాశం 
ఈ అంశంపై ఇప్పటికే  కసరత్తు చేసిన బల్దియా, ట్రాఫిక్‌ అధికారులు....  56,660 స్థలాలను గుర్తించారు. ఇందులో 41, 550 ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు... 15,110 స్థలాల్లో ఫోర్‌వీలర్స్ తోపాటు భారీ వాహనాలు కూడా పార్క్‌ చేసేందుకు వీలుంటుందని తేల్చారు. ఐతే పలు విభాగాలకు చెందిన స్థలాలు కావడంతో  సంబంధిత అధికారులతో  చర్చలు జరుపుతున్నారు. అలాగే  ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో కూడా పార్కింగ్‌ అవకాశం కలిపిస్తున్నారు. 
టూ వీలర్స్‌కు  2 గంటలకు రూ.10 
టూ వీలర్స్‌కు  2 గంటలకు 10 రూపాయలు, ఆ పైన ప్రతి రెండు గంటలకు ఐదు రూపాయలు వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫోర్‌ వీలర్స్‌కు మొదటి రెండు గంటలకు 20 రూపాయలు, ఆపైన ప్రతి 2 గంటలకూ ఐదు రూపాయలు వసూలు చేసుకోవచ్చు. 
ట్రాఫిక్ అడ్డుగా విద్యుత్‌ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు 
మరోవైపు  విద్యుత్‌ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారినట్లు అధికారులు గుర్తించారు.  490 విద్యుత్‌ స్థంభాలు, 61 ట్రాన్స్‌ఫార్మర్లు అడ్డంకిగా ఉన్నట్లు తేల్చారు..  వాటన్నింటినీ తొలగించాలని విద్యుత్‌ శాఖ అధికారులను బల్దియా కోరింది.

 

12:49 - January 31, 2018
09:15 - January 31, 2018

వరంగల్ : మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సుమారు కొన్ని కిలోమేటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామన్న అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని తెలుస్తోంది.

బుధవారం సారలమ్మ..పగిడిద్దరాజు..గోవిందరాజు..గద్దెలపైకి తీసుకొని రానున్నారు. గురువారం సమ్మక్క - పగిడిద్దరాజు పెండ్లి వేడుక కార్యక్రమం జరుగనుంది. ఇందుకు ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 300 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.

మంగళవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి బయల్దేరారు. ఆయన తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి మేడారం చేరుకుంటారు. సారలమ్మతో కలిసి ముగ్గురు గద్దెల మీదకు చేరుకుంటారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మతోపాటు పగిడిద్దరాజు ఆయన తమ్ముడు గోవింద రాజులు గద్దెలమీదే ఉంటారు. జాతర చివరి రోజైన శనివారం సమ్మక్క వన ప్రవేశం చేస్తుంది. ఈ జాతరలోనూ పగిడిద్ద రాజు సమ్మక్కను పెళ్లాడతారు.

06:30 - November 26, 2017

హైదరాబాద్ : గ్రేటర్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ఈ నెల 29 నుండి అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్‌ ఇబ్బందులను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన మెట్రోకు కావలసిన పనులు పూర్తి చేశారు అధికారులు. శనివారం మంత్రులు ప్రజాప్రతినిధులు మెట్రోలో ప్రయాణించి రైలు పనితీరును పరిశీలించారు.

భాగ్యనగరంలో ఈ నెల 29 నుండి అందుబాటులోకి రానున్న మెట్రో రైలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28 న ప్రధానమంత్రి మోదీ లాంఛనంగా మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభమైన మరుసటి రోజు నుండే ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుందన్నారు మంత్రి కేటీఆర్‌. నాగోల్‌ నుండి మియాపూర్‌ వరకు 30 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని మెట్రో ప్రారంభోత్సవం చేయనున్నందున ఇవాళ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు మెట్రో పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ను ప్రారంభించారు. ఈ కార్డ్‌ ప్రస్తుతానికి మెట్రోలో మాత్రమే అందుబాటులో ఉండనుందని, భవిష్యత్‌లో అన్ని వాహనాలకు అనుసంధానం చేస్తామని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ను ఎల్‌ అండ్ టీ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్టనర్‌ షిప్‌ మోడ్‌లో అతిపెద్ద ప్రాజెక్టుగా మెట్రో రైల్‌ నిలిచిందన్నారు. మెట్రో ప్రారంభోత్సవానికి కావలసిన అన్ని పనులు పూర్తి చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కార్మికుల కఠోరశ్రమకు ఫలితంగా హైదరాబాద్‌ మెట్రో సగర్వంగా ప్రస్థానం ప్రారంభించబోతోందన్నారు. మెట్రోను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు మంత్రి. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల మద్దతుతో మెట్రోను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం 57 రైళ్లు కొరియన్‌ కంపెనీ నుండి ఈ రైళ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఒక్కో రైళ్లో 1000 మంది వరకు ప్రయాణించవచ్చన్నారు. గ్రేటర్‌లో మొత్తం 24 స్టేషన్లు ప్రారంభించామన్నారు. మెట్రో కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రేటర్‌ వాసుల కల ఇంకో మూడు రోజుల్లో నెరవేరనుంది. 

10:48 - November 25, 2017

సిరిసిల్ల : రోడ్డు ప్రమాద నివారణలో గతంలో హెల్మెట్ పెట్టుకోవాలని ప్రచారం నిర్వహించిన మంత్రి కేటీఆర్...ట్రాఫిక్ నిబంధనలపై అలాగే స్పందిస్తున్నారు. శుక్రవారం సిరిసిల్ల పర్యటనకు మంత్రి కేటీఆర్ వచ్చారు. స్థానిక గాంధీ చౌక్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఒకే బైక్ పై ముగ్గురు వస్తుండడాన్ని మంత్రి కేటీఆర్ చూశారు. వెంటనే వారి ఆపి వారితో సరదగా మాట్లాడారు. ఇలా ప్రమాదకరంగా నడపవద్దని, నిబంధనల్లు ఉల్లంఘిస్తూ బైక్ ను నడవవద్దని సూచించారు. 

10:44 - November 21, 2017

హైదరాబాద్ : నగరంలోని మలక్ పేటలో మెట్రో రైల్ నిర్మాణ పనుల్లో సాంకేతిక లోపంతో భారీ క్రేన్ రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

12:06 - October 27, 2017

హైదరాబాద్ : నగర కమిషనరేట్ పరిధిలో 9000-10000 చలాన్లు విధించారని..వీటికి రూ. 9-10 లక్షల రూపాయలను ట్రాఫిక్ పోలీసులు కలెక్షన్ చేయడం జరిగిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ శాసనసభలో పేర్కొన్నారు. శుకవారం శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ చలాన్లపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వేసిన ప్రశ్నకు మంత్రి నాయినీ సమాధానం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ అధికంగా ఉందని మంత్రి పేర్కొనడం జరిగిందని...ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెద్ద మొత్తంలో జరిమాన వసూలు చేస్తున్నారా అనే ప్రశ్నలకు లేదు అని మంత్రి చెప్పారని తెలిపారు. కానీ దీనిపై తాను ఆర్టీఐ చట్టం కింద కొంత సమాచారం సేకరించడం జరిగిందన్నారు. నగరంలో కమిషనరేట్ పరిధిలో 9000-10000 చలాన్లు విధించారని..వీటికి రూ. 9-10 లక్షల రూపాయలను కలెక్షన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మొత్తం ఎన్ని వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ లున్నాయో మంత్రి చెప్పాలని..ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం..ఎలాంటి సమస్య రాకుండా చూడడం ట్రాఫిక్ పోలీసుల బాధ్యత అని పేర్కొన్నారు. 

09:26 - October 10, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ను భారీవర్షాలు వదలడం లేదు. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో సీటీజనం నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో కుంభవృష్టిపడింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చీబౌలీ, కొండాపూర్‌ ఏరియాల్లో గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. నాలాలు పొంగడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రామాంతపూర్‌ చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరుతోంది. మోకాటిలోతు నీటిలో జనం రాత్రంతా భయంగుప్పిట్లోనే గడుపేశారు. ఆల్వీన్‌కాలనీ, లెనిన్‌నగర్‌, మిథిలానగర్‌లలో వరదనీటి ఉధృతితో జనం భయపడుతున్నారు. వర్షం ఉన్నా లేకున్నా ట్రాఫిక్‌ కష్టాలు మాత్రం వదలడంలేదు. ఉదయం నుంచే ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు నరకం చూస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - ట్రాఫిక్