ట్రైలర్

12:52 - June 23, 2017

పార్లమెంట్ లో సినిమా ట్రైలర్ విడుదల చేయడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది వాస్తవం. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. దర్శకుడు తిగ్మాంషు దులియా తెరకెక్కించిన 'రాగ్ దేశ్' సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఏం చేశారు ? అన్న దానితో సినిమాను రూపొందించడం జరిగిందని దులియా పేర్కొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను పార్లమెంట్ లో విడుదల చేయాలని..ఇందుకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ లో ఇలాంటి అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి అని, తమ సినిమాకు ఎంతో గౌరవమన్నారు. కునాల్ కపూర్, అమిత్ సాధ్, మోహిత్ మార్వాలు ఈ సినిమాలో నటించగా గుర్దీప్ సింగ్ సప్పల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. జులై 28న సినిమా విడుదల కానుంది.

09:45 - June 6, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' లెటెస్ట్ ఫిల్మ్ 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్ర ట్రైలర్ అదరగొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన లెటెస్ట్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో 'బన్నీ' డైలాగ్స్ దుమ్ము రేపేలా ఉన్నాయి. ఈ డైలాగ్స్ అభిమానులను ఎంతో ఉర్రూతలూగిస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'అల్లు అర్జున్' హీరోగా 'పూజా హెగ్డే' హీరోయిన్ గా నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలువుతున్నాయి. అంతేగాకుండా ఫొటోలు..టీజర్ కూడా విడుదల చేశారు. అభిమానులను మరింత అలరించడానికి చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. 'పబ్బుల్లో వాయించే డీజేను కాదురా...పగిలిపోయేలా వాయించే డీజే'...అంటూ..బుద్ధం శరణం గచ్ఛామి కాదు సార్..యుద్ధం శరణం గచ్ఛామి అనాలి సార్' అంటూ బన్నీ పలికే డైలాగ్స్ చెప్పారు. ఒక వైపు బ్రాహ్మణ యువకుడి గెటప్..మరోవైపు సూట్ లో బన్నీ కనిపించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'దిల్' రాజు ఈ సినిమాను నిర్మించారు. చివరగా జూన్ 23న వస్తున్నా..అంటూ బన్నీ డైలాగ్ తో చిత్ర ట్రైలర్ ముగుస్తుంది.

13:30 - May 26, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటించిన 'ట్యూబ్ లైట్' చిత్రం ఈ రంజాన్ కు విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ గురువారం రాత్రి విడుదల చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే చాలా మంది అభిమానులు చూశారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో చైనా నటి 'చూ చూ' నటిస్తుండడం విశేషం. భారత్ - చైనా యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. సల్మాన్ ఖాన్ సోదరుడు 'సోహైల్ ఖాన్' రీల్ లైఫ్ సోదరుడిగా సైనికుడు పాత్రలో నటించడం విశేషం. కానీ ఈ ట్రైలర్ లో 'షారూఖ్ ఖాన్' ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. చిత్ర ట్రైలర్ లో షారూఖ్ ఖాన్ సిగ్నేచర్ ఫోజ్ ఒకటుందని, జాగ్రత్తగా గమనిస్తే ఆ ఫోజు కనిపిస్తుందని అంటున్నారు. వారన్నట్లుగానే షారూఖ్ ఖాన్ ఉన్నట్లుగానే ఓ వ్యక్తి ఉండడం. షారూఖ్ లాగే ఫోజు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ చిత్రంలో 'షారూఖ్' నటించాడా ? లేదా ? అనేది తెలియాలంటే రంజాన్ వరకు ఆగాల్సిందే.

09:08 - April 15, 2017

తనకు ప్రమోషన్స్ తో హడావుడి చేయడం ఇష్టం ఉండదని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో 'ట్యూబ్ లైట్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సల్మాన్' తో 'ఏక్ థా టైగర్', ‘బ్రజంగీ భాయిజాన్' వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు కావడంతో 'సల్మాన్' ను ఏ విధంగా చూపించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ‘సల్మాన్' చిత్రాలు 'ఈద్' కు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఈద్ కు విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేశారు. ఈద్ డేట్ సమీపిస్తున్నా చిత్రానికి సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ విడుదల కాకపోవడం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కబీర్ ఖాన్ స్పందించారు. సినిమా విడుదలకన్నా నెలల తరబడి ముందునుండే ప్రమోషన్స్ హడావుడి చేయడం తనకిష్టం ఉండదని కుండబద్ధలు కొట్టాడు. టైమ్ దగ్గర పడుతోంది కనుక ఏప్రిల్ చివర్లో..టీజర్ ను రిలీజ్ చేస్మాని..మే నెలలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అప్పటి వరకు వేయిట్ చేయాల్సిందే.

08:02 - March 20, 2017

తాజా చిత్రం 'కాటమరాయుడు' చిత్రంలో పవర్ స్టార్ 'పవన కళ్యాణ్' పై విధంగా డైలాగ్స్ పలికారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. పవన్ మరింతగా గ్లామర్ గా కనిపిస్తుండడం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్ .. చాలా చాలా డేంజర్ రోయ్" అనే డైలాగ్..."కోపాన్ని .. ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో" అంటూ పవన్ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకొంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాను ఏప్రిల్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన సాంగ్స్ యూ ట్యూబ్ లో రెండు రోజుల కొకసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, అలీ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

09:24 - March 16, 2017

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బాహుబలి -2 ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. గురువారం ఉదయం నేరుగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలని జక్కన్న టీం ప్లాన్‌ చేసింది. అయితే తెలుగుకంటే కోలీవుడ్‌లో అనుకున్న సమయంకంటే ముందుగానే ట్రైలర్‌ వచ్చేసింది. రెండు నిమిషాల 20 సెకన్ల నిడివిగల ట్రైలర్‌ దుమ్మురేపుతోంది. సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అయితే ట్రైలర్‌లో ఫస్ట్‌పార్ట్‌లోని కొన్ని సీన్స్‌ రిపీట్‌ అయ్యాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినట్టు అన్న కోణాన్ని బయటపెట్టకుండా రాజమౌళి సస్పెన్స్‌లో పెట్టేశాడు. యువరాజుగా ఉన్నప్పుడు ప్రభాస్‌, యువరాణిగా ఉన్నప్పుడు అనుష్కని చూపించారు. ఆధిపత్య పోరులో అన్నదమ్ముల మధ్యవార్‌ సన్నివేశాలు మేజర్‌ హైలెట్‌గా చూపించారు.

13:02 - March 11, 2017

ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా 'బాహుబలి-2’ ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే విడుదలవుతోంది అంటూ చిత్ర యూనిట్ పేర్కొంటుండడంతో ఉత్కంఠ నెలకొంది. తాజాగా దీనిపై నటుడు 'ప్రభాస్' క్లారిటీ ఇచ్చేశాడు. కాసేపటి క్రితం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ట్రైలర్ కోసం తాను ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని పోస్టులో పేర్కొన్నారు. మార్చి 16వ తేదీన సెలక్ట్ చూసిన థియేటర్ లలో ట్రైలర్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సోషల్ మాధ్యమాల్లో సాయంత్రం 5గంటలకు విడుదలవుతుందని తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో 'బాహుబలి 2’ ట్రైలర్ పై వర్క్ జరిగాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బాహుబలి 2’ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ట్రైలర్ నిడివి సుమారు రెండున్నర నిమిషాలున్నట్లు, అన్ని భాషాల్లోనూ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క, రానా, తమన్నా కీలక పాత్రలు పోషించారు. ఇక చిత్ర పాటలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

12:49 - March 8, 2017

'బాహుబలి 2’ సినిమా విడుదల కోసం ఉత్కంఠ నెలకొంది. సినిమా ట్రైలర్ కొద్ది రోజుల్లో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొనడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే చిత్ర ట్రైలర్ తాను చూడడం జరిగిందని, గుండెలు అదిరిపోయాయని మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ రమణ వ్యాఖ్యానించడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సినిమాతో సంబంధం లేకుండా ఇది కూడా విడిగా 100 రోజులు ఆడుతుందని, రికార్డులు బద్ధలు కొడుతుందని పేర్కొనడంతో ట్రైలర్ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ట్వీట్స్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణరమణ సౌండ్ సూపర్ వైజర్ గా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే 'బాహుబలి 2’ ట్రైలర్ ఎప్పుడు విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో 'బాహుబలి 2’ ట్రైలర్ పై వర్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బాహుబలి 2’ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

07:41 - March 7, 2017

బాహుబలి 2..చిత్రం గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. యావత్ ప్రపంచం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ‘బాహుబలి : ది బిగినింగ్' ఎన్ని సంచనాలు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'బాహుబలి : ది కన్ క్లూజన్' చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్ ఇతర పనుల్లో నిమగ్నమైంది. ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేయాలని రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఆలోపు చిత్ర ట్రైలర్ విడుదల చేయాలని రాజమౌళి బృందం రంగం సిద్ధం చేస్తోంది. మార్చి మూడో వారంలో 'బాహుబలి 2’ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు, ఈనెల 15 లేదా 16 గానీ హైదరాబాద్ లో ట్రైలర్ ని ఆవిష్కరించే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ట్రైలర్ నిడివి సుమారు రెండున్నర నిమిషాలున్నట్లు, అన్ని భాషాల్లోనూ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క, రానా, తమన్నా కీలక పాత్రలు పోషించారు. ఇక చిత్ర పాటలు ఏప్రిల్ మొదటి వారంలో పాటలని విడుదల చేసే అవకాశం ఉంది.

13:05 - March 2, 2017

టాలీవుడ్ స్టామినా ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి తీర్చిదిద్దిన 'బాహుబలి' రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్ గా 'బాహుబలి..ది కన్ క్లూజన్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయి పోయింది. కానీ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు మాత్రమే చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది. కానీ టీజర్ మాత్రం రిలీజ్ కాకపోవడం పట్ల అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగిపోతోంది. టీజర్ ఎలా ఉంటుందానే దానిపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ రెడీ అయ్యిందని..ప్రస్తుతం అది తెరపై ఎలా ఉందనే విషయాన్ని పరిక్షీస్తున్నట్లు చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రైలర్ తయారైందని పేర్కొంటూ పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఫొటోను పోస్టు చేశారు. సీవీ రావు, శివకుమార్ లతో కలిసి తెరపై ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని చూడడం జరిగిందని తెలిపారు. దీనితో చిత్ర ట్రైలర్ త్వరలోనే విడుదల కాబోతోందని తెలుస్తోంది. చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందో ? తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వరకు వేచి చూడాల్సిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - ట్రైలర్