డాక్టర్లు

16:07 - March 25, 2017

హైదరాబాద్: నగరవాసులకు భానుడు చుక్కలు చూపిస్తున్నాడు.. మార్చిలోనే నగరం నిప్పుల కుంపటిగా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలతో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.

హైదరాబాద్‌ వాసులను హడలెత్తిస్తున్న ఎండలు.....

గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వడగాడ్పులకు గురై వాంతులు..విరోచనాలతో సతమతమవుతున్నారు. ఎండతీవ్రత కారణంగా ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోవడం వల్ల, నగర రహదారులన్నీ కర్ఫ్యూని తలపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే పగటి ఉష్ణోగ్రత 37 డిగ్రీలు నమోదు కావడాన్ని బట్టి చూస్తే, భవిష్యత్తులో ఎండతీవ్రత మరెంతగా ఉంటుందోనని నగరవాసి కలవర పడుతున్నాడు.

ఎండ తీవ్రతకు దేశ వ్యాప్తంగా 1400 మంది మృతి.....

ఎండల తీవ్రతకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా 14 వందల మంది మృత్యువాత పడగా ... తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల మంది చనిపోయినట్లు అంచనా. మరో 2 వందల మంది చర్మ సంబంధిత ఎలర్జీస్‌తో పాటు, డీ హైడ్రేషన్‌ కారణంగా ఆస్పత్రుల పాలయ్యారు. ముదురుతున్న ఎండల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పసి పిల్లలు తొందరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని.. వారిని ఎండబారిన పడకుండా..జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్లే...

పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి మార్చి మూడో వారంలోనే ఎండతీవ్రత ఇలా ఉంటే.. ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందోనని నగరవాసులు భయపడుతున్నారు.

19:17 - February 27, 2017

హైదరాబాద్ : హిళా డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నరాల బలహీనత, కీళ్ల నొప్పులతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పీఎస్‌ పరిధిలోని పిర్జాదిగూడ స్పార్క్‌ ఆస్పత్రితో జరిగింది. నగాం జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన సరిత అనే మహిళ కీళ్లు, వెన్నెముకలో నరాల సమస్యలతో ఈనెల 25వ తేదీన పిర్జాదిగూడలోని స్పార్క్‌ ఆస్పత్రిలో చేరింది. అయితే.. సర్జరీ చేసిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వాంతులు చేసుకుని సరిత చనిపోయిందని బాధితులు ఆరోపించారు. ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన సరిత సడెన్‌గా ఎలా చనిపోతుందని బాధితులు ప్రశ్నించారు. సరిత మృతితో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సరిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆస్పత్రి వద్ద పరిస్థితిని శాంతింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

14:38 - February 6, 2017

హైదరాబాద్: నీలోఫర్‌ ఆస్పత్రిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రోగుల బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

13:35 - February 6, 2017
13:28 - February 6, 2017
19:17 - February 4, 2017

భద్రాద్రి కొత్తగూడెం : అదో ప్రభుత్వ ఆస్పత్రి. 9 ఏళ్ల క్రితం ప్రభుత్వ పెద్దలు లాంఛనంగా ప్రారంభించారు. వైద్యం కోసం గిరిజనులు కిలోమీటర్లు నడిచిపోవాల్సిన అవసరం లేదని ఉపన్యాసాలు ఇచ్చారు. గిరిజనుల ఆరోగ్యానికి మేము రక్షగా ఉంటామని హామీలు గుప్పించారు. కాలం గిర్రున తిరగింది. 9 ఏళ్లు గడిచాయి. మరి ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టు అక్కడ గిరిజనులకు వైద్యం అందుతోందా? వైద్యం కోసం వారు కిలోమీటర్లు నడిచే బాధ తప్పిందా? తెలుసు కోవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ..
పేషెంట్లు లేక వెలవెల
చూస్తున్నారుగా... పేషెంట్‌లు లేక ఈ ఆస్పత్రి ఎలా వెలవెలపోతోందో. పేషెంట్‌లు రావాలంటే మరి డాక్టర్లు ఉండాలిగా.  ఈ ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరూ ఉండరు.  ప్రభుత్వం కేటాయించినా డాక్టర్లు విధులకు హాజరవ్వడం లేదనుకుంటున్నారేమో.. అసలు ప్రభుత్వం ఈ ఆస్పత్రికి వైద్యులనే కేటాయించలేదు.  అందుకే వైద్య పరికరాలు, బెడ్‌లు  ఇలా నిరుపయోగంగా పడి ఉన్నాయి.
ఇప్పటి వరకు వైద్యులను కేటాయించని సర్కార్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి ఇది.  ఈ భవన నిర్మాణానికి 2002లో నాటి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. పనులన్నీ పూర్తి చేసుకోవడంతో 2007లో నాటి ఆరోగ్యశాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. 30 పడకల ఆస్పత్రిగా అప్‌డ్రేగ్‌ కూడా చేశారు. ఈ పీహెచ్‌సీని  ప్రారంభించి 9ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వైద్యులనే ఏర్పాటు చేయలేదు.
గిరిజనుల పట్ల సవతితల్లి ప్రేమ కనబరుస్తోన్న ప్రభుత్వం
30పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో స్థానిక గిరిజనులంతా సంతోషించారు.  సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా తమ ప్రాంతంలోనే  వైద్యసేవలు చేయించుకోవచ్చని  సంబరపడ్డారు. కానీ ఆ తర్వాతే తెలిసింది ప్రభుత్వం తమపట్ల సవతితల్లి ప్రేమ కనబర్చిందని. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ ఆస్పత్రి వైపు కన్నెత్తి చూసిన నేతలే లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్దించి...  టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడిచినా నేటికీ పట్టించుకున్న నాధుడే లేడు.
కిలోమీటర్ల కొద్దీ వైద్యం కోసం గిరిజనుల నడక
9ఏళ్లుగా వైద్యులు లేకపోవడంతో ఏచిన్న అనారోగ్యం వచ్చిన ఇక్కడి గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నారు.  ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.  వైద్యం కోసం వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.  అంతేకాదు..  వైద్యం కోసం సుదూరంలోని  కొత్తగూడెం, వైరా, ఖమ్మం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ పాము, కుక్కకాటుకు గురవుతున్న గిరిజనులు
జూలూరుపాడు మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో తరచూ ఇక్కడి గిరిజనులు తరచూ పాము, కుక్కకాటుకు గురవుతుంటారు. అతిసార, కలరాతోపాటు సీజన్‌ వ్యాధులు, విషజ్వరాలకు బలవుతుంటారు. ఏళ్లతరబడి అంతుచిక్కని రోగాలతో గిరిజనులు చనిపోతుంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి జూలూరుపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
 

 

09:29 - January 31, 2017

p { margin-bottom: 0.21cm; }

చిత్తూరు : తిరుపతిలో స్వైన్‌ ఫ్లూ కలకలం రేగింది. స్విమ్స్‌లో స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూత్రపిండాల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆయనకు... స్వైన్‌ ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. కాగా మృతుడు కొర్లకుంట వాసిగా గుర్తించారు.

15:53 - January 27, 2017

హైదరాబాద్‌: నగరంలో గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో మరొకరి మృతిచెందారు. గాంధీలో చికిత్సపొందుతున్న బీబీనగర్‌కు చెందిన 10నెలల చిన్నారి ఇవాళ మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మరణాలు ఆరుకు చేరాయి. మరోవైపు చార్మినార్‌కు చెందిన మరో బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీలో చేరాడు.

14:57 - January 11, 2017

హైదరాబాద్ : ముంబాయి చెందిన సాజిద్‌ 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నగరానికి వచ్చి పనిచేసుకునేవాడు..ఈ క్రమంలోనే ఇక్కడే పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిన సాజిద్‌ ఆ తర్వాత మోసాలు చేయడం మొదలుపెట్టాడు... 2004లో నకిలీ వీసాలు ...పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో నకిలీ వీసాలు సృష్టించి తాను దుబాయి చెందినవాడిగా పరిచయం చేసుకుని వీసాలు ఇస్తూ మోసాలకు పాల్పడ్డాడు...సాజిద్ చీటింగ్ బయటపడ్డంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు....

2012లో మరో కొత్త వేషం..

ఇక సాజిద్ మరో వేషం కట్టాడు...తనకు తంత్రాలు వస్తాయని నమ్మించి బ్లాక్‌ మేజిక్ పేరుతో ఇంట్లో శని ఉందని... సైతాన్‌ ను పంపిస్తానంటూ మోసాలు చేయడం మొదలుపెట్టాడు..మూఢనమ్మకాల్లో ఉన్నవారిని మరింతగా భయపెట్టి దండుకునేవాడు..ఇలా సాజిద్ వేషం ఎన్నో రోజులు లేదు... అప్పట్లోనే టప్పాచబుత్ర, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు...

సరికొత్త ఆలోచనలతో బయటకు...

రెండు,మూడు సార్లు జైలుకు వెళ్లొచ్చిన సాజిద్‌ బయటకు వచ్చిన ప్రతీ సారి కొత్త ఆలోచనతో వస్తున్నాడు..ఈసారి ఏకంగా వైద్యులను టార్గెట్ చేసుకున్నాడు..తనకు తాను నాందేడ్ చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నంటూ ఫోన్ చేసి మీ వైద్యం వల్ల ఓ మనిషి చనిపోయాడంటూ టార్గెట్ చేసిన డాక్టర్‌కు ఫోన్ చేసి సెటిల్ చేస్తాడు...అకౌంట్ నంబర్ చెప్పి డబ్బులు జమ చేయించుకుంటాడు...సాజిద్ ఎలా మోసం చేస్తాడో పోలీసుల సమక్షంలోనే జరిగింది....ఇలా ఎందరో వైద్యులను నమ్మించి మోసం చేసిన సాజిద్‌పై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి పట్టుకున్నారు...ఫోన్లలోనే మాట్లాడుతూ రకరకాలుగా మోసాలు చేసే సాజిద్‌ లాంటివారెందరో ఉన్నారు..తస్మాత్ జాగ్రత్తా...

16:00 - October 26, 2016

హైదరాబాద్ : తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్‌తో ఆస్పత్రి పాలైన చిన్నారి సంజన డిశ్చార్జ్ అయింది. ప్రమాదంతో ఈ నెల 2న కోమాలోకి వెళ్లిన పాప... నెమ్మదిగా కోలుకుంది. రోడ్డుదాటుతుండగా పాపతోపాటు.. ఆమెతల్లిని కారు ఢీకొట్టింది. తల్లి శ్రీదేవి కోలుకున్నా... చిన్నారిమాత్రం కోమాలో ఉండిపోయింది. మెరుగైన చికిత్స అందించిన కామినేని వైద్యులు... పాపను డిశ్చార్జ్ చేశారు. మూడు వారాల తర్వాత సంజన నడుస్తుందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సంజన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - డాక్టర్లు