డిమాండ్

11:21 - October 22, 2018

బెంగళూరు : మంచి చెడులు అనేవి రెండు విభిన్నమైనకోణాలు. అలాగే ప్రతీ అంశంలోను రెండు కోణాలు వుంటాయి. బాధ, వేధన అనేవి అందరికీ ఒకలాగనే వుంటాయి. ప్రతీ మనిషిలోను మంచి చెడులు వుంటాయి. అలాగే బాధ అనేది స్త్రీ పురుషులిద్దరికి వుంటుంది. కానీ ఎక్కువగా బాధింపబడే నేపథ్యంలో మహిళలు కొన్ని తరతరాలుగా బాధలను, వేదనలను, అణచివేతలను ఎదుర్కొంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో సాధికారతవైపుగా అడుగులు వేస్తున్న మహిళలు తమపై జరుగుతున్న వేధింపులపై గళమెత్తుతున్నారు. ‘మీటూ ’ అంటు ఇక బాదలను, వేధింపులను సహించం అంటు నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాకూ బాధలున్నాయి. మేము వేధింపులను ఎదుర్కొంటున్నామంటు పురుషులుకూడా ‘మెన్ టూ’ను ప్రారంభించారు. దీనిపై ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. 

‘మెన్ టూ ప్రారంభించిన దర్శకుడు వారాహి..
సినీ పరిశ్రమలోనే కాక దాదాపు అన్ని రంగాల్లోను ‘మీ టూ’ ఉద్యమం కాక పుట్టిస్తున్న సమయంలో మరో సరికొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది. తమిళ పరిశ్రమలోని ఓ దర్శకుడు ఈ ఉద్యమన్ని ప్రారంభించారు. ‘మీటూ’ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మహిళలు బెదిరింపులకు పాల్పడుతున్నారని..దీని బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘మీ టూ మెన్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తమిళ సినీ దర్శకుడు వారాహి తెలిపారు. 

 బెంగళూరులో మెటూను ప్రారంభించిన జాగిర్ధార్..Image result for men too
ఇప్పుడు ఇటువంటి తరహా ఉద్యమమే మరోటి పురుడు పోసుకుంది. అయితే, ఇది పురుషుల చేతిలో అన్యాయానికి గురైన మహిళలకు సంబంధించినది కాదు.. మహిళల చేతిలో కష్టాలు పడుతున్న పురుషులకు సంబంధించింది. దీనిపేరు ‘మెన్ టూ’. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘క్రిస్ప్’ అనే స్పచ్ఛంద సంస్థ దీనిని తెరపైకి తీసుకొచ్చింది. ఈ సంస్థ నిర్వాహకుడైన కుమార్ జాగిర్దార్.. మరో 15 మందితో కలిసి ఆదివారం దీనిని ప్రారంభించారు. ‘మీటూ’కు ‘మెన్ టూ’ ఏమాత్రం వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా జాగిర్దార్ పేర్కొన్నారు. తప్పుడు కేసులు, ఆరోపణలతో మానసిక క్షోభ అనుభవిస్తున్న పురుషుల ఆవేదనను వెలికి తీసుకొచ్చేందుకే దీనిని ప్రారంభించినట్టు వివరించారు. 
అకౌంటెంట్ అయిన జాగిర్దార్... స్టాక్ మార్కెట్ నిపుణుడు కూడా. భార్యా బాధితుల సంఘం, భారతీయ కుటుంబ సంక్షేమ సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాలలో సవరణలు చేయాలంటూ గత 15 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఆయనను వదిలి కుమార్తెతో కలిసి వెళ్లిపోయిన భార్య ఓ క్రికెటర్‌ను పెళ్లాడింది. తన కుమార్తె సంరక్షణ భారాన్ని తనకు అప్పగించాలంటూ పోరాడి విజయం సాధించారు. కాగా, ‘మెన్ టూ’ వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ ఉండడం విశేషం. సొంత కుమార్తెనే లైంగికంగా వేధించాడంటూ పాస్కల్‌పై ఆయన భార్య కేసు పెట్టింది. 2017లో కేసును కొట్టేసిన కోర్టు పాస్కల్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.
 

08:26 - August 24, 2018

హైదరాబాద్ : సీబీఐటీ కాలేజీలో విద్యార్థులు కదం తొక్కారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా కాలేజీ ఆవరణలో నిరసనకు దిగారు. మూడు రోజుల నుండి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కాలేజీ యాజమాన్యం.. తమపై భౌతిక దాడులకు దిగడంతో విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేశారు. 
రూ.86 వేలు అదనంగా చెల్లించాలన్న యాజమాన్యం
హైదరాబాద్‌లోని సీబీఐటీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్‌లో ఎ, బి కేటగిరి విద్యార్థులను టీఎఫ్ ఆర్సీ నిర్ణయించిన ఫీజుల కంటె ఒక్కో విద్యార్థి 86 వేల రూపాయలు అదనంగా చెల్లించాలంటూ యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెంచిన ఫీజు కట్టేది లేదని స్పష్టం చేయడంతో ఈ నెల 31 వరకు యాజమాన్యం గడువు విధించింది. ఆ లోపు ఫీజు కట్టకపోతే పరీక్షలకు అనుమతి లేదని తెగేసి చెప్పింది. యాజమాన్యం నిర్ణయంతో విద్యార్థులు క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. 
విద్యార్థులపై చేయి చేసుకున్న ప్రిన్సిపాల్‌ 
ఉదయం నుండి క్లాసులు బాయ్‌కాట్‌ చేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపాల్‌ చేయి చేసుకోవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన ఉధృతం చేశారు. కోర్టులో ఫీజులు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారని అందుకే కాలేజీ యాజమాన్యం ఫీజులు పెంచిందని పోలీసులు అంటున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీని పోలీసు అకాడమీగా మార్చేస్తున్నారని.. న్యాయం అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. 
ఆందోళన చేస్తున్న విద్యార్థులను టార్గెట్‌ చేస్తున్నారు : విద్యార్థులు
ఫీజుల భారం మోయలేమంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను టార్గెట్‌ చేసి డిటైన్‌ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మీడియాతో మాట్లాడినా కాలేజీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడలేదన్న పోలీసులు  
విద్యార్థులపై ఎలాంటి భౌతిక దాడులకు పాల్పడలేదని... కేవలం డిటైన్‌ అయిన విద్యార్థులే కావాలని ఆందోళన చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. 
ఫీజుల పెంపు తగ్గించే వరకు ఆందోళన
ఫీజుల పెంపు తగ్గించే వరకు ఆందోళన ఆపేది లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెంచిన ఫీజు కట్టేదిలేదని...పాత ఫీజులనే కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

 

19:29 - August 1, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో.. ఐదు జిల్లాలను సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. విశాఖ, ఉభయగోదావరి, చిత్తూరు, అమరావతిలతో పాటు.. అనంతపురం జిల్లాలనూ ఐటీ పరిశ్రమలను స్థాపింప చేస్తామన్నారు. 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష, ఎలెక్ట్రానిక్స్‌ మానుఫ్యాక్చరింగ్‌లో రెండు లక్షలు చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభం 
నవ్యాంధ్రప్రదేశ్‌లో సరికొత్తగా మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. అమరావతిలోని ఏపీ ఎన్నార్టీ పార్క్‌లో.. ఒకేసారి పది ఐటీ సంస్థలను.. రాష్ట్ర ఐటీ మంత్రి నారాలోకేశ్‌ ప్రారంభించారు. వీటి ద్వారా వెయ్యిమందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. ఎన్నికల నాటికి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలూ కృషిచేస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. ఈ దిశగా.. ఐదు జిల్లాలను సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.
ఎంఓయూలు వాస్తవరూపం 
ఎంఓయూలను వాస్తవరూపంలోకి తేవడంలో.. ఏపీ దేశంలోనే అగ్రభాగాన ఉందని లోకేశ్‌ వెల్లడించారు. సీఐఐ సదస్సులో ఐటీ శాఖ కుదుర్చుకున్న ఎంఓయూలు దాదాపుగా వాస్తవరూపం దాల్చాయన్నారు. జియో కంపెనీకి చెందిన ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో 80శాతం ఏపీలోనే చేస్తామని రిలయన్స్‌ సంస్థతో ఒప్పందం కుదిరిందని.. తిరుపతిలో 125 ఎకరాలు దీనికోసం సిద్ధం చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వం రూపొందించుకున్న విధానం వల్లే.. ఇది సాధ్యపడుతోందని లోకేశ్‌ చెప్పారు. 
పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్‌  
తనను అవినీతిపరుడని ఆరోపించిన పవన్‌ వ్యాఖ్యలపై లోకేశ్‌ స్పందించారు. తాను అవినీతిపరుడైతే ఇన్ని సంస్థలు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణంపై ఆరోపణలు చేస్తూ.. పనులను అడ్డుకుంటామనడాన్ని తప్పుబట్టిన లోకేశ్‌.. పది మంది కోసం 35వేల ఎకరాలిచ్చిన రైతులను ఇబ్బందిపెట్టలేమని అన్నారు. విపక్షాలు అడ్డుకుంటే.. పెట్టుబడులు రావని, ఇది సరైంది కాదని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

16:39 - July 27, 2018
16:45 - July 18, 2018

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో యువజన సంఘాల నేతలు ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు రాత్రి నుండి యువజన సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్‌ చేశారు. యువజన సంఘాలు చేపట్టిన ప్రదర్శనను కూడా అడ్డుకున్నారు. నేతలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

16:40 - July 11, 2018

పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అలాగే వయసుతో తారతమ్యం లేకుండా పాలు అన్ని వయసులవారికి చాలా అవసరం. సాధారణంగా మనం ఎక్కువ ఆవు, గేదె పాలను వాడుతుంటాం. అంతగా కాకుంటే మేకపాలు, గొర్రెపాలు వాడుతుంటాం. ఆవుపాలు పిల్లలకు, పెద్దవారికి కూడా ఎంతో శ్రేష్టమయినవి. పాలు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. ఇది అందరికీ తెలుసు. పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమేని నిరూపించబడింది. ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 45-60 మధ్య వయసు వున్న 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడంతో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అందుకే పాలలోని కాల్సియం, విటమిన్‌ డి-బరువుతగ్గడములో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు అనే సామెతను మనం వింటుంటాం. కానీ ఆవుపాలకు మించిన డిమాండ్ ఒంటెపాలకు వచ్చింది.

ఆవు పాలకు మించిన డిమాండ్‌ ఇప్పుడు ఒంటె పాలకు..
ఆవు పాలకు మించిన డిమాండ్‌ ఇప్పుడు ఒంటె పాలకు ఉంది. ఆ ‘డిమాండ్‌’ను రూపాయల్లో లెక్కించాలంటే.. లొట్టిపిట్ట అంటే ఒంటె. దీనినే ఎడారి ఓడ అని కూడా అంటారు. ఒంటె పాలు లీటరు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 3వేల వరకూ పలుకుతోందట. అమెరికాలో అయితే రూ. 3500 వరకూ వెళ్తోంది. ఒంటెపాలతో పాటు పాల పౌడర్‌కూడా మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. రాజస్థాన్‌లోని ఒంటెల యజమానులకు ఈ డిమాండ్‌ వరంగా మారింది. దీంతో వారు ఒంటె పాలతో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.

పాల తయారీకోసం కొత్తగా యూనిట్లు..
బికనీర్‌, కచ్‌, సూరత్‌ ప్రాంతాల్లో పాల తయారీకోసం కొత్తగా యూనిట్లు కూడా వెలిశాయి. అసలేంటి ఈ ఒంటె పాల విశిష్టత అంటే.. వీటిలో సహజసిద్ధమైన ఇన్సులిన్‌ ఉందట. డయాబెటిస్‌ ఉన్న వారికి ఈ పాలు చాలా ఆరోగ్యకరమని కొన్ని జంతువులపై చేసిన పరీక్షల్లో తేలిందని పరిశోధకులు తెలపటంతో ఒంటెపాటకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది.

పలు దీర్ఘకాలిక వ్యాధులకు ఔషదంగా ఒంటెపాలు..
ఇదే కాక ఆటిజం, కీళ్లనొప్పుల పరిష్కారానికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఉపకరిస్తాయని పరిశోధకులు అంటున్నారు. మిగిలిన పాలతో పోలిస్తే లాక్టోజ్‌ శాతం కూడా చాలా తక్కువగా ఉన్న కారణంగా.. లాక్టోజ్‌ సహించని వారికి ఒంటెపాలు మంచి ప్రత్యామ్నాయమని వారు చెబుతున్నారు. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఒంటెపాలను నేరుగా అస్సలు తాగకూడదు. మానవ శరీరంలోకి వెళ్లకూడని అనేక మలినాలు వీటిలో ఉంటాయట. ఈ పాలను శుద్ధి చేసిన తర్వాతే తాగడానికి వీలుగా తయారవుతాయి. 

07:59 - July 10, 2018

తెలంగాణలో అంగన్ వాడిలు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యల సాధన కోసం 36 గంటల ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని.. తమకు పీఎఫ్‌, ఈఎస్‌ఐల సదుపాయం కల్పించాలని.. పెన్షన్‌ ఇవ్వాలని.. ఐసీడీఎస్‌ను రక్షించాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళన బాట పట్టారు. వారు ఆందోళనకు గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వ విధానాలపై ఇవాళ్టి జనపథంలో అంగనీవాడీ వర్కర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:40 - July 8, 2018

హైదరాబాద్ : చెరువులను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో 50 కాలనీవాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాలుష్యం నుంచి చెరువులను,... రోగాల నుంచి తమను రక్షించాలని కోరుతూ ఐదువేల మంది కాలనీవాసులు ఆందోళన బాట పట్టారు. ర్యాలీలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌, ఆల్మాస్‌గూడా కమాన్‌ నుంచి మంద మల్లమ్మ ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ కొనసాగింది. డ్రైనేజీలకు ప్రత్యేక ట్రంక్‌లైన్‌ ఏర్పాటు చేయాలని నాగేశ్వర్‌ కోరారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌సిటీగా మార్చాలనుకుంటున్న సర్కార్‌.. చెరువులను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.

 

17:46 - July 6, 2018

కడప : విభజన హామీ చట్టంలో ఇచ్చిన విధంగా కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని..ఆ తర్వాతే కడపలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  అడుగుపెట్టాలన్నారు వామపక్ష నేతలు.  కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం తుంగలో తొక్కిందని ఆరోపించారు. వెంటనే జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై స్పష్టమైన ప్రకటన చేయాలని లేని పక్షంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా పర్యాటనను అడ్డుకుంటామని వామపక్ష నేతలు హెచ్చరించారు.

 

16:40 - July 6, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తున్న ఉద్యోగులకు దేశం గర్వించేలా పిఆర్సిని ప్రక‌టించాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పిఆర్సిలో పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా 63 శాతం పిట్ మెంట్‌తో పాటు 30 శాతం ఐ ఆర్ ని ప్రక‌టించాల‌ని టిఎన్జివో, టిజివో సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. స‌చివాల‌యంలో పే రివిజ‌న్ క‌మీష‌న్ చైర్మన్‌ను  క‌ల‌సి విడివిడిగా నివేదిక‌లు అందించారు.
సీఎం కేసీఆర్‌ ఆద‌ర్శవంత‌మైనా నిర్ణయం తీసుకోవాలి 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ త‌మ పిఆర్సి విష‌యంలోనూ ఆద‌ర్శవంత‌మైనా నిర్ణయం తీసుకోవాల‌ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే  వివిధ కారాణాల‌తో రెండు సార్లు పిఆర్సిని కోల్పోయిన తాము..మ‌రో సారి అలా న‌ష్టపోకుండా చూడాల‌ని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
మా ప‌ట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి  
రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో కీల‌క‌పాత్ర పోషిస్తున్న తమ ప‌ట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈమేరకు తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత‌లు  పిఆర్సి క‌మీటికి  ఓ నివేదిక అందించారు. 41 అంశాల‌తో టిఎన్జివో సంఘం అంద‌చేసిన వివ‌రాల ప‌ట్ల క‌మీష‌న్ సానుకూలంగా ఉన్నట్లు నేత‌లు చెప్పారు. 
ఖాళీ పోస్టులను బర్తీచేయాలి 
రాష్ట్రంలోని వివిధ స్ధాయిల్లో ఉద్యోగుల ప‌డుతున్న  ఇబ్బందుల‌ను కూడా ఆ నివేదిక‌లో పొందు ప‌ర్చారు. ఉద్యోగుల సంఖ్య తగ్గడంలో ప్రస్తుతం ఉన్న వారిపై భారం పడుతున్నందున ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.. వీటితో పాటు ప‌క్కన ఆంధ్ర ప్రదేశ్ తో పాటు చాల రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే ఉద్యోగుల వయో పరిమితి ని పెంచాలని డిమాండ్ చేశారు. ఇక  కాలుష్యం వల్ల ప్రయాణంలో ఇబ్బందులకి గురి అవుతున్నందున పని దినాలు సంఖ్య ని 5 రోజులకి కుదించాలని డిమాండ్‌ చేస్తున్నారు
నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి 
వీటితో పాటు నూత‌న పెన్షన్ విధానాన్ని కూడా ర‌ద్దు తో పాటు మ‌హిల ఉద్యోగుల స‌మ‌స్యలు, గ్రామీణప్రాంతా ఉద్యోగుల హెచ్ ఆర్ ఏ వంటి అంశాల‌నుకు కూడా నివేదిక‌లో పోందు ప‌ర్చారు. అయితే పిఆర్సి కి సంఘాల ప్రతిపాద‌న‌లు అందించే స‌మ‌యం ద‌గ్గర ప‌డుతున్నందన ఉద్యోగుల డిమాండ్లపై సీఎం కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తసుకుంటారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - డిమాండ్