డీఎస్సీ

09:49 - August 16, 2017

హైదరాబాద్ : సర్కార్‌ బడుల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పంచాజెండా ఊపింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి కేసిఆర్ పాఠశాల విద్యాశాఖను ఆదేశించడంతో అధికారులు నోటిఫికేషన్ పై కసరత్తు మొదలుపెట్టారు. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యపై ప్రాథమికంగా ప్రభుత్వం అవగాహనకు రావడంతో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2015 వరకు ఉన్న 8వేల 972 ఖాళీలు భర్తీ చేయడానికి సర్కార్‌ సన్నద్ధమవుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన ఖాళీలతో మరో డీఎస్సీ చేపట్టాలని భావిస్తున్నారు. అయితే పాతజిల్లాలు, కొత్త జిల్లాలకు సంబంధించిన అంశంపై న్యాయస్థానాల్లో చిక్కులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి కడియం సూచించారు. టీచర్‌ పోస్టులు మరీ తక్కువగా ఉండటంతో.. ఖాళీ పోస్టులపై పూర్తి వివరాలతో రావాల్సిందిగా కడియం అధికారులను ఆదేశించారు.

రెండు సార్లు డీఎస్సీ
5 ఏళ్లుగా డీఎస్సీ నిర్వహించకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచింది. డీఎస్సీపై ప్రభుత్వం పలు ప్రకటనలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో సర్కార్‌పై నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగుల్లో నెలకొన్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఒకేసారి మెగా డీఎస్సీ నిర్వహించాలా. లేక వెంటవెంటనే రెండు డీఎస్సీలు వేయాలా అన్నదానిపై తర్జన భర్జన పడింది. చివరికి రెండు డీఎస్సీలు వేయడంవైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 17న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.

17:10 - June 10, 2017

హైదరాబాద్ : డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో మూడేళ్లు కాలయాపన చేసిన తెలంగాణ ప్రభుత్వం..ఇప్పుడు పాత జిల్లాల ప్రకారం కాకుండా కొత్త జిల్లాల ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తామంటూ ఆందోళనకు గురిచేస్తున్నారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గురుకుల పోస్టుల భర్తీకి పాత జిల్లాల వారీగా నిర్వహించారని అదే ప్రకారం తమకు కూడా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్‌ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. నాలుగు జిల్లాల్లోనే 10వేల టీచర్ పొస్టులు ఉన్నాయని కొత్త జిల్లాల ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తే కొన్ని జిల్లాలకు రెండు, మూడు పొస్టులు మత్రమే వస్తాయిని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ మూడు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుందని వారు విమర్శించారు. టెట్ తో పాటే డీఎస్సీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వలని వారు డిమాండ్ చేశారు. 

13:21 - May 30, 2017

హైదరాబాద్ : తమకు న్యాయం చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను..ముఖ్యమంత్రులను..నాయకులను, అధికారులను అడుగుతూనే ఉన్నారు. కానీ అందరూ చేస్తాం... చూస్తాం... ఇస్తామని చెబుతున్నారు. కానీ వారికి మాత్రం అన్యాయమే ఎదురవుతూనే ఉంది. న్యాయం చేసినవారు లేరు. వారే 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు. తమ గోడును మరోసారి వినిపించేందుకు ప్రగతి భవన్ కు మంగళవారం ఉదయం చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కానీ అక్కడనే ఉన్న పోలీసులు వీరిని అడ్డుకున్నారు. తాము సీఎం కేసీఆర్ తో మాట్లాడుతామని, శాంతియుతంగా ఆందోళన చేపట్టామని వారు పేర్కొన్నారు. వంద మంది అభ్యర్థులను అరెస్టు చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు. అరెస్టులను డీఎస్సీ అభ్యర్థుల సంఘం నేత నర్సింహరెడ్డి ఖండించారు. సమస్యలను పరిష్కరించాలరని కోరితే అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. న్యాయం చేస్తామని అధికారంలోకి రాకముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మారుస్తున్నారని అభ్యర్థులు తెలిపారు.

20:09 - May 19, 2017

హైదరాబాద్: పోలీసోళ్లను ఆకాశానికి ఎత్తిన సీఎం కేసీఆర్.. అంతకంటే గొప్పోళ్లు లేరని అంటున్నారట, విశాఖలో ముగిసిన జనసేన సెట్ పరీక్ష...ఫలితాల విడుదల మీద పెరిగిన ఉత్కంఠ, తెలంగాణకు సరికొత్త సచివాలయమట...అమరవీరుల ఆత్మకు అసలైన శాంతట, ఆంధ్ర రాష్ట్రం ఆడోళ్లకు లోకేశం బంపర్ ఆఫర్....జలమణి పథకం కొలాయించిన అయ్యా, కొడుకు, మళ్లా మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వం...15 రోజుల డీఎస్సీకి కడియం పాతర, ఎండలల్లోనే ఆమ్లేట్ వేసుకోని తింటున్న జనం...ఉష్ణోగ్రత కొలతకు మారిపోయిన ప్రమాణం. ఇత్యాది అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

21:48 - April 2, 2017

హైదరాబాద్ : డీఎస్సీ నోటిఫికేషన్‌ను టీఎస్ పీఎస్సీకి అప్పగించామని ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో బడిబాట, స్కూల్ యూనిఫామ్స్, టాయిలెట్స్, ఇతర వసతులతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపై జిల్లా విద్యాధికారులతో కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశం జరిగింది. బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచడానికి తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ నెల 15 వరకు పుస్తకాల పంపిణి పూర్తి చేసి జూన్ 15 లోగా అన్ని స్కూళ్లకు యూనిఫామ్స్ సరఫరా చేయాలని అధికారులకు అదేశాలిచ్చారు.

 

11:38 - December 20, 2016

హైదరబాద్ : డీఎస్సీ నియామకాలు ఎప్పుడు చేపడతారో తెలిపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రశ్నించారు. 23వేల తరగతి గదులు అదృశ్యమైనపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని ఆమె తెలిపారు. విద్యావవస్థను మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలిపాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరిందని తెలిపారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతిని గుర్తు చేశారు. దీనికి మంత్రి కడియం శ్రీహరి ఎడ్యుకేషన్ పై చర్చించేందుకు సిద్ధంగా వుందన్నారు.  

18:01 - November 7, 2016

హైదరాబాద్ : వచ్చే ఏడాది జూన్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో 'ఇన్ స్పైర్ ఎక్స్ పో లెవెల్ ఎగ్జిబిషన్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 14నుంచి 1500 ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభించనున్నామని చెప్పారు. 

15:01 - May 18, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీని రద్దు చేస్తూ టీ.ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై టీఎస్ పీఎస్ సీ ద్వారానే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ పీఎస్ సీ ద్వారా చేస్తేనే పారదర్శకత వుంటుందని గతంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చావా రవి యూటీఎఫ్ నేత మాట్లాడుతూ..టీఎస్ పీఎస్ సీతో రిక్రూట్ చేసినా.. డీఎస్సీతో చేసినా వున్న ఖాళీలను ఎలా భర్తీ చేస్తారన్నది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడివుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 17వేల పోస్టులు ఖాళీగా వున్నాయి. వీటన్నింటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సామాన్యులు చదువుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. ఖాళీగా వున్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా చేసినా..టీఎస్ పీఎస్ సీ ద్వారా చేసినా పారదర్శకంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్ధిష్టమైనటువంటి సమయంలో చేయాలని కోరారు.

11:35 - March 31, 2016

హైదరాబాద్ : ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. పోలీసు డిపార్ట్ మెంట్ లో 5.70 వేలు, డీఎస్సీకి 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. నిరుద్యోగుల 12 -15 లక్షల మంద్రి మాత్రమే ఉన్నారని కొంతమంది పేర్కొంటున్నారని కానీ సీఎం మాత్రం కోటి మందికిపైగా ఉన్నారని చెబుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నీళ్లు..నిధులు..నియామకాల సమస్యలపై తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 43 వేల టీచర్ల పోస్టులు..3,755 జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రెండు సంవత్సరాల అవుతున్నా ఇంతవరకు ఖాళీలు భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. భర్తీ చేయకపోతే కేటాయించిన బడ్జెట్ మిగులుతుందని, నిరుద్యోగుల పొట్ట కొట్టే విధంగా చేయకూడదని ఆర్.కృష్ణయ్య సూచించారు. 

14:43 - March 28, 2016

హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకా ఎందుకు వేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో విద్యారంగానికి టీఆర్‌ఎస్‌ ఎన్నో హామీలిచ్చినా.. ఇంతవరకు ఒక్కటీ కూడా అమలు చేయలేదని డీకే అరుణ విమర్శించారు. సోమవారం ఆమె అసెంబ్లీలో విద్యారంగంపై ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్ధుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. అదేవిధంగా వెంటనే డీఎస్సీ ప్రకటించి.. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలన్నారు డీకే డిమాండ్ చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - డీఎస్సీ