డైరెక్టర్ శ్రీనువైట్ల. కాంబినేషన్‌

15:58 - January 11, 2018

హీరో రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందంట. త్వరలోనే పట్టాలెక్కబోతుందట. శ్రీనువైట్ల మార్క్‌ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అమెరికాలో ఎక్కువ శాతం సాగే ఈ చిత్రంలో రవితేజ ఎన్‌ఆర్‌ఐగా కనిపించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ ఫైనల్‌ దశలో ఉందని, ఫైనలైజ్‌ అయ్యాక సినిమాను మొదలు పెట్టేందుకు చిత్ర బృందం ముమ్మర సన్నాహాల్లో ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందట. గతంలో రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 'నీకోసం', 'దుబారు శ్రీను', 'వెంకీ' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం రవితేజ 'టచ్‌ చేసి చూడు' చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. 

Don't Miss

Subscribe to RSS - డైరెక్టర్ శ్రీనువైట్ల. కాంబినేషన్‌