డైలాగ్

18:19 - March 30, 2017

గుంటూరు : బాలకృష్ణ నటించిన గౌతమీపుత్రశాతకర్ణి సినిమాలోని సమయంలేదు మిత్రమా.... శరణమా... రణమా.. అన్న డైలాగ్‌ ఏపీ అసెంబ్లీలో మార్మోగుతోంది. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి అధికారపక్ష సభ్యులు, మంత్రులు తరచూ ఈ డైలాగ్‌ను తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. మొన్న కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఉపయోగించిన ఈ డైలాగ్‌ను ఇవాళ చంద్రబాబునాయుడు తనకు అకూలంగా అన్వయించుకున్నారు. పదవ తరగతి ప్రశ్న పత్రం లీకు దర్యాప్తుపై ప్రతిపక్షం తేల్చుకోవాలంటూ చంద్రబాబునాయుడు.. సమయంలేదు... అన్న డైలాగ్‌ను వాడారు. 

 

15:40 - January 11, 2017

కడప : 'నీ ఇంటికి వస్తా..నీ నట్టింటికి వస్తా' అనే డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అదే డైలాగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలికితే ఎలా ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ఎంపీ జేసీ తనదైన శైలిలో విమర్శలు..ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం బాబు చొరవతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 'బూట్లు నాకే వ్యక్తి అని అయితే ఎప్పుడూ మంత్రిగా ఉండేవాడిని..మా ఇంట..వంట..సారాయి తాగే అలవాటు లేదు..నాలుక చీరుస్తావా..అంత మొగడివా..నీ ఇంటికి వస్తా..పులివెందులకు వస్తా' అంటూ డైలాగ్స్ పలికారు. 1981లో మొట్టమొదటిసారిగా తాడిపత్రికి పిలిపించి రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

07:23 - May 8, 2016

'స్వర్గం నరకం' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన మోహన్‌బాబు గతేడాది(2015 నవంబర్‌ 22)తో నటుడిగా 40ఏండ్లు పూర్తి చేసుకున్నారు. నలభై వసంతాల వేడుకల్లో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మోహన్‌బాబు సినిమాల్లోని పాపులర్‌ డైలాగ్‌లన్నింటినీ ఒక బుక్‌గా తయారు చేశారు. 'డైలాగ్‌ బుక్‌' పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని ఈ నెల 11న బ్రిటన్‌ పార్లమెంట్‌ 'హౌస్‌ ఆఫ్‌ కామన్‌'లో ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6.30 నుంచి 8.30గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఏసియన్‌ లైట్‌ అనే సంస్థ, బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు బాబ్‌ బ్లాక్‌ మన్‌ సంయుక్తంగా డా||మోహన్‌బాబును సత్కరించనున్నారు. అలాగే శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థను నెలకొల్పి అనేకమంది విద్యార్థులకు విద్య అందిస్తున్న మోహన్‌బాబుకు మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భంగా బెస్ట్‌ టీచర్‌ అవార్డును అందజేశారు.

Don't Miss

Subscribe to RSS - డైలాగ్