డ్రగ్స్

09:18 - July 22, 2017

హైదరాబాద్ : నగరంలోని కూకట్ పల్లి లో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థాని మలేషియా టౌన్ షిప్ లోఇద్దరు యువతులు గంజాయి సేవిస్తున్నారు. వీరిలో ఒకరు ముంబైకి చెందిన అమ్మాయి సాప్ట్ వేర్ ఇంజనీర్, మరొకరు కరీంనగర్ చెందిన ఫ్యాషన్ డీజైనర్ ఉన్నారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదే టౌన్ షిప్ లో మరో ముగ్గురు యువకులు కూడా పట్టుబడ్డారు. మలేషియా టౌన్ షిప్ లోని 17 వ బ్లాకులో ఘటన జరిగింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:10 - July 21, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నలుగురు ఇంటర్ విద్యార్థులకు సిట్ కౌన్సిలింగ్ ఇచ్చారు. నలుగురు విద్యార్థుల్లో ఒకరు డాక్టర్ కుమారుడు, మరో ఇద్దరు ఎయిర్ పోర్టు నిర్మాణాలుచేపట్లే సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలుగా తెలుస్తోంది. వారు డార్క్ వెబ్ సైట్ నుంచి ఇంటి అడ్రస్ లకు ఎల్ఎస్ డీ డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు ఒకే ఇంటర్నేషనల్ కాలేజీ చెందిన విద్యార్థులు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:49 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంలో శ్యామ్‌ కె.నాయుడును సిట్‌ ఆరుగంటల పాటు విచారించింది. కెల్విన్‌తో శ్యామ్‌కు ఉన్న సంబంధాలపై సిట్‌ ఆరా తీసింది. ఫోన్‌ డేటా, వాట్సాప్‌ డేటాలపై సిట్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణకు శ్యామ్‌ సహకరించారని.. మళ్లీ అవసరమైతే పిలుస్తామని సిట్‌ అధికారులు తెలిపారు. శ్యామ్‌తో విచారణలో కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సప్లై అవుతున్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా కొరియర్‌ సంస్థల ప్రతినిధులనూ సైతం అధికారులు విచారించారు. కొరియర్‌ సంస్థలకు రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు. శ్యామ్‌ ఇంటికి ఎన్నిసార్లు కొరియర్‌ వచ్చిందో డీహెచ్ ఎల్, బ్లూ డార్ట్‌, ఫెడెక్స్‌ ప్రతినిధులను ఆరా తీశారు. ఇకపై నిషేధిత నార్కాటిక్స్‌ లాంటివి సరఫరా చేయవద్దని సిట్‌ ఆదేశించింది. ఇక ఈ విచారణ పరంపరలో భాగంగా రేపు నటుడు సుబ్బరాజును సిట్‌ అధికారులు విచారించనున్నారు. సుబ్బరావు రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. 

 

12:42 - July 20, 2017

హైదరాబాద్ : సిట్ అధికారులు శ్యాం. కె నాయుడు, కొరియర్ కంపెనీల ప్రతినిధులను విడివిడిగా విచారిస్తున్నారు. అధికారులు శ్యాం.కె నాయుడుకు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:36 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారల బాద్యులు డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యంలు చేశారు. ఆయన డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల వారసుల హస్తం ఉందన్నారు. విచారణ ఎలా జరుగుతుందో చూడాలని డిగ్గీ కామెంట్ చేశారు. టీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తారా అంటూ ట్విట్టర్ ద్వారా పొస్టు చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:47 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ తీసుకున్నారా...లేదా...? ఇప్పుడు టాలివుడ్‌లో షేక్ చేస్తుంది...డ్రగ్స్ తీసుకున్నట్లు...డీలర్లతో లింకులున్నట్లు ఆధారాలు సేకరించిన సిట్ బృందం నటీనటులను విచారణ మొదలుపెట్టింది...అయితే డ్రగ్స్ వారు తీసుకున్నారా లేదాన్నది తేలాలంటే రక్త, మూత్ర పరీక్షలతో సాధ్యమా..? ఆ శాంపిల్స్‌తో మాత్రం వారు మత్తు సేవించారాన్నది తేలడం కష్టమే...లోతుగా శోధించాలంటే మాత్రం శిరోజాలే ప్రధానం...మత్తు తీసుకున్నట్లు తేలాలంటే వెంట్రుకల శాంపిల్స్ మాత్రమే బయటపెట్టగలుగుతుంది..ఆ మత్తు ప్రభావం వెంట్రుకల్లో మూడు నెలల పాటు ఉంటుంది...
వెంట్రుకల ద్వారా టెస్ట్‌లు
మత్తు..డ్రగ్స్...ఇది తీసుకుంటే మత్తు ఎన్ని రోజులు ఉంటుందో చెప్పారు...కాని తెలియని నిజం ఒకటి ఉంది..ఆ మత్తు తీసుకున్నవారు నిజమేనా..కాదాన్నది తేల్చాలంటే రకరకాల టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది...ఇందులో ప్రధానమైంది శిరోజాలే... అవును.. వెంట్రుకల శాంపిల్స్ తీసుకుని నార్కోటిక్‌ నిపుణులు పరీక్షలు జరిపితే మాత్రం బయటపడుతుంది..కాని ఇది కేవలం 90 రోజుల్లోపు జరగాల్సి ఉంటుంది...ఆ తర్వాత డ్రగ్స్ సేవించారా లేదాన్నది తేలడం కష్టమేనంటున్నారు నిపుణులు...
ఒక్కసారి పీల్చితే కొన్ని గంటలు..
మత్తు తీసుకునేవారు మొదటిసారి తీసుకున్నప్పుడు కాస్త కష్టంగా..ఆ తర్వాత మత్తులో తేలుతూ మైమర్చిపోతుంటారు..ఇది కొన్ని గంటలపాటు పనిచేస్తుంది..కాస్త వీక్‌బాడీ ఉంటే మాత్రం రోజుకు పైనే ఉంటుంది...ఆ తర్వాత మత్తు దిగుతుంది..కాని మత్తు ఒక్కసారి తీసుకున్నవారు మళ్లీ మళ్లీ తీసుకోవాలనిపిస్తుంది..అందుకుకారణం మత్తులో ఉన్న మజానే వేరంటుంటారు బానిసలు.. దీంతోనే బానిసలుగామారి రెగ్యూలర్‌గా  మత్తు తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యంలో మార్పు వస్తుంది...ఆ తర్వాత దానికి ఎడిక్ట్‌ కావడంతో రక్తంలో మార్పుతో ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది...
ఒక్కో రకమైన మత్తు ఒక్కోరకంగా...
ఇప్పుడు మత్తు తీసుకున్నారా లేదా..? తీసుకుంటే వారు ఎవరికి సరఫరా చేశారనేదానిపై ఎక్సైజ్ అదికారులు విచారణ మొదలుపెట్టారు..అయితే మత్తు తీసుకున్న విషయం తెలియాలంటే మాత్రం ఒక్కో రకమైన మత్తు ప్రభావం కొంత సమయం ఉంటుంది..దీన్ని బట్టి వారు డ్రగ్స్ తీసుకునే విషయం బయటపడుతుంది..అయితే ఎక్సైజ్ అధికారులు విచారిస్తున్నవారి నుంచి రక్త పరీక్షలు,మూత్ర పరీక్షలు తీసుకుంటే మాత్రం డ్రగ్స్ వాడారా లేదాన్నది తేలడం కష్టమేనంటున్నారు నిపుణులు...
మూడు రోజుల్లోపే రక్త పరీక్షలు 
డ్రగ్స్ తీసుకున్నవారి గుట్టు తెలియాలంటే మూడు రోజుల్లోపే రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది...ఇక మూత్ర పరీక్షల ద్వారా వారం లోపు తెలుసుకోవచ్చు...మామూలు పరీక్షల్లో 24 గంటల వరకే ఉంటుంది...పూర్తి స్థాయిలో లోతుగా పరీక్షలు జరపాలంటే మాత్రం శిరోజాల ద్వారానే బయటపడుతుంది...ఇప్పుడు అధికారులు విచారిస్తున్నవారి గుట్టు తెలుసుకోవాలంటే వెంట్రుకలు కూడా శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయిస్తే మాత్రం తప్పక వారి గుట్టురట్టవుతుంది...

 

18:20 - July 19, 2017

హైదరాబాద్ : తన కూతురుకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని హీరోయిన్ చార్మి తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ అన్నారు. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. 13 ఏళ్ల వయసులోనే చార్మి సినీ రంగప్రవేశం చేసిందని తెలిపారు. సినీ రంగంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని పేర్కొన్నారు. తన కూతురు గురించి తనకు బాగా తెలుసు అన్నారు. ట్విట్టర్ లో తన తండ్రికి చార్మీ కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

15:12 - July 19, 2017
15:11 - July 19, 2017

హైదరాబాద్ : నగరానికి ఏమైంది. బ్రాండ్ ఇమేజ్ పేరు ఉన్న హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. విద్యార్థులు..సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు..యువతను టార్గెట్ చేసిన ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఛైన్ సిస్టం మాదిరిగా ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు. కెల్విన్ ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వీరి విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. టాలీవుడ్..స్కూళ్లు..కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఎక్సైజ్ శాఖ అధికారి అకూన్ సబర్వాల్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ మొదలు పెట్టారు. ప్రభుత్వం కూడా పలు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బుధవారం సిట్ అధికారులు విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను విచారిస్తుండగా... మరో డ్రగ్స్ ముఠా పోలీసులకు పట్టుబడడం కలకలం రేపింది. కాల్ డేటా ఆధారంగా దాడులు చేస్తుండడంతో ఒక్కో ముఠా బయటపడుతోంది. నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు జరిపిన దాడుల్లో 9 మందిని అరెస్టు అయ్యారు. వీరిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. వీరివద్ద 17 డోస్‌ల ఎన్‌ఎస్‌డీ, 300 గ్రాముల కొకైన్‌..ఒక ఎయిర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు ? వీరి వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు ? ఎంతకాలం నుండి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు ? తదితర విషయాలు విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది.

14:21 - July 19, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 'ఆబ్కారీ' శాఖ మెట్లు ఎక్కారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. విచారణకు రావాలని ఎక్జైజ్ శాఖ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉదయం 10గంటలకు నాంపల్లి ఆబ్కారీ శాఖ కమిషనర్ కార్యాలయానికి 'పూరీ' వచ్చారు. ఆయనతో పాటు కుమారుడు ఆకాశ్..సోదరుడు సాయిరామ్ లు కూడా వచ్చారు.

కెల్విన్ ముఠా..
గత కొన్ని రోజులుగా డ్రగ్స్ రాకెట్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రగ్స్ పంపిణీ చేస్తున్న కెల్విన్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వీరి విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. టాలీవుడ్..స్కూళ్లు..కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఎక్సైజ్ శాఖ అధికారి అకూన్ సబర్వాల్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ మొదలు పెట్టారు. ప్రభుత్వం కూడా పలు ఆదేశాలు జారీ చేసింది.

ప్రశ్నలు..సమాధానాలు..
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు కూడా రావడం జరిగింది. అందులో భాగంగా ఆయన విచారణకు బుధవారం వచ్చారు. అకూన్ సబర్వాల్ పర్యవేక్షణలో నలుగురు అధికారుల బృందం ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ తో ఏర్పడిన సంబంధాలు..డ్రగ్స్ అలవాటు..మద్యం తాగే అలవాటు..జీవన శైలికి సంబంధించిన పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
ఓ ఈవెంట్ మేనేజర్ ద్వారా తనకు పరిచయం ఏర్పడిందని పూరీ అధికారులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధం లేదని పూరీ కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏ మాత్రం తడబడకుండా సూటిగా, స్పష్టంగా పూరీ సమాధానాలు చెబుతున్నట్లు..కెల్విన్ కు తనకు రెగ్యులర్ గా ఎలాంటి సంభాషణలు జరగలేదని చెప్పినట్లు తెలుస్తోంది. విచారణకు 'పూరీ' పక్కా ప్లానింగ్ తో వచ్చారని తెలుస్తోంది. విచారణపై అధికారులు స్పందించడం లేదు. 12 మందిని విచారించిన అనంతరం పూర్తి వివరాలను ఎక్సైజ్ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

Pages

Don't Miss

Subscribe to RSS - డ్రగ్స్