డ్రైవర్ నాగరాజు

08:25 - March 23, 2017

హైదరాబాద్ : రెండు కోట్లు డిమాండ్ చేశారు... కుదరకపోవడంతో కేసులో ఇరికించారు...కేసులో సెటిల్ చేసుకోమన్నారు...వినకపోవడంతో అరెస్టు చేస్తామన్నారు...ఆ డబ్బు కింది స్థాయి నుంచి పోలీసు బాస్‌వరకు వెళ్తుంది...తీవ్ర సంచలన ఆరోపణలు చేసిందెవరో కాదు...హత్య కేసులో అరెస్టయిన ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు...ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన వాట్సాప్ సందేశం కలకలం రేపింది...
పోలీసు డిపార్ట్‌మెంట్‌పై ఐఏఎస్‌ ఆరోపణలు..
డ్రైవర్ నాగరాజు హత్య కేసులో ప్రమేయంపై అరెస్టు అయిన ఐఏఎస్‌ అధికారి డి.వెంకటేశ్వర్‌రావు పోలీసు డిపార్ట్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు....హత్య కేసులో తన ప్రమేయం లేకున్నా ఇరికించారని...అన్యాయం చేశారంటూ దుమ్మెత్తి పోశారు...పోలీసులు లంచాలకు అలవాటు పడ్డారంటూనే పోలీసు బాస్‌పైనే తన బాణం ఎక్కుపెట్టారు...
సెటిల్ చేసుకోమంటూ ఫోన్లు..
డ్రైవర్ నాగరాజు హత్యానంతరం తనకు విషయం తెలియగానే పోలీసు స్టేషన్‌కు కొడుకు సుకృత్‌ను తీసుకువెళ్లి అప్పగించానని..అయితే సెటిల్ చేసుకోవాలంటూ ఫోన్లు వచ్చాయంటున్న వెంకటేశ్వర్‌రావు రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ ఆరోపించారు.
డబ్బులు ఇవ్వకపోవడంతో కేసు...
నాగరాజు హత్య తర్వాత తానే డెడ్‌బాడీ తీసుకురమ్మని కొడుకును పంపానంటున్నారు...18 ఏళ్ల కుర్రాడు డెడ్‌బాడీ మోసుకు రావడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు...తనపై మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తూ డబ్బులు ఇవ్వాలని..నిరాకరించడంతో కేసులో ఇరికించారంటూ ఆస్పత్రిలో ఉన్న ఐఏఎస్‌ వెంకటేశ్వర్‌రావు వాట్సాప్‌ ద్వారా తన సందేశాన్ని బయటకు పంపారు.
సెటిల్‌ చేసుకుందామని ఫోన్ చేసిందెవరు..?
ఈ నెల 17న డ్రైవర్ నాగరాజును వెంక‌టేశ్వర్‌రావు  పెద్ద కుమారుడు వెంకట్ సుక్రుత్ హత్య చేశాడు. ఈ కేసులో మృతదేహాన్ని సంఘటనాస్థలం నుంచి తరలించేందుకు ప్రయత్నించారని హత్యకు పాల్పడిన వెంకట్ తో పాటు తండ్రి ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు వెంకట్ ను పోలీసులు మీడియా ముందు చూపించగా... వెంకటేశ్వర్‌రావు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు...ఆయన్ని నేరుగా కోర్టులో హాజరుపర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు... ఆస్పత్రిలో ఉన్న వెంకటేశ్వర్ రావు ఆరోపణలతో సందేశాన్ని పంపడంతో కలకలం రేపుతోంది.

 

17:45 - March 20, 2017

హైదరాబాద్‌: యూసుఫ్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌ వద్ద దొరికిన డ్రైవర్ నాగరాజు డెడ్‌బాడీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు.. పక్కా ప్లాన్‌ ప్రకారమే నాగరాజును అంతం చేసిన ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు పుత్రరత్నం వెంకట్‌ సుకృత్‌ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు..సీసీ ఫుటేజీలు..ఇతర ఆధారాలు దొరికిన తర్వాత పోలీసులు సుకృత్‌ను అదుపులోకి తీసుకున్నారు...ఈ కేసులో కొడుకుకి సాయం చేసినందుకు వెంకటేశ్వర్‌రావును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు....

ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

17న ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు డ్యూటీ వెళ్లి ఇంటికి రాలేదు.. మధ్యలో భార్య ఫోన్ చేస్తే స్విచ్చాఫ్‌ రాగా..ఆ తర్వాత తానే ఫోన్ చేసి సారు వద్ద ఉన్నానని చెప్పాడు..ఆ తర్వాత తిరిగి రాలేదు...ఇదిలా ఉంటే అదే అర్ధరాత్రి నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్‌ అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లాడు...ఆ తర్వాత ఎవరూ చూడలేదు.. మర్నాడు ఉదయం అదే యువకుడు అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి ఓ మూటను తరలించేయత్నం చేయగా వృద్దుడు ప్రశ్నించడంతో అక్కడే వదిలేసి వెళ్లాడు...తీరా అది విప్పిచూస్తే అందులో డెడ్‌బాడీ ఉంది....

హత్యకు గురయింది డ్రైవర్ నాగరాజు..

కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా పరిశోధిస్తే వివరాలు బయటపడ్డాయి...సీసీ ఫుటేజీ పరిశీలించగా అందులో ఉన్న యువకుడు ఐఏఎస్‌ వెంకటేశ్వర్‌రావు కొడుకు వెంకట్‌ సుకృత్‌గా గుర్తించారు..నాగరాజును దారుణంగా చంపి మూటగట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

ఐఏఎస్‌ కొడుకు మహిళను చిత్రహింసలు చేశాడా..?

డ్రైవర్ నాగరాజును ఎందుకు హత్య చేశాడన్నది అనుమానం...పోలీసుల దర్యాప్తు చేస్తుంటే తెలిసిన విషయాలను బట్టి చూస్తే వెంకట్‌ సుకృత్‌ తీరే బాగోలేదని తెలుస్తోంది...కొద్ది రోజులు క్రితమే వెంకట్ ఓ మహిళను తీసుకొచ్చి ఆమెని చిత్ర హింసలకు గురి చేశాడు .. అయితే సమయం లో ఆమ్మాయిని వేదిస్తున్న దృశ్యాలు ను డ్రైవర్ నాగరాజు సెల్ ఫోన్ లో చిత్రికారించాడా ? ఆ భయం తోనే నాగరాజు ను హత్యకు కారణామా ? లేక నాగరాజు భార్యపై వెంకట్ కన్నేశాడా..? ఇలా ఎన్నో అనుమానాలు కలుగుతుండడంతో అసలు కథ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగం చేశారు... ఈ హత్య కేసులో ఐఏఎస్ కుమారుడు నిందితుడుగా ఉండడంతో తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆందోళన చేసింది...అయితే కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో శిక్ష పడేలా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు చెప్పారు...మూడు కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు పోలీసులు...నాగరాజు , వెంకట్ సుకృత్‌ కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Don't Miss

Subscribe to RSS - డ్రైవర్ నాగరాజు