తమన్నా

15:42 - November 8, 2018

మిల్కీబ్యూటీ తమన్నా, సందీప్ కిషన్ జంటగా, బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో, రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న చిత్రానికి నెక్స్ట్ ఏంటి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నవదీప్, పూనమ్ కౌర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాటలే సినిమాకి టైటిల్స్‌గా పెట్టడం చూస్తున్నాం. నాని హీరోగా నటించిన నేను లోకల్ మూవీలో, నెక్స్ట్ ఏంటి అనే సాంగ్ పాపులర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టారు. కునాల్ కోహ్లి  బాలీవుడ్‌లో, అమీర్ ఖాన్‌తో ఫనా, సైఫ్ అలీఖాన్‌తో హమ్‌తుమ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న నెక్స్ట్ ఏంటి చిత్ర షూటింగ్, లండన్, హైదరాబాద్‌లలో జరగనుంది. తమన్నా ప్రస్తుతం ఎఫ్2, అభినేత్రి 2, క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మితో పాటు, హిందీలో ఖామోషీ అనే సినిమాలు చేస్తుంది. నెక్స్ట్ ఏంటి  మూవీకి లియోన్ జేమ్స్ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు.  

13:32 - November 4, 2018

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే విదేశాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని, హైదరాబాద్ చేరుకుంది మూవీ టీమ్. ఎఫ్2లో వెంకీ, వరుణ్‌లు తోడల్లుళ్ళుగా కనిపించబోతుండగా, వారికి జంట అయిన తమన్నా, మెహరీన్ ఇద్దరూ అక్కా,చెల్లెళ్ళుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా, నవంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు, ఎఫ్2 - ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యనున్నట్టు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. దీపావళి కొంచెం ముందుగా అంటూ, ఎఫ్2 ఫస్ట్‌లుక్  అప్‌డేట్‌తో ఒక పోస్టర్ పోస్ట్‌చేసాడు. అందులో, వి2, వెంకటేష్, వరుణ్ తేజ్ అని మెన్షన్ చేసారు. లోగో డిజైనింగ్ టైటిల్‌కి తగ్గట్టుగా సెట్ అయింది.  ఇప్పటికే దిల్ రాజు, అనిల్ కాంబోలో, సుప్రీమ్, రాజా ది గ్రేట్ లాంటి రెండు హిట్స్ వచ్చాయి. ఎఫ్2తో, హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.  

15:55 - October 14, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 అనంతరం నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది షూటింగ్‌లో ఉండగానే మరో చిత్రానికి చిరు కన్ఫామ్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ మరలా ఈ సినిమాను నిర్మించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా ప్రధానంగా రైతులు..వ్యవసాయ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ చిత్రంలో చిరంజీవి సరసన అనుష్క లేదా తమన్నాలతో నటింప చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘రైతు’ అనే టైటిల్ పెట్టాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిగురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

10:30 - October 13, 2018

మెగాస్టార్ చిరంజీవి, తన 151వ సినిమాగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా,  సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. ఈస్ట్‌ఇండియా కంపెనీ సైనికులకు, నరసింహా రెడ్డి బృందానికీ మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌కీ,  బిగ్‌బి అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లుక్‌కీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది.. ఇంతలోనే సైరా నుండి మరో కొత్త అప్‌డేట్ వచ్చింది.. దసరా సందర్భంగా సైరా నరసింహా రెడ్డి నుండి మరో టీజర్ రీలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది.. ఈ వార్త కనక నిజం అయితే,  పండగనాడు మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.. జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్న సైరాలో, కన్నడ నటుడు సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు..  

11:26 - October 12, 2018

మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది.. నిన్న బిగ్‌బి అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లుక్‌కి మంచి స్పందన వస్తోంది.. ఇంతలోనే సైరా నుండి మరో కొత్త లుక్ వచ్చింది..
కన్నడ నటుడు సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తన్నారు.. అమితాబ్, నరసింహా రెడ్డి గురువు గోసయి వెంకన్నగా  కనిపించబోతున్నాడు.. విజయ్, నరసింహా రెడ్డి కుడిభుజంగా తమిళుడైన ఓబయ్య పాత్రలో నటిస్తుండగా, సుదీప్, అవుకు రాజు అనే పాత్ర పోషిస్తున్నాడు... వీళ్ళిద్దరూ పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం, మెలితిరిగిన మీసకట్టుతో వీరుల్లా ఉన్నారు.. జార్జియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులకు, నరసింహా రెడ్డి బృందానికీ మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి  2019 సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది...

15:05 - June 28, 2018

తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కు సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా వారి గ్లామర్ కు మాత్రం సినిమాల్లో పెద్దపాత్ర వుంటుంది. అందులోను కొంతమంది హీరోయిన్స్ తో ముందు జాబితాలో వుండే అందాల భామలు కాజల్, తమన్నాలు. ప్రస్తుతం గ్రీస్ లోని ఏథెన్స్ లో వున్నారు. 'క్వీన్' హిందీ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ కోసం తమన్నా, తమిళ రీమేక్ కోసం కాజల్ ప్రస్తుతం ఏథెన్స్ నగరంలో వున్నారు. తమిళ వెర్షన్ కి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు వెర్షన్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

15:49 - June 15, 2018

రొటీన్ రోత సినిమాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం ‘నా నువ్వే’ మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రమోషన్‌ సాంగ్స్ సినిమా అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి. ఈ సినిమా గురించి మరింతగా తెలుసుకునేందుకు రివ్వ్యూను చూడాల్సిందే..

18:14 - May 5, 2018

కడప : అభిమానుల ప్రేమాభిమానాలే తనకు ఆశీస్సులని ప్రముఖ సినీనటి తమన్నా అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సందడి చేశారు. ఓ మొబైల్‌ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమన్నాను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తమన్నా విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరుకు తాను మొదటిసారిగా వచ్చానని.. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. అనంతరం షోరూం నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వారిని మరింత ఉత్సాహపరిచారు. మొబైల్‌ షోరూం లక్కీడ్రాలో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

15:36 - January 28, 2018

హైదరాబాద్ : సినీ నటీ నటులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఫ్యాన్ చేసే అత్యుత్సాహంతో నటులు ఇబ్బందులు పడుతుంటారు. సినీ తమన్నాకు హైదరాబాద్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం హిమాయత్ నగర్ లో మల్ బార్ గోల్డ్ షాపు ప్రారంభోత్సవానికి 'తమన్నా' వచ్చింది. 'తమన్నా'ను చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. అందరిలాగే వచ్చిన ముషిరాబాద్ కు చెందిన కరీముల్లా అనే వ్యక్తి ఏకంగా 'తమన్నా'పైకి చెప్పు విసిరేశాడు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను తమన్నాకు వీరాభిమాని..కలిసేందుకు అవకాశం రావడం లేదని..ఇలా చేయడం వల్ల అవకాశం వస్తుందోమోనని చేసినట్లు కరీములా పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

12:02 - November 9, 2017

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కంప్లీట్ గా కొత్త యంగ్ డైరెక్టర్స్ చేతికి వెళ్లిందా అనుకునే టైం లో సీనియర్ డైరెక్టర్స్ మల్లి తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఈ సీనియర్ డైరెక్టర్ మళ్ళీ హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రేమకథలను తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ మరో క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్నాడు . డైరెక్టర్ తేజ ఒకప్పుడు ఈ పేరు అంటే హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్. ఆ తరువాత కాలంలో కొంచం వెనుకబడిన తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ వచ్చాడు. రానా - కాజల్ జంటగా నటించిన ఈ సినిమా ఆడియన్స్ ని రీచ్ అయింది. తాజాగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన తేజ మరో సినిమాకి ముహూర్తం పెట్టాడు. రానా హీరోగా పవర్ఫుల్ పొలిటిషన్ రోల్ లో నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో తేజ స్టైల్ అఫ్ మేకింగ్ ని మరో సారి చూపించాడు. రానా లాంటి పర్సనాలిటీని హ్యాండిల్ చేసి హిట్ కొట్టాడు తేజ.

నేనే రాజు నేనే మాత్రి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన తేజ త్వరలోనే వెంకీతో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. బాబు బంగారం సినిమా తరువాత వెంకీ మెయిన్ లీడ్ గా కనిపించే ఈ సినిమా ఇంటరెస్టింగ్ గా మారుతుంది. గురు సినిమా లో వెంకీ నటనకి మంచి మార్కులు పడ్డాయి. తేజ డైరెక్షన్ లో వెంకీ తో రాబోయే సినిమాలో స్పెషల్ పాత్ర కోసం ఒక యువ హీరోని చేయించాలని అనుకుంటున్నాడట దర్శకుడు తేజ. అయితే ఆ పాత్ర కోసం ఇద్దరి పేర్లను కూడా అనుకుంటున్నాడట. సుమంత్ - నారా రోహిత్ ఇద్దరిలో ఎవరో ఒకరిని తేజ ఫైనల్ చేయనున్నాడట. అలానే హీరోయిన్ రోల్ కోసం హీరోయిన్స్ ని ఇద్దరిని అనుకున్నా వారు రిజెక్ట్ చేశారట. వారు ఎవరో కాదు ఒకరు కాజల్ అగర్వాల్ మరొకరు మిల్కి బ్యూటీ తమన్నా. మరి వెంకీ పక్కన ఎవరు కనిపిస్తారో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - తమన్నా