తమ్మినేని వీరభద్రం

22:00 - December 16, 2017

హైదరాబాద్ : కేసీఆర్ తెలంగాణ హీరో కాదు.. జీరో అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం హైదరాబాద్  సెంట్రల్ సిటీ 21 వ మహాసభల్లో తమ్మినేని పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ తెచ్చి  కేసీఆర్ ఏమీ సాధించలేకపోయారని ఆరోపించారు. స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ ఏంటో తెలియడానికి 50 ఏళ్లు పట్టిందని.. కేసీఆర్ ఏంటో రాబోయే రోజుల్లో అందరికీ అర్ధం అవుతుందని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలను అడ్డుకుంటున్న శక్తుల ఆగడాలు, ఆటంకాలు అర్ధం చేసుకోవాలని తమ్మినేని అన్నారు. అంతకు ముందు తుకారంగేట్ నుంచి అడ్డగుట్టవరకూ భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున సీపీఎం నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

14:12 - December 13, 2017

హైదరాబాద్ : తెలుగు భాషకు అధికార పార్టీలే విలన్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు భాషపై మాటలు చెప్పడం కాదు...చేతలు కావాలన్నారు. తెలుగు భాష అభివృద్ధికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఏ జీవో అమలు కాలేదన్నారు. తెలుగు భాషా, సాహిత్యం కోసం ప్రభుత్వం చేస్తున్న కృష్టి ఏంటని ప్రశ్నించారు. మహాసభలు, వంటకాలు కాదని... తెలుగు భాషను అమలు చేసి చూపించాలన్నారు. 

18:46 - December 7, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ప్రజలు ఆశించిన విధంగా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ఎస్వీకేలో జరిగిన పొలిటికల్ ఫ్రంట్ సన్నాహక సమావేశంలో తమ్మినేనితో పాటు టీమాస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 119 నియోజక వర్గాల్లో పోటీ చేసేలా..ప్రయత్నం చేయాలన్నారు. జనవరిలో రాష్ట వ్యాప్తంగా ప్రచార జాతాలు, ఆందోళనలు చేపడతామని తెలిపారు. త్వరలోనే ఫ్రంట్‌పై క్లారిటీ వస్తుందని చెప్పారు.


 

20:27 - November 28, 2017

ఖమ్మం : పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తిగా పరిహారం చెల్లించి భూములు తీసుకుంటే అభ్యంతరం లేదన్నారు. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను  బెదిరిస్తూ భూములు తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను తమ్మినేని తప్పు పట్టారు. ఖమ్మం రూరల్‌ మండలం సీపీఎం మహాసభల్లో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. 
 

21:36 - November 26, 2017
22:10 - November 7, 2017

ఖమ్మం : పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని CPM తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణజర్ల మండలం లాలాపురంలో జరిగిన పార్టీ సభకు తమ్మినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా  కేంద్ర, ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ఇవ్వకుండా వ్యాపారులు దోచుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. 

 

12:25 - November 2, 2017

హైదరాబాద్ : 2018 ఏప్రిల్ 18 నుంచి 22వరకు జరుగనున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా నేడు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్యలు హాజరు అయ్యారు. ఈ సండర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనేది కీలక ఎజెండాగా మారాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అంశాలన్నింటినీ ప్రభుత్వం ముందుంచడానికి మహాసభలు ఉపయోగపడతాయన్నారు. మహాసభల విజయవంతానికి అందరూ సహాయసహకారాలు అందించాలని కోరారు.

 

14:02 - November 1, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ ప్రొఫెసర్ కోదండరాం చేస్తున్న దీక్షకు.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగే వరకు ఐక్య పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని తమ్మినేని తెలిపారు.  

13:45 - October 17, 2017

మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు నేటికి 500 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి... చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. 

 

16:27 - October 16, 2017

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయం వద్ద బీజేపి ధర్నాను సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపి ధర్నాలు చేస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యాలయం వద్ద బీజేపి కార్యకర్తలకు పోలీసులు అనుమతి ఇవ్వడాన్ని పక్షపాత చర్యగా తమ్మినేని వ్యాఖ్యానించారు. బీజేపి ఆగడాలను ఆపడానికి అన్ని వర్గాల వారిని ఏకం చేస్తూ పోరాడాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించిందని తమ్మినేని చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై సీపీఎం పోరాడుతుందన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - తమ్మినేని వీరభద్రం