తల్లి

18:58 - June 6, 2018

కామారెడ్డి : జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. తన ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి.. తానూ కూడా సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది సుజాత. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. 

11:25 - May 7, 2018

నిజామాబాద్ : ధర్పల్లి మండలం దుబ్బాకలో విషాదం నెలకొంది. పల్లె చెరువు తండాలో కొడుకును చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అత్త, ఆడపడుచులే హత్య చేశారంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు అత్త ఇంటిపై దాడి చేసి, గుడిసెకు నిప్పుపెట్టారు. భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:44 - February 4, 2018

హైదరాబాద్ : మేడమెట్లు ఎక్కిస్తున్నాడనుకుంటున్న ఈ అమాయకపు తల్లికి తెలీదు.. తన కొడుకు మృత్యువు దగ్గరకు నెట్టేస్తున్నాడని..చితకబాదుతున్నా మౌనంగా భరించిన ఈ తల్లికీ తెలియదు.. తన కొడుకు చితికి చేరవేస్తున్నాడని..కన్నబిడ్డలే తల్లుల పట్ల కర్కశత్వంగా ప్రవర్తించిన ఈ రెండు ఘటనలు దేశ ప్రజల్ని కలచివేశాయి. గుజరాత్‌, రాజస్ధాన్‌లలో ఇద్దరు ఉన్నత విద్యావంతులు తమ తల్లుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. అవసాన దశలో ఉన్న వారికి సపర్యలు చేయాల్సింది పోయి వారిని పొట్టనపెట్టుకున్నారు.గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన ప్రొ.సందీప్‌ తల్లి జయశ్రీబెన్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది సెప్టెంబర్ 27న ఆమె ఇంటి భవనంపై నుంచి కిందపడి చనిపోయింది. ఆరోగ్యం సరిగా లేదన్న బెంగతో తన తల్లి ఆత్మహత్య చేసుకుందని సందీప్ అందర్నీ నమ్మించాడు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులకు వాస్తవం తెలిసింది. సందీప్‌ బలవంతంగా తల్లిని లాక్కెళ్లి మేడపై నుంచి కిందకు తోసేసాడు.

కన్నతల్లిని చిత్రహింసలు పెట్టి
రెండురోజుల క్రితం రాజస్ధాన్‌ రాష్ట్రంలోని అల్వార్‌లో జోగేంద్ర చౌదరి అనే ఉపాధ్యాయుడు కన్నతల్లిని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు. పక్షవాతంతో బాధపడుతున్న జోగేంద్ర చౌదరి తల్లి కొద్దిరోజులుగా అతని వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే జోగేంద్రకు అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో జోగేంద్ర తల్లిని హింసించడం మొదలుపెట్టాడు. ఆ బాధలు భరించలేకపోయిన ఆ తల్లి కన్నుమూసింది. తల్లిని హింసించిన వీడియో బయటకు రావడంతో జోగేంద్ర వ్యవహారం బట్టబయలైంది. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ...కన్నతల్లుల మరణానికి కారకులైన వీరిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. 

16:46 - January 30, 2018

అనంతపురం : జిల్లాలోని లేపాక్షి మండలం నాయినపల్లిలో విషాద ఘటన వెలుగుచూసింది. ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. మృతులు కల్పన(29), మేఘన(6), భవ్య(4) గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:08 - January 19, 2018

అనంతపురం : మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి అని చెప్పడానికి ఇది మరో సంఘటన. తన పేరిట ఉన్న పొలాన్ని అనాథాశ్రమానికి ఇస్తాననడంతో తల్లిని చూడటం మానేశాడు కొడుకు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ సమీపంలోని ముద్దిరెడ్డి పల్లికి చెందిన గంగమ్మకి ముగ్గురు కుతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. గంగమ్మ వృద్ధాప్యంలో ఉండటంతో ఆమె ఆలనా పాలన చూసేందుకు ముగ్గురు కుమారులు తల్లిని పంచుకున్నారు. చిన్న కుమారుడి వంతు రావడంతో పొలాన్ని ఇవ్వలేదన్న కసితో తల్లిని సరిగ్గా చూడటం మానేసాడు. కాలికి గాయమై.. దుర్వాసన వస్తుండటంతో తల్లిని పగలంతా గడ్డివాము వద్ద వదిలేసి.. రాత్రికి ఇంటికి తీసుకెళ్తున్నాడు. కన్న కొడుకు మీద మమకారంతో ఆ తల్లి మాత్రం బాగానే చుసుకుంటున్నాడని తన మాతృత్వాన్ని చాటుకుంటుంది. స్థానికులు మాత్రం చిన్న కుమారుడు ఆస్తి ఇవ్వలేదనే కోపంతోనే అలా చేస్తున్నాడని అంటున్నారు.

07:18 - January 11, 2018

కరీంనగర్ : సవతి తల్లి కర్కశత్వానికి కరీంనగర్‌లో కావేరి అనే పదవతరగతి బాలిక బలైంది. కొందరు గ్రామస్థులతో కలిసి గొంతు నులిమి చంపిన సవతి తల్లి... ఆత్మహత్యగా చిత్రీకరించింది... మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో... స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలితోపాటు... ఆమెకు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

13:52 - December 27, 2017

పాకిస్తాన్ : కులభూషణ్‌ జాదవ్‌తో ములాఖత్‌ వేళ.. ఆయన కుటుంబ సభ్యుల పట్ల... పాకిస్తాన్‌ అధికారులు వ్యవహరించిన తీరుపై.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ సంప్రదాయాన్ని హేళన చేసేలా.. భర్త బతికుండగానే.. జాదవ్‌ భార్య మంగళసూత్రాలను తీయించారని, నుదుటి బొట్టును.. కాళ్ల చెప్పులనూ తీసేయించారని కథనాలు వచ్చాయి. పాక్‌ అధికారుల తీరుపై భారత్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
జాదవ్‌ కుటుంబ సభ్యులకు దారుణ అవమానం..
పాక్‌ జైల్లో జాదవ్‌ నిర్బంధం..పరామర్శకు వెళ్లిన కుటుంబ సభ్యులకు దారుణ అవమానం.. తాళి తీయించి, నుదుటి బొట్టు చెరిపేయించిన పాక్‌ అధికారగణం... గూఢచర్యం కేసులో.. పాక్‌ నిర్బంధించిన కులభూషణ్‌ జాదవ్‌ను... కళ్లారా చూసేందుకు వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతనలకు తీవ్ర అవమానం ఎదురైంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన జాదవ్‌ కుటుంబ సభ్యులు.. తాము ఎదుర్కొన్న అవమానాన్ని.. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వివరించారు. జాదవ్‌తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వక పోగా.. జైల్లోకి అనుమతించే ముందు.. జాదవ్ భార్య చేతన ధరించిన చెప్పులు తీసేసుకున్నారు. అంతేకాదు భారతీయ మహిళలు పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని, నుదుటి బొట్టును తీసేయించారు. అవంతి, చేతనలు స్వయంగా ఈ విషయాలను సుష్మాస్వరాజ్‌కు వివరించారు. 
మాతృభాషలో మాట్లాడేందుకూ అనుమతినిరాకరణ 
కులభూషణ్‌తో మాతృభాషలో మాట్లాడేందుకూ పాక్‌ అధికారులు అనుమతించలేదని, పైగా, తమ దుస్తులు మార్చుకోవాలంటూ బలవంతం చేశారని జాదవ్‌ తల్లి అవంతి, భార్య చేతనలు సుష్మా స్వరాజ్‌ ఎదుట కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వార్తలు వెలుగు చూడడంతో.. పాక్‌ అధికారుల తీరుపై భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 
గతేడాది జాదవ్‌ను అదుపులోకి పాక్‌ సైన్యం  
భారత గూఢచారిగా పనిచేస్తూ, ఇరాన్‌ మీదుగా తమ భూభాగం బలూచిస్థాన్‌లోకి ప్రవేశించాడన్న ఆరోపణలపై జాదవ్‌ను గతేడాది మార్చిలో పాక్‌ సైన్యం అదుపులోకి తీసుకుంది. కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే భారత్ ప్రయత్నం... ఐక్యరాజ్యసమితి చొరవతో, అంతర్జాతీయ న్యాయస్థానం.. జాదవ్‌కు ప్రకటించిన మరణశిక్ష అమలుపై స్టే విధించింది. పాక్‌ జాతిపిత మహమ్మద్‌ ఆలీ జిన్నా జయంతి సందర్భంగా, జాదవ్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులను అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో.. పాక్‌ వెళ్లిన అవంతి, చేతనలను... అద్దం ఆవల ఇంటరాగేషన్‌ రూములో... కెమెరాలు, అధికారుల పహారా మధ్య కూర్చున్న జాదవ్‌తో.. కేవలం టెలిఫోనిక్‌ సంభాషణలకే అనుమతించారు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
భేటీ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు 
మరోవైపు అద్దాల గోడకు అవతల నుంచి జాదవ్‌ నిలబడి ఉండగా, ఇవతల తల్లి, భార్య ఉండి మాట్లాడుతున్న వీడియోను పాక్‌ ప్రభుత్వం విడుదల చేసింది. జాదవ్‌ను కలుసుకొని ఆయన కుటుంబసభ్యులు వెనుదిరిగిన కొద్దిసేపటికే పాక్‌ ప్రభుత్వం వారి భేటీ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. వెనువెంటనే తన తల్లి, భార్యతో ములాఖత్ ఏర్పాటు చేసిన పాకిస్తాన్‌ అధికారులకు జాదవ్‌ 'ధన్యవాదాలు' చెబుతున్నట్టు ఉన్న ఓ వీడియోనూ విడుదల చేసింది. జాదవ్‌ కేసు ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున.. కోర్టు దృష్టిలో మార్కులు కొట్టేసేందుకే పాక్‌ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

20:15 - December 25, 2017

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ జైలులో ఖైదీగా ఉన్న కులభూషణ్‌ జాదవ్‌ను ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. రెండేళ్ల తర్వాత జాదవ్‌ను కలుసుకున్న ఆయన కుటుంబానికి ప్రత్యక్షంగా చర్చలు జరిపేందుకు అనుమతించలేదు. జాదవ్‌కు ఆయన తల్లి, భార్యకు మద్ద పెద్ద గాజు గ్లాస్‌ను గోడ మాదిరి అడ్డంగా ఏర్పాటు చేశారు. జాదవ్‌ భార్యకు ఫోను ద్వారా మాట్లాడేందుకు పాక్‌ అధికారులు అనుమతించారు. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ కార్యాలయంలో 35 నిముషాల పాటు జాదవ్‌తో వీరి సమావేశం జరిగింది. అంతకుముందు జాదవ్‌ భార్య, తల్లి అవంతిక మధ్యాహ్నం 12 గంటలకు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని భారీ భద్రత నడుమ భారత హైకమిషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. జాదవ్‌ కుటుంబ సభ్యులతో పాటు భారత దౌత్యాధికారి కూడా ఉన్నారు. గూఢచర్యం కేసులో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. జాదవ్‌కు మరణ శిక్షను అమలు చేయడంపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. 

10:34 - December 13, 2017

వికారాబాద్ : జిల్లాలోని పరిగి గౌరమ్మకాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కూతుర్ని కాపాడపోయిన తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో కూతురు చనిపోయింది. కుటుంబ కలహాలతో కూతురు అంబిక కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. ఆమెను కాపాడుకుందామని వెళ్లిన తల్లి సుగుణ పరిస్థితి విషమంగా ఉంది. సుగుణ భర్త రవీందర్ రెండేళ్ల క్రితం చనిపోవడంతో టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల కారణంగా  ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

09:30 - December 5, 2017

గుంటూరు : జిల్లా నరసరావుపేటలో విషాదం నెలకొంది. స్థానిక రైల్వేస్టేషన్‌ 3వ గేట్‌ వద్ద గూడ్స్‌ రైలు కిందపడి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నాదెండ్ల మండలం అప్పాపురానికి చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. పిల్లలు దిగ్విజయ్‌,గణేష్ సాయి మార్టూరులో చదువుతున్నారు. మార్టూరు నుంచి పిల్లలను నరసరావుపేట కు తీసుకు వచ్చిన విజయలక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియడంలేదు. కేసు నమోదు చేసిన నర్సరావుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - తల్లి