తల్లిదండ్రులు

12:46 - April 10, 2017

పెద్దపల్లి : మధుకర్‌ మృతదేహానికి మరికాసేపట్లో రీపోస్టుమార్టంకొనాసగుతోంది. పెద్దపల్లి జిల్లా ఖానాపూర్‌లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ చీఫ్‌ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్, మధుకర్‌ తల్లిదండ్రులు,. ఉస్మానియా, కేఎంసీ వైద్యుల బృందం రీపోస్టుమార్టం చేస్తున్నారు. రీపోస్టుమార్టం ప్రక్రియను అధికారులు వీడియో రికార్డు చేయనున్నారు. నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సమర్పించనున్నారు. 

17:00 - February 11, 2017

అమరావతి: తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంవల్లే ఈ స్థాయికి చేరగలిగానని... జస్టిస్‌ రోహిణి చెప్పారు.. ఏ స్కూల్‌లో మనం చదువుకున్నామన్నదికాదని... మన లక్ష్యం ఏంటనేదే ముఖ్యమని స్పష్టం చేశారు..

12:51 - January 28, 2017

నల్గొండ : జిల్లాలో దారుణం జరిగింది. అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సమాజంలో ఆడ పిల్లగా పుట్టడం నేరమైపోయింది. ఆడపిల్లలపై వివక్ష మరోసారి బయటపడింది. కన్నకూతురిని అల్లారుమద్దుగా పెంచాల్సిన తల్లిదండ్రులే కాలయములయ్యారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో పసికందును తల్లిదండ్రులే చంపేశారు. చందంపేట మండలంలో జరిగింది. మూడవత్ శారదకు ఇప్పటికే ఇద్దరు ఆడపల్లిలు, ఒక బాబు ఉన్నారు. ఇటీవలే దేవరకొండ ఆస్పత్తిలో ఆమెకు మరోపాప  జన్మించింది. తల్లి, కూతురు ఆరోగ్యంగా ఉండడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 26న పాపకు వాంతులు వస్తున్నాయని మళ్లీ ఆస్పత్రికి పాపను తీసుకొచ్చారు. వైద్యులు చికిత్స అందించి పంపించారు. ఈనేపథ్యంలో ఇంటికి వచ్చిన అనంతరం ఆరు రోజుల పసికుందును తల్లిండ్రులే హత మార్చారు. గుట్టుచప్పుడు కాకుండా దహనం కూడా చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:08 - January 16, 2017

హైదరాబాద్: లవ్‌.. ఇది ఎక్కడ ? ఎలా పుడుతుందో చెప్పలేం. కొందరు ఫస్ట్‌ లుక్‌లోనే ప్రేమలో పడితే.. మరికొందరు ఎంతో కాలంగా స్నేహం చేసిన తర్వాత ప్రేమించుకుంటారు. అయితే.. వీటన్నింటికి భిన్నంగా ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడ్డారు కర్నూలు జిల్లా అబ్బాయి, అనంతపురం జిల్లా అమ్మాయి. ఇక ఒకరినొకరు వీడి ఉండలేని వాళ్లు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత వాళ్ల జీవితం అనేక మలుపులు తిరిగింది. ఇంతకీ ఏంటా ట్విస్టులు అనుకుంటున్నారా ? అయితే మీరే చూడండి.

హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న రాజేశ్వరి .....

అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రాజేశ్వరి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సాయి ఈశ్వర్‌ కర్నూలులో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వీరిద్దరికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంత అనుబంధం పెరిగింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వయసులో అతనికంటే ఆమె పెద్దదైనా రాజేశ్వరిని సాయి పెళ్లి చేసుకున్నాడు.

సంసారంలో మనస్పర్ధలు .....

అయితే.. కొన్నాళ్లపాటు సవ్యంగా సాగిన సంసారంలో మనస్పర్థలు తలెత్తాయి. రాజేశ్వరికి అంతకుముందే వివాహం జరిగి.. విడాకులు తీసుకుందనే విషయం సాయి ఈశ్వర్‌కు తెలిసింది. ఈ విషయంపై రాజేశ్వరితో గొడవపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సాయిఈశ్వర్ తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చి.. అతనిని కర్నూలుకు తీసుకువెళ్లారు.

కర్నూలుకు వచ్చిన రాజేశ్వరి ....

సాయిఈశ్వర్‌ను వదిల ఉండలేక రాజేశ్వరి కూడా కర్నూలుకు బయల్దేరింది. నువ్వు లేకుండా నేను బతకలేనని సాయిఈశ్వర్‌ను బ్రతిమలాడింది. నువ్వే నా జీవితం అంటూ వేడుకుంది. ఆ తర్వాత చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సాయి ఈశ్వర్‌కు సమాచారమిచ్చారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఈశ్వర్‌.. ప్రేమించిన రాజేశ్వరిని ఆ స్థితిలో చూసి.. చలించిపోయాడు. అంతే.. నీతోనే నా బతుకు అంటూ హామీ ఇచ్చాడు. మళ్లీ ఎప్పుడూ నిన్ను వీడను అంటూ శపథం చేశాడు.

రాజేశ్వరిని కోడలుగా ఒప్పుకునేందుకు నిరాకరిస్తున్న సాయి తల్లిదండ్రులు....

అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్‌ ఏర్పడింది. రాజేశ్వరిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోడలిగా చేసుకునేందుకు సాయి ఈశ్వర్‌ తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. దీంతో ఏమీ చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు సాయి ఈశ్వర్‌. ఓ వైపు పెంచిన తల్లిదండ్రులు, మరోవైపు పెళ్లి చేసుకున్న భార్య. మరి తల్లిదండ్రులను ఒప్పించి.. తన ఫేస్‌బుక్‌ ప్రేమను ఎంతవరకు నిలుపుకుంటాడో చూడాలి.

16:07 - January 11, 2017

నల్లగొండ : జిల్లాలో దారుణం జరిగింది. నందకుమార్‌ అనే వ్యక్తి ఆరుగురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా చిన్నారులపై అత్యాచారానికి పాల్పిడినట్లు తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన టీచర్లు.. విద్యార్థినుల తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు నందకుమార్‌ను చితకబాదారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థినులు గిరకబావిగూడెం సుందరయ్య కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.

22:32 - January 8, 2017
07:45 - November 27, 2016

కోలీవుడ్ హీరో, సూపర్ స్టార్ 'రజనీకాంత్' అల్లుడు 'ధనుష్' వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఇతనిపై కోలీవుడ్ లో చర్చ జరుగుతోందంట. 'ధనుష్' తమ కొడుకేనంటు ఓ వృద్ధ దంపతులు కోర్టుకు హాజరు కావడం కలకలం సృష్టిస్తోంది. కోర్టు విచారణ చేపట్టి జనవరి 12వ తేదీన కోర్టుకు స్వయంగా హాజరు కావలంటూ 'ధనుష్' కు నోటీసులు పంపింది. గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. 'ధనుష్' వివాహ సమయంలో తమ కుమారుడని..అతడిని తమకు అప్పగించాలంటూ ఆరోపణలపై 'ధనుష్' తండ్రి కస్తూరి రాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా 'ధనుష్' తమ కుమారుడంటూ మధురై జిల్లాకు చెందిన దంపతులు కోర్టును ఆశ్రయించారు. మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఆ.మలంపట్టికి చెందిన కదిరేశన్‌, మీనాళ్‌ దంపతులు మేలూరు మేజిస్ట్రేట్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. 'ధనుష్‌' తమ కుమారుడని, అతని అసలు పేరు కలైసెల్వన్‌ కాగా చిన్నప్పుడు చదువుకోలేదని మందలించడంతో సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని అందులో పేర్కొన్నారు. 'ధనుష్‌' తమ కుమారుడేనని చెప్పడానికి పలు ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. వృద్ధులైన తమకు 'ధనుష్‌'తో నెలకు రూ. 65వేలు జీవనభృతిని ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. నిజంగా వీరు 'ధనుష్' తల్లిదండ్రులేనా ? కాదా ? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. 

13:04 - October 19, 2016

హైదరాబాద్‌ : నగరంలోని ఎర్రగడ్డలోని డాన్‌బాస్కో స్కూల్‌ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంచిన స్కూల్‌ ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సేవా ముసుగులో స్కూల్‌ యాజమాన్యం విరాళాలు సేకరించి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌కు తరలించారు. 

06:32 - August 20, 2016

రియో ఒలపింక్స్ లో తెలుగు తేజం పి.వి సింధు వెండి వెలుగులో భారత్ సంబురాల్లో మునిగిపోయింది. ఒలంపిక్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రవేశించి చరిత్ర సృష్టించిన సింధు. సిల్వర్ మెడల్ తో భారత క్రీడారంగంలో నూతన శకానికి శ్రీకారం చుట్టింది. పి. వి సింధు సాధించిన ఈ ఘనత పట్ల ఒకపక్క యావత్ దేశం గర్విస్తుంటే..మరోపక్క పి.వి సింధు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పి.వి సింధు సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే వారి ఆనందం రెట్టింపయ్యేది. ఎట్టకేలకు ఫైనల్ లో ప్రపంచ నంబర్ వన్ మారిన్ కు గట్టిపోటినించిన తమ కూతురు ఆటను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. తమ కూతురు సిల్వర్‌ మెడల్‌ను సాధించడంతో పట్టలేని సంతోషంలో పి.వి సింధు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మునిగితేలారు.

బాగా ఆడిందన్న సింధు తండ్రి..
సింధు చాలా బాగా ఆడిందని, చివరి వరకు పోరాడిందని ఈమె తండ్రి రమణ అన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్‌కు వెళ్ళడం గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరింత సమర్ధవంతంగా ఆడి స్వర్ణం సాధించాలని ఆయన అన్నారు. కోచ్ గోపీచంద్, సహకరించిన అందరికి రమణ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తన కూతురు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయుల విశ్వాసాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని, అయితే ప్రత్యర్థిపై తొలి గేమ్ సింధు గెలిచినా ఆమెపై గెలుపు అంత సులువుకాదని మరోసారి పీవీ రమణ ప్రస్తావించారు.

ఫైనల్లో సింధు కాస్త నెర్వస్‌గా ఆడింది- తల్లి విజయ..
బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు కాస్త నెర్వస్ గా కనిపించిందని ఆమె తల్లి విజయ అన్నారు. కచ్చితంగా సింధు స్వర్ణం నెగ్గుతుందని భావించామని, అయితే అనవసర తప్పిదాలు చేయడం వల్లే సింధు స్వర్ణం సాధించలేక పోయిందని పేర్కొన్నారు. సింధు 'శారీరకంగానూ కాస్త అలసిపోవడం తన ఆటపై ప్రభావం చూపింది. మొదట్లో మెరుగ్గానే ఆడినా చివరికొచ్చే సరికి కాస్త టెన్షన్ పడ్డట్లు కనిపించింది. మరో ప్రయత్నంలో కచ్చితంగా ఒలింపిక్ స్వర్ణం నెగ్గుతుంది' అని సింధు తల్లి విజయ ఆశాభావం వ్యక్తం చేశారు.

బాగా ఆడితే బాగుండేది - గోపిచంద్ సతీమణి..
ఒలంపిక్స్ లో రజతం సాధించిన సింధుకు ఆమె కోచ్‌ గోపీచంద్‌ సతీమణి లక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్‌ మ్యాచ్‌లో మరికొంత బాగా ఆడితే బావుండేదని లక్ష్మి అభిప్రాయపడ్డారు. పి.వి సింధు ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించటం పట్ల ఆమె సోదరి దివ్య ఆనందం వ్యక్తం చేసింది. పి.వి సింధు సాధించిన ఈ రజతం పతకం వెనుక తమ తల్లిదండ్రులు, కోచ్ గోపిచంద్ కృషి ఎంతగానో ఉందని ఆమె తెలిపింది. రియో ఒలంపిక్స్ లో ఫైనల్ మ్యాచ్ లో ఓడినప్పటికీ రజతం సాధించి భారత్ ప్రతిష్టను విశ్వయవనికపై నిలిపిన సింధు కుటుబంసభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బివుతున్నారు. స్వర్ణం పతకం సాధిస్తే ఈ ఆనందం రెట్టింపయ్యేదిగా కనిపిస్తోంది. అయినప్పటికీ రజత పతకాన్ని అందించి సింధు దేశం గర్వించేలా చేసింది. 

19:54 - August 17, 2016

Pages

Don't Miss

Subscribe to RSS - తల్లిదండ్రులు