తాజ్ మహల్

14:26 - December 10, 2018

ఉత్తరప్రదేశ్ : అద్భుతమైన..అపురూప కట్టడం తాజ్ మహల్. తాజ్ మహల్ నిర్మాణం గురించి గానీ..అలనాటి ఆర్కిట్రెక్చర్ గురించి గానీ ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కట్టడాన్ని చూస్తే అదొక సమాధి అని ఎవరికి అనిపించదు. హుందా తనానికి..చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా కనింపించే ఈ తాజ్ మహల్ ను ఇకపై చూడాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే. అదేమిటి అనుకుంటున్నారా? అంతేమి? అపురూపాన్ని చూడాలంటే బారీ రుసుము చెల్లించుకోవాల్సిందేనట. 
దేశీయ టూరిస్టులకు ఇప్పటి వరకు ఎంట్రీ టికెట్ రూ. 50గా ఉంది. ఈరోజు నుంచి మనం రూ. 250 చెల్లించాలి. విదేశీ టూరిస్టుల టికెట్ ధర రూ. 1,300లకు పెరిగింది. అంటే అదనంగా రూ. 200 చెల్లించాలి. పెరిగిన ధరలు డిసెంబర్ 10 నుండే అమల్లోకి వచ్చాయి. 
ఇక సార్క్ దేశాల నుంచి వచ్చే టూరిస్టుల టికెట్ ధర రూ. 540 నుంచి రూ. 740కి పెరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చీఫ్ ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణాకర్ ఈ వివరాలను వెల్లడించారు. రూ. 50 టికెట్ తీసుకున్న వారిని తాజ్ మహల్ ప్రధాన ప్రాంతం వద్దకు అనుమతించమని... తాజ్ ను వెనుకవైపు ఉన్న యమునా నది ముందు నుంచి వీక్షించేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.
 

15:20 - November 24, 2018

అమరావతి: ఏపీ అసెంబ్లీ భవనం డిజైన్‌ అద్భుతంగా ఉందని టీడీపీ నేతలు అంటుంటే.. అంత సీన్ లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. తాజాగా అసెంబ్లీ డిజైన్‌ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేసిన అసెంబ్లీ భవనం డిజైన్ ఇడ్లీలు పెట్టే స్టాండ్‌లా కనిపిస్తోందని గతంలో విమర్శలు వచ్చాయని.. దీంతో దాన్ని బోర్లించిన లిల్లీ పువ్వు ఆకారంలోకి మార్చారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్న నయా తాజ్ మహల్ ఇదేనని సెటైర్ విసిరారు.  

‘అసెంబ్లీ భవనం డిజైన్‌ ఇడ్లీ స్టాండ్‌లా కనిపిస్తోందని విమర్శలు రావడంతో దానిని బోర్లించిన లిల్లీ ఆకృతిలోకి మార్చారంట. నాయుడు బాబు చెబుతున్న నయా తాజ్‌మహల్‌ ఇదేనేమో. తాజ్‌ను తలదన్నేలా కట్టినా.. తాజ్‌ చారిత్రక విశిష్టతను ఏదీ అధిగమించలేదన్న ఇంగితం లేదాయె!’ అని తన ట్విట్టర్ ఖాతాలో విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.

17:41 - July 11, 2018
16:47 - July 11, 2018

ఢిల్లీ : తాజ్‌మహల్‌ సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌మహల్‌ను రక్షించండి... లేదా మూసేయండి... లేదా ధ్వంసం చేయండని కోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్‌ను కాపాడుకోవాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కన్నా తాజ్‌మహల్‌ ఎంతో అందమైనదని.. దీన్ని సంరక్షిస్తే భారత్‌కున్న విదేశీ కరెన్సీ లోటు భర్తీ చేయొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశ సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న ఏకైక కట్టడం తాజ్‌మహల్‌... అలాంటి తాజ్‌ను మీరు పట్టించుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌ ట్రాపెజియమ్‌ జోన్‌ పరిధిలోని పరిశ్రమలను ఎందుకు మూయించడం లేదని టిటిజెడ్‌ ఛైర్మన్‌ను ప్రశ్నించింది. టిటిజెడ్‌ పరిధిలో కొత్త ఫ్యాక్టరీలకు అనుమతించమని ఛైర్మన్‌ కోర్టుకు హామీ ఇచ్చారు.

06:51 - May 25, 2018

ఢిల్లీ : ప్రపంచంలోని ప్రజాదరణ పొందిన కట్టడాల్లో తాజ్‌ మహల్‌ ఆరవస్థానం పొందింది. ఆగ్రాలోని ఈ చారిత్రాత్మక కట్టడం ఆసియాలో రెండోస్థానంలో నిలిచింది. మొగలుల శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన తాజ్‌మహల్‌ యాత్రపై ట్రిప్‌ అడ్వయిజరీ సంస్థ ఆన్‌లైన్‌లో సలహాలు ఇస్తోంది. ట్రావెలర్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌ 2018కి గాను ఈ సంస్థ ఎంపికైంది. అద్భుత పాలరాతి కట్టడాన్ని వర్ణిస్తూ గత 12 నెలల్లో ప్రజలు ఈ కంపెనీ సైట్‌లో ఎన్నో సమీక్షలు, మరెన్నో లేఖలు రాయడం ద్వారా రేటింగ్‌ ఇచ్చారు. ఈ రేటింగ్‌ ఆధారంగా తాజ్‌మహల్‌కు ఈ సంవత్సరం సూచిలో చోటు దక్కింది. ఈ పురస్కారం కోసం 68 దేశాల నుంచి 759 స్మారక చిహ్నాలు వచ్చాయి. వీటిలో 10 స్మారక చిహ్నాలను ఎంపిక చేయగా....అందులో కంబోడియాకు చెందిన అంకోర్‌వాట్‌ మందిరం ప్రథమ స్థానంలో నిలిచింది. జయపూర్‌కు చెందిన ఆమెర్‌ కోట, అమృత్‌సర్‌లోని స్వర్ణ మందిరానికి కూడా చోటు దక్కింది. 

17:21 - December 30, 2017
15:11 - December 30, 2017

హైదరాబాద్ : తాజ్ మహల్ హోటల్ లో పనిచేస్తున్న ఓ బాలుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం జరిగిన ఈ ఘటనను హోటల్ యాజమాన్యం గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన నారాయణగూడలో చోటు చేసుకుంది. కానీ హోటల్ యాజమాన్యం మాత్రం బాలలను పనిలో ఎందుకు పెట్టుకుందనేది తెలియడం లేదు.

ఒడిషా రాష్ట్రానికి చెందిన లాచయ్య అనే బాలుడు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీసీ టివి కెమెరా ఫుటేజ్ లో ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడడానికంటే ముందు అక్కడ ఇతర వారు కూడా ఉన్నారు. అందరూ మాట్లాడుతుండగా...లాచయ్య లేచి అమాంతం పై నుండి కిందకు దూకేసినట్లు దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. అక్కడ పనిచేస్తున్న వారు బాలలే అని తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రి నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

07:35 - October 20, 2017

దేశంలో సంస్కృతిక విధ్యసం జరిగే పరిస్థితి పెరిగిందని, దీంతో ప్రజల్లో భావోద్వేగాలు సృష్టించి ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారని, తాజ్ మహల్ గురించి మాట్లాడుకొవడం కాదు దేశం అభివృద్ధి చెందడం ముఖ్యమని ప్రముఖ విశ్లేషకులు వీరయ్య అన్నారు. తాజ్ మహల్ మతానికి సంబంధం లేదని, బీజేపీ పార్టీ దాన్ని టూరిజం నుంచి తీసివేయాలేదని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:02 - October 17, 2017

ఢిల్లీ : ప్రపంచంలోనే ప్రేమికులకు చిహ్నంగా నిలిచిన అద్భుతకట్టడం తాజ్‌మహల్‌కు కమలనాథులు మతం రంగు పులుముతున్నారు. తాజాగా.. తాజ్‌ మహల్‌ని దేశద్రోహులు కట్టారని బిజెపి నేత సంగీత్‌ సోమ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంఐఎం ఘాటుగా స్పందించింది.  ఎర్రకోటను కూడా దేశద్రోహులే నిర్మించారని...అక్కడ ప్రధాని జెండా ఎగురవేయకుండా ఉంటారా అని ఎంఐఎం నేత ఒవైసీ బిజెపిని ప్రశ్నించారు. 

మొగల్ చరిత్రకు తార్కాణంగా నిలిచిన అద్భుత కట్టడం తాజమహల్‌ను బిజెపి వివాదాస్పదం చేస్తోంది. ఆగ్రాలో షాజహాన్‌ నిర్మించిన ఈ పాలరాతి సౌధాన్ని చూస్తే...ఎవరైనా మైమరచి పోవాల్సిందే...ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులకు చిహ్నంగా నిలిచిన తాజ్‌మాహల్‌కు కమలనాథులు మతం రంగు పులిమే యత్నం చేస్తున్నారు.

తాజాగా... తాజ్‌మహల్‌ కట్టడం...భారతీయ సంస్కృతికి ఓ మచ్చ లాంటిదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత సంగీత్ సోమ్ అన్నారు.  తాజ్‌మహల్‌ను దేశద్రోహులు కట్టారని ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  అసలు మనం ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం... తాజ్‌ను కట్టిన షాజహాన్ తన తండ్రిని చెరశాలలో వేశాడు, హిందువులను ఊచకోత కోయాలని చూశాడు... నిజంగా ఇదే చరిత్ర అయితే... దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు. 

తాజ్‌ మహల్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ''ఎర్రకోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారని,  ఆ కోటపై జెండా ఎగురవేయకుండా ప్రధాని నరేంద్రమోదీ ఉంటారా''.... ''తాజ్‌ మహల్‌ను చూడొద్దని పర్యాటకులకు మోదీ, యోగి చెప్పగలరా'' అని ఓవైసీ ప్రశ్నించారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ను కూడా దేశద్రోహులే కట్టించారు..ఇందులో విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వరా...అని ఓవైసీ మండిపడ్డారు.

తాజ్‌మహల్‌పై తమ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ చేసిన వ్యాఖ్యలపై యోగి ప్రభుత్వం స్పందించింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని యూపీ మంత్రి రీటా బహుగుణ జోషి ప్రకటన చేశారు. తాజ్‌ మహల్‌ వారసత్వ కట్టడాల్లో ఒకటని యోగి ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి నేత సంగీత్‌ సోమ్‌ వివాదస్పద నేతగా పేరొందారు. 2013లో ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్ల వెనుక సంగీత్‌ సోమ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ హింసలో సుమారు 60 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌  ప్రభుత్వ యూపీ టూరిజం బుక్‌లెట్ నుంచి తాజ్‌మహల్‌ను తీసివేసిన విషయం తెలిసిందే. పర్యాటకశాఖ ప్రచురణ నుంచి తాజ్‌ను తొలగించడంపై పెద్ద దుమారం రేగడంతో ప్రభుత్వం దిగివచ్చింది. టూరిజం బుక్‌లెట్ తయారీలో పొరపాటు జరిగినట్లు వివరణ ఇచ్చుకుంది. 

11:56 - October 5, 2017

తాజ్ మహల్...ప్రపంచంలో తాజ్ మహల్ అంత అందమైన కట్టడం ఇంకోటి లేదనడంలో సందేహం లేదు. తాజ్ మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక, అమూల్యమైన ప్రేమ చిహ్నంగా అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది. తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా కట్టించాడని చరిత్ర చెబుతోంది. ఈ అత్యంత అద్భుతమైన కట్టడాన్ని చూడటానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఎంతో మంది ఇక్కడకు విచ్చేస్తుంటారు. ఈ కట్టడాన్ని చూస్తూ మైమరచిపోతుంటారు.

తాజ్ మహల్ ను చూడటానికి గురువారం చాలా మంది విచ్చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రోజు శరద్ పూర్ణిమ కావడం..చంద్రుడు నిండుగా వెండి వెలుగులను విరజిమ్మనుంది. తాజ్ మహల్ పాలరాళ్లపై పడే చంద్రుని వెలుగులను చూడటానికి చాలా మంది వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆగ్రాకు దేశ..విదేశీ పర్యాటకులు క్యూ కట్టారంట. నేటి రాత్రి 8.30 నుండి పున్నమి చంద్రుడి కాంతులను చూడవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

అయితే ఇంతటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ తాజ్ మహల్ పై యూపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 'యోగి సర్కార్' వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటోంది. పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్‌మహల్‌ పేరు పేర్కొనలేదు. తాజ్‌ మహల్‌ను తొలగించి ఆ స్థానంలో యోగి ఆదిత్యనాథ్‌ అధిపతిగా ఉన్న గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని చేర్చిన విషయం తెలిసిందే. దీంతో యోగి సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగానే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే యూపీ మాజీ మంత్రి ఆజంఖాన్ తాజ్ మహల్ పై పలు కామెంట్స్ చేశారు. ఈ కట్టడాన్ని కూల్చివేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించడం వల్ల మరింత ఆదాయం పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - తాజ్ మహల్