తీర్పు

17:52 - July 10, 2018

హైదరాబాద్ : పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలని డిమాండ్‌ చేశారు. 

20:32 - July 4, 2018

కేంద్ర, రాష్ర్టాల అధికార పోరుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.  లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రభుత్వం కలిసికట్టుగా పని చేయాలని,  లెఫ్టినెంట్ గవర్నర్‌ యాంత్రికంగా పని చేయకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవొద్దని ఆదేశించింది. ఢిల్లీ పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్‌ జోక్యంపై ఆప్‌ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం ఈ తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, ఆప్ నేత సుదర్శన్, టీడీపీ నేత మాల్యాద్రి, టీఆర్ ఎస్ నేత దేవిప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని వక్తలు అన్నారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

17:49 - July 4, 2018

ఢిల్లీ : ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారం ఉంటుందని, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్ స్వాగతించింది. ఇది చారిత్రాత్మక విజయమని డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా ఎల్జీ అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తమకు ఎంతో ఊరట నిచ్చిందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజలే సుప్రీమ్‌ అని చెప్పిన సుప్రీంకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారం ఉంటుందని ఎల్జీకి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉండవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని మనీష్‌ సిసోడియా పేర్కొన్నారు.

16:46 - July 4, 2018

ఢిల్లీ : కేంద్ర, రాష్ర్టాల అధికార పోరుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.  లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రభుత్వం కలిసికట్టుగా పని చేయాలని,  లెఫ్టినెంట్ గవర్నర్‌ యాంత్రికంగా పని చేయకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవొద్దని ఆదేశించింది. ఢిల్లీ పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్‌ జోక్యంపై ఆప్‌ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం ఈ తీర్పును వెలువరించింది. 

 

15:29 - June 18, 2018

హైదరాబాద్ : మక్కా మసీద్‌ బ్లాస్ట్‌ కేసులో.. తుదితీర్పు ప్రకటించిన న్యాయమూర్తి రవీందర్‌ రెడ్డి ఇటీవల స్వచ్చంద పదవీ విరమణ ప్రకటించారు... ఇవాళ రవీందర్‌ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం హైదరాబాద్‌ నాగోల్‌లోని కళ్యాణ లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్‌, ఎమ్మెల్సీ రామచందర్‌ రావుతో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 24 ఏళ్లుగా న్యాయమూర్తి గా సేవలు అందించి స్వచ్చంద పదవీ విరమణ పొందుతున్న రవీందర్‌ రెడ్డిని పలువురు అభినందించారు. పదవీ విరమణ అనంతరం న్యాయమూర్తులపై ఏసీబీ సోదాలు చేయడం తనను కలిచివేసిందన్నారు జడ్జి రవీందర్‌రెడ్డి. ఇకపై తన శేష జీవితం ప్రజాసేవకు అంకితం చేస్తానన్నారు. 

19:36 - May 25, 2018

బీహార్ : 2013 బుద్ధ గయ వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చింది. హైదర్ అలీ వురపు బ్లాక్ బ్యూటీ, ఇంతియాజ్ అన్సారీ, ఉమర్ సిద్ధికి, అజారుద్దీన్ ఖురేషీ, ముజిబుల్లా అన్సారీ నేరం చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 31న కోర్టు వీరికి శిక్షను ఖరారు చేయనుంది. 2013 జూలై 7న పవిత్ర బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు చేరిన సమయంలో వరుసగా 9 సార్లు  పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఓ టిబెటన్‌ సాధువు, భక్తుడు గాయపడ్డారు. సిమి ఉగ్రవాదులే పేలుళ్లకు పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ ఆరోపించింది. మయన్మార్ సైన్యం రొహింగ్యా ముస్లింలను హత్య చేసినందుకు ప్రతీకారంగా సిమి బౌద్ధుల పవిత్ర క్షేత్రంపై దాడి చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో ఎన్‌ఐఏ 90 మంది సాక్షులను ప్రవేశపెట్టింది.

 

08:54 - May 3, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో వాదనలు ముగిశాయి.ఈ కేసులో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డివిజన్‌ బెంచ్‌కి అప్పీల్‌ చేశారు. పిటిషనర్ల తరుపున వైద్యనాథన్‌  వాదనలు వినిపించారు.  కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ తరుపున అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. పిటిషన్‌ వేసిన 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పార్టీ ఫిరాయించిన వారేనని, ఇలాంటి వారు కేసు వేసే అర్హతలేదని సింఘ్వి వాదించారు. అయితే  సభలో సభ్యులకు కేసు వేసే అర్హత ఉందని వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వు చేసింది. 
 

 

21:02 - April 25, 2018

ఢిల్లీ : 16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మిక గురువు ఆశారాంకు జీవిత ఖైదు పడింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ జోద్‌పూర్‌ కోర్టు తీర్పు చెప్పింది. మధ్యప్రదేశ్‌ చింద్యారాలో యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపు దోషిగా ఉన్నారు. ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ జోద్‌పూర్‌ కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు రమేష్, ఆదిశంకరాచార్య బంగారయ్య శర్మ, పీవోడబ్ల్యు నేత సంధ్య, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు శ్రీనివాసబంగారయ్య శర్మ పాల్గొని, మాట్లాడారు. మోసపూరిత బాబాలను నమ్మవద్దన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:36 - April 18, 2018

భద్రాచలం : కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం, స్పీకర్‌లకు తమ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. భద్రాచలంలో సీతారామ స్వామిని దర్శించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న హామీని కేసీఆర్ మరిచిపోయారని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చని తర్వాత కూడా భద్రాచలం అభివృద్ధికి నోచుకోలేదని...గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం వదలటం లేదని ఉత్తమ్ ఆరోపించారు. భద్రాచలం ప్రస్తుతం అక్రమ ఇసుక దందాకు మారు పేరుగా మారుతుందని.. ప్రజల సొమ్ముని, సహజ వనరులను అడ్డంగా దొచుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. 

21:27 - April 17, 2018

హైకోర్టులో కేసీఆర్‌ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దును కోర్టు కొట్టేసింది.  ఇద్దరి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, అడ్వకేట్ వి.ఆర్ మాచవరం పాల్గొని, మాట్లాడారు. హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు
అని అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని..నియంతలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆ ప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - తీర్పు