తీర్మానం

18:48 - February 13, 2018

ఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నుంచి 21 వ తేదీ వరకు సీపీఎం జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించే రాజకీయ తీర్మానం ముసాయిదాను పార్టీ నాయకలు విడుదల చేశారు. 80 పేజీల తీర్మానంపై డివిజన్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చిస్తారు. అంతర్జాతీయ, జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్‌ పోరాటాలు, సీపీఎం రాజకీయ పంథా... తదితర అంశాలను ముసాయిదాలో చేర్చారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

14:14 - December 2, 2017
21:30 - November 22, 2017
12:37 - November 20, 2017

ఢిల్లీ : సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. రాహుల్ ను అధ్యక్షుడిగా చేయాలని పార్టీ తీర్మానించింది. రెండో నామినేషన్ రాకపోతే డిసెంబర్ 4న రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి మన్మోహన్ సింగ్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. రాహుల్.. 2004 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అమేథి నుంచి ఎంపీగా ఉన్నారు. 
అధ్యక్షుడి పదవికి రాహుల్ గాంధీని వ్యతిరేకించే వారు ఎవరూ లేరు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:51 - August 14, 2017

విజయవాడ : విజయవాడలో కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు మంత్రివర్గంలోని కాపు మంత్రులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాపు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాపుల రిజర్వేషన్లు, జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ నివేదిక, ముద్రగడ పద్మనాభం పాదయాత్ర, ఈవర్గం రిజర్వేషన్లపై వైసీపీ, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రకటనలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. బీసీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

తర్వలో కాపు భవన నిర్మిణం
తర్వలో కాపు భవనాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు. కాపు సామాజిక వర్గాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, కాపుల రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌... గుంటూరు లో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఈ అంశంపై ఎందుకు తీర్మానం చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో ఎందుకు చేర్చలేదో చెప్పలాని నిలదీశారు. అన్ని విధాల వెనుకబడి ఉన్నామన్న భావనతో ఉన్న కాపులను విద్య, ఉద్యోగ, ఆర్థికపరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్న విషయాన్ని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కాపులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీల నేతల మాటలు విశ్వసించొద్దని, ఇటువంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

08:37 - July 26, 2017

రాజన్నసిరిసిల్ల : వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ వద్దు... 9 గంటల కరెంటే ముద్దు అంటున్నారు  అక్కడి గ్రామ రైతులు... అంతటా .. కరెంటో రామచంద్రో అంటూ  అరుస్తుంటే... ఆ  రైతులు మాత్రం ... 24 గంటల కరెంట్‌ వద్దు అని వేడుకుంటున్నారు. దీనికోసం తీర్మానం కూడా చేశారు. 
9 గంటల విద్యుత్‌ అందించాలని తీర్మానం  
ఎక్కడైనా.. రైతులు 24 గంటల విద్యుత్ కావాలని డిమాండ్‌ చేస్తారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంట్లలో పరిస్థితి దీనికి భిన్నం. తమకు పగటపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని  కోరుతూ తీర్మానించారు. ఆ తీర్మాన ప్రతులను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రభుత్వానికి  అందించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.  
భూగర్భ జలాలపైన ఆధారపడి వ్యవసాయం 
గ్రామానికి ఎటువంటి నీటి వనరులు లేకపోవడం వల్ల... భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చే‌స్తున్నారు ఇక్కడి రైతులు. అయితే 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడంతో నీటిని ఇష్టానుసారం వాడుతున్నారని.. దాంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ కారణంగా తొమ్మిది గంటల కరెంట్ తమకు సరిపోతుందని రైతులు చెబుతున్నారు. 
చిన్న కుంటల్లో నీరు ఉండేలా కృషి అవసరం
తొమ్మిది గంటల కరెంట్‌తో పాటు... పరిసర ప్రాంతాల్లోని చిన్న చిన్న కుంటల్లో నీరు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుకుంటున్నారు. గ్రామానికి ఓ పక్కన లోతువాగులో చెక్‌ డ్యాంలు, ఊరి పైభాగాన ఉన్న మైసమ్మ చెరువుకు మరమ్మతులు  చేయాలని కోరుతున్నారు. అలాగే ఎర్రకుంట వి‌స్తీర్ణాన్ని పెంచి అందులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు.  ఊరికి సమీపంలో ఉన్న పెద్ద బోరుగుట్ట మెట్టు గుట్టల మధ్యన చెక్‌ డ్యాంను నిర్మిస్తే గ్రామంలో భూగర్భ జలాలు పెరుగుతాయంటున్నారు. భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుని... ఆ తర్వాత.. 24 గంటలు కరెంట్‌ ఇస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. 

 

15:32 - March 24, 2017

అమరావతి : తండ్రి బుద్ధలతో పాటు తాత బుద్ధులు కూడా విపక్ష నేతకు వచ్చాయని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని నిరసిస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం పై ఆయన మాట్లాడుతూ... స్పీకర్ పై ఏ హక్కుతో అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెడతారని ప్రశ్నించారు.

11:20 - March 14, 2017

విజయవాడ : అసెంబ్లీలో భూమా నాగిరెడ్డికి సంతాపం ప్రకటించేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ రాకపోడాన్ని అధికార టిడిపి తప్పుపట్టింది. శాసనసభలో దుష్ట సంప్రదయానికి జగన్‌ తెర తీశారని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

వైసీపీ వాకౌట్ చేయడం దారుణమన్న బోండా..
ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపే అపార అనుభవమున్న రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి అని బొండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. భూమా నాగిరెడ్డితో కలిసి పనిచేయడం జీవితంలో మరుపురానిదన్నారు. భూమాకు సంతాపం తెలిపే సమయంలో వైసీపీ వాకౌట్‌ చేయడం వారి రాక్షస మనస్తత్వం బయటపడుతుందన్నారు.

మానవ ధర్మాన్ని మరిచిపోయారు - ధూళిపాళ్ల..
కర్నూలు జిల్లా రాజకీయాల్లో తన దైన ముద్ర కనబరిచిన నేత భూమా నాగిరెడ్డి అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తమ ప్రాంత అభివృద్ధికి రాజీలేని పోరాటం చేసి.. ప్రజాభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. తండ్రి ఆశయాల సాధన కోసం కూతురు అఖిలప్రియ పనిచేయాలన్నారు. వైసీపీ సభ్యులు కనీస మానవ ధర్మాన్ని కూడా మరిచిపోయారని ఆక్రోశించారు.

ఆక్షేపించిన బీజేపీ..
భూమా నాగిరెడ్డికి సంతాపం ప్రకటించేందుకు అసెంబ్లీకి హాజరకాని ప్రతిపక్ష నేత జగన్‌ తీరును బీజేపీ ఆక్షేపించింది. ఈ విషయంలో జగన్‌ కుసంస్కారం మరోసారి బయటపడిందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.

11:57 - August 16, 2016

హైదరాబాద్ : 'కదిలితే లాఠీ ఛార్జీలు..అణిచివేత, బురద జల్లడం ద్వారా సమస్యను పరిష్కరించాలని సర్కార్ అనుకొంటొంది..గత ప్రభుత్వ విధానాలే ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది' అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎస్వీకేలో సీపీఎం ప్లీనం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఆయన రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ప్రసంగించారు.

బంగారు తెలంగాణ ఎలా సాధ్యం..?
ఆర్థిక, సామాజిక స్థితి గతులను మార్చడం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యమని, కానీ నినాదాలు చేయడం..ఏదో చెప్పడం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రం కాబట్టి ఆర్థిక ప్రమాణాలు పెరగాలని ఆకాంక్షించారు. మూడున్నర కోట్ల మందిలో 92 శాతం ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలున్నారని తెలిపారు. 90 శాతం వ్యవసాయ కార్మికులు, దళితులు, మధ్య తరగతి, చిన్న పరిశ్రమల్లో పని చేసే కార్మికులున్నారని తెలిపారు. 85 శాతం పూర్తిగా పేదరికంలో ఉండడం...బలహీన కులాల్లో ఉండడం వాస్తవ పరిస్థితి ఉందన్నారు. వీరు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధిస్తామనడం ఎలా అని ప్రశ్నించారు.

మూడెకరాల భూమి ఎక్కడ ? విద్య.వైద్య రంగం పరిస్థితి ఏంటీ ? 
దళితులు..గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి తొలుత కొంత భూమి ఇచ్చారని, ప్రస్తుతం ఆ మాటే మరిచిపోయారని విమర్శించారు. సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కొంటున్నారని, దళితులు, గిరిజనులకు ఇచ్చే హామీలు అమలు జరగగడం లేదన్నారు.
అంతేగాకుండా విద్య, వైద్యం రంగాలపై నిర్లక్ష్యం కనబరుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య రంగం ఏ పరిస్థితి నెలకొందని ప్రశ్నించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ రంగం వృద్ధి చెందుతోందని, వేలకొద్ది పాఠశాలలు మూసివేస్తున్నారని, ఫీజుల నియంత్రణ లేని పరిస్థితి నెలకొందన్నారు. విద్య..వైద్యం గురించి ఏ మాత్రం శద్ధ తీసుకోవడం లేదన్నారు. ప్రైవేటు సెక్టార్ పై నియంత్రణ చేయడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం చెప్పారని, నోటిఫికేషన్ లు విడుదల చేయడం లేదని...నిరుద్యోగుల్లో పెద్ద అలజడి నెలకొందన్నారు.

ప్రాజెక్టుల అంచనాలు పెంచేస్తున్నారు..
కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని చెబుతున్నారని, ఏ ప్రాతిపదికన నీళ్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆర్థికంగా దోచుకోవడానికి ప్రాజెక్టుల డిజైన్ లున్నాయని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలు రూ. 85వేల కోట్లకు పోయిందన్నారు. నీళ్లు రైతులకు ఇస్తున్నారా ? లేదా అనేది నిమిత్తం లేకుండా అంచనాలను అమాంతం పెంచేస్తున్నారని విమర్శిస్తున్నారు. దుమ్ముగూడెంలో చేస్తున్న మార్పు మంచిదేనని, కానీ ఆశించిన తీరుగా రావడం లేదన్నారు. ప్రాజెక్టులకు, పరిశ్రమలకు సీపీఎం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. చట్టన్ని మార్చే పరిస్థితి లేదని, సొంతంగా జీవోలు తయారు చేసుకుని భూములు సేకరించుకోవాలని కేంద్రం చెబుతుండడంతో ఆయా రాష్ట్రాలు జీవోలు జారీ చేస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో జారీ చేసిన జీవోకు ఇటీవలే తెలంగాణ జారీ చేసిన జీవోకు పెద్ద వ్యత్యాసం లేదన్నారు. మొత్తంగా పాత ప్రభుత్వాలకు..ఈ ప్రభుత్వానికి పొంతన ఏమీ లేదన్నారు.

ప్రత్యామ్నాయ విధానంతో ముందుకు రావాలి...
అణిచివేయడం ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోందని, అభివృద్ధికి ప్రభుత్వ యొక్క విధానాలు ముఖ్యమన్నారు. కొత్త పద్ధతులు పాటించాలని..ప్రస్తుత విధానాన్ని వ్యతిరేకించే వారు...నిజమైన అభివృద్ధి కోరుకొనే వారు..ప్రత్యామ్నాయ అభివృద్ధి కోరుకొనే వారు ఐక్యం కావాల్సినవసరం ఉందని నొక్కాణించారు. ప్రత్యామ్నాయ విధానంతో ముందుకు రావాలి తమ్మినేని పిలుపునిచ్చారు. 

22:23 - July 2, 2016

కేరళ : ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ను వ్యతిరేకించాలని కేరళ ముస్లింలు తీర్మానించారు. రంజాన్‌ మాసం ఆఖరు శుక్రవారం సందర్భంగా స్వాలత్‌నగర్‌, మలప్పురంలో వేలాది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఐసిస్‌ ముస్లిం వ్యతిరేక విధానాలకు అవలంబిస్తోందని వారు ఆరోపించారు. ఉగ్రవాదులు ఇస్లాం మతాన్ని అడ్డుపెట్టుకుని మానవత్వం లేకుండా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ముస్లిం మత పెద్దలు ముక్త కంఠంతో ఖండించారు. ఇస్లాం మతం ప్రేమ, సహనం, మర్యాదను బోధిస్తుందని...అలాంటిది ఐసిస్‌ క్రూర ఆటవిక చర్యలకు పాల్పడుతోందని మత పెద్ద సయ్యద్‌ ఇబ్రహీం ఖలీల్‌ బుఖారి దుయ్యబట్టారు. ఇస్లాం వ్యతిరేక చర్యలను తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - తీర్మానం