తులసి

13:45 - December 28, 2017

హిందు సంప్రదాయం ప్రకారం రోజు తులసి చెట్టుకు పూజ చేస్తాం. కానీ తులసి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. తులసిలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. రోజుకు ఒక తులసి ఆకు తినడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తులసిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మచ్చలను తొలగిస్తుంది. ఎండిన తులసి ఆకు పొడితో పళ్లు తొముకుంటే నోటి దుర్వాసన పోవడమే కాకుండా చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి.జలుబూ, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వాటికి సంబంధించిన మాత్రలే వేసుకోవాలని లేదు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు పరగడుపున కొన్ని పచ్చి తులసి ఆకులను బుగ్గన పెట్టుకుని రసం మింగడం వల్ల పరిష్కారం దొరుకుతుంది.

19:57 - June 18, 2017

అలనాడు ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి తాను ఎదుగుతూనే అదే విధంగా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ అలనాటి నుండి నేటి వరకు సక్సెస్ ఫుల్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు..ఆమెనే సీనియర్ నటి 'తులసి'..ఈ మంగళవారం 'శంకరాభరణం' అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ శుక్రవారం 'తులసి' జన్మదినం కావడం..అందులో శంకరాభరణం ఈవెంట్ లో కళా తపస్వీ విశ్వనాథ్ కు 'తులసి' సన్మానించబోతున్నారు. తన సినిమాలో అవకాశం ఇచ్చిన గురువు పేరున ఆమె పురస్కారాలు అందించబోతున్నారు. 'శంకరాభరణం' సినిమాలో 'శంకరం' పాత్రతో తనను సినిమా రంగానికి తీసుకొచ్చిన కాశీనాథుని విశ్వనాథ్ పేరిట ఆమె పురస్కారాల్ని ఇవ్వబోతున్నారు. ఈసందర్భంగా టెన్ టివి ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా 'తులసి' పలు విశేషాలు తెలియచేశారు. అంతేగాకుండా ఆమెతో పలువురు కాలర్స్ ముచ్చటించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

19:29 - December 13, 2016

ఆకులూ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. చిన్న..పెద్ద..ముసలి ఇలా అన్ని వయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. అలాంటి కొన్ని ఆకులు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తాయో చదవండి...

తమలపాకులు : తమలపాకులో ఫోలిక్ యాసిడ్, ఏ విటమిన్, విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఫైబర్‌ అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. తమలపాకు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అంతేగాకుండా యాంటాక్సిడెంట్‌గా పని చేస్తుంది.

కరివెపాకు : చాలా మంది కూరగాయల్లో ఉపయోగించే కరిపాకును పడేస్తుంటారు. కానీ ఈ కరివెపాకును తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఎన్నో విధానాలైన ఔషధ విలువలు ఇందులో ఉన్నాయి. బ్లడ్ షుగర్ ఉన్న వారు ప్రతి రోజు కరివెపాకును తినడం వల్ల వ్యాధి అదుపులోకి వస్తుంది. కొబ్బరినూనెలో కరివెపాకును మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు వత్తుగా పెరిగే అవకాశం ఉంది.

పుదీనా : ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ, విటమిన్ సి గుణాలు అధికంగా ఉంటాయి. పొటనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనాతో చారు చేసుకోవడం వల్ల మల్లబద్ధకం, పొట్ట శుభ్రపడడం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. పుదీనా ఆకుల పేస్టుతో దంతాలను తోమడం వల్ల తెల్లగా మెరిగిసిపోతాయి. పుదీనా శరీరాన్ని రక్తాన్ని శుభ్రం చేస్తుంది.

తులసి : ఇంట్లో పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. తులసి మేలు చేసే అంతాఇంతా కాదు. ఔషధ విలువలు మెండుగా ఉంటాయి. దగ్గు..జలుబు..జ్వరాలను తులసి ఆకుతో చెక్ పెట్టవచ్చు. 

07:22 - March 31, 2016

పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చనే మాటలు అక్షర సత్యాలనవచ్చు. ఎందుకంటే తులసిలో ఉండే ఔషధ గుణాలు సకల రోగాలను నివారిస్తాయి కాబట్టి. ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. లక్ష్మి తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా పిలువబడే ఈ తులసి వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందామా..?
మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో తయారు చేసిన కషాయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా మంచి ప్రభావం కనిపిస్తుంది. ఇలా చేయడాన్నే ఆరోమా థెరపీ అంటారు.
నీడలో ఆరబెట్టిన తులసి ఆకులను పొడి చేసి, ఒక స్పూన్‌ పొడికి, చిటికెడు సైంధవ లవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళు నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి.
తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకుని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి. తులసి ఆకుల కషాయం జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది.
తులసి కషాయంలో ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే జ్వరంతో బాధపడేవారి అధిక దాహం సమస్యను నివారిస్తుంది. వీటి ఆకులతో ఆవిరి పడితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. 

20:54 - November 12, 2015

రోజూ పెరట్లో కనిపించే తులసి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నోటిపూత, నోట్లో అల్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు తులసి ఎంతో ఉపకరిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు మొదలైనవాటిని నివారించేందుకు తులసి ఆకులు సహాయపడతాయి. రింగ్‌వార్మ్ లాంటి చర్మసంబంధ వ్యాధులకు తులసి ఆకుల రసం రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ల్యూకోడెర్లాలో ప్రకృతి వైద్యులు తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. తలనొప్పికి కూడా తులసి మంచి ఔషధంలా పనిచేస్తుంది. తులసి ఆకులను డికాషన్ గా తీసుకుంటే తలనొప్పిని దూరం చేయవచ్చు. అంతేకాదు ఈ ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంతాలకు చాలా మంచిది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్ లా కూడా వాడుకోవచ్చు. అలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోయి, పళ్ళను అందంగా మార్చుతుంది. గంధం అరగదీసి అందులో తులసి ఆకులను కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటిమీద రాసుకుంటే వేడివల్ల వచ్చే తలనొప్పిని దూరం చేసి, ఎంతో చల్లదనం లభిస్తుంది. తులసి ఆకులు కలిపిన నీటిని తాగడం వల్ల గొంతులో కలిగే ఇబ్బందులను దూరం చేయొచ్చు.

Don't Miss

Subscribe to RSS - తులసి