తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018

13:35 - November 12, 2018

హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఒకవైపు, కేసీఆర్ కుటుంబం ఒకవైపు ఉందని తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  కాంగ్రెస్ ప్రచార కమిటి ఛైర్మన్ మల్లు భట్టివిక్రమార్క నివాసంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఈ పెద్దిరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్  సమావేశం అయ్యారు. ఈసమావేశంలో మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు. కూటమిలో కలిసొచ్చే పార్టీలన్ని తమకు ప్రజాసమస్యలపై ముసాయిదా అందజేశాయని, రేపు మరోసారి  సమావేశమై భాగస్వామ్య పార్టీలతో చర్చించిన అనంతరం ఉమ్మడి మేనిఫెస్టో ముసాయిదాను విడుదల చేస్తామని భట్టి తెలిపారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ ముసాయిదాను అంగీకరించాయని ప్రోఫెసర్ కోదండరాం చెపుతూ, నిరంకుశ పాలనకు, సామాన్య ప్రజల ఎజెండాకు మధ్యనే ఎన్నికలు జరగనున్నట్టు పేర్కొన్నారు.

08:22 - November 11, 2018

గజ్వేల్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదివారం తన నియోజక వర్గ కార్యకర్తలతో వ్యవసాయ క్షేత్రంలో సమావేశం అవుతారు. గ్రామానికి 100 మంది చొప్పున సుమారు 10 వేలమంది ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈసమావేశంలో కార్యకర్తలతో కేసీఆర్ సహపంక్తి భోజనం చేయనున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన తర్వాతే నామినేషన్ వేశారు. ఈసమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కార్యకర్తలు,నాయకులకు కేసీఆర్ వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేయాల్సిన ఎన్నికల ప్రచారానికి కూడా ఇక్కడి నుంచే  బయలుదేరి వెళ్లేట్లు ప్రణాళిక రూపొందించుకున్నారు. సమావేశం అనంతరం ఆయన హైదరాబాద్  బయలుదేరి వచ్చి తెలంగాణా భవన్లో   ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు బీఫారాలు అందచేయనున్నారు.

07:36 - November 11, 2018

హైదరాబాద్‌:  తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు వేసే తేదీ దగ్గర పడింది. సోమవారం నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభ మవుతుంది. షెడ్యూల్‌ ప్రకారం నవంబర్  12 వతేదీ నుంచి  19వ తేదీ  వరకు నామినేషన్ల దాఖలు చేసుకునే అవకాశం ఉంది. 20న నామినేషన్ల పరిశీలిస్తారు, ఉపసంహరణకు 22 వరకు గడువు ఇచ్చారు.  అధికార  టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్ధులకు ఈ  రోజు బీఫారాలు ఇస్తుండగా, టీఆర్ఎస్ ను గద్దే దింపటానికి ఏర్పడిన మహాకూటమిలో ఇంత వరకు సీట్ల సర్ధుబాటు అంశం పూర్తిగా ఓ కొలిక్కిరాలేదు. ఖరారు చేసుకున్న స్ధానాల్లో   అభ్యర్ధుల పేర్లు ప్రకటించటానికి కూడా నాన్చుడు ధోరణి అవలింబిస్తున్నారు. బీజేపీ, బీఎల్ ఎఫ్ లు పలు స్థానాల్లో  తమ అభ్యర్థులను  ప్రకటించాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 14న నామినేషన్‌ దాఖలు చేస్తారు రేపటి నుంచి నుంచి ఈనెల 22 వ తేదీ వరకు అన్ని ఆర్వో కార్యాలయాల వద్ద 144 సెక్షన్‌అమల్లో ఉంటుంది. హైదరాబాద్‌ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

19:57 - November 8, 2018

ఢిల్లీ: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకమిటీ సమావేశం ముగిసింది. తీవ్ర వడపోతల మధ్య 74 సీట్లలో పోటీచేసే అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఇచ్చే స్ధానాలను కేటాయించారు. యూపీఏ ఛైర్ పర్సన్  సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకమిటీ సమావేశం అనంతరం తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియా విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమిలో మిత్ర పక్షాలకు 25 సీట్లు కేటాయించామని చెప్పారు. టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐకి 3  కేటాయించామని, ఈనెల 10న తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

18:34 - November 7, 2018

హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీకి నామినేషన్లు వేసే తేదీ దగ్గర పడుతున్నాకాంగ్రెస్ పార్టీ సీట్ల విషయం తేల్చకుండా తాత్సారం చేయటం, సీట్ల విషయంపై  లీకులివ్వటం పట్ల మిగిలిన పార్టీలను అసహనానికి గురిచేస్తోంది. తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్.కోదండరాం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డితో బుధవారం హైదరాబాద్లో సమావేశం అయ్యారు. కూటమిలో కాంగ్రెస్ వ్యవహార శైలిపై నాయకులు చర్చించినట్లు తెలిసింది. మహాకూటమిలో భాగస్వాములమైన మాకు సీట్లు కేటాయింపు జరపకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్నిస్ధానాల్లో ప్రచారం చేసుకోవటం పట్ల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఐ, జనసమితి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న స్ధానాలు, సీట్ల సంఖ్యపై కూడా అసంతృప్తితో ఉన్నాయి. ఈనేపధ్యంలో రెండు పార్టీల నేతలు భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఈ భేటీ పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పందిస్తూ కేవలం  స్నేహ పూర్వకంగా కలవడానికి వచ్చానని చెప్పారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి, నారాయణ కూడా పాల్గొన్నారు. 

16:15 - November 7, 2018

హైదరాబాద్: ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పోలీసు నిఘా పెరిగింది. అక్రమంగా డబ్బు తరలించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.  హైదరాబాద్లో  బుధవారం 7న్నర కోట్లకు పైగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది.  ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు జరిపిని తనిఖీల్లో  రూ.7,71.25.510 నగదును స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో కారులో తరలిస్తున్న రూ.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈడబ్బుకు సరైన పత్రాలు చూపించకపోవటంతో నగదు తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నిందితులపై 171(బీ), 468, 471, 420, 120(బీ) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
మరో వైపు బంజారా హిల్స్లోని షాఇనాయత్ గంజ్ వద్ద రూ.2,71.25.510 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము ముంబై .ఢిల్లీ ,నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు చెపుతున్నారు. హావాలా సొమ్మా, లేక ఎన్నికల కోసం ఎవరైనా తెప్పించారా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక హైదరాబాద్ లో ఇంత పెద్ద మొత్తంలో  నగదు పట్టుబడటం ఇదే మొదటిసారి. 

21:10 - November 5, 2018

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ  ప్రారంభం అవుతుంది. నామినేషన్లకు టైం దగ్గర పడుతున్నప్పటికీ, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహా కూటమిలో మాత్రం సీట్ల పంపకం ఇంకా తేలలేదు.  దీంతో భాగస్వామ్య పక్షాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికి ఎన్నిసార్లు భాగస్వామ్య పార్టీలన్నీసమావేశం అయినా టికెట్ల సంఖ్య తేలలేదు. పొత్తులు, సీట్ల సర్దుబాటులో జాప్యంపై  ఇప్పటికే సీపీఐ అసహనం వ్యక్తంచేస్తోంది.  కూటమి బలోపేతంకు చాలా ఆలస్యం అయిందని, తొమ్మిది నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయబోతున్నట్టు  చాడ ప్రకటించారు. తొమ్మిది సీట్లు  ఇస్తేనే కూటమిలో  ఉంటామని చాడ  తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మహాకూటమి ముఖ్య నేతలు పార్క్‌ హయత్‌ హోటల్‌లో  సమావేశం అవ్వాలని భావించారు. కానీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదండరాం మాత్రం సమావేశమై సీట్ల విషయం చర్చించుకున్నారు.  సీట్ల విషయంలో స్పృష్టత ఉంది కనుక మీటింగ్ కు వెళ్లలేదని  టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ  చెప్పగా,  మీటింగ్ కు పిలవలేదని చాడ వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. 
ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రస్తావించగా.......మహా కూటమి నుంచి ఎవరూ బయటకు వెళ్లడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉన్నందున రేపు ఢిల్లీకి వెళుతున్నామని, తిరిగి వచ్చాక కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని ఉత్తమ్ చెప్పారు.  కోదండరాంతో చర్చలు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగాయని ,  రేపటిలోగా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

21:19 - November 4, 2018

యాదాద్రి: కేవలం అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుందని విమర్శించారు ఐటీ శాఖమంత్రి కేటీఆర్. యాదాద్రిజిల్లా భువనగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు ఇచ్చేనోట్లకోసం, 4 సీట్ల కోసం ప్రాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్దుల పేర్లు  ఖరారుచేయాల్సింది  రాహుల్ గాంధీ కాదని,చంద్రబాబే అని ఇంతకంటే దౌర్బాగ్యం మరోకటి ఉండదని అన్నారు. ఉత్తమ్, జానాలు  రాష్ట్రంలో పులుల మాదిరి ఉంటారని , ఢిల్లీ వెళ్లి   పిల్లిలా చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని అన్నారు. ముసలి నక్క కాంగ్రెస్‌- గుంట నక్క చంద్రబాబు ఒక్కటై మహాకూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

11:24 - October 29, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ సోమవారం సమావేశం అవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ తేది దగ్గర పడుతుండటం, మరో 2 రోజుల్లో మహాకూటమి తొలి జాబితా, టీఆర్ఎస్ తుది జాబితా విడుదల చేయనున్న నేపధ్యంలో పార్టీ ఎన్నికల కమిటీ ఈరోజు సమావేశం అవుతోంది. ఈసమావేశంలో అసెంబ్లీకి పోటీ చేసే రెండవ విడత  అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన స్వామి పరిపూర్ణానంద పోటీ చేసే స్ధానం ఈరోజు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీ రూపొందించిన 38మంది తొలి జాబితాను కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇటీవల ప్రకటించారు.ముషీరాబాద్ నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, గోషామహల్ నుంచి రాజాసింగ్, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి రామచంద్రరావు, ఉప్పల్ నుంచి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎల్‌బీనగర్ నుంచి  పేరాల శేఖర్ రావు పోటీ చేస్తున్న వారిలో ఉన్నారు.

20:29 - October 21, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో సీపీఐకి ఓటర్లు ఉన్నారని, ఈఎన్నికల్లో మహాకూటమితో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. కొన్ని పార్టీలు కావాలనే తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని, సీపీఐ అభ్యర్ధుల కోసం కూటమిలో 12 సీట్లు కావాలని అడుగుతున్నామని, కనీసం 9 సీట్లు అయినా తమకు ఇవ్వాలని ఆయన మహాకూటమి నేతలను కోరారు. 

Don't Miss

Subscribe to RSS - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018