తెలంగాణ జన సమితి

20:20 - April 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సమావేశాన్ని నిర్వహించనుంది. సభ కోసం అనుమతి ఇవ్వాలని జనసమితి నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సభకు అనుమతి ఇవ్వలేమని ఇటు పోలీసు శాఖ, అటు సరూర్‌నగర్‌ గ్రౌండ్‌ నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో  తెలంగాణ జన సమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. 

 

06:40 - April 1, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించనుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త పార్టీ పెడతామన్న తెలంగాణ JAC ఛైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. కొత్త పార్టీ కోసం JAC దరఖాస్తు చేసుకున్న తెలంగాణ జనసమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 2న కోదండరామ్‌ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఏప్రిల్‌ 4న పార్టీ పతాకం ఆవిష్కరించి, పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు ఏప్రిల్‌ 29న భారీ బహిరంగ సభ ఏర్పాటుకు JAC నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

Don't Miss

Subscribe to RSS - తెలంగాణ జన సమితి