తెలంగాణ పోలీస్

20:09 - May 19, 2017

హైదరాబాద్: పోలీసోళ్లను ఆకాశానికి ఎత్తిన సీఎం కేసీఆర్.. అంతకంటే గొప్పోళ్లు లేరని అంటున్నారట, విశాఖలో ముగిసిన జనసేన సెట్ పరీక్ష...ఫలితాల విడుదల మీద పెరిగిన ఉత్కంఠ, తెలంగాణకు సరికొత్త సచివాలయమట...అమరవీరుల ఆత్మకు అసలైన శాంతట, ఆంధ్ర రాష్ట్రం ఆడోళ్లకు లోకేశం బంపర్ ఆఫర్....జలమణి పథకం కొలాయించిన అయ్యా, కొడుకు, మళ్లా మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వం...15 రోజుల డీఎస్సీకి కడియం పాతర, ఎండలల్లోనే ఆమ్లేట్ వేసుకోని తింటున్న జనం...ఉష్ణోగ్రత కొలతకు మారిపోయిన ప్రమాణం. ఇత్యాది అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:41 - March 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీసుల అలర్ట్‌నెస్‌తో పెనుముప్పు తప్పింది. లక్నోలో భారీ విధ్వంసానికి జరిగిన కుట్రను భద్రతా బలగాలు వమ్ముచేశాయి. భారత్‌లో తెగబడేందుకు ఐసిస్‌ చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికపుడు నిఘా సంస్థలు విజయవంతంగా అడ్డుకుంటున్నాయి. 

లక్నో కుట్రను..
తెలంగాణ పోలీసులు ఉప్పందించడంతో ఏటీఏస్ పోలీసులు భారీ ఆపరేషన్ మొదలు పెట్టారు. లక్నోలో జరగనున్న కుట్రను మన పోలీసులు ఇట్టే పసిగట్టారు. అవకాశం కోసం వేచిచూసి సరైన సమయంలో సమాచారం చేరవేశారు. పెను ముప్పుకు కుట్రపన్నిన ఉగ్రవాదులపై ఆపరేషన్‌ను విజయవంతంగా ముంగిచాయి భద్రతా దళాలు. 

పాక్ లో ట్రైనింగ్..
పాకిస్థాన్‌ నుంచి ఆర్థిక, ఆయుధ సహాయం పొందిన ఐసిస్‌ ఉగ్రవాదులు భారత్‌లో పేలుళ్లకు  పన్నిన కుట్రను  ముందుగానే గుర్తించిన తెలంగాణ ఇంటలిజెన్స్‌ పోలీసులు.. విషయాన్ని యూపీ పోలీసులకు చేరవేశారు. ఐసిస్‌ ఉగ్రవాది సైఫూల్లాపై గత కొన్ని రోజులుగా నిఘా ఉంచారు.  భారత్‌లో దాడి చేసేందుకు ఇప్పటికే రెండు సార్లు పాకిస్థాన్ కు వెళ్లిన సైఫుల్లా అక్కడ ట్రైనింగ్ కూడా  తీసుకున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. దేశంలో పేలుళ్లకు కుట్రలు పన్నుతున్న విషయాన్ని తెలంగాణా డీజీపీ ఆఫీసులోని నిఘా విభాగం పసిగట్టింది. ఎపుడు, ఎలా దాడిచేయాలన్న దానిపై ఉగ్రవాదుల మధ్య నడిచిన సంభాషణలను గుర్తించారు.  దీనిపై యూపీలో నిఘా విభాగాన్ని అలర్ట్‌ చేశారు. 

మరో కుట్ర..
పాట్నా వద్ద జరిగిన ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం.. ఉజ్జయిని పాసింజర్ ప్రమాదం లాంటి సంఘటనలు సైఫూల్లా డైరెక్షన్ లోనే జరిగినట్లు ఇంటలిజెన్స్ విభాగం గుర్తించింది. మరోసారి కుట్రకు పాల్పడుతున్నాడని తెలుసుకున్న తెలంగాణ పోలీసులు యాంటీ టెర్రరిస్టు స్కాడ్ కు సమాచారం అందించారు.  లక్నో నగరం ఠాకూర్ ఘంజ్ లోని ఓ ఇంట్లో  ముష్కరులు దాగి ఉన్నట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నారు. 

ఇండియాలో పాగా వేసేందుకు..
మరోవైపు సైఫుల్లాకు సహాకరించిన మరో ఇద్దరి టెర్రరిస్టులను కూడా భద్రతా దళాలు  అదుపులోకి తీసుకున్నాయి.  వీరిని విచారించి మరింత సమాచారం రాబట్టనున్నారు. మొత్తానికి ఇటీవల ఐసిస్‌ చెరనుంచి విముక్తిపొందిన డాక్టర్ రామ్మూర్తి వెల్లడించిన విషయాలతోపాటు..  సైఫూల్లా తాజా ప్లాన్స్ చూస్తే.. ఇండియాలో పాగా వేసేందుకు.. భారీగా ప్రాణనష్టం కల్గించేందుకు.. ఐసిస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుందనే విషయం స్పష్టం అవుతోంది.  

దేశవ్యాప్తంగా ప్రశంసలు..
మొత్తానికి దేశంలో ఐసిస్ మూలాలు ఎక్కడ ఉన్న మన తెలంగాణ పోలీసులే ముందుగా పసిగట్టుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆపరేషన్ మొదలు పెట్టాలనుకున్న ఐసిస్‌ ముష్కరుల కుట్రలను ముందే పసిగట్టిన మన పోలీసులు.. 7గురు ఉగ్రవాదులను  అరెస్ట్ చేశారు. సమర్థంగా పనిచేస్తున్న తెలంగాణ పోలీసులు నిఘావిభాగానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. 

Don't Miss

Subscribe to RSS - తెలంగాణ పోలీస్