తెలుగుదేశం

19:16 - November 3, 2018

కత్తిపూడి: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని,టీడీపీ నాయకులకు డబ్బే ప్రధానం అయిందని, వాళ్లను నిలదీసే పరిస్ధితి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయటానికి డబ్బులు ఉండవు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలను కొనటానికి డబ్బులుంటాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి లోకేష్ అడ్డదారిలో పంచాయతీ రాజ్ శాఖమంత్రి అయ్యారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గ్రామ,గ్రామాన అవినీతి పెరిగిపోయిందని జనసేన పార్టీ అవినీతిపై పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు అవినీతి రహిత పాలన అందించటమే జనసేన లక్ష్యం అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామాల్లో కనీస వసతులు కరువయ్యాయని, సాగునీరు లేదు, ప్రభుత్వాసుపత్రిలు మూసివేస్తున్నారు అని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే విశాఖ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం వెంటనే  జాగ్రత్త పడి వుంటే ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగేవారని...... మీ ఎమ్మెల్యేలను కాపాడలేకపోయిన మీరు ఒక ముఖ్యమంత్రా అని  సీఎం ను ఉద్దేశించి ప్రశ్నించారు. సభ ప్రారంభలో అభిమానులు పవర్ స్టార్ సీఎం ,పవర్ స్టార్ సీఎం, అంటూ నినాదాలు చేయగా... మీ ఆకాంక్ష భగవంతుడి ఆశీస్సులతో  త్వరలో నెరవేరుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.   

11:22 - October 29, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు ఆగడం లేదు. తాము కేంద్రం నుండి బయటకు రాగానే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని..సీబీఐ, ఈడీలను రాష్ట్రానికి పంపిస్తూ దాడులు చేయిస్తోందని ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైసీపీ అధినేత జగన్‌పై దాడి అనంతరం మరింత రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై పలు విమర్శలు గుప్పించారు. తాజాగా సోమవారం ఉదయం గుంటూరు జిల్లాలోని టీడీపీ నేత, ప్రముఖ వ్యాపార వేత్త రవీంద్ర నివాసంపై ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. 
Related imageకోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని ప్రముఖ వ్యాపార వేత్త. పెట్రోల్, గ్యాస్ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఈయన టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా నిర్వహిస్తున్నారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా అధిష్టానం మాత్రం ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపలేదు. దీనితో టీడీపీ వాణిజ్య విభాగాన్ని నాని చూస్తున్నారు. 
సోమవారం ఉదయం మూడు బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు తొలుత ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

15:37 - October 26, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం ఆంధ్రా పార్టీ అని పొలిమేరల దాకా తరిమితే మళ్లీ కాంగ్రెస్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణాకు తీసుకువస్తోందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చంద్రబాబు పల్లకి మోస్తున్నారని.. ఇది తెలంగాణకు సిగ్గుచేటని హరీష్ రావు అన్నారు.  అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే కాంగ్రెస్ నేతలు మాత్రం బల్లలు చరిచారు అని హరీష్ విరుచుకుపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్పుడు, ఇప్పుడూ వలసవాదుల పల్లకీలు మోస్తున్నారని ఎద్దేవా చేశారు.
కొడంగల్‌కు చెందిన వివిధ పార్టీల నేతలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారిని ఉద్దేశించి తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు ప్రసంగించారు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్ గెలుపు తధ్యమని హరీష్ రావు అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గానికి తాగు, సాగునీరు టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని... ఈ నలభై రోజులు మీరు పార్టీ కోసం కష్టపడితే.. అరవై నెలలు మీ కోసం కష్టపడుతామని కార్యకర్తలతో హరీష్ పేర్కొన్నారు. 
మహాకూటమి గెలిస్తే తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ఒప్పందం కుదిరిందట అంటూ... అందులో ఒకటి సాగునీటి శాఖ అయితే మరొకటి హోంశాఖ అంటున్నారు. సాగునీటి శాఖను తీసుకొని టీడీనీ తెలంగాణను ఎండబెడుతుందని.. అలాగే హోంశాఖని తీసుకొని ఓటుకు నోటు కేసు నుంచి బయట పడాలని దేశం నాయకులు కుట్ర పన్నుతున్నారని హరీష్ విమర్శించారు. 

 

 

10:18 - October 13, 2018

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తూ, ప్రభుత్వంలోని అవకతవకలు ఎత్తి చూపుతూ నిత్యం జనంతో మమేకమై రోడ్ షోలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  విజయవాడ పార్టీ కార్యాలయాన్నిశనివారం ప్రారంభించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో  కలిసి  బెంజిసర్కిల్ లో  ఏర్పాటు  చేసిన కార్యాలయాన్నిఈఉదయం ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనున్న జనసేన పార్టీలోకి ఇప్పటికే  ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలు మొదలయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సరికి ఇంకెంత మంది జనసేన పార్టీలో చేరతారో వేచి చూడాలి.  

16:32 - October 11, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయింది. అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ టీడీపీ తన సత్తా చాటుకుంది. ఏ పార్టీకి లేని విధంగా తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అదే టీడీపీకి ప్లస్. కాగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితం కావడం తెలంగాణలో టీడీపీకి మైనస్ అయింది. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. ఆ కారణంగా టీఆర్ఎస్‌కు అత్యధిక స్థానాలు రావడం అధికారం దక్కడం జరిగిపోయాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడింది. ఓవైపు ఎన్నికల్లో వరుస ఓటములు.. దీనికి తోడు వలసలు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. Image result for l ramana

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 72స్థానాల్లో పోటీ చేస్తే 15 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్ శాతం 14.66గా ఉంది. కాగా గులాబీ ఆకర్ష్ కారణంగా తెలుగుదేశం టికెట్ మీద గెల్చిన ఎమ్మెల్యేలంతా సైకిల్ దిగి కారెక్కారు. చివరకు టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. సండ్ర వెంటక వీరయ్య(సత్తుపల్లి), ఆర్ క్రిష్ణయ్య(ఎల్బీనగర్). టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి సైతం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఒంటరిగా కాకుండా మహాకూటమి పేరుతో బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. అయితే మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయన్నది క్లారిటీ లేదు. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీలు చెబుతున్నాయి.

జిల్లాలు గెలిచిన స్థానాలు
రంగారెడ్డి 7
హైదరాబాద్ 3
మహబూబ్‌నగర్ 2
వరంగల్ 2
ఖమ్మం 1

          

2014లో టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు 15
ఎంపీ స్థానాలు 1
ఓటింగ్ శాతం 14.66

 

 

 

 

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం దూకుడు మీదుంది. ఇప్పటికే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రతిపక్షాల కన్నా చాలా ముందు ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ సరైన నాయకత్వమే లేదు. ఈ లోపం కారణంగానే టీడీపీ చతికలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఆ లోపాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. 

2014 టీడీపీ ఎమ్మెల్యేలు
సండ్ర వెంకట వీరయ్య -సత్తుపల్లి
ఆర్.కృష్ణయ్య -ఎల్బీనగర్
రేవంత్ రెడ్డి -కొడంగల్
రాజేందర్ రెడ్డి -నారాయణ్ పేట్
వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్
కృష్ణా రావు కూకట్ పల్లి
కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం
క్రిష్ణా రెడ్డి మహేశ్వరం
ప్రకాశ్ గౌడ్, రాజేంద్రనగర్
ఎ.గాంధీ శేరిలింగం పల్లి
ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి
చల్లా ధర్మారెడ్డి పరకాల
శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్
సాయన్న, కంటోన్‌మెంట్
మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్

     


 

 

21:07 - July 14, 2018

విజయవాడ : టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతుంటే... ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. నాలుగేళ్లుగా తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి... ప్రతిపక్షాల కుట్రలను గ్రామదర్శిని పేరిట ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పోలవరం రాష్ట్ర హక్కు అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. సోమవారం నాటికి టీడీపీ అధికారం చేపట్టి 1500 రోజులు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర ప్రగతిని వివరించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే... విభజన హామీ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన హక్కులపై పోరాటం చేస్తామన్నారు చంద్రబాబు. రాష్ట్రం కోసం నాలుగేళ్లు అహర్నిశలు శ్రమపడినందుకు ఫలితాలు వస్తున్నాయన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అందరికీ మంచి జరుగుతుందని... టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు సీఎం.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను పార్టీ పరంగా.. ప్రభుత్వపరంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. జనవరి వరకు గ్రామదర్శిని పేరుతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. 75 గ్రామదర్శిని కార్యక్రమంలో తాను పాల్గొంటానన్నారు. అలాగే అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులతో సమావేశమై... రాష్ట్ర విభజన వల్ల జరిగిన అన్యాయంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇక కేంద్రం నమ్మకద్రోహంపై చేస్తున్న ధర్మపోరాట దీక్షలు ఇంకా 13 జిల్లాల్లో చేసి... భవిష్యత్‌కు ప్రజలను సమాయత్తం చేస్తామన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేందుకు తాము, అధికారులు ఎంతో కష్టపడ్డామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ఒక బెస్ట్‌ టీమ్‌ అని దేశంలో నిరూపితమైందన్నారు. కేంద్రంతో సమస్యలున్నా... పోలవరం ప్రాజెక్ట్ ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. తనపై బీజేపీ, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లతో పవన్‌కల్యాణ్ కూడా కలిశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పుట్టినవారు కూడా పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల విషయంలో లాలూచీపడి.. రాష్ట్ర ప్రయోజనాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇలాంటి వారు రాష్ట్రానికి అవసరమా ? అని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి ఎన్నికల ఏడాది ప్రారంభం కావడంతో ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాము కష్టపడుతున్నా... అధికారం కోసం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సిద్దం కావాలని నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. 

21:05 - June 29, 2018

విజయవాడ : తెలుగుదేశం పార్టీ సాగిస్తోన్న పోరాటంపై బురద చల్లేందుకు.. కుట్రలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రమంతా తమ ధర్మపోరాటం వైపే చూస్తోందన్న చంద్రబాబు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉక్కు కోసం దీక్షలను టీడీపీ ఎంపీలు ఎద్దేవా చేస్తూ మాట్లాడారంటూ.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న వీడియోను చంద్రబాబు ప్రస్తావించారు. పార్టీ ఎంపీల ఉద్యమంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి దృష్టిని మళ్లించేందుకు తప్పుడు వీడియో క్లిప్పింగ్‌లను ప్రచారంలోకి తెస్తున్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ పోరాటంపై బురద చల్లేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఎంపీలు బాధ్యతగా వ్యవహరించాలని, ఎవరూ సరదాగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు సూచించారు.

పార్లమెంటులో ఆందోళన సందర్భంగా మురళీమోహన్‌ స్పృహ కోల్పోయారని, కొనకళ్లకు గుండెపోటు వచ్చిందని.. అప్పుడు వాస్తవాన్ని ప్రచారం చేయని వారు.. ఇప్పుడు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీలు.. చంద్రబాబు దృష్టికి తెచ్చారు. గతంలోనూ జేసీ దివాకరరెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇప్పుడు కూడా.. 75 ఏళ్ల వయసున్న తాను వారం రోజులు దీక్ష చేయగలను అన్న వ్యాఖ్యలను కత్తిరించారని, వాళ్లకు కావలసిన వ్యాఖ్యలను అతికించారని ఎంపీలు సీఎంకు వివరించారు. టీడీపీ ఎంపీల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఎవరు చిత్రీకరించారో.. ఎందుకు ప్రసారం చేశారో విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని, ప్రతిపక్షాల అడ్డంకులను అధిగమిస్తూ.. వారి కుట్రలను భగ్నం చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు. నేరస్తులు, బ్లాక్‌మెయిలర్లతో పోరాటం ఆషామాషీ కాదని, పార్టీ నేతలంతా ఇకపైనా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. 

15:42 - June 28, 2018

విజయవాడ : తెలుగుదేశం పార్టీ పాలనలో మహిళలరకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై జరగుతున్న దాడులతో సీఎం చంద్రబాబు నాయుడు తలదించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. గురువారం విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ...ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేస్తే ప్రజలు నమ్మరని తెలిపారు. తెలుగుదేశం నాయకుల వల్లే మహిళలకు రక్షణ లేదన్నారు. విభజన చట్టంలో ఏవీ రాకపోయినా నాలుగేళ్లు బీజేపీతో టిడిపి అంటకాగిందని..మంత్రి పదవులు అనుభవించారని గుర్తు చేశారు. ఇప్పుడు దీక్షలు అంటూ చేస్తున్నారని విమర్శించారు. కడప ఉక్కు..విశాఖ రైల్వే జోన్..వెనుకబడిన జిల్లాల అభివృద్ధి..తదితర అంశాలపై వైసీపీ పోరాడిందన్నారు. 

18:33 - June 19, 2018

అమరావతి : ఏపీలో నాలుగు నెలల పాటు నిర్వహించిన తెలుగుదేశం దళితతేజం కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30న నెల్లూరులో లక్ష మంది దళితులతో ముగింపు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూలేని విధంగా దళితులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ ప్రభుత్వమేని ఏపీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్‌, నారాయణ చెప్పారు. 

17:30 - June 19, 2018

అమరావతి : ఏపీలో నాలుగు నెలల పాటు నిర్వహించిన తెలుగుదేశం దళితతేజం కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30న నెల్లూరులో లక్ష మంది దళితులతో ముగింపు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూలేని విధంగా దళితులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ ప్రభుత్వమేని ఏపీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్‌, నారాయణ చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - తెలుగుదేశం