తేజ

12:02 - November 9, 2017

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కంప్లీట్ గా కొత్త యంగ్ డైరెక్టర్స్ చేతికి వెళ్లిందా అనుకునే టైం లో సీనియర్ డైరెక్టర్స్ మల్లి తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఈ సీనియర్ డైరెక్టర్ మళ్ళీ హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రేమకథలను తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ మరో క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్నాడు . డైరెక్టర్ తేజ ఒకప్పుడు ఈ పేరు అంటే హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్. ఆ తరువాత కాలంలో కొంచం వెనుకబడిన తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ వచ్చాడు. రానా - కాజల్ జంటగా నటించిన ఈ సినిమా ఆడియన్స్ ని రీచ్ అయింది. తాజాగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన తేజ మరో సినిమాకి ముహూర్తం పెట్టాడు. రానా హీరోగా పవర్ఫుల్ పొలిటిషన్ రోల్ లో నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో తేజ స్టైల్ అఫ్ మేకింగ్ ని మరో సారి చూపించాడు. రానా లాంటి పర్సనాలిటీని హ్యాండిల్ చేసి హిట్ కొట్టాడు తేజ.

నేనే రాజు నేనే మాత్రి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన తేజ త్వరలోనే వెంకీతో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. బాబు బంగారం సినిమా తరువాత వెంకీ మెయిన్ లీడ్ గా కనిపించే ఈ సినిమా ఇంటరెస్టింగ్ గా మారుతుంది. గురు సినిమా లో వెంకీ నటనకి మంచి మార్కులు పడ్డాయి. తేజ డైరెక్షన్ లో వెంకీ తో రాబోయే సినిమాలో స్పెషల్ పాత్ర కోసం ఒక యువ హీరోని చేయించాలని అనుకుంటున్నాడట దర్శకుడు తేజ. అయితే ఆ పాత్ర కోసం ఇద్దరి పేర్లను కూడా అనుకుంటున్నాడట. సుమంత్ - నారా రోహిత్ ఇద్దరిలో ఎవరో ఒకరిని తేజ ఫైనల్ చేయనున్నాడట. అలానే హీరోయిన్ రోల్ కోసం హీరోయిన్స్ ని ఇద్దరిని అనుకున్నా వారు రిజెక్ట్ చేశారట. వారు ఎవరో కాదు ఒకరు కాజల్ అగర్వాల్ మరొకరు మిల్కి బ్యూటీ తమన్నా. మరి వెంకీ పక్కన ఎవరు కనిపిస్తారో చూడాలి.

11:14 - October 12, 2017

టాలీవుడ్ లో రీమెక్ ల హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు వెంకటేష్. ఇతర భాషల్లో వచ్చిన సినిమాలపై వెంకీ ఆసక్తి కనబరుస్తుంటాడు. తెలుగులో తీసినా మంచి విజయాన్నే నమోదు చేస్తుంటాయి. ఇటీవలే వచ్చిన 'గురు' కూడా ఆ కోవకి చెందిందే. ఈ చిత్రం అనంతరం 'వెంకటేష్' ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. తాజాగా 'తేజ' దర్శకత్వంలో 'వెంకీ' నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

వెంకీ – తేజ‌ కాంబినేషన్ ఓకే అయిపోయింద‌ని, ఈ సినిమా కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లోనే ఉంటుంద‌ని టాక్‌. ఇదివరకే వీరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాల్సింది. కానీ తేజ ఫామ్ లో లేకపోవడంతో వెంకీ ధైర్యం చేయలేదని తెలుస్తోంది. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి టాక్ నే తెచ్చుకుంది. దీనితో మళ్లీ ఫాంలోకి వచ్చిన 'తేజ'తో సినిమా చేయాలని వెంకటేష్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకీ ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నాడని, రెండు భిన్న భావాలున్న పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది తెలియడం లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

10:33 - October 12, 2017

ఎన్టీఆర్ బయోపిక్..ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చొంది. ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలని ఆయన కుమారుడు 'బాలకృష్ణ' ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ వివాదంలో ఉండే 'రాంగోపాల్ వర్మ' కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్' బయోపిక్ నిర్మించే దర్శకుడి కోసం 'బాలయ్య' వెయిట్ చేశారని తెలుస్తోంది.

తొలుత 'క్రిష్'..లేదా 'తేజ'కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని 'బాలయ్య' యోచించారని టాక్. కానీ 'క్రిష్' మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో 'ఎన్టీఆర్' బయోపిక్ పై దృష్టి పెట్టే టైం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలను తాజాగా 'తేజ' స్వీకరించినట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో టాక్. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

08:54 - October 3, 2017

డిజిటల్ యుగం పెరిగింది. సినిమాలు థియేటర్స్ నుండి ఇంటర్నెట్ కి పయనం కట్టాయి. డిజిటల్ రెవెల్యూషన్ పెరుగుతున్న ఈ ట్రెండ్ లో యూ ట్యూబ్ హావా నడుస్తుంది. రీసెంట్ గా సినిమా నటులు కూడా వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టారు. సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోస్ కూడా రీసెంట్ గా వెబ్ సీరీస్ మీద ఫోకస్ పెడుతున్నారు. 'చిత్రం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు 'తేజ’, తాజాగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. పొలిటికల్ డ్రామాతో వచ్చిన ఈ సినిమా మంచి కలక్షన్స్ తో హిట్ ట్రాక్ తెచ్చుకుంది. 'రానా' హీరోగా పవర్ఫుల్ పొలిటిషన్ రోల్ లో నటించిన ఈ సినిమాలో 'తేజ' స్కూల్ హీరోయిన్ 'కాజల్ అగర్వాల్' నటించింది. డైరెక్టర్ గా మల్లి తన సత్త చాటాడు డైరెక్టర్ తేజ.ఈ సినిమా హిట్ అవ్వడానికి డైలాగ్స్ కూడా మెయిన్ రీజన్ అని టాక్. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో జోగేంద్ర పాత్రలో నటించి మెప్పించాడు రానా. ప్రస్తుతం సోషల్ అనే ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

'రఘువరన్ బీటెక్' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైన 'ధనుష్' వెబ్ సీరీస్ కి ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో ఓ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ధనుష్ చెప్పేశాడు. అలానే 'ఆలా మొదలయింది' సినిమాతో క్లాస్ డైరెక్టర్ బ్రాండ్ తో వచ్చిన నందిని రెడ్డి రీసెంట్ గా వెబ్ సిరీస్ పోస్టర్ విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ కి 'నేనే రాజు నేనే మంత్రి' మాటల రచయిత లక్ష్మి భూపాల డైలాగ్ రైటర్ గా ఉన్నాడు.

13:20 - August 21, 2017

హైదరాబాద్: దాదాపు 50 చిత్రాల్లో బాలనటుడిగా తెరపై కనువిందు చేసిన బాలనటుడు మాస్టర్‌ తేజ... ఇప్పుడు అతడు హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. బెక్కెం వేణుగోపాల్‌(గోపి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సంస్థలో దర్శకత్వం విభాగంలో ఎనిమిదేళ్లు పనిచేసిన హరి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గోపి మాట్లాడుతూ.. ‘కథ అద్భుతంగా కుదిరింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది. కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. సెప్టెంబరు 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. ‘ఉయ్యాల జంపాల’, ‘స్వామిరారా’ చిత్రాలకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడు ఎం.ఆర్‌.సన్నీ దీనికి బాణీలు సమకూరుస్తున్నారు.

09:40 - August 10, 2017

మాస్ చిత్రాలకు కేరాఫ్ 'వినాయక్'. యాక్షన్ మూవీస్ ను తెరకెక్కించడంలో తనదైన బాణీ పలికిస్తున్నారు. మాస్ మసాలాలు దట్టించడంలో ఇతను మేటి. క‌థ‌కు క‌మ‌ర్శియ‌ల్ అంశాలు జోడించాల‌న్నా..ప‌దునైనా సంభాష‌ణ‌ల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌పై పంచ్ లు వేయాల‌న్నా మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కే చెల్లింది. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా అనంతరం మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మెగా కుటుంబం నుండి వచ్చిన 'సాయి ధరమ్ తేజ్' తో వినాయక్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. సి. కల్యాణ్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో 'సాయి ధరమ్ తేజ్' హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో సాయిధరమ్ తేజ్ కి ఆశీస్సులు అందజేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

11:40 - July 18, 2017

డైరెక్టర్ తేజ తీసిన 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన నటి 'కాజల్ అగర్వాల్'. ఇండస్ట్రీ లో ఆల్మోస్ట్ అందరి హీరోలతో ఫిలిమ్స్ చేస్తూ రీసెంట్ గా 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో మెగాస్టార్ తో కూడా స్టెప్ లు వేసింది కాజల్. మెగా స్టార్ 150 అంటే చాల ప్రెస్టీజియస్ అలాంటి మూవీలో 'కాజల్' కనిపించడం ఫాన్స్ కి కూడా మంచి ఫీల్ ఇచ్చింది. ఇప్పుడు తన 50th సినిమాతో రాబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్ లతో కొట్టుకుంటున్న డైరెక్టర్ తేజ. తన ప్రీవియస్ మూవీ 'హోరా హోరి' కూడా ఆశించినంత హిట్ అవ్వలేదు. అందరూ కొత్తవాళ్లతో తీసిన లవ్ అండ్ యాక్షన్ ఫిలిం 'హోరా హోరి' ఆడియన్స్ కి కొత్తదనం ఇవ్వలేకపోయింది. తేజ మార్క్ సినిమాగా నిలిచింది. దాదాపు పది సినిమాలనుండి పోరాడుతున్న తేజ ఇప్పుడు రీసెంట్ గా మల్లి తన ప్రాజెక్ట్ తోరాబోతున్నాడు.

'రానా' తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో రానా పొలిటీషియన్ గా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తైనట్లు తెలుస్తోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. 'కాజల్' హీరోయిన్ గా నటిస్తుండగా, కేథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చిత్ర ఆడియో మరియు విడుదల తేదీకి సంబందించిన విషయాలు త్వరలోనే వెల్లడవుతాయి.

13:19 - July 7, 2017

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ తనలోని నటన ప్రతిభను చూపిస్తున్న నటుడు 'రానా' మరోసారి భిన్నమైన పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు. తేజా దర్శకత్వంలో రూపొందిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో 'రానా' తో 'కాజల్' జత కడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై విశేషంగా ప్రేక్షకులను ఆకర్షించిన విషయం తెలిసిందే. రాజకీయ నేప‌థ్యంతో వ‌స్తున్న ఈ సినిమాపై చిత్ర‌ యూనిట్‌ భారీ అంచ‌నాలు పెట్టుకుంది. 'కృష్ణం వందే జగద్గురుమ్' తర్వాత 'రానా' మరోసారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఓ సాధారణ యువకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఆసక్తికరమైన అంశంతో చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. కేథరిన్ కూడా ఓ ముఖ్యపాత్ర పోషించిన ఈ సినిమాలో అశుతోష్ రానా, నవదీప్, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి, అజయ్ లు నటింంచారు. కన్పించనున్నారు. ఈ సినిమాను ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌నున్నారు. మరి ‘నేనే రాజు.. నేనే మంత్రి’తో 'రానా' ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

11:22 - June 23, 2017

‘వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్ లో పెడితే..సాయంకాలానికి సీఎం అవుతా'..అంటూ 'దగ్గుబాటి రానా' పలికిన డైలాగ్స్ తో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆయన నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో 'రానా' పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇటీవలే ఆయన పలు విభిన్నమైన పాత్రలు పోషించుకుంటూ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా 'రానా’కు మంచి పేరు వచ్చింది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో 'రానా' సరసన 'కాజల్' నటించింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. సినిమాపై అభిమానుల అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచేసిందని టాక్. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

13:28 - June 19, 2017

కాజల్ అగర్వాల్...తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ప్రధాన స్టార్స్ తో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. తన నటన..అభినయం..ఆకట్టుకొనే అందంతో మెప్పిస్తోంది. జులై 19వ తేదీ ఆమె పుట్టిన రోజు.. తనకు స్పెషల్ డే అంటోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు చలన చిత్ర సీమకు ఈమెను పరిచయం చేసింది 'తేజ'.. ‘లక్ష్మీ కళ్యాణం' చిత్రం ద్వారా ఈమె వెండితెరకు పరిచయమైంది. మళ్లీ ఈ అమ్ముడు 'తేజ' దర్శకత్వంలోనే సినిమా చేస్తోంది. దాదాపు పదేళ్ల తరువాత 'తేజ' దర్శకత్వంలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందని..అంతేగాకుండా తనకు ఈ చిత్రం 50వది కావడం విశేషమని 'కాజల్' పేర్కొంటోంది. ‘రానా' హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' 'తేజ' దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. ఇందులో 'రానా' సరసన 'కాజల్' నటిస్తోంది. ఈ చిత్రంలో తాను రాధ అనే పాత్ర పోషిస్తున్నట్లు, తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోందని ‘కాజల్’ పేర్కొన్నారు. ‘రానా’ తో కలిసి పనిచేయడం సరదాగా ఉంటుందని, తన పుట్టినరోజుకు ఇంతకు మించిన బహుమతి మరొకటి ఉండదు అని 'కాజల్' పేర్కొన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - తేజ