తోటపల్లి బ్యారేజీ

21:20 - January 4, 2017

విజయనగరం : వందేళ్లకు పైగా చరిత్ర.. వేలాది ఎకరాలకు సాగు నీరు అందించిన ఘనత.. రెండు రాష్ట్రాలను కలిపే బ్యారేజీ.. అలాంటి బ్యారేజీ ఇప్పుడు కనుమరుగువుతోంది..!బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జి కూల్చివేతకు అధికారులు, ప్రభుత్వం పాటుపడడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 
కనుమరుగవుతున్న తోటపల్లి బ్యారేజీ 
విజయనగరం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన బ్యారేజీ నాగావళి నదిపై ఉన్న తోటపల్లి బ్యారేజీ.. ఒక్క విజయనగంలోనే కాకుండా ఉత్తరాంధ్రలోనే ఎంతో పేరు ప్రతిష్టలున్న బ్యారేజీ ఇప్పుడు కనుమరుగువుతోంది. పార్వతీపురానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యారేజీని అప్పటి బ్రిటీష్ వారు నిర్మించారు.. దీని ద్వారా పార్వతీపురం డివిజన్‌లోని 64వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ బ్యారేజీ నిర్మాణంతో పార్వతీపురం ప్రాంతమంతా సస్యశామలమైంది. ప్రతి ఏడాది రైతులు రెండు పంటలను పండించేవారు.. ఒడిశా రాష్ట్రానికి వెళ్లాలన్నా ఈ బ్రిడ్జే దిక్కు.. అలాంటి బ్రిడ్జి ఇప్పుడు ఇప్పుడు చరిత్ర పుట్టల్లో కలిసిపోనుంది.
నాగావళి నదిపై మరో కొత్త బ్యారేజీ  
నాగావళి నదిపై మరో కొత్త బ్యారేజీ నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం 2003లో నిర్ణయించింది. బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసింది. దాదాపు పదేళ్లకు పైగా బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఇటీవలే ఈ బ్రిడ్జిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 
పాత బ్రిడ్జిని కూల్చివేతకు అధికారులు సిద్ధం 
ఇంతవరకు బాగానే ఉన్న కొత్త బ్యారేజీ ఎంతో చారిత్రత్మక నేపథ్యం ఉన్న పాత బ్రిడ్జిని కూల్చివేయడానికి అధికారులు సిద్ధపడ్డారు. దీనిపై అక్కడి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరి తోటపల్లి బ్యారేజీపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.. 

 

Don't Miss

Subscribe to RSS - తోటపల్లి బ్యారేజీ