త్రివిక్రమ్

10:58 - June 4, 2018

విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు మాటల రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేశ్ కాంబినేషన్ లో తొలి సినిమా రాబోతోంది. మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ డైలాగ్స్ ఎంతటి ప్రాచుర్యం పొందాయో చెప్పనక్కరలేదు. ఇక వెంకీ కుటుంబ కథా సినిమాల హీరో. వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి హిట్ అయిన వెంకీ సినిమాలు చెప్తాయి. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్ అంటే సినిమా పరిశ్రమలోను, ఇటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. పంచ్ డైలాగ్స్ తో త్రివిక్రమ్..టైమింగ్ తో వెంకీ నటనలతో ఇటు అభిమానులకు, ప్రేక్షకులకు నయనానందం..శ్రవణానందం కూడా కలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'అరవింద సమేత..' చిత్రాన్ని చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత వచ్చే జనవరి నుంచి వెంకీతో చిత్రాన్ని చేస్తాడట.

మరోసారి వాయిదా పడనున్న 'టాక్సీవాలా' ?
విజయ్ దేవరకొండ నటిస్తున్న 'టాక్సీవాలా' చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెలలో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఇప్పటికే ఈ నెలకు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ మరికొంత కాలం వాయిదా పడచ్చని అంటున్నారు. సినిమాకు మరిన్ని మెరుగులు దిద్దవలసి రావడం వల్ల ఆలస్యం అవుతోందట.  

15:28 - April 7, 2018

అఘ్నాతవాసితో దెబ్బతిన్న త్రివిక్రమ్.. కథతో, పవన్ కళ్యాణ్ నిర్మాణంలో యూత్ స్టార్ నితిన్ తన 25 వ సినిమాగా చేస్తున్నాడంటేనే..అందర్లో క్యూరియాసిటీ ఏర్పడింది. దానికి తగ్గట్టు గానే.. ఫస్ట్ లుక్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకూ ఫ్రెష్ రోమ్ క్యామ్ టచ్ తో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది సినిమా టీమ్. ప్రీ రిలీజ్ కు పవన్ రాకతో .. అన్ని రకాలుగా సినిమాకు కావల్సిన క్రేజ్ ఏర్పడింది. అలా అంచలంచెలుగా అంచనాలు పెంచి థియేటర్ లోకి వచ్చిన 'చల్ మోహన్ రంగ'.. హుషారుగా చల్ అన్నాడా.. లేక డల్ అయ్యాడా అన్నది తెలుసుకుందాం...

సినిమా కథ...
సినిమా కథ విషయానికొస్తే..పనీ పాటా, చదువూ సంధ్యా అంటూ ఏమీ లేకుండా లైఫ్ ని లైట్ గా లీడ్ చేసే మోహన్ రంగ చిన్నతనంలోనే ..మేఘ ను చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆమె కోసం అమెరికా వెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సినిమాటిక్ గానే మేఘ తో పరిచయం, ప్రేమ, ఆ ప్రేమ ను వ్యక్తపరచలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. దాంతో మేఘ ఇండియా వచ్చేస్తుంది. ఆమెను వెతుక్కుంటూ ఇండియా వచ్చేసిన మోహన్ రంగ ఆమెను ఎలా కలుసుకున్నాడు..? తన ప్రేమను ఎలా వ్యక్తపరచాడు..? అతని ప్రేమను ఆమె యాక్సెప్ట్ చేసిందా..? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల అభినయం...
నటీనటుల విషయానికొస్తే..యూత్ స్టార్ నితిన్ ఈ సినిమాలో నటన పరంగా చాలా పరిణితి కనపర్చాడు. స్టైలింగ్ కూడా బావుంది. కాకపోతే తన గాడ్ అయిన..పవన్ కళ్యాణ్ ని చాలా ఎక్కువగా వాడేశాడు. చాలా చోట్ల ఇమిటేట్ కూడా చేశాడు. నితిన్ మిగతా సినిమాలతో పోలిస్తే.. కామెడీ టైమింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. ఇక లై సినిమాలో తన లుక్స్ తో అందరినీ ఇంప్రెస్ చేసిన మేఘ ఆకాష్..ఈ సినిమాలో కూడా లుక్స్ తో ఆకట్టుకుంది. కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చాలా పేలవంగా అనిపించింది. సిచ్యువేషన్ కి సింక్ గాని ఎక్స్ ప్రెషన్స్ తో కన్ ఫ్యూజ్ చేసింది. చాల రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన లిజి.. ఏ ప్రత్యేకతా లేని సాదాసీదా క్యారెక్టర్ లో కనిపించింది. నితిన్ ప్రెండ్స్ గా నటించిన మధు నందన్, పమ్మిసాయి, మంచి కామెడీ జనరేటర్స్ గా ఉపయోగపడ్డారు. ఇక రావు రమేష్, నరేష్, నర్రాశీను క్యారెక్టర్స్ సినిమాను సేవ్ చేసే ఎలిమెంట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో రావు రమేష్, నర్రాశీనుల మధ్య వచ్చే ఎపిసోడ్స్..సెకండాఫ్ మొత్తాన్ని కాపాడింది. సత్య కామెడీ అక్కడక్కడా...నవ్వించినా.. కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. మిగతా నటీనటులందరూ..డైరెక్టర్ చెప్పిన విధంగా ..తమపాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. టైటిల్స్ లో ఈ కథ త్రివిక్రమ్ దే అని వేశారు. సినిమా చూశాక మాత్రం అసలు ఈ కథ త్రివిక్రమ్ దేనా..అని డౌట్ రావడం కామన్. క్లారిటీ లేని క్యారెక్టరైజేషన్, సెంటర్ పాయింట్ లేని స్టోరీ.. త్రివిక్రమ్ ఇచ్చాడు అంటే నమ్మడం కష్టం. ఇక ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కృష్న చైతన్య ..స్క్రీన్ ప్లే లో ఎలాంటి మెరుపులు యాడ్ చెయ్యలేదు. ఫస్టాఫ్ లో u.s యాంబియెన్స్ వల్ల, కృష్ణ చైతన్య కామెడీ టైమింగ్ వల్ల సినిమా అలా అలా నడిచిపోతుంది. ఇంట్రవెల్ కార్డ్ తోనే సినిమాలో ఉన్న లోపాన్ని బయట పెట్టిన డైరెక్టర్, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి ఫ్లాట్ గా స్టోరీ ని నడిపించేశాడు. మిత్ర క్యారెక్టర్ ఎంట్రీ వరకూ..సినిమా అసలు ఎటు పోతుందో అర్దం కాదు. సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పడంతో, స్టోరీలో కొత్తదనం లేకుండా పోవడంతో ఒక సగటు సినిమాగా నిలిచింది చల్ మోహన రంగ. అయితే సినిమాను నిలబెట్టడానికి..ఆర్.ఆర్ పరంగా బాగా హార్డ్ వర్క్ చేశాడు తమన్. కానీ సీన్స్ లో బలమైన కంటెంట్ లేకపోవడంతో ఆర్.ఆర్ కూడా ఓవర్ లౌడింగ్ అనిపిస్తుంది. నటరాజ్ సుబ్రమణ్యన్ సినిమాటోగ్రఫీ..చల్ మోహన రంగా టెక్నీషియన్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. U.S ని గానీ, ఊటీ అందాలను గానీ.. అతను ప్రజెంట్ చేసిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ఏరియల్ షాట్స్..విజువల్ ట్రీట్ గా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి ల నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే జనరల్ స్టోరీలైన్, క్లారిటీ లేని స్క్రీన్ ప్లే, అసలు ఆకట్టుకోలేని ఎమోషన్స్, అనేక బలహీనతలతో తెరకెక్కిన 'చల్ మోహనరంగా' కి క్యామెడీ బ్యాకింగ్ ఒక్కటే అండగా నిలిచింది. ఆ కామెడీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుంది అనే దానిపై మోహనరంగా బాక్సాఫీస్ స్టామినా ఆధారపడి ఉంది.

ప్లస్..
ఫస్టాఫ్
కామెడీ
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనస్
రొటీన్ కథ
స్క్రీన్ ప్లే
కనెక్ట్ కాని ఎమోషన్స్
కన్ ఫ్యూజింగ్ క్యారెక్టర్స్

రేటింగ్...విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...
 

10:22 - February 16, 2018

తన ఫామిలీ హీరోలకి కాకుండా తనను నిజంగా అభిమానించే నటుడికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోతో పాటు స్టార్ డైరెక్టర్ కూడా తన సపోర్ట్ ని అనౌన్స్ చేశాడు. లవర్ బాయ్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో 'నితిన్'. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవడంలో 'నితిన్' ముందు ఉంటాడు. 'లై' లాంటి సినిమాలతో పాటు ఫామిలీ స్టోరీస్ కూడా టచ్ చేసిన 'నితిన్' తన ప్రీవియస్ సినిమా 'లై' లో ఇంటరెస్టింగ్ రోల్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని ట్రై చేశాడు. 'లై' సినిమాలో 'నితిన్' నటనకు మంచి మార్కులే పడ్డాయి.

'నితిన్' ని లవర్ బాయ్ గా యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ ఫామిలీ హీరోగా నటించిన 'అ ఆ' సినిమాని కూడా హిట్ చేశారు. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' డైరెక్షన్ లో వచ్చిన 'అ ఆ' సినిమా ఆడియన్స్ ని రీచ్ అయింది. 'నితిన్' స్వతహాగా 'పవన్ కళ్యాణ్' అభిమాని. పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు 'నితిన్' సినిమాకి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రియల్ 5న విడుదలయ్యే ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి డైరెక్టర్ కృష్ణ చైతన్య. పవన్ కళ్యాణ్ తో పాటు నితిన్ తో 'అ ఆ' సినిమా తీసిన త్రివిక్రమ్ కూడా 'నితిన్' కి సపోర్ట్ ఇస్తున్నాడు.

ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో 'మేఘా ఆకాశ్' క‌థానాయిక‌గా నటిస్తోంది. 'ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', 'శ్రేష్ట్ మూవీస్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించగా, మూవీకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 

15:19 - January 10, 2018

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'..మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' కాంబినేషన్ లో రూపొందిన 'అజ్ఞాత వాసి'.. చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాను చూడటానికి అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. మరి

సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను మెప్పించిందా ? అనే దానిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో కత్తి మహేష్ (సినీ క్రిటిక్), కృష్ణ సాయిరాం (టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం సినిమాపై నమ్మకం కలిగిందని, సినిమా చూసిన అనంతరం ఆశ కాస్త నిరాశే మిగిలిందని సినిమా క్రిటిక్ 'కత్తి మహేష్' పేర్కొన్నారు. మంచి కథ తీసుకున్నారని..కథలో గమనం లేకపోవడంతో సినిమాను అపహస్యం చేశారన్నారు. ఫ్యాన్స్ ను కూడా పూర్తిగా నిరాశపరిచిందన్నారు. మాస్..ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కించాలని ప్రయత్నించారని, కానీ చిత్ర యూనిట్ కన్ ఫ్యూజ్ అయ్యారని టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ 'కృష్ణ సాయిరాం' పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:14 - October 3, 2017

టాలీవుడ్ లో సీన్ మారుతుంది. ఇంతకుముందు హీరోని చూసి సినిమాకి వచ్చే ఆడియన్సు ఇప్పుడు డైరెక్టర్ నేమ్ చూసి వస్తున్నారు. సినిమా అంటే హీరో మాత్రమే కాదు కదా ..డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ నేమ్ చూసి చెప్పేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్ ఎప్పుడు హిట్ టాక్ తో దూసుకెళ్తాయి. అలానే ఇప్పుడు ఒక టాప్ డైరెక్టర్ ఒక టాప్ హీరో కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఇంటరెస్ట్ మొత్తం వాళ్ళమీదనే ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పేరుతో ఇండస్ట్రీ హిట్ రికార్డుకి మంచి పరిచయం ఉంది. తన సినిమాల్లో ప్రతి సీన్ లో పంచ్ డైలాగ్స్ ఉండాలి అని ఏర్చి కూర్చి పంచ్ డైలాగ్స్ పెట్టె ఈ స్టార్ డైరెక్టర్ 'అత్తారింటికి దారేది' సినిమాతో మెగా హీరో 'పవన్ కళ్యాణ్' కి హిట్ ఇచ్చాడు. ఒక నార్మల్ స్టోరీ 'అత్తారింటికి దారేది' సినిమా గా మారి హిట్ టాక్ తో ఆడియన్స్ ని రీచ్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ కురిపించింది.

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటుల్లో 'ఎన్ టి ఆర్' ఒకడు. ఎన్ టి ఆర్ రీసెంట్ సినిమా 'జై లవ కుశ’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బాబీ డైరెక్షన్ లో కొంత గాప్ తరువాత వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈ జై లవ కుశ సినిమా. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేసే ఎన్ టి ఆర్ నటించిన జై లవ కుశ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమాకి ఎన్ టి ఆర్ నటనే మేజర్ ఎసెట్ అని డైరెక్టర్ బాబీ చాల సంధర్భాల్లో చెప్పాడు కూడా. ఈ జై లవ కుశ సినిమాలో ఉన్న మూడు హీరో పాత్రలను ఎన్ టి ఆర్ పోషించడం సినిమాకి ఇంటరెస్టింగ్ పాయింట్ అయింది. నటుడిగా ఎన్ టి ఆర్ వేరియేషన్స్ చూపించడం లో ఎప్పుడు ముందే ఉంటాడు.

'
కాటం రాయుడు' సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో 'పవన్ కళ్యాణ్' 25వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో తండ్రి – కొడుకులు సెంటిమెంట్ మేజర్ హైలెట్ అని తెలుస్తోంది. గతంలో పవన్ – త్రివిక్రమ్ లు కలిసి చేసిన 'అత్తారింటికి దారేది' అత్తా – మేనల్లుళ్ళ అనుబంధం ప్రధాన అంశంగా రూపొంది మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 'కాటం రాయుడు' సినిమా కూడా అన్న తమ్ముల సెంటిమెంట్ తో అల్లుకున్న కధే. అలానే ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్ టి ఆర్ సినిమా చెయ్యబోతున్నారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. 'నాన్నకు ప్రేమతో' వంటి క్లాస్ సినిమాల్లో నటించిన ఎన్ టి ఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాకి న్యాయం చేస్తాడు అనే టాక్ కూడా ఉంది.

12:04 - September 3, 2017

మెగా కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. ఆయా ఫంక్షన్..ఇతర కార్యక్రమాల్లో 'పవన్ కళ్యాణ్' పాల్గొనకపోతుండడంపై వారి మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు షికారు చేస్తుంటాయి. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఎన్నోమార్లు చెబుతున్నా అలాంటి వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పేరిట పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. దీనితో చిరంజీవి, పవన్ మధ్య అంతగా సఖ్యత లేదని ప్రచారం జరిగింది.

కానీ తాజాగా ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్..చిరంజీవి ఉన్న ఆ ఫొటో అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోతో విబేధాలు..ఇతర ఎన్నో ప్రశ్నలకు చెక్ పెట్టినట్లైంది. ‘పవన్ కళ్యాణ్' జన్మదిన సందర్భంగా 'రామ్ చరణ్ తేజ' ఓ ఫొటోను షేర్ చేశారు. 'మీరు బాబాయి కావడం నా అదృష్టం అని చెప్పడం కూడా తక్కువే అవుతుంది. మీ అబ్బాయిగా నేను చాలా సంతోషంగా ఉన్నా.. అదృష్టం, ఆశీర్వాదం పొందిన భావనతో ఉన్నా. మీ నుంచి నిజాయతీగా, సింపుల్‌గా ఉండటం నేర్చుకున్నా. మనసులో ఉన్న భావనలనే మాట్లాడటం నేర్చుకున్నా. లక్షల మందిలో మీరొక వినయపూర్వకమైన వ్యక్తని నిజంగా నమ్ముతున్నా. 'పవర్‌' పవర్‌.. సింప్లిసిటీ, హ్యుమానిటీలో ఉంది' అని రామ్‌ చరణ్‌ రాశారు. దీంతో పాటు హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. దీని తర్వాత మరో రెండు ఫొటోలు కూడా జత చేశారు.

17:23 - July 25, 2017

మెగా ఫ్యామిలీ కుటుంబం నుండి వెండితెరకు పరిచయమై బిజీ బిజీగా మారిపోతున్నారు. అందులో మెగా స్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్' ఒకరు. ఇప్పటికే యువతో ఎంతో క్రేజ్ తెచ్చుకుని తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న నటుల్లో 'పవన్ కళ్యాణ్' ఒకరు. ప్రస్తుతం వీరిద్దరి సినిమాలు షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి.

సుకుమార్ దర్వకత్వంలో 'రామ్ చరణ్ తేజ' నటిస్తున్నాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చిత్రం ఉండనుందంట. ఈ సినిమాలో 'రామ్ చరణ్' వైవిధ్యమైన పాత్రను పోషించనున్నారని..పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇందులో 'చెర్రీ' సరసన 'సమంత' హీరోయిన్ గా నటిస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా భారీ సెట్టింగ్ లో షూటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ నవంబర్ బరిలో నిలిచిన 'పవన్'..’త్రివిక్రమ్' సినిమా సంక్రాంతికి మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ‘పవన్ కళ్యాణ్' సైతం వేగంగా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఇతర సినిమాలకు సైతం సైన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని త్రివిక్రమ్..పవన్ యోచిస్తున్నట్లు టాక్.

మరి సంక్రాంతి బరిలో 'రామ్ చరణ్' నిలుస్తారా ? బాబాయ్ 'పవన్ కళ్యాణ్' సినిమాతో ముందే రిలీజ్ చేయాలని 'చెర్రీ' నిర్ణయిస్తారా ? అనేది రానున్న రోజుల్లో చూడాలి.

13:58 - July 23, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఆయన 'జనసేన' పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేషశ్ రాష్ట్రాల్లో పార్టీ కోసం కార్యకర్తలను నియమిస్తున్నారు. పరీక్షల ద్వారా టాలెంట్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు కూడా.

ఇదిలా ఉంటే ప్రస్తుతం 'పవన్' పలు సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీగా మారిపోయారు. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' దర్శకత్వంలో 'పవన్' ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమా అనంతరం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా పూర్తి చేయాలని 'పవన్' నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం పూర్తిగా రాజకీయంపై దృష్టి పెట్టాలని 'పవన్' ప్లాన్ చేసుకున్నారని వినికిడి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఎన్నికల కంటే ముందుగానే చిత్రం పూర్తి చేయాలని చిత్ర యూనిట్ తో పాటు 'పవన్' కూడా నిర్ణయానికి వచ్చారని టాక్. కేవలం 40 రోజుల కాల్షిట్లు మాత్రమే కేటాయించారని తెలుస్తోంది. అంటే కేవలం 40 రోజుల్లోనే సినిమా పూర్తవుతుందన్నమాట. ఇందులో 'పవన్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.

మరి సినిమా 40 రోజుల్లో పూర్తవుతుందా ? ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

10:10 - July 21, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన తాజా చిత్రం కోసం కష్టపడుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘పవన్' ఈ సినిమాలో ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్. సినిమాకు సంబంధించిన టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.

సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలనే భావనతో 'పవన్' ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా నిన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తాజాగా టీం బ‌ల్గేరియా షిఫ్ట్ అయింది. 20 రోజ‌లు పాటు అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న‌ట్టు స‌మాచారం. షూటింగ్ లో పాల్గొనేందుకు 'పవన్' బల్గేరియా వెళ్లారు. పవన్ వెళుతున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పవన్ సరసన కీర్తి సురేష్..అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బల్గేరియాలో వీరిద్దరిపై పాటలు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మ‌ధ్య‌ ‘రోబో 2.0’, 'వివేగం' మూవీ టీం కూడా బల్గేరియాలో కొన్ని సన్నివేశాలతో పాటు సాంగ్స్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా 'ప‌వ‌న్' సినిమా కూడా అక్క‌డికే బ‌య‌లుదేర‌డం విశేషం. దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

10:58 - July 10, 2017

జూనియర్ ఎన్టీఆర్ కలల ప్రాజెక్టుకు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' అడ్డుపడుతున్నాడా ? ఈ వార్త సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇరువురు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'కాటమరాయుడు' డిజాస్టర్ అనంతరం మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో 'పవన్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలో 'జై లవ కుశ' చిత్రంలో 'ఎన్టీఆర్' నటిస్తున్నాడు. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలు పోషించనున్నాడు. అందులో ఒకటి విలన్ పాత్ర కావడం విశేషం.
'రాశీఖన్నా', 'నివేదితా థామస్' లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టులోపు షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని దర్శకుడు బాబి పక్కా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ అనంతరం నవంబర్ మాసంలో 'త్రివిక్రమ్' దర్వకత్వంలో 'ఎన్టీఆర్' నటించనున్నాడని తెలుస్తోంది. కానీ 'పవన్' తో 'త్రివిక్రమ్' చేస్తున్న సినిమా ఆ లోపు షూటింగ్ కంప్లీట్ అవుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దసరా విడుదల చేయాలని అనుకున్నా ఆలస్యం అవుతుండడంతో అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎన్టీఆర్' సినిమాకు 'పవన్' అడ్డు పడుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఎన్టీఆర్..త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - త్రివిక్రమ్