దంతెవాడ

21:57 - November 8, 2018

దంతెవాడ: చత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని పోలిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. చత్తీస్ ఘడ్ కు చెందిన అభినందన్ పాఠక్ అచ్చు మోడీ లాగానే ఉంటారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బస్తర్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.  గతంలో బీజేపీ కార్యకర్తగానే ఉన్న పాఠక్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దంతెవాడ, కొండగావ్‌, జగ్దల్‌పూర్‌, బస్తర్‌ జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నపాఠక్ తో ఓటర్లు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

07:58 - November 4, 2018

ఛత్తీస్‌గఢ్‌ : దంతేవాడలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అర్ధరాత్రి రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను కాల్చివేశారు.  భాగ్యనగరం అడవుల్లో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులను దింపి రెండు బస్సులను కాల్చివేశారు. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.

 

09:34 - July 19, 2018

ఛత్తీస్ ఘఢ్ : దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లో తుపాకీ మరోసారి ఘర్జించాయి. భద్రతా బలగాలకు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెల్లవారుఝామున స్పెషల్ బెటాలియన్ కూబింగ్ జరుపుతున్న నేపథ్యంలో మావోలు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మావోలు కూడా వున్నట్లుగా భద్రతాబలగాలు గుర్తించాయి. మావోల నుండి భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గతకొంతకాలం నుండి అటవీప్రాంతాన్ని వీడి మరో స్థలానికి వలస వెళ్లి గతకొంతకాలంగా వారి ఉనికి స్థబ్దుగా వున్న మావోలు తిరిగి తమ స్థావరాలకు చేరుకున్నట్లుగా సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఈరోజు పక్కా ప్లాన్ తో కూబింగ్ చేపట్టిన క్రమంలో మావోలు ఎదురు కాల్పులు జరపిన ఘటనలో ముగ్గురు మహిళా మావోలతో సహ మొత్తం ఏడుగురు మావోలు మృతి చెందారు.  

14:51 - May 20, 2018

చత్తీస్‌గడ్‌ : దంతెవాడలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చోల్నార్‌ గ్రామంలో పోలీసుల వాహనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై పాతిపెట్టిన ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఐదు మంది జవాన్లు మృతి చెందారు. చత్తీస్‌గడ్‌ ఆర్మ్‌ఫోర్స్‌కు చెందిన ముగ్గురు జవాన్లు, డీస్ట్రీక్ట్‌ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎల్ఈడీ బాంబు పేలడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

17:25 - March 30, 2016

ఛత్తీస్ గఢ్ : మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. జవాన్ల వాహనాన్ని మందుపాతరతో పేల్చి ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారు. దంతెవాడలోని మైలవాడలో సంత మార్కెట్ నిర్వహిస్తుంటారు. ఈ సంతకు నక్సలైట్లు వస్తున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. అనంతరం జవాన్లు ఇతర ప్రాంతాలకు వాహనంలో వెళుతున్నారు. మందుపాతర పేలడంతో జవాన్ల వాహనం పేలిపోయింది. పేలుడు ధాటికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. వాహనంలో ఉన్న ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనలో గాయపడిన మరో నలుగురిని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. జవాన్లు 230 బెటాలియన్ కు చెందిన వారుగా తెలుస్తోంది. 

16:59 - March 30, 2016

ఛత్తీస్ గఢ్ : మావోయిస్టులు మళ్లీ విజృంభించారు. భద్రతా బలాగాలే లక్ష్యంగా వారు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన దాడిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటన దంతెవాడలోని మైలవాడలో చోటు చేసుకుంది. ప్రతి వారం మైలవాడలో జరిగే వారపు సంతకు సీఆర్‌పిఎఫ్‌ జవాన్లు వెళుతుంటారు. దీన్ని గమనించిన మావోయిస్టులు మోక్‌పాల్‌ -మైలవాడ కల్వర్టు సమీపంలో మందు పాతర అమర్చి కాపు కాశారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం కల్వర్టు సమీపంలోకి రాగానే మందుపాతరను పేల్చారు. పేలుడు ధాటికి వాహనం తునాతునకలయ్యింది. ఆ సయమంలో వాహనంలో 14 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఏడుగురు అక్కడికక్కడనే దుర్మరణం చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. జవాన్ల శరీరాలు చిధ్రమయ్యాయి. మావోయిస్టుల దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ ప్రారంభించారు.

Don't Miss

Subscribe to RSS - దంతెవాడ