దమనకాండ

20:18 - August 12, 2017

మెదక్ : అమరుల స్ఫూర్తి యాత్రకు వరుసగా రెండోరోజు పోలీసులు అడ్డు తగిలారు. హైదరాబాద్‌ నుంచి యాత్రకు బయలుదేరిన తెలంగాణ జేఏసీ నేతల్ని తుప్రాన్‌ మండలం అల్లాపూర్‌దగ్గర పోలీసులు ఆపేశారు.. టోల్‌గేట్‌ దగ్గర కోదండరాం టీంను అరెస్ట్ చేసి పలు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.. కోదండరాంను కౌడిపల్లి పీఎస్‌కు పంపారు.. అరెస్ట్ విషయం తెలుసుకున్న జేఏసీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ముందు ఆందోళనకు దిగారు.స్ఫూర్తియాత్రకు ముందు... కోదండరాం.. నిజమాబాద్ జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మార్గాన్ని అన్వేషించడం కోసమే అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరుల స్ఫూర్తి యత్రకు పోలీసులు అనుమతించలేదని.. అందుకే హాల్ మీటింగ్ నిర్వహించాలని తీర్మానించామని ప్రకటించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని చెప్పారు.తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు జేఏసీ స్ఫూర్తియాత్ర చేపట్టాలని రెండురోజులుగా ప్రయత్నిస్తోంది. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు బయలుదేరిన జేఏసీ నేతల్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆపేశారు.. ఆ తర్వాత అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు పంపారు.. అరెస్టులకు భయపడమన్న జేఏసీ నేతలు... శనివారం మళ్లీ యాత్రకు వెళతామని ప్రకటించారు. ఈ సమాచారంతో శనివారం నిజామాబాద్‌కు వెళ్లే ప్రతి మార్గంలో తనిఖీలుచేసిన పోలీసులు... మళ్లీ జేఏసీ నేతల్ని అదుపులోకి తీసుకొని.. మళ్లీ హైదరాబాద్ తిప్పిపంపారు.

17:02 - August 11, 2017

కామారెడ్డి : టీజేఏసీ చైర్మన్ కోదండరాం కామారెడ్డి జిల్లా చేస్తున్న అమరవీరుల స్పూర్తియాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్లిన కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పీఎస్ లో ఉన్న ఆయన భోజనం తీసుకునేందుకు నిరాకరించడంతో పోలీసులు కోదండరాంను భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:19 - March 24, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో పోలీసులు కొనసాగిస్తున్న దమనకాండపై  విద్యావేత్తలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. వీసీ అప్పారావు సెలవు నుంచి తిరిగొచ్చిన వెంటనే గొడవలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు  హాస్టళ్లను మూసివేసి నీరు, విద్యుత్‌ నిలిపివేయడం.. విద్యార్ధుల హక్కులను కాలరాయడమే అవుతుందని విమర్శిస్తున్నారు.  
విద్యార్ధులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణం : కోదండరాం 
హెచ్‌సీయూ విద్యార్ధులపై దఫదఫాలుగా పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తప్పు పట్టారు. యూనివర్సిటీ అధికారులు హాస్టళ్లను మూసివేసిన దరిమిలా వంటవార్పు చేసుకుంటున్న విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం దారుణమన్నారు. 
వీసీ అప్పారావు రాకతో వర్సిటీలో అశాంతి : వీహెచ్
హెచ్‌సీయూకు వెళ్లిన కాంగ్రెస్‌ ఎంపీ హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులు తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీసీ అప్పారావు రాకతోనే యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిందని వీహెచ్‌ మండిపడ్డారు. 
అలజడికి సంఘ్‌ పరివార్‌ శక్తులే కారణం : జేడీ శీలం 
హెచ్‌సీయూలో అలజడికి సంఘ్‌ పరివార్‌ శక్తులు కారణమని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం విమర్శించారు. విద్యావ్యవస్థలో మతోన్మాదుల జోక్యం  పెరగడంతోనే యూనివర్సిటీల్లో గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు. 
అరెస్టు చేసిన విద్యార్ధులను విడుదల చేయాలి : కాంగ్రెస్ 
హెచ్‌సీయూ ఘటనలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం... డీజీపీ అనురాగ్‌ శర్మను కలిసి వినతిపత్రం అందచేశారు. అరెస్టు చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ  విషయాల్లో పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తెచ్చారు. 

 

20:40 - December 14, 2015

హైదరాబాద్ : ఆశావర్కర్లపై ప్రభుత్వం దమనకాండను కొనసాగిస్తుందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈమేరకు వారు మీడియాతో మాట్లాడారు. నాగేశ్వర్‌ అరెస్ట్, ఆయన పట్ల పోలీసుల ప్రవర్తన దారుణమన్నారు.

 

Don't Miss

Subscribe to RSS - దమనకాండ