దర్శకుడు

06:21 - September 14, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1948 సెప్టెంబర్ 5న కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. సినీ దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా పేరు పొందారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియచేశారు. ఆయన దర్శకత్వం వహించిన …తిలదానం, కమ్లి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన తెరకెక్కించిన తిలదానం, డాక్యుమెంటరీ చిత్రమైన సురభి చిత్రాలు నంది అవార్డులను గెలుచుకున్నాయి. 

ఆయన ఆరు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ఈయన కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలు చేశారు.  1989లో బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ నేషనల్ అవార్డును సైతం శాస్త్రి గెలుచుకున్నారు. 2006లో నందిత దాస్ ప్రధాన పాత్రలో రూపొందించిన కమిలి చిత్రం దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.  తెలుగు, కన్నడ సినిమాలు తీసిన శాస్త్రి… చివరగా ఖోఖో ప్రధాన అంశంగా ‘శాణు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

12:04 - August 17, 2018

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా పేరు తెచ్చుకున్న వినాయక్..ఇటీవల మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 సినిమాకు డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది స్టార్ డైరెక్టర్లలో వినాయక్ ను చిరు ఎంచుకోవటంతో ఆయనపై వున్న నమ్మకమేనన్నారు మెగాస్టార్. మరి మెగాస్టార్ నమ్మకాన్ని పొందిన వినాయక్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అటువంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించేందుకు మంచువారబ్బాయి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం మంచు విష్ణు ప్రస్తుతం 'ఓటర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పరశురామ్ వేరే నిర్మాతల దగ్గర ముందుగానే అడ్వాన్స్ తీసుకోవడం వలన, ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చెప్పలేం. అందువలన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మంచు విష్ణు ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. బాలకృష్ణ తదుపరి సినిమా చేయడం కోసం అందుకు సంబంధించిన సన్నాహాలను వినాయక్ సిద్ధం చేసుకుంటున్నా..'ఎన్టీఆర్' బయోపిక్ ను పూర్తి కావటానికి చాలా సమయం పట్టే అవకాశాలుండటంతో ఈలోగా ఒక సినిమా చేయాలనుకుంటే వినాయక్ చేసేయొచ్చు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

12:13 - July 6, 2018

కాజల్ అంటే కాటుక అని అర్థం..కళ్లకు కాటుక ఎంత అందాన్నిస్తుందో వెండి తెరపై కాజల్ అందం అలా వుంటుంది. సినీ పరిశ్రమలో పెద్ద హీరోలందరితోను నటించిన కాజల్ మోగా స్టార్ చిరంజీవితో కలిసి స్టెప్ లేసింది. కమర్షియల్‌ కాజల్ అనే కాకుండా హిస్టరీ కాజల్ గా ఫాంటసీ కాజల్ గా ‘మగధీర’తో నిరూపించుకుంది. యువరాణి మిత్రవిందగా కాజల్‌ ఆ పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఇప్పుడు ఆమె మరో చారిత్రక. చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

రావణాసురుడి సోదరి శూర్ఫణఖగా కాజల్?..
దర్శకుడు భార్గవ్‌ ఓ చారిత్రక సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో కాజల్‌ రావణాసురుడి సోదరి శూర్పణక పాత్రలో నటించనున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. రామాయణంలోని చాలా పాత్రల గురించి మనం విని ఉంటాం కానీ శూర్పణక గురించి చాలా మందికి అంతగా తెలీదని.. అందుకే ఈ సినిమాలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలని చిత్రబృందం భావిస్తోందట. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

19:09 - June 16, 2018

ఇటీవలి కాలంలో తన మ్యూజిక్ తో యూత్ ను మెస్మరైజ్ చేస్తున్న యువ మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్యతో 10టీవీ స్పెషల్ చిట్ చాట్..

17:46 - June 4, 2018

సామాజికాంశాలను తన చిత్రాల ద్వారా చూపించే కొరటాల శివ ఇప్పుడు మెగాస్టార్ కి కట్ చెప్పనున్నాడా? సైరాతో బిజీగా వున్న మెగాస్టార్ కొరటాల శివతో కమిట్ అవ్వనున్నాడా? భరత్ అను నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు చిరంజీవి సై అన్నట్లుగా సమాచారం. రీ ఎంట్రీనిచ్చి ఖైదీనంబర్ 150తో మెగా హిట్ ను అందుకున్న చిరంజీవి ఒక వైపున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమాను చేస్తూనే, మరో వైపున కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కొరటాల వినిపించిన కథకి చిరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయం తెలిసిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండనుంది? చిరంజీవి పాత్ర తీరుతెన్నులు ఎలా వుండనున్నాయి? అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది.

ద్విపాత్రాభియంలో చిరంజీవి మరోసారి అలరించనున్నాడా?..
ఈ సినిమాలో బిలియనీర్ అయిన ఎన్నారై గాను .. ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రెండు పాత్రలను కూడా కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై వున్నాడని అంటున్నారు. కొరటాల వరుసగా ఘన విజయాలను అందుకుంటూ వస్తుండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందో చూడాలి.

 

19:28 - April 12, 2018

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఈసారి ఏకంగా డ్యూయల్ రోల్ లో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేశాడు.. నాని హీరోగా, రెండు హిట్లు ఇచ్చిన.. మెర్లపాక గాంధి డైరక్టర్ గా మంచి రైజింగ్ లో ఉన్న దిల్ రాజు.. రిలీజ్ అనగానే ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్.. మరి ఆ రేంజ్ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన కృష్ణార్జునుడు ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాడు.. వాళ్ల యుద్ధం లో ఎలాంటి సక్సెస్ సాధించాడు ఇప్పుడు చూద్దాం..

 

కథ విషయానికి వస్తే.. ఒక మారుమూల పల్లెటూరిలో ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడివేసే కృష్ణను అతని బిహేవియర్ వల్ల ఏ అమ్మాయి ప్రేమించదు..కాని హైదరాబాద్ నుండి వచ్చిన రియా కృష్ణను ప్రేమిస్తుంది... అలాగే యూరప్ లో రాక్ స్టార్ గా ఉన్న అర్జున్ ప్లే భాయ్.. కాని ఇండియా నుండి వచ్చిన సుబ్బలక్ష్మీని చూసి సిన్సియర్ గా లవ్ చేస్తాడు.. కాని ఆమె అర్జున్ ను రిజక్ట్ చేసి హైదరాబాద్ కి వస్తుంది... ఇక రియాతో కూడా కృష్ట నీకు కరెక్ట్ కాదు అని, ఆమెను బలవంతంగా హైదరాబాద్ కు పంపిస్తాడు వాళ్ళ తాత.. అలా హైదరాబాద్ వచ్చిన రియా, సుబ్బలక్ష్మీ ఇద్దరూ కనపడకుండా పోతారు.. అసలు వాళ్ళు ఏమైయ్యారు... కృష్ణ, అర్జున్ ఇద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారు.. చివరికి రియా,సుబ్బలక్ష్మీలను ఎలా కాపాడుకున్నారు.. లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవలసిందే..

 

నటీనటుల విషయానికి వస్తే.. మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమాను కూడా తన నాచ్యూరల్ ఫర్ఫామెన్స్ తో నిలబెట్టేస్తాడు అనే పేరున్న నాని,... ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు.. కెరీర్ లో రెండో సారి డ్యూయల్ రోల్ చేసిన నాని రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ చూపిస్తూ.. ఆ రెండు పాత్రలను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి చాలా హర్డ్ వర్క్ చేశాడు.. అయితే... కృష్ట పాత్రలో కల్లకపటం లేని పల్లెటూరి.. అబ్బాయిగా ఒదిగిపోయి.. ఫుల్ ఫన్ ను జనరేట్ చేసిన నాని.. ప్లేబయ్ తరహా రాక్ స్టార్ గా మాత్రం అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.,. అతనికి ఉన్న నాచ్యూరల్ స్టార్ అనే టాగ్ వల్ల.. రాక్ స్టార్ క్యారక్టర్ లో ఉన్న నెగెటీవ్ టచ్.. అంతగా ఎలివేట్ కాలేదు.. ఇక స్టైలింగ్ కూడా చాలా సాధాసీదాగా అనిపిస్తుంది.. కృష్ట పాత్ర మాత్రం సినిమాను కాపాడే ఎలిమెంట్ గా నిలిచింది.. ఇక ఇప్పటి వరకు పర్ఫామెన్స్, క్యారక్టర్ లో అలరించిన అనుపమా పరమేశ్వరన్ లిమిటెడ్ ప్రజన్స్ ఉన్న రోల్ లో కనిపించింది... మరో హీరోయిన్ రుక్సార్ మీర్ కూడా స్క్రీన్ ప్రజన్స్ పరంగా, పర్ఫామెన్స్ పరంగా.. జస్ట్ ఓకే అనిపిస్తుంది.. ఇక గాంధీ సినిమాలకు కామెడీ బ్యాక్ బోన్ గా మంచి సపోర్ట్ ఇస్తున్న బ్రహ్మాజీ ఈ సినిమాలో కూడా హిల్లేరియస్ కామెడీని జనరేట్ చేసే క్యారక్టర్ పడటంతో, ఆ పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు.. అతను చేసిన కామెడీ ఫస్ట్ ఆఫ్ కి హైలెట్ అని చెప్పవచ్చు.. ఇక యూట్యూబ్ స్టార్స్ కాస్త ఇంపార్టెట్స్ ఉన్న క్యారక్టర్స్ లో కనిపించి.. పర్వాలేదు అనేలా నవ్వించారు.. ఇక మిగతా నటీనటులు అంతా, పాత్రల పరిది మేరా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు...

 

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. రైటర్ గా డైరక్టర్ గా మొదటి రెండు సినిమాలతో గ్రాండ్ హిట్స్ అందుకున్న గాంధీ ఈ సినిమాకు కూడా మంచి స్పానూ ఉన్న స్టాండెడ్స్ సెంట్రల్ పాయింట్ ను కథగా ఎంచుకున్నాడు.. కాని మొదటి రెండు సినిమాలలా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడం కాని, టెంపోను మెంటేయిన్ చేయడంలో కాని బాగా తడబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ సినిమాను నాని నిలబెట్టలేసినా... రెండో ఆఫ్ వచ్చేసరికి.. ఊహాజనితమైన కథ. సో సో గా సాగే స్క్రీన్ ప్లేతో సినిమా సైడ్ ట్రాక్ అయిపోయింది.. రచయితగా అక్కడక్కడా మెరిసిన గాంధీ..డైరక్టన్ పరంగా ఓకే అనిపించుకున్నాడు... స్క్రీన్ ప్లే పంరంగా మరింత కసరత్తు చేసి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది,.. ఇక డైరక్టర్స్ కి ఫుల్ సపోర్డ్ ఇచ్చే. వ్యూ ఉన్న కెమేరా మెన్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా విజ్యూవల్స్ పరంగా ఫుల్ క్రెడిట్ ఇవ్వచ్చు.. రెండు క్యారక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపించడంలో, యూరప్ అందాలను కెమేరాలో బంధించడంలో, క్యారక్టర్స్ లోని ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో.. అతను పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ పై కనిపించింది.. ఇక మ్యూజిక్ డైరక్టర్ హిప్ హాప్ తమిళ్ ఈ సినిమాకు కాస్త తమిళ్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు.. దృవ సినిమాకు తన మ్యూజిక్ తో మంచి హైప్ తెచ్చిన హిప్ హాప్ తమిళ్ ఈ సినిమా వరకు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు.. పాటలలో తమిళ వాసన, ఆర్ ఆర్ లో రొటీన్ నెస్ కనిపించాయి.. ఆర్ట్స్ డైరక్టర్ సాయి సురేష్.. ఎడిటర్ సత్య తమ క్రాఫ్ట్స్ లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.. ఒక క్యారక్టర్ తోనే సినిమాను నిలబెట్టేసే నాని.. ఈ సినిమాలో రెండు క్యారక్టర్స్ చేసినప్పట్టికీ.. పెద్దగా ఇంపాక్ట్ లేని కథ. ఊహాజనితమైన స్క్రీన్ ప్లే ఉండటంలో అక్కడక్కడ చూస్తూ ఉండిపోవలసి వచ్చింది.. తనకు స్కోప్ ఉన్నంతలో బెస్ట్ప్ పర్ఫమెన్స్ ఇచ్చిన నాని ప్రయత్నం.. ఎంత వరకు మైలేజ్ ఇస్తుందో, బాక్సీఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే..

 

 

ప్లస్ పాయింట్స్

కృష్ట క్యారక్టరైజేషన్

కెమెర వర్క్

బ్రహ్మాజీ కామెడి

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

అర్జున్ క్యారక్టర్

మెరుపులు లేని స్క్రీన్ ప్లే

పేలని విలేజ్ కామెడి

 

20:15 - November 26, 2017
10:48 - November 20, 2017

ముంబాయి : పద్మావతి మూవీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి, నటి దీపిక పదుకొణెకు బెదిరింపులు ఆగడంలేదు. సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలని చాలా గ్రూపులు, కమ్యూనిటీస్‌ నుంచి బెదిరింపులు శృతిమించుతున్నాయి.  తాజాగా దీపిక, సంజయ్‌ల సిరచ్ఛేదనం చేసిన వారికి 10కోట్ల నజరానా ప్రకటించారు హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో-ఆర్డినేటర్ సూరజ్ పాల్. నటులను చంపిన వారి కుటుంబ సభ్యుల బాగోగులు కూడా తామే  చూసుకుంటామని బీజేపీనేత వెల్లడించారు. పనిలోపనిగా ఇంతకుముందే  5కోట్ల నజరానా ప్రకటించిన మీరట్‌యూత్‌ వారిని సూరజ్‌పాల్‌ తెగ మెచ్చుకున్నారు. బీజేపీ నేతల బెదిరింపులపై  బాలీవుడ్‌ మండిపడుతోంది. వరుణ్ ధావన్, సోనమ్ కపూర్, పరిణితి చోప్రా ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీతారలను చంపుతామనడం తనను షాక్‌కు గురిచేసిందని, ఇలాంటి బెదిరింపులకు భయపడేదిలేదని వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు. ఇండియన్స్‌ ఇలాంటి బెదిరింపులకు పాల్పడటంపై సిగ్గుపడుతున్నామని నటిసోనమ్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు. అసలు వీళ్లు మనుషులేనా..అని నటి పరిణితి చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

20:08 - September 21, 2017

గుంటూరు : చంద్రబాబు, జక్కన్న.. ఇప్పుడీ కాంబినేషనే హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనుకుంటున్న రాజధానిలో భాగం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఎందరో ప్రముఖ ఆర్కిటెక్‌లను కాదని చంద్రబాబు, రాజమౌళిని ఎంచుకోవడంలో ఉన్న అంతరార్ధమేంటి? కేవలం గ్రాఫిక్‌ డిజైన్స్‌తో తీసిన సినిమాలకు, వాస్తవ కట్టడాలకు చాలా తేడా ఉంటుంది. అయితే చంద్రబాబు ఎందుకు రాజమౌళిని ఎంచుకున్నట్టు? ఇప్పుడిలాంటి ప్రశ్నలే సామాన్య ప్రజానికంతో పాటు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమరావతిని ఆంధ్రుల అద్భుత కలల రాజధానిగా, ప్రపంచం మెచ్చే సుందరనగరంగా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు కోరిక. అందుకోసమే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచంలోని అన్ని టెక్నాలజీలను వాడుకోవాలని భావిస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా కీలకంగా ఉండేవి అసెంబ్లీ, హై కోర్ట్‌, సచివాలయం భవనాలే కాబట్టి ఈ నిర్మాణాల విషయంలో నో కాంప్రమైజ్‌ అంటూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు.

పది నెలల నుండి నార్మన్‌ సంస్థలు
మాకీ సంస్థలు ఇచ్చిన డిజైన్స్‌ నచ్చలేదని, నార్మన్‌ పోస్టర్‌ సంస్థలను ఎంపిక చేశారు. పది నెలల నుండి నార్మన్‌ సంస్థలు ఎన్ని డిజైన్‌లు సిద్ధం చేసినా, ఎన్ని మార్పులు చేసినా చంద్రబాబుని సంతృప్తి పరచడంలేదు. అప్పుడే చంద్రబాబు మదిలో బాహుబలి మాహిష్మతి రాజ్యాన్ని, కుంతల రాజ్యాలను సృష్టించిన రాజమౌళి గుర్తుకువచ్చాడు. అంతే వెంటనే రాజమౌళిని పిలిపించి, ఆయన సూచనలు, సలహాలతో హైకోర్ట్‌, అసెంబ్లీ భవనాలను రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు రాజమౌళితో సమావేశం అవడం, తర్వాత చంద్రబాబుతో భేటీ అవడం వరుసగా జరిగిపోయాయి. బాహుబలి సినిమాలో రాజమౌళి చెప్పకుండా, రాజమౌళి విజన్‌ చూపించకుండా గ్రాఫిక్‌ డిజైనర్‌ గాని, ఆర్ట్‌ డైరెక్టర్‌ గాని అలాంటి కోటలు, రాజ్యాలు సృష్టించలేడు. ఈ సినిమాలో మనం చూసిన అద్భుత దృష్యాలకు అసలు రూపకర్త రాజమౌళినే. ఈ అంశమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాజమౌళి సేవలు ఉపయోగించుకోవాలనే ఆలోచన పుట్టింది. రాజమౌళి నిర్మించిన కోటలు, రాజ్యాలు చూసి కాకుండా వాటి వెనక ఆయనకున్న విజన్‌, పరిశోధన వంటి అంశాలు ఆయనను రాజధాని నిర్మాణానికి సలహా అడిగాలన్న ఆలోచన చంద్రబాబుకి కలిగేలా చేశాయి.

అమరావతి సంస్కృతి, సంప్రదాయాలు
వందల సంవత్సరాల క్రితం రాజ్యాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించిన రాజమౌళి... అమరావతిలోని భవనాల విషయంలో తెలుగు సంప్రదాయ ముద్ర వేస్తారనే నమ్మకంతో చంద్రబాబు ఆయనను సంప్రదించారు. డిజైన్‌లో అమరావతి సంస్కృతి, సంప్రదాయాలు మిళితం చేయాలన్నదే చంద్రబాబు కోరిక. అదే విషయాన్ని రాజమౌళికి స్పష్టం చేశారు. మొదట్లో హైకోర్టును కోహినూర్‌ డైమండ్ ఆకారంలో నిర్మించాలనుకున్నప్పటికీ, అసెంబ్లీ కొహినూర్‌ ఆకారంలో ఉంటే అద్భుతంగా ఉంటుందని చంద్రబాబు నిర్ణయించారు. కోహినూర్‌ డైమండ్‌ ఆకారంలోనే అసెంబ్లీని సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోహినూర్‌ ఆకారంలో అసెంబ్లీ భవన నిర్మాణ డిజైన్‌ను నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు రెండు నెలల పాటు శ్రమించి చంద్రబాబుకు చూపించారు. అద్భుతంగా ఉందని ఇలాంటి డిజైన్‌ కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పిన చెంద్రబాబు దానిని ఖరారు చేస్తామని ప్రకటించారు. కాని రాత్రికి రాత్రే సీన్‌ మారిపోయింది. అప్పటివరకు అసెంబ్లీ డిజైన్‌ అద్భుతంగా ఉందన్న చంద్రబాబు మరుసటి రోజు కోహినూర్‌ ఆకారం అంటే అచ్చెం అలానే దించమని కాదని, దాని స్ఫూర్తిని మాత్రమే తీసుకోమన్నానని చెప్పారు.

కోహినూర్‌ ఆకారంలోని డిజైన్‌ను తిరస్కరించడం
అయితే కోహినూర్‌ ఆకారంలోని డిజైన్‌ను తిరస్కరించడంలో కొత్త కోణం దాగి ఉందనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. చంద్రబాబుకు మొదటి నుండి వాస్తు, సిద్ధాంతాలపై నమ్మకం ఎక్కువ. అందులో భాగంగానే కోహినూర్‌ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యాలు సర్వనాశనం అవుతాయని, రాజులు అధికారాలు కోల్పోతారని చంద్రబాబు ఆస్థాన సిద్ధాంతులు కొంత ఆలస్యంగా చెప్పడంతో రాత్రికిరాత్రి చంద్రబాబు ఈ డిజైన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని చర్చించుకుంటున్నారు. డిజైన్‌ బాగున్నప్పటికీ సంస్కృతీ, సంప్రదాయం డిజైన్‌లో కనబడడంలేదనే మెలిక పెట్టారని ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించడంలో ప్రచారం నిజమనే భావన కల్గిస్తుంది. అమరావతి డిజైన్స్‌లోకి ఇప్పుడు రాజమౌళి రావడంతో రాజధాని రూపకల్పన ఆగిన చోట నుండి తిరిగి ప్రారంభమవుతుందా లేక మొదటికి వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కలగలిపి ఆకృతులను ఖరారు చేస్తారా లేక రాజమౌళి స్టైల్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సిద్ధం చేయిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఎంచుకున్న కోహినూర్‌ కథ ముగిసిందా లేదా అనేది కూడా కొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది. 

19:34 - September 20, 2017

గుంటూరు : ఎపీ సీఎం చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి ఇవాళ రెండుసార్లు భేటి అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో రాజమౌళితో పాటు మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాజధానిలో నిర్మిస్తున్న శాశ్వత అసెంబ్లీ, హై కోర్ట్ భవనాల డిజైన్స్‌పై చర్చ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనుకుంటున్న అసెంబ్లీ, హైకోర్ట్ భవనాలకు సంబంధించి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా డిజైన్లను సూచించాలని చంద్రబాబు రాజమౌళిని కోరారు. అమరావతి డిజైన్స్‌ను తానింకా పూర్తి స్ధాయిలో చూడలేదని సీఎంతో మరోసారి భేటీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని రాజమౌళి చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తో కలిసి రాజమౌళి వెలగపూడి సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం మరోసారి భేటీ అయ్యారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - దర్శకుడు