దసరా

14:49 - November 6, 2017
08:49 - October 3, 2017

తెలుగు ఇండస్ట్రీకి ఈ పండగ సీజన్ కలిసి రాలేదు అనే టాక్ వినిపిస్తోంది. పండగ హాలిడేస్ అన్ని టివి ప్రోగ్రామ్స్ తో నిండిపోతే కొత్తగా వచ్చిన సినిమాలు మిక్స్డ్ టాక్ తో ఆడుతున్నాయి. ఇది ఇలా ఉంటె రీసెంట్ గా రైన్ అటెక్ మరో కోణం చూపించింది ..సినిమాల మీద నేచర్ కూడా పగపట్టింది అనుకుంట. పండగ సీజేన్ ని క్యాష్ చేసుకోవడానికి వచ్చిన యాక్షన్ సినిమా 'స్పైడర్' . .మురుగదాస్ డైరెక్షన్ లో కొంత గ్యాప్ తరువాత వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈ 'స్పైడర్' సినిమా మహేష్ బాబు ని 'స్పై' గా చూపించింది. ఎలాంటి పాత్ర అయిన అలవోకగా చేసే 'మహేష్ బాబు' నటించిన 'స్పైడర్' సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమాకి 'మహేష్' నటనతో పాటు టెక్నికల్ వాల్యూస్ కూడా ఆడ్ అయ్యాయి. డైరెక్టర్ మురుగదాస్ 'స్పైడర్' సినిమాను యాక్షన్ ఎలెమెంట్స్ తో ఇంటరెస్టింగ్ వే లో స్టోరీ నేరేషన్ ప్లాన్ చేసాడు. ఓపెనింగ్స్ బాగున్నా ఈ సినిమా ఎంత గ్రాస్ కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఈ పండక్కి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి 'ఎన్ టి ఆర్' కూడా వచ్చాడు. మాస్ ని ఆకట్టుకోవడం లో 'ఎన్ టి ఆర్' ఎప్పుడు ముందే ఉంటాడు. టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటుల్లో 'ఎన్ టి ఆర్' ఒకడు. రీసెంట్ సినిమా 'జై లవ కుశ’. బాబీ డైరెక్షన్ లో కొంత గ్యాప్ తరువాత వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈ 'జై లవ కుశ' సినిమా. ఎలాంటి పాత్ర అయిన అలవోకగా చేసే 'ఎన్ టి ఆర్' నటించిన 'జై లవ కుశ' సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమాకి ఎన్ టి ఆర్ నటనే మేజర్ ఎసెట్ అని డైరెక్టర్ బాబీ చాల సంధర్భాల్లో చెప్పాడు కూడా. ఈ జై లవ కుశ సినిమా లో ఉన్న మూడు హీరో పాత్రలను ఎన్ టి ఆర్ పోషించడం సినిమాకి ఇంటరెస్టింగ్ పాయింట్ అయింది. నటుడిగా ఎన్ టి ఆర్ వేరియేషన్స్ చూపించడంలో ఎప్పుడు ముందే ఉంటాడు.

ఈ పండగ సీజేన్ లో కామెడీ టచ్ తో వచ్చిన 'శర్వానంద్' పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాడు. శుభ్రంగా ఉండటం తప్పు లేదు..ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం కూడా..కానీ శుభ్రత మించి అతి శుభ్రంగా తయారైతే ఎలా ఉంటుంది అనే కథతో వచ్చిన సినిమా 'మహానుభావుడు’. మారుతీ డైరెక్షన్ లో కొంత గ్యాప్ తరువాత వచ్చిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ 'మహానుభావుడు' సినిమా. అతి శుభ్రం అనే డిస్ ఆర్డర్ ని కథలో చేర్చి చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే ఈ 'మహానుభావుడు’. ఇది ఒక మలయాళ సినిమాకి కాపీ అని ఫిలిం నగర్ వాసులు అనుకుంటున్నారట.

మొత్తానికి దసరా సీజన్ గ్రాండ్ గా మొదలై.. గ్రాండ్ గానే ముగుస్తోంది. గాంధీ జయంతి సెలవు కలసి రావడంతో అక్టోబర్ 2ను కూడా కలుపుకుని వరుస సెలవలు రావడంతో పెద్ద సినిమాలు అన్ని మంచి కలక్షన్స్ రాబట్టుతున్నాయి. ఇప్పుడు సెలవలన్నీ అయిపోయాయ్ కాబట్టి..వర్కింగ్ డేస్ లో వసూళ్ళు రాబట్టడం అంత ఈజీ కాదు. కలక్షన్స్ రాబట్టడం లో మరి ఈ పెద్ద హీరోలు ఎం చేస్తారో చూడాలి.

13:33 - October 1, 2017
15:37 - September 30, 2017

హైదరాబాద్: విజయదశమి సందర్భంగా క్యాంప్ ఆఫీస్‌లో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సతీసమేతంగా పూజలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ వాహన పూజ నిర్వహించారు.

11:24 - September 30, 2017

గాయనీలతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. సింగర్స్ మోహన, సోనీ, ఉమా నేహ, రమ్య మెహరా ముచ్చటించారు. తమ అనుభవాలను తెలిపారు. బహుబలి, టెంపర్ వంటి పలు సినిమాల్లోని పాటలు పాడి వినిపించారు. వారు సినిమాల్లో పాడిన పాటలు పాడి అలరించారు. అంత్యాక్షరి సందర్భంగా పలు పాటలు పాడి వినిపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:58 - September 30, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరిరోజు అమ్మవారు  రాజరాజేశ్వరి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. దీంతో క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. మరోవైపు భవానీలు సైతం ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్నారు. భవానీ దీక్ష విరమణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

10:33 - September 29, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం న్యూ లుక్..టీజర్..ఇతర విశేషాలు తెలుస్తాయని అభిమానులు ఆశించారు. దసరా పండుగ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ వారి ఆశలు నెరవేరడం లేదు. ఇటీవలే అనురుధ్ స్వరపరిచిన పాట టీజర్ ను మాత్రమే ఇటీవలే విడుదల చేశారు. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ శ్రీనివాస్' దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా 'పవన్' సరసన 'క్తీరి సురేష్', 'అనూ ఇమ్మాన్యుయేల్' హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది.

ఇటీవలే విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న అనంతరం 'దసరా' పండుగ సందర్భంగా షూటింగ్ కు చ్రిత బృందం కొంత విరామం తీసుకున్నట్లు టాక్. అక్టోబర్ మొదటి వారంలో మళ్లీ షూటింగ్ మొదలు పెడుతారని తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా పవన్ న్యూ లుక్..పోస్టర్ విడుదల చేస్తారని టాక్ వినిపించింది. కానీ అవన్నీ వట్టివేనని తేలిపోయాయి. దీపావళికి టీజర్..ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ..

15:05 - September 28, 2017

బతుకమ్మ...ఏదో పూలు తెచ్చి ఆడి..నిమజ్జనం చేయడం కాదు. ఇందులో ఆరోగ్య రహస్యం కూడ ఉందంట. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి… తదితర పూలతో బతుకమ్మను పేరుస్తారు. పేర్చిన ఈ పూలల్లో ఔషద గుణాలున్నాయి. బతుకమ్మకు అందంతో పాటు..ఆడిన వారికి..ఇతరులకు ఆరోగ్యానిస్తాయి. అడవిలో పుట్టిన పూలను తెచ్చి ఓపికగా బతుకమ్మను పేర్చి..ఆడి పాడి చెరువుల్లో..బావుల్లో నిమజ్జనం చేస్తుంటారు. బతుకమ్మలను నిమజ్జనం చేయడం వల్ల పూలల్లో ఉండే ఔషధ గుణాలు నీటిలో కరిగి క్రిములను నశింపచేస్తాయి.

బంతి : బంతిపూలలో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయ.ఇ కాస్మటెక్స్ తయారీలో బంతి పూలు ఉపయోగిస్తుంటారు.

తామరపూలు : రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీ, మలబద్ధకంతో బాధపడేవారికి దీని నుండది తీసిన నూనె ఔషధంగా పనిచేస్తుంది.

గునుగు : గాయం అయిన చోట ఈ ఆకులను కడుతుంటారు. అతిసార, కలరా లాంటి వాటికి ముందుగా ఈ పూలను వాడుతారంట. పాము విషానికి విరుగుడుగా ఈ మొక్క ఉపయోగపడుతుంది. వీటి గింజల నుండి నూనె కూడా తీస్తారు. రుతుస్రావ సమస్యలు ఉన్న మహిళలు పూలతైలన్ని వాడతారు. గునుగు రక్త విరోచనాను అరికడుతుంది.

గులాబీ : గులాబీ పూలను ఆయుర్వేద మందుల్లో విరివిగా ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే.

మందార పూలు : మందార పూలను ఎండబెట్టి నూనెలో మరిగించి తలకు రాస్తే తల నొప్పి తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు తెల్లగా మారకుండా నల్లగా ఉంటాయి.

చామంతి పూలు : ఇందులో ఆరోగ్యకర లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి నియంత్రణకు వాడతారు. ఈ పూల తైలం తో పైరటమ్‌ అనే కీటకనాశిని మందులను తయారు చేస్తారు. 

13:37 - September 28, 2017

గుంటూరు : సోనోవిజన్‌ 48వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన దసరా డిస్కౌంట్‌ సేల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. సోనోవిజన్‌ స్క్రాచ్‌ కార్డ్‌లపై 7 కార్లను బహుమతులుగా అందజేశారు. ఈనెల 25,26,27 తేదీల్లో ఈ బహుమతులు ప్రదానం చేశారు. గుంటూరు సోనోవిజన్‌ షోరూంలో.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లక్కీడ్రా తీసి కారు, ఎల్‌ఈడీటీవీ, రిఫ్రిజిరేటర్‌ అందించారు. అదేవిధంగా విజయనగరం, ఒంగోలు, రేపల్లే, గాజువాక, కాకినాడ, నర్సాపురంలో ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. 

10:35 - September 27, 2017

దసరా...తెలంగాణలో అతి పెద్ద పండుగ. దీనితో సొంతూళ్లకు వెళ్లేందుకు జనాలు బయలుదేరుతున్నారు. రైల్వే స్టేషన్ లు..బస్ స్టేషన్ లన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ, రైల్వే స్టేషన్ లు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. స్కూళకు ముందుగానే దసరా సెలవులు ఇచ్చేయడం...ప్రభుత్వ ఉద్యోగులు..ఇతరులకు కూడా సెలవులు రావడంతో కుటుంబసభ్యులతో గడిపేందుకు మక్కువ చూపుతున్నారు. మొత్తంగా ఐదు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. దసరాతో పాటు కలిసొచ్చిన ఆదివారం..ఆపై గాంధీ జయంతి..దీనితో పెట్టాపేడా సర్దుకుని ఛలో సొంతూరికి అంటూ వెళ్లిపోతున్నారు.

కొంతమంది ముందుగానే ప్లాన్స్ వేసుకుని మరీ బయలుదేరుతున్నారు. ఏకంగా లక్షల మంది హైదరాబాద్ నగరం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. దీనితో సిటీ సగం బోసిపోయినట్లైంది. ఇక ఆర్టీసీ..రైల్వే ఛార్జీలు కూడా అదనపు ఛార్జీల పేరిట ప్రజల జేబులు చిల్లు చేసే పనిలో పడిపోయాయి. ఎంతమంది నగరం నుండి వెళ్లారో..అంతమంది బుధవారం తిరుగు ప్రయాణమౌతారు. అప్పుడు జాతీయ రహదారులన్నీ కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - దసరా