దాడి

16:49 - June 16, 2018

విజయవాడ : జిల్లాలో పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. బందర్‌ బీచ్‌లో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. నాలుగు రోజుల పాటు యువకులను అజ్ఞాతంలో ఉంచడంతో యువకుల బంధువులు సర్చె వారెంట్‌ తెచ్చారు. దీంతో పోలీసులు ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచారు. విషయం బయటికి చెబితే కేసులు బనాయిస్తానని పోలీసులు యువకుల కుటుంబసభ్యులను బెదిరించారు. 

16:47 - June 16, 2018

తూర్పుగోదావరి : వీధి కుక్కల దాడిలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనలో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో స్థానికులు భయాందోళనలకు లోనవుఉన్నారు. వీధికుక్కలు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తాయోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలోని ప్రధానమైన కూడలి అయిన బాలాజీ చెరువు సెంటర్ నాగేంద్ర అనే ఏడేళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఎనిమిది కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని మార్టం నిమిత్తం జీజీ హెచ్ కు తరలించారు. 

19:56 - June 15, 2018

కరీంనగర్ : ప్రేమోన్మాది దాడికి మరో యువతి బలైంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో యువతిని దారుణంగా హత్య చేసాడు ఓ ఉన్మాది. కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతు రసజ్న మృతి..
కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో వేధిస్తూ రసజ్ఞ అనే యువతిని దారుణంగా గొంతు కోసి చంపాడు వంశీధర్‌ అనే యువకుడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కరీంనగర్ కలెక్టరేట్‌ ఎదుట ఉన్న మీసేవ కార్యాలయంలో రసజ్ఞ రెండు నెలల నుండి ట్రైనీ ఆపరేటర్‌గా పని చేస్తుంది. రోజు లాగే మీసేవలో విధులు నిర్వహించేందుకు వచ్చిన రసజ్ఞతో వంశీధర్‌ గొడవ పడినట్లు తెలుస్తోంది. గొడవ పెద్దది కావడంతో మీసేవ వద్దే వంశీ తన వద్ద ఉన్న కత్తితో యువతి గొంతు కోశాడు. అడ్డుకోబోయిన వారిపై కూడా దాడికి దిగాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ రసజ్ఞను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రేమ పేరుతో రసజ్ఞను వేధిస్తున్న వంశీధర్..
కాటారం మండలం శంకరంపల్లికి చెందిన నిందుతుడు వంశీధర్‌.... ప్రస్తుతం గోదావరిఖని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వంశీ 3 ఏళ్ల నుండి ప్రేమ పేరుతో రసజ్ఞను వేధిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వేధింపులు భరించలేకే..... రసజ్ఞ కరీంనగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. రసజ్ఞ మరణంతో ఆమె కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. మరణ వార్త తెలుసుకున్న వెంటనే ఆమె బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకొని రసజ్ఞను హత్య చేసిన వంశీధర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

15:11 - June 13, 2018

మంచిర్యాల : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అనుభవజ్నులు చెప్పిన మాటకు నిదర్శనంగా కనిపిస్తోంది వెన్నల మండలంలో చోటుచేసుకుంది. తోడబుట్టిన అన్న కృష్ణారెడ్డిపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రికి తరలించారు.

12:49 - June 13, 2018

మేడ్చల్‌ : జిల్లా రిజిష్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్‌. కిషన్‌ ప్రసాద్‌ ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. అక్రమ ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్బీనగర్‌లోని కిషన్‌ ఇంటితోపాటు.. మేడ్చల్‌ జిల్లా రిజిష్టర్‌ కార్యాలయంలోని ఆయన క్యాబిన్‌లోనూ  సోదాలు చేపట్టారు. 

 

12:09 - June 7, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. 183వ రోజు నిడదవోలు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. పెరవలి మండలం కానూరు వద్దకు రాగానే తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. జగన్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతంలో మామిడి తోటలు న్నాయి. ఇక్కడ తేనెతుట్టలు భారీగా ఉన్నాయి. మామిడి కాయలు కోస్తుండగా తేనెటీగలు పాదయాత్రవైపుకు వచ్చాయి. దీనితో కార్యకర్తలు..నేతలు భయాందోళనలకు గురయ్యారు. జగన్ కు తేనేటీగలు కుట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పది మంది వైసీపీ కార్యకర్తలకు, మీడియా ప్రతినిధికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ చర్యతో పాదయాత్రకు కాసేపు విరామం ప్రకటించారు. కానీ ఇదిలా ఉంటే ఎవరో కావాలనే ఇలా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు సమాచారం. 

18:39 - June 5, 2018

జయశంకర్‌ భూపాలపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అమాయక గిరిజనుల పై అటవీశాఖ అధికారులు దాడిచేసి చితక బాదిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలో గర్బిణీలు, చిన్నారులు అని చూడకుండా ఫారెస్ట్‌ అధికారులు దాడులు చేశారు. అటవీశాఖ అధికారుల తీరును గిరిజన సంఘాలు ఖండించాయి. మరోవైపు న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తమనే నిర్బంధించారని గిరిజనులు వాపోతున్నారు. న్యాయపోరాటం చేస్తున్న గిరిజనులు తమకు ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

16:32 - June 4, 2018
20:57 - May 25, 2018

చంద్రబాబు ఎంట్రీతో టీటీడీపీలో జోష్...కేసీఆర్కు చెక్ వెట్టెతందుకు ప్లాన్..?, ఇంకా కొనసాగుతున్న జనం దాడులు..రేపల్లెకాడ మహిళన కొట్టిన మూర్ఖులు, తెలంగాణలో అగ్రవర్ణ రాజకీయాలు..బహుజన ఎమ్మెల్యేలే బలిపశువులు.?, ఇండ్లు గట్టిస్తవా మేము గట్టుకోవాల్నా?..సర్కారు భూమిల దిగిన ఎర్రజెండాలు, రైతులను మోసం జేశిన ఊరి దేవుడు..రైతు బంధు చెక్కులు రానియ్యలేదు, పోలీసోళ్లను గొట్టిన తాగువోతులు..తాగినోని తెర్వువోతె కొట్టడా మరి..?
ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

16:16 - May 23, 2018

యాదాద్రి : బీబీ నగర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంధువ ఇంటికి వచ్చిన బాలకృష్ణ అనే వ్యక్తిపై గ్రామస్థులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలయిన బాలకృష్ణను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేసరికే మృతి చెందాడు. ఈ ఘటన జియాపల్లిలో చోటుచేసుకుంది. ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన బాలకృష్ణ జియాపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయలకు తాళలేక బాలకృష్ణ మృతి చెందాడు. బాలకృష్ణ మృతిపై కొర్రెముల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలకృష్ణ మృతదేహంతో బీబీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు యత్నించారు. దీంతో పీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో రెండు గ్రామాల మధ్య సోషల్ మీడియా వార్తలు చిచ్చురేపాయి. ఈ క్రమంలో దాడిని జియాపల్లి వాసులు సమర్ధించుకుంటున్నారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో పలు ప్రాంతాలలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారనీ..పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనీ మెసేజ్ లతో పలు ప్రాంతాలలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలోకొత్తగా వ్యక్తులెవరైనా కనిపిస్తే దాడికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే బంధువుల ఇంటికి వచ్చిన బాలకృష్ణపై గ్రామస్థులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. గాయాలకుతాళలేక బాలకృష్ణ మృతి చెందారు. కాగా ఇటువంటి మెసేజ్ లను, వదంతులను నమ్మవద్దని పోలీసులు ఎంతగా చెప్పినా ఈ దాడులు మాత్రం ఆగటంలేదు. కాగా ఇటువంటి ఘటనలు తెంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జరిగినట్లుగా సమాచారం. 

Pages

Don't Miss

Subscribe to RSS - దాడి