దాడులు

22:06 - June 28, 2017

ఢిల్లీ : దేశంలో దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని.. వీటిని రాజ్యం ప్రోత్సహిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వ శక్తుల దాడులను నిరసిస్తూ జంతర్‌మంతర్‌వద్ద "నాట్‌ ఇన్‌ మై నేమ్‌" పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల దాడులు మరీ ఎక్కువగా జరుగుతున్నాయని ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని రాఘవులు అన్నారు.

20:50 - June 24, 2017

ఢిల్లీ : సంఘ్‌ పరివార్‌ అండతో దేశంలో మతపరమైన దాడులు పెరిగిపోయాయని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ-మధుర లోకల్‌ ట్రైన్‌లో జరిగిన మతపరమైన దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. సంఘ్‌ పరివార్‌ కార్యకర్తల దాడిలో మృతి చెందిన జునైద్‌ కుటుంబాన్ని సిపిఎం నేతలు పరామర్శించారు. రంజాన్‌ పండగ షాపింగ్‌ వెళ్లి లోకల్‌ ట్రైన్‌లో తిరిగి వస్తున్న ముస్లిం యువకులపై సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు గురువారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో  15 ఏళ్ల జునైద్‌ మృతి చెందగా...అతని సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. మతపరమైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని సిపిఎం విమర్శించింది. రైల్వే కంపార్ట్‌మెంట్లను మతపరమైన ప్రాంతాలుగా మారుస్తున్నారని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ మండిపడ్డారు. రైళ్లలో భద్రత పెంచాలని, జునైద్‌ హత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

 

19:47 - June 20, 2017

ఢిల్లీ : మూడేళ్ల బీజేపీ పాలనలో దేశంలోని దళితులపై దాడులు పెరిగాయే తప్ప ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. దళితులు, మైనార్టీలే లక్ష్యంగా బీజేపీ దాడులు చేస్తోందన్నారు. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని సురవరం అన్నారు. ఇంతవరకు బ్లాక్ మనీ ఎంత జమ అయిందో మోడీ ప్రభుత్వం లెక్కలు చెప్పడంలో విఫలమైందని విమర్శించారు.

18:47 - June 20, 2017

హైదరాబాద్‌ : నగరంలో కల్తీ బాదామ్‌ మిల్క్‌ తయారీ గోదాముపై పోలీసులు దాడులు చేశారు. హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో కల్తీ బాదామ్‌ మిల్క్‌, జీరా సోడా, స్పోర్ట్‌ మిల్క్‌, ఫ్ర్టూట్‌ బీర్‌ తయారీ గోదాములపై పోలీసులు దాడులు చేశారు. గోదాం యజమాని ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సుమారు 10 వేల బాదామ్‌ బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

 

14:56 - June 20, 2017

విశాఖ : ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసిలపై రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పోలీసులు, భద్రతా దళాలతో దాడులు చేయిస్తుందని బృందాకారత్‌ ఆరోపించారు. మహిళల పట్ల అరాచకాలు కొనసాగిస్తుందని..మద్దతుగా ఉన్నవారిపై అక్రమకేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. భద్రతా దళాలు ఆదివాసి మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా..రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధిత మహిళలకు ఆదివాసి అధికార్‌ మంచ్‌ తోడుగా ఉంటుందన్నారు. 

21:23 - June 17, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని సాయి కిరణ్‌ ఆస్పత్రిపై వైద్యాధికారులు, టాస్క్‌ఫోర్స్ దాడులు చేశారు.. సాయి కిరణ్‌ ఆస్పత్రిలో సరోగసీ చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు జరిపారు.. ఈ తనిఖీల్లో అద్దెగర్భం ద్వారా 48మంది మహిళలు పిల్లల్ని కనబోతున్నారని గుర్తించారు..

19:53 - June 13, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో విత్తన షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు దుకాణాల్లో సుమారు 7 లక్షల విలువైన విత్తనాలు సీజ్ చేశారు. బిల్లులు లేకుండా అక్రమంగా నిల్వ ఉండటంతో అధికారులు సీజ్ చేశారు. ఇతర షాపుల్లోనూ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. 

13:42 - June 13, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూకుంభకోణం కేసులో నిందితుడు, కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. బోయిన్‌పల్లిలోని శ్రీనివాస్‌ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 50 కోట్లకుపైగా అక్రమాస్తులున్నట్లు అనుమానిస్తున్నారు. 

11:28 - June 13, 2017

విజయనగరం : విజయనగరంలో ఏసీబీ దాడులు చేస్తుంది. నెర్లిమర్ల మున్సిపల్ మాజీ కమిషనర్ అచ్చినాయుడు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో అచ్చినాయుడు అతని బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన పై చాలా కాలంగా అవనీతి ఆరోపణలు వస్తున్నాయి. ఏసీబీ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలు బయపడుతున్నాయి. అచ్చినాయుడు గతంలో రాజం పేట మున్సిపల్ కమిసనర్ గా చేశారు. ఆయనకు చాలా ప్రాంతాల్లో భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

 

09:33 - June 13, 2017

ఖమ్మం : ఖమ్మంలో కల్తీ కల్లు తయారు చేస్తున్న దుకాణంపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్ధానిక ఎంబి గార్డెన్స్‌ వెనుక ఉన్న దుకాణంలో మంచినీటిలో అమ్మోనియా, సోడా కలిపి కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దుకాణంపై దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, త్రీ టౌన్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - దాడులు