దీక్షలు

09:24 - October 19, 2018

విజయవాడ : కృష్ణా నదిలో తెప్పోత్సవం ఘనంగా సాగింది. విద్యుద్దీపాల అలంకరణలో హంస వాహనంపై దుర్గా మల్లేశ్వర స్వామి వారు విహరించారు. ఈ వేడుకను చూసేందుకు  భక్తులు పోటెత్తారు.  విజయవాడ కృష్ణానదిలో ఈవేడుక కన్నుల పండగగా జరిగింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు పలు ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి పైనుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దుర్గామల్లేశ్వరస్వామి వారు విహరించారు..
ఇంద్రకీలాద్రిపై ఇరుముడి సమర్పించేందుకు భవానీలు  భారీగా  తరలివచ్చారు. రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు  బారులు తీరారు.. జైదుర్గా .. జైజై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మార్మోగాయి. భవానీల దీక్ష విరమణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.   భవానీలతో సహా భక్తులు పెద్దఎత్తున రావడంతో.. ప్రకాశం బ్యారేజీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 

21:23 - August 9, 2018

గుంటూరు : స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని వైసీపీ నేతలు ఆరోపించారు. గుంటూరులో వైసీపీ చేపట్టిన వంచనపై గర్జన సభలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు వైఎస్‌ జగన్ వల్లే సాధ్యమవుతాయని అన్నారు. గుంటూరులోని విఎఆర్‌ గార్డెన్స్‌లో వైసీపీ వంచనపై గర్జన పేరుతో సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. నలుపు రంగు దుస్తులతో హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు నీరుగార్చారని వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారన్నారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ప్రదేశ్‌గా సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ మాజీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేశాయన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే వంచనపై గర్జన కార్యక్రమం చేపట్టామన్నారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ప్రధాని మోదీపై తిరుగుబాటు చేస్తున్నామంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా స్టాండ్‌ తీసుకోవడానికి వైసీపీయే కారణమని గుర్తు చేశారు. వంచనపై గర్జన సభ సందర్భంగా సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు వైఎస్‌ జగన్‌తో సాధ్యమవుతాయన్నారు. 

15:18 - August 9, 2018

గుంటూరు : తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బిజెపికి టిడిపి తాకట్టుపెట్టిందని వైసీపీ పేర్కొంది. గుంటూరు జిల్లాలో గురువారం వంచనపై గర్జన కార్యక్రమం నిర్శహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు టిడిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎంగా చంద్రబాబు ఉన్నంతకాలం ఏపీకి హోదా రాదని, జగన్ తో విభజన హామీలు అమలవుతాయన్నారు.

బాబు అనుభవం అప్పుల పాలు..
చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవం అప్పుల పాలు చేసిందని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ప్రజల కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేస్తుంటే జగన్ ను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిపై కుట్రలు పన్నడం ధర్మం కాదన్నారు. 

12:34 - July 30, 2018

విజయవాడ : కేవీపీఎస్ ఆధ్వర్యంలో దళితుల దీక్షలు కొనసాగాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెన్ టివి పలువురితో మాట్లాడింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నట్లు అర్థమౌతోందని, హిందూ మతోన్మాదం మత సిద్ధాంతాల ఆధార పడి కుల వ్యవస్థ కొనసాగించాలని అనుకుంటుందని తెలిపారు. చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తానమి కేవీపీఎస్ స్పష్టం చేసింది. 

21:23 - July 23, 2018

హైదరాబాద్ : పాసుబుక్కు.. పంటచెక్కు.. భూమిపై హక్కు అన్న నినాదంతో.. తెలంగాణ జనసమితి.. తెలంగాణ వ్యాప్తంగా.. దీక్షలు నిర్వహించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్‌.. మూడు చోట్ల దీక్షల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం రైతాంగ సమస్యలపై తక్షణమే స్పందించకుంటే.. సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి రూపకల్పన చేస్తామని, కోదండరామ్‌ హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ.. తెలంగాణ జనసమితి పార్టీ.. సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. పార్టీ వ్యవస్థాపకుడు కోదండరామ్‌.. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్‌లలో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు. కొత్తగూడెంలో బైక్‌ర్యాలీలో పాల్గొని, అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే.. ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని ఆశిస్తే.. పరిస్థితి భిన్నంగా ఉందని.. కోదండరామ్‌, ఈసందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

జగిత్యాల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట టీజేఎస్‌ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. రైతుబంధు, భూప్రక్షాళన, సాదాబైనామాలల్లోని అక్రమాలను గుర్తించి రైతులకు న్యాయం చేయాలని వక్తలు కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ.. ప్రజావాణి కేంద్రంలో వినతిపత్రం సమర్పించారు. పెద్దపల్లి కలెక్టరేట్‌ వద్ద కూడా టీజేఎస్‌ నాయకులు దీక్ష చేపట్టారు. రైతు బంధు పథకం ఓ బూటకమని నేతలు ఈ సందర్భంగా విమర్శించారు.

నల్లగొండ జిల్లాలోనూ టీజేఎస్‌ నేతలు రైతు దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని నేతలు విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద టీజేఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భూ రికార్డులు ప్రక్షాళనలో తప్పులను యుద్ధప్రాతిపదికతన సరిదిద్దాలని, వెంటనే కొత్త పాసు పుస్తకాలు అందించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ జిల్లాలోనూ టీజేఎస్‌ నేతలు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టారు. పాస్‌బుక్కు, పంట చెక్కు, భూమిపై హక్కు కోసం చేపట్టిన దీక్షకు ప్రభుత్వం స్పందించకుంటే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద కూడా టీజేఎస్‌ నేతలు దీక్షలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. పాసుపుస్తకాల్లో తప్పులను సరిదిద్దకుంటే 15 రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని నేతలు హెచ్చరించారు. 

21:05 - July 11, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు సూచించిన నేత ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరవు నేలపై కేంద్ర వివక్ష పేరుతో అనంతపురంలో టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షలో ప్రసంగించిన ఎంపీలు, మంత్రులు... బీజేపీ, వైసీపీ, జనసేనను టార్గెట్‌ చేశారు. రాయలసీమ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు అనంతపురంలో దీక్ష చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. దీక్షా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రారంభించారు.
నిరసన దీక్షలో ప్రసంగించిన సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే... అన్ని హక్కులు సాధించుకోవచ్చన్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తప్పేది చంద్రబాబేనని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని చెప్పారు.

రాయలసీమ.. ముఖ్యంగా అనంతపురం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోడాన్ని ఎంపీ తోట నరసింహం తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఎంపీ నిమ్మల కిష్టప్ప మండ్డిపడ్డారు. కరువు సీమపై కేంద్ర వివక్షకు నిరసనగా టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

21:55 - July 4, 2018
19:56 - July 4, 2018

 హైదరాబాద్ : విశాఖ రైల్వే జోన్ కావాలని ఉద్యమం, దీక్షలు చేసిన విపక్షాలను అవహేళన చేసిన టీడీపీ నేతలు ఏ మొఖం పెట్టుకుని ఇప్పుడు దీక్షలు చేస్తారని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో విశాఖ రైల్వే జోన్ కావాలని ఉద్యమం చేస్తే టీడీపీ హేలన చేసిందని, కేసులు పెట్టిందని తెలిపారు. చంద్రబాబు హేళనగా మాట్లాడారని పేర్కొన్నారు. ఉద్యమాలు, దీక్షల పట్ల మురళీమోహన్ లాంటి టీడీపీ పార్లమెంట్ సబ్యులు చులకన భావంతో ఉక్కు లేదు..తుక్కు లేదు అని వ్యాఖ్యానించారని చెప్పారు. మళ్లీ ఏ మొఖం, పెట్టుకుని టీడీపీ నేతలు విశాఖలో దీక్షలు చేస్తారని నిలదీశారు. 6 నెలల సమయంలో సాధ్యాసాధ్యాలు గుర్తించమని..వాటిని ఏర్పాటు చేయాలని చట్టంలో పెట్టిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉంటూ ఏం ఒరగపెట్టారని, ఏం సాధించారని నిలదీశారు. అవినీతి కార్యక్రమాల కోసం కాలాన్ని వెల్లబుచ్చారని విమర్శించారు. 

20:32 - June 29, 2018

కడప : ఉక్కు పరిశ్రమ కోసం పది రోజులుగా దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోండటంతో తక్షణం దీక్ష విరమించి వైద్యం చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. దీనిని సున్నితంగా తిరస్కరించిన రమేశ్‌.. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ.. ఉక్కు పరిశ్రమపై స్పష్టమైన హామీ రాకుండా దీక్ష విరమించేదిలేదని తేల్చి చెప్పారు. రమేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన రిమ్స్‌ డాక్టర్లు షుగర్‌ స్థాయి, బీపీ పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష విరమించాలని డాక్టర్లు చెప్పినా... ససేమిరా.. అన్నారు. లక్ష్యం నెరవేరే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

దీక్ష చేస్తున్నసీఎం రమేశ్‌ నడవలేని స్థితికి చేరుకున్నారు. స్నానాల గదికి వెళ్లాలన్నా వీల్‌ చైర్‌ పై తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. దీక్షా శిబిరంలో పూర్తిగా పడుకునే ఉంటున్నారు. పరామర్శించడానికి వస్తున్న వారితో సరిగా మాట్లాడలేదకపోతున్నారు. రమేశ్‌ దీక్షకు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ రమేశ్‌ని కలిసి దీక్షకు మద్దతు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రమేశ్‌ను పరామర్శించి, దీక్షకు సంఘీభావం ప్రకటించారు. క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీక్ష విరమించడం మంచిదని లక్ష్మీనారాయణ సూచించగా ... రమేశ్‌ సున్నితంగా తిరస్కరించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌ను పరామర్శించి, సంఘీభావం ప్రకటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కడప వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

19:20 - June 29, 2018

కాకినాడ : తెలుగు జాతితో పెట్టుకోవద్దని, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, 2019లో అసలైన సినిమా చూస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొని మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బాబు కృషి చేస్తుంటేను విమర్శించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం అభినందించి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉండేదని..బాబుపై అనేక ఆరోపణలు చేస్తున్నారని..ఏపీ ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - దీక్షలు